Karthika deepam 2 May 10th : జ్యోత్స్న గుట్టు బయటపెట్టిన దాసు.. కన్న కూతురిపై సుమిత్ర కర్కషత్వం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 9వ తేదీ 353వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బ్లడ్ కావాలంటే జ్యోత్స్న చెప్పినట్టు వినాలని కార్తీక్ బాబును హెచ్చరిస్తుంది. లేదంటే దీపాకు బ్లడ్ అందక చనిపోతుందని కార్తీక్ బాబును జ్యోత్స్న హెచ్చరిస్తుంది. మరోవైపు డాక్టర్ కూడా ఫోన్ చేసి సమయం చాలా తక్కువగా ఉందని వెంటనే బ్లడ్ డోనర్ దొరకకపోతే దీపా ప్రాణాలను కాపాడలేమని డాక్టర్ కూడా ఒత్తిడి పెంచుతుంది. దీంతో కార్తీక్ బాబు జ్యోత్స్న చెప్పినట్టు వినేందుకు ఒప్పుకుంటాడు. ఆమె అడిగినట్టుగా వైట్ పేపర్స్ పై సంతకాలు పెడుతాడు. దాంతో వెంటనే జ్యోత్స్న తన మనుషులను పంపించి బ్లడ్ ఇప్పిస్తుంది. అయితే దీపా ప్రాణాలను కాపడటానికి కూడా ఒక కారణం ఉందని చెబుతుంది.
మరోవైపు దీపాను ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కార్తీక్ బాబు ఊపిరి పీల్చుకుంటాడు. అలా ఆస్పత్రి బయటికి రావడంతో బయట దాసు కనిపిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని దాసును కార్తీక్ బాబు అడుగుతాడు. దీంతో దాసు మాట్లాడుతూ తనకు గతం గుర్తుకు వచ్చిందని కార్తీక్ బాబుతో చెబుతాడు. దీపా ఆస్పత్రిలో ఉండటానికి కారణం జ్యోత్స్ననే అని దాసు నిజం చెబుతాడు. శివనారాయణ ఆస్తి మొత్తం తనకే దక్కాలని, ఆ ఇంటికి అసలు వారసురాలు కావాలని జ్యోత్స్న కుట్ర పన్నిందని వివరిస్తాడు. కానీ జ్యోత్స్న శివనారాయణకు అసలు వారసురాలు కాదని, దీపానే శివనారాయణ అసలు వారసురాలు అని చెబుతాడు. దీపా పుట్టినప్పుడు పారుజాతం చేసిన దుర్భుద్ది పనికి సుమిత్ర కడుపులో పుట్టిన దీపా అనాథగా పెరిగిందని చెబుతాడు. ఈ విషయాన్ని చెప్పాలని ప్రయత్నించినందుకు జ్యోత్స్న తనను కూడా చంపాలని చూసిందని దాసు వివరిస్తాడు. ఇక నిజం తెలుసుకున్న కార్తీక్ బాబు ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మే 10వ తేదీ 354 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబుకు దాసు నిజం చెబుతాడు. 20 ఏళ్లుగా దాచబడిన వాస్తవాలను బయట పెడుతాడు. జ్యోత్స్న తన కూతురని, దీపానే దశరథ అన్నయ్య అసలు కూతురని చెబుతాడు దాసు. కానీ జ్యోత్స్న, పారుజాతం దురుద్దేశంతో ఆసక్తి కోసం ఆ ఇంట్లో వాళ్లందరినీ చంపడానికి ప్రయత్నిస్తుందని చెబుతాడు. నన్ను కూడా జ్యోత్స్న చంపాలని ప్రయత్నించింది. తలపై కర్రతో బలంగా కొట్టింది. అప్పటి నుంచి నాకు మతి స్థిమితంగా లేకుండా పోయింది. ఇక జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించాను. దశరథ అన్నయ్యకు అసలు విషయాన్ని చెప్పాలని ప్రయత్నించాను. కానీ కుదర లేదు. కానీ ఇప్పుడు నాకు బాగానే ఉంది. అందుకే నిజాన్ని పూర్తిగా నీకు చెబుతున్నాను అంటాడు దాసు. దాసు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత కార్తీక్ బాబు షాక్ అవుతాడు.
ఇదంతా నిజమేనా అని దాసును అడుగుతాడు. అక్షరాల నిజమని దాసు చెప్పడం, జ్యోత్స్న అందుకే దీపాను చంపాలని చూస్తుందని వివరించడంతో కార్తీక్ బాబు నమ్ముతాడు. ఇక దీపానే శివనారాయణ అసలు మనవరాలు అనే విషయం ఇంకెవ్వరికి తెలుసని దాసును కార్తీక్ బాబు అడుగుతాడు. దానికి కార్తీక్ బాబు. ఎవ్వరికీ తెలియదని, ఒక్క జ్యోత్స్నకు నాకు మాత్రమే తెలుసని కార్తీక్ బాబుతో దాసు వివరిస్తాడు. ఈ మధ్య కాలంలో పారు జాతానికి కూడా తెలిసే అవకాశం ఉంటే ఉండొచ్చని, ఇంక మిగితా వారేవ్వరికీ తెలియదని దాసు చెబుతాడు. దాంతో కార్తీక్ బాబు ఇంకెవ్వరికీ ఈ విషయాన్ని చెప్పడానికి వీల్లేదని అంటాడు. కానీ దాసు మాత్రం వెంటనే వెళ్లి దశరథం అన్నయ్య ఈ విషయాన్ని చెప్పాలని పట్టుబడుతాడు. నేరుగా దశరథ అన్నయ్యకు, నాన్న శివనారాయణకు చెబితే ఓ పనై పోతుందని, అసలు వారసురాలిగా దీపానే కొనసాగుతుందని, దాంతో జ్యోత్స్న ఆటలు ఇకపై సాగవని దాసు అంటాడు.
కానీ దాసు మాటలను ఎవ్వరూ నమ్మబోరని కార్తీక్ బాబు బదులిస్తాడు. ఆ ఇంట్లో ఇప్పుడు తనపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని చెబుతాడు. ఇంకా నీ మాటనైతే అసలే లెక్క చేయడం లేదని అంటాడు. నువ్వు చెప్పిన విషయానికి నేను షాక్ లో ఉన్నాను. నమ్మలేక పోతున్నాను. ఇక వాళ్లైతే అసలు నమ్మే ఛాన్సే లేదని కార్తీక్ బాబు అంటాడు. కానీ కార్తీక్ బాబు అనుకుంటున్న ఏం జరగదని, వాళ్లను నమ్మించే బాధ్యత నాదని, జ్యోత్స్న, పారుజాతం నోటితోనే ఈ విషయాన్ని ఒప్పిస్తానని అంటాడు. కానీ కార్తీక్ బాబు వద్దని నివారిస్తాడు. మనం ఎంత చెప్పినా వారు ఒప్పుకోరని అంటాడు. సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలని అంటారని వివరిస్తాడు.
ఒకవేళ డీఎన్ఏ టెస్ట్ చేయించినా ఎంత డబ్బు పెట్టి ఈ సర్టిఫికెట్లు కొన్నారని అవమానిస్తారు. వాళ్లు నమ్మాలంటే మనం ముందు కొన్ని విషయాలకు సమాధానాలు రాబట్టాలి. ముందు దీపాపై హత్యాహత్నం చేసింది ఎవరు? శౌర్యను చంపాలనుకున్నది? దశరథం మామ ఛాతిలో బుల్లెట్ దింపిన వాళ్లు ఎవరనేది తెలుసుకోవాలని, అప్పుడు సరైనా ఆధారాలతో జ్యోత్స్న నాటకాన్ని బయట పెట్టే అవకాశం ఉందని అంటాడు. ఈలోపు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదని అంటాడు. అన్ని నిజాలు తెలిసే వరకు అందరితో తెలియనట్టుగానే ఉండాలని, జ్యోత్స్నను గమనిస్తూ ఆమె గుట్టు రాబట్టాలని కార్తీక్ బాబు అంటాడు. నువ్వు కూడా గతం గుర్తుకు రానట్లే ఉండమని దాసుకు చెబుతాడు. దాంతో దాసు కూడా సరేనని అంటాడు.
ఇక ఇప్పటి నుంచి కథ మరోలా ఉంటుందని కార్తీక్ బాబు దాసుతో అంటాడు. ముల్లును ముల్లుతోనే తీస్తానని చెబుతాడు. ఇక మరోవైపు ఆస్పత్రిలో పోలీసులు దీపాను ఎంక్వైరీ చేస్తారు. మిమ్మల్ని ఎవ్వరైనా చంపాలని ప్రయత్నిస్తున్నారనే అనుమానం ఉందా? అని అడుగుతారు. ఇటీవల ఎవరితోనైనా గొడవలు అయ్యాయా అని పోలీసులు ప్రశ్నిస్తారు. దానికి దీపా ఒక్క జ్యోత్స్న పైన తప్ప మరెవ్వరిపైనా అనుమానం లేదని, ఇంకెవ్వరితోనూ తాను గొడవపడలేదని పోలీసులకు చెబుతుంది. ఇక దీపా చెప్పిన మాటలతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇక దీపాకు మెరుగైన వైద్యం అందుతుండటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే దీపాకైనా కార్తీక్ బాబు దాసు చెప్పిన నిజాన్ని చెబుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జ్యోత్స్నపై కార్తీక్ బాబు రివేంజ్ గేమ్ ను ఎలా ప్రారంభిస్తాడనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications











