Karthika deepam 2 May 8th : చావు బతుకుల్లో దీపా.. కార్తీక్ ను ఛీ కొట్టిన సుమిత్ర

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 7వ తేదీ 351వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కత్తిపోటుకు గురైన దీపాను కార్తీక్ బాబు ముందుగా ఆస్పత్రికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత పోలీస్ లకు ఫిర్యాదు చేస్తాడు. జ్యోత్స్న పై అనుమానం ఉందని పోలీసులకు చెబుతాడు. పోలీసులు నేరుగా శివనారాయణ ఇంటికి వెళ్లి జ్యోత్స్న గురించి ఆరా తీస్తారు. పోలీసులను చూసి జ్యోత్స్న ఎందుకు వచ్చారా? అని భయపడుతుంది. ఒక వేళ దశరథంపై గన్ తో కాల్చిన సత్తిపండు దొరికిపోయాడా? అని సందేహిస్తుంది. కానీ పోలీసులు దీపాను ఎవరో హత్య చేశారని, కార్తీక్ బాబు జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేశారని పోలీసులు వివరిస్తారు. తమతో పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు అంటారు. కానీ ఎలాంటి ఆధారం లేకుండా, కేవలంలో ఎవరో ఆరోపించారని ఎలా వస్తాం.. రాలేమని సుమిత్ర పోలీసులకు బదులిస్తుంది. సరైనా ఆధారాలతో వస్తే తప్పకుండా విచారణకు వస్తామని చెబుతుంది. దాంతో పోలీసులు వెళ్లిపోతారు.

ఇక కార్తీక్ బాబు నిందారోపణ చేసినందుకు కార్తీక్ బాబుపై రగిలిపోతాడు. తను కూడా కార్తీక్ బాబుపై కేసు పెట్టేందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో నుంచి బయల్దేరే సమయానికి కార్తీక్ బాబే ఆ ఇంటికి వస్తాడు. ఆస్పత్రిలో దీపా ప్రాణాలకు ప్రమాదం ఉందని, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని, మన ఇంట్లో అత్త సుమిత్ర, జ్యోత్స్నకు మాత్రం ఆ గ్రూప్ బ్లడ్ ఉందని చెబుతాడు. సుమిత్రను వచ్చి రక్తదానం చేసి తన భార్య దీపాను రక్షించు అని బతిమిలాడుతాడు. కానీ అందుకు సుమిత్ర ఒప్పుకోదు. నా భర్త, కూతురు ప్రాణాలు తీయాలనుకున్న దీపా ప్రాణాలు కాపాడేందుకు నేనెందుకు రక్తదానం చేస్తానని అంటుంది. అది జరగని పని అని వివరిస్తుంది. కార్తీక్ బాబు ఎంత బ్రతిమిలాడినా శివనారాయణ కూడా ఒప్పుకోడు. అయినా కార్తీక్ బాబు అడుగుతూనే ఉంటాడు.. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 8వ తేదీ 352 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 352 May 8th 2025

ఆస్పత్రిలో కొన ప్రాణాలతో దీపా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. రెండు గంటల్లోనే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని డాకర్లు చెబుతారు. అదే గ్రూప్ బ్లడ్ ఉన్న సుమిత్ర, జ్యోత్స్నను వెళ్లి అడిగిన కార్తీక్ బాబును అవమానించి మరీ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. ఇక చేసేదేమీ లేక కార్తీక్ బాబు ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. మిగితా తనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి బ్లడ్ కావాలని ప్రాదేయ పడుతాడు. కానీ ఎక్కడ మీనా గ్రూప్ నకు బ్లడ్ డోనర్ దొరకడు. వరుసగా ఫోన్లు కొడుతూనే ఉంటాడు. తెలిసిన వారందరికీ పదే పదే చేస్తాడు. కానీ ఎక్కడి నుంచి సానుకూల స్పందన రాదు. దీపాను బతికించలేనేమో అని బాధపడుతుండగా.. ఆస్పత్రి నుంచి డాక్టర్ ఫోన్ చేసి డోనర్ దొరికాడని చెబుతుంది. వెంటనే ఆస్పత్రికి రమ్మని చెబుతుంది.

వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ ను కలుస్తాడు కార్తీక్ బాబు. ఏమైందని అడుగుతాడు. డోనర్ ఎక్కడా అని డాక్టర్ ను అడుగుతాడు. ఇక డాక్టర్ స్పందిస్తూ డోనర్ ఫోన్ చేస్తూ కట్ చేస్తున్నాడు. బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. కానీ ఆస్పత్రి లోపలికి మాత్రం రాలేదంటూ డాక్టర్ చెబుతారు. ఇక వెంటనే ఆ నెంబర్ కు కార్తీక్ బాబు ఫోన్ చేయడం ప్రారంభిస్తాడు. లిఫ్ట్ చేసిన అతను నేను ఆస్పత్రి బయటే ఉన్నాను, ఇప్పుడు లోపలికి రాలేను. మీరే బయటకి రండి.. అని కార్తీక్ బాబుతో అంటాడు. బయటకి వెళ్లి డోనర్ కోసం వెతుకుతూ ఉంటాడు. మళ్లీ ఫోన్ చేస్తూ స్విచ్ఛాఫ్ వస్తుంది.

ఇక మరోవైపు కార్తీక్ బాబు ఇంటికి వచ్చి మరీ బ్లడ్ అడిగినా ఇవ్వకపోవడం సరికాదని దశరథం అంటాడు. సుమిత్ర మొండికేసి కూర్చోవడం ఏమాత్రం సబబు కాదని, నీ ప్రాణాలు కాపాడిన దీపా ప్రాణాలు కాపాడటం నీ బాధ్యత అని దశరథం చెబుతాడు. కానీ శివనారాయణ మాత్రం అస్సలు ఒప్పుకోడు. వాడి భార్య దీపా ప్రాణాలు కాపాడు అని అడగటం కోసం వచ్చాడు కానీ దశరథకు ఎలా ఉందని, ఒక్కసారైనా వచ్చి చూశాడా? కనీసం ఫోన్ చేసి అడిగాడా? అని రగిలిపోతాడు. దీపాకు రక్తదానం చేయడానికి వీల్లేదని అందరికీ స్పష్టం చేస్తాడు. కానీ దశరథ మాత్రం సుమిత్ర, జ్యోత్స్నలను ఆస్పత్రికి వెళ్లి బ్లడ్ ఇవ్వమని ఆదేశిస్తాడు. దాంతో వారు వెళ్లిపోతారు. ఇక దీపా ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణం జ్యోత్స్ననే అని తనకు తెలుసని అంటాడు. కానీ దాసుకు గతం గుర్తుకు వచ్చేంత వరకు నోరు విప్పలేనని దశరథ మనసులో అనుకుంటాడు.

ఈ క్రమంలోనే దాసుకు గతం గుర్తుకు వస్తుంది. కాశీ, స్వప్న ఇద్దరూ దీపా ఆస్పత్రిలో ఉన్న విషయం గురించి మాట్లాడుకుంటారు. పెద్ద ఆస్పత్రిలో చేర్పించారని, దీపాను ఎవరో హత్య చేయాలని చూశారని చర్చించుకుంటూ ఉంటారు. వెంటనే వెళ్లి చూసి వద్దామని స్వప్న కాశీతో అంటుంది. కానీ కాశీ కార్తీక్ బాబు ఫోన్ చేశాక వెళ్దామని బదులిస్తాడు. ఈ విషయాలన్నీ వింటున్న దాసు గతం గుర్తుకు రావడంతో వెంటనే ఆ ఆస్పత్రి దగ్గరకు బయల్దేరుతాడు. ఇక ఆస్పత్రి దగ్గర కార్తీక్ బాబు బయటికి వచ్చి డోనర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే సమయంలో జ్యోత్స్న వస్తుంది. బ్లడ్ కావాలంటే తను చెప్పినట్టు చేయాలని కార్తీక్ బాబుతో అంటుంది.

దీపాకు బ్లడ్ ఇచ్చేందుకు వచ్చిన డోనర్ తనే మనిషే అని తను చెప్పే వరకు ఫోన్ లిఫ్ట్ చేయడని జ్యోత్స్న కార్తీక్ బాబుకు చెబుతుంది. దీపాకు బ్లడ్ కావాంటే వైట్ పేపర్స్ పై సంతకం పెట్టాలని కండీషన్ పెడుతుంది. దాంతో కార్తీక్ బాబు మండిపడుతాడు. ఓవైపు దీపా చావు బతుకుల్లో ఉంటే నువ్వు బేరాలు ఆడుతున్నావా? అంటూ రగిలిపోతాడు. ఇంతకీ సంతకాలు పెడితే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. అదంతా నీకు అవసరం లేదని, బ్లడ్ కావాలి, దీపా బతకాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ పేపర్లపై సంతకాలు పెట్టాలని అంటుంది. కార్తీక్ బాబును అయోమయ స్థితిలో పడేస్తుంది. ఇదే సమయంలో ఆస్పత్రికి దాసు వస్తాడు. కార్తీక్ బాబు, జ్యోత్స్నను చూస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కార్తీక్ బాబు జ్యోత్స్న చెప్పినట్టుగా సంతకాలు పెడతాడా? లేదా? దీపాకు బ్లడ్ దొరుకుతుందా? దాసు కార్తీక్ బాబుకు దీపా గురించి అసలు మనవరాలు తనే అనే విషయం చెబుతాడా? అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X