Karthika deepam 2 May 9th : గతం గుర్తుకొచ్చింది.. దీపానే అసలు వారసురాలని కార్తీక్ బాబుకు చెప్పిన దాసు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 8వ తేదీ 352వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆస్పత్రిలో కొన ప్రాణాలతో దీపా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతాడు. రెండు గంటల్లోనే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని సూచిస్తాడరు. అదే బ్లడ్ గ్రూప్ ఉన్న సుమిత్ర, జ్యోత్స్నను కార్తీక్ బాబుకు రక్తదానం చేయమని ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని మరీ బ్రతిమిలాడుతాడు. కానీ వాళ్లూ అస్సలు ఒప్పుకోరు. పైగా కార్తీక్ బాబును నానా మాటలు అంటారు. దీపా చనిపోయినా కూడా మాకు పర్లేదని, అది మా కుటుంబానికి శుభవార్తే అవుతుందని కఠినంగా మాట్లాడుతాడు. అయినా అన్ని మాటలకు ఓర్చుకొని దీపా ప్రాణాలు కాపాడాలని సుమిత్ర, జ్యోత్స్నలను బతిమిలాడుతాడు. కానీ వారు ఎంతకూ అంగీకరించరు. దాంతో చేసేదేమీ లేక ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. తనకు తెలిసిన వారి దగ్గర బ్లడ్ కోసం సాయం కోరుతాడు.

చివరిగా ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కావాల్సిన బ్లడ్ డోనర్ దొరికాడని డాక్టర్ ఫోన్ చేసి చెబుతుంది. దీంతో కార్తీక్ బాబు తిరిగి ఆస్పత్రికి వెళ్తాడు. కానీ అక్కడ డోనర్ కనిపించడు. డాక్టర్ దగ్గర నుంచి ఆ డోనర్ నంబర్ తీసుకొని కార్తీక్ బాబు ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన అతను ఆస్పత్రి బయటికి రమ్మని అంటాడు. వెళ్లి చూస్తే డోనర్ కనిపించడు. కానీ జ్యోత్స్న కార్తీక్ బాబును కలుస్తుంది. ఆ డోనర్ మా మనిషేనని చెబుతుంది. నేను చెప్పినట్టుగా వింటే రక్తదానం జరుగుతుందని, లేకపోతే అంతేనని అంటుంది. దీంతో కార్తీక్ బాబు ఏం చేయాలని అడుగుతాడు. తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని, తన కండీషన్స్ కు ఒప్పుకోవాలని జ్యోత్స్న అంటుంది. అయితే కార్తీక్ బాబు సంతకాలు ఎందుకని అడుగుతాడు. సంతకం పెట్టేందుకు సందేహిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 9వ తేదీ 353 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 353 May 9th 2025

జ్యోత్స్న కార్తీక్ బాబుకు కండీషన్స్ పెడుతుంది. తను చెప్పినట్టుగా తెల్లని కాగితాలపై సంతకాలు పెడితేనే డోనర్స్ ను పంపించి దీపాను బతికిస్తానని కార్తీక్ బాబుతో అంటుంది. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న దీపా ప్రాణాలతో ఆడుకుంటున్నావని, దీపాను బతికించడం కోసం నన్ను తాకట్టు పెట్టుకుంటున్నావని కార్తీక్ బాబు మండి పడుతాడు. ఇక ఆస్పత్రిలోంచి డాక్టర్ కాల్ చేస్తుంది. దీపా ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతుంది. 5 నిమిషాల్లో డోనర్ రాకపోతే దీపాను బతికించడం సాధ్యం అయ్యే పని కాదని కార్తీక్ బాబుకు డాక్టర్ ఫోన్ లో హచ్చరిస్తారు. మరోవైపు జ్యోత్స్న తన కండీషన్స్ కు ఒప్పుకొని సంతకం చేసే వరకు డోనర్స్ ను రానివ్వకపోవడంతో కార్తీక్ బాబు కుమిలిపోతాడు. మరోవైపు జ్యోత్స్న కూడా సంతకం పెట్టకపోతే ఐదు నిమిషాల్లో తిరిగి వెళ్లిపోతానని బెదిరిస్తుంది.

దీంతో చేసేదేమీ లేక కార్తీక్ బాబు జ్యోత్స్న షరతులకు తల వంచుతాడు. జ్యోత్స్న చెప్పినట్టుగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతాడు. దీపా తన జీవితానికి ఎంతో త్యాగం చేసిందని అన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఎలాగైనా దీపా రుణం తీర్చుకోవాలని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని కార్తీక్ బాబు మనస్సులో అనుకొని జ్యోత్స్న తీసుకొచ్చిన పేపర్లపై సంతకం పెడుతాడు. వెంటనే డోనర్స్ ను జ్యోత్స్న ఆస్పత్రి లోకి పంపిస్తుంది. దాంతో దీపాకు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక కార్తీక్ బాబు ఆస్పత్రి లోపలికి వెళ్తూ ఉంటే.. దాసు కనిపిస్తాడు. జ్యోత్స్నతో కార్తీక్ బాబు కనిపించడంతో దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు. ఇక కార్తీక్ బాబు చూసి దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారని అడుతాడు. ఇలా బయటికి వస్తే అక్కడ కాశీ, స్వప్న ఎంత కంగారు పడుతారో మీకు తెలుసు కదా అని అంటాడు.

ఇక దానితో దాసు మాట్లాడుతూ.. ఇప్పుడు నాకేమీ మతిస్థిమితం లేదురా కార్తీక్ అని అంటాడు. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది. అసలు దీపాకు ఎలా ఉందని అడుగుతాడు. దాంతో దీపాకు ఇప్పుడు ఆషరేషన్ జరుగుతోందని చెబుతాడు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారని చెబుతాడు. అయితే దీపా ఆస్పత్రిలో ఉండటానికి కారణం జ్యోత్స్ననే అని దాసు నిజం చెబుతాడు. జ్యోత్స్న ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తుందని అంటాడు కార్తీక్ బాబు. ఎందుకంటే శివనారాయణ ఆస్తి మొత్తం తనకే దక్కాలని, ఆ ఇంటికి అసలు వారసురాలు కావాలని అనుకుంటోంది కాబ్టటి అని దాసు నిజం చెబుతాడు. జ్యోత్స్న శివనారాయణకు అసలు వారసురాలు కాదని, దీపానే శివనారాయణ అసలు వారసురాలు అని చెబుతాడు. కార్తీక్ బాబుకు దాసు చెప్పేది సరిగా అర్థం కాదు. దీంతో దాసు మొదటి నుంచి చెప్పుకొస్తాడు.

దీపా కుబేర కూతురు కాదని, దీపా అసలు తల్లిదండ్రులు దశరథం, సుమిత్ర అని చెబుతాడు. ఇక జ్యోత్స్న తన కూతురని చిన్నప్పుడు వీరు పుట్టినప్పుడు జరిగిన ఒక సంఘటనతో దీపా జీవితం తలకిందులైందని వివరిస్తాడు. తన తల్లి పారుజాతం చేసిన పనికి దీపా శివనారాయణ కుటుంబానికి దూరమైందని చెబుతాడు. సుమిత్ర వదినకు, తన భార్యకు ఓకే సారి, ఒకే ఆస్పత్రిలో డెలీవరి అయ్యిందని చెబుతాడు. అప్పుడు పారుజాతం దురుద్దేశంతో దీపాను రోడ్డుపైన వదిలేసి, తన కూతురు జ్యోత్స్నను సుమిత్ర చేతికి వెళ్లేలా మార్చేసిందని దాసు పూర్తిగా వివరిస్తాడు. దీంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. మరీ దీపానే శివనారాయణ అసలు వారసురాలని ఎప్పుడు? ఎలా? తెలుసుకున్నావని కార్తీక్ బాబు దాసును ప్రశ్నిస్తాడు.

అందుకు దాసు స్పందిస్తూ దీపా తమ ఇంటికి వచ్చిన సమయంలో కుబేరా ఫొటోను చూశానని చెబుతాడు. కుబేరా తన తండ్రి అని దీపా చెప్పడం, ఆయన ఫొటోను అనసూయ చూపించడంతో అసలు విషయం తెలిసిపోయిందని వివరించాడు. ఇక ఈ విషయం జ్యోత్స్నకు కూడా తెలిసిపోయిందని, అందుకే దీపాను చంపాలని ప్రయత్నం చేస్తుందని అంటాడు. ఈ విషయాన్ని ఇంట్లో అన్న దశరథకు చెప్పేందుకు వెళ్లిన సమయంలో రాడ్ తో నా తలపై జ్యోత్సన కొట్టిందని కూడా కార్తీక్ బాబుకు పూర్తిగా వివరిస్తాడు దాసు. దీంతో కార్తీక్ బాబు షాక్ లో ఉంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత కార్తీక్ బాబు ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X