Karthika deepam 2 May 12th : అసలైన గేమ్ మొదలెట్టిన కార్తీక్ బాబు.. జ్యోత్స్నకు బిగ్ షాక్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 10వ తేదీ 354వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబుకు దాసు నిజం చెబుతాడు. 20 ఏళ్లుగా దాచబడిన వాస్తవాలను బయట పెడుతాడు. జ్యోత్స్న తన కూతురని, దీపానే దశరథ అన్నయ్య అసలు కూతురని చెబుతాడు దాసు. వెంటనే వెళ్లి దశరథం అన్నయ్య ఈ విషయాన్ని చెప్పాలని పట్టుబడుతాడు. నేరుగా దశరథ అన్నయ్యకు, నాన్న శివనారాయణకు చెబితే ఓ పనై పోతుందని, అసలు వారసురాలిగా దీపానే కొనసాగుతుందని, దాంతో జ్యోత్స్న ఆటలు ఇకపై సాగవని దాసు అంటాడు. కానీ దాసు మాటలను ఎవ్వరూ నమ్మబోరని కార్తీక్ బాబు బదులిస్తాడు. ఆ ఇంట్లో ఇప్పుడు తనపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని చెబుతాడు.
ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదని అంటాడు. అన్ని నిజాలు తెలిసే వరకు అందరితో తెలియనట్టుగానే ఉండాలని, జ్యోత్స్నను గమనిస్తూ ఆమె గుట్టు రాబట్టాలని కార్తీక్ బాబు అంటాడు. నువ్వు కూడా గతం గుర్తుకు రానట్లే ఉండమని దాసుకు చెబుతాడు. దాంతో దాసు కూడా సరేనని అంటాడు. ఇక ఇప్పటి నుంచి కథ మరోలా ఉంటుందని కార్తీక్ బాబు దాసుతో అంటాడు. అయితే దీపాకైనా కార్తీక్ బాబు దాసు చెప్పిన నిజాన్ని చెబుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జ్యోత్స్నపై కార్తీక్ బాబు రివేంజ్ గేమ్ ను ఎలా ప్రారంభిస్తాడనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక నిజం తెలుసుకున్న కార్తీక్ బాబు ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మే 12వ తేదీ 355 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

పోలీసులు అన్ని వివరాలను ఎంక్వైరీ చేస్తారు. దీపాను కత్తితో పొడిచించింది ఎవరంటూ పలు ప్రశ్నలు అడుగుతారు. వచ్చిన వ్యక్తి ముసుగు వేసుకొని ఉన్నాడని, గుర్తు పట్టలేక పోయాయనని చేబుతుంది. ఇక పోలీసులు ఇంకెవ్వరి మీదనైనా అనుమానం ఉందా? అని అడుగుతాడు. దాంతో కార్తీక్ బాబు జ్యోత్స్న మీద ఉందని చెబుతాడు. దాంతో దర్యాప్తు చేస్తామని చెప్పి వెళ్లిపోతారు. ఇక దీపా మాత్రం మళ్లీ జ్యోత్స్న పేరు ఎందుకు పోలీసులకు చెప్పారని కార్తీక్ బాబు తో అంటుంది. ఇప్పటికే ఉన్న గొడవలు సరిపోతాయి కదా? మళ్లీ జ్యోత్స్న పేరు చెప్పి సమస్యను ఎందుకు పెద్దదిగా చేశావని అంటారు. మరి అసలు పొడిచింది ఎవరో మనకు తెలియాలి కదా? అని అంటాడు. జ్యోత్స్న తో పాటు గౌతమ్ పైనా కూడా సందేహం ఉందని చెబుతాడు. కానీ ప్రస్తుతం కేవలం జ్యోత్స్న పేరునే చెప్పాను.. ఇక గౌతమ్ ను నా స్టైల్ లోనే ఎంక్వైరీ చేస్తానని దీపాతో అంటాడు.
ఇక దశరథ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సుమిత్ర దగ్గరుండి అన్ని సేవలు చేస్తుంటుంది. దశరథ కాస్తా కోలుకోవడంతో ఇక దీపా ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకే సుమిత్రను అడుగుతాడు. కానీ దశరథ ప్రశ్నకు పారుజాతం సమాధానం ఇస్తుంది. మన కుటుంబాన్ని సమస్యల్లోకి నెటేసే వాళ్లు ఎలా ఉంటారు బాగానే ఉంటారని చెబుతుంది. ఇప్పుడు బాగానే ఉందంట. ఇవ్వాళ డిశ్చార్జ్ కూడా చేస్తున్నారని అంటుంది. దాంతో దశరథ కాస్తా ఆనంద పడుతాడు. దీపాపై ఎంత కోపం ఉన్నా ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీస్తూనే ఉందని, దీపా యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉందని అంటాడు దశరథ. అందుకు పారుజాతం స్పందిస్తూ నేనేమీ దానిపై ప్రేమతో అడగలేదని, మన శత్రువు ఉందా? పోయిందా? అనేది కూడా ఓ కంటితో చూడాలనే ఉద్దేశంతో తెలుసుకున్నానని రగిలిపోతూ బదులిస్తుంది.
కార్తీక్ బాబు దీపాను ఆస్పత్రి నుంచి నేరుగా శివనారాయణ ఇంటికి తీసుకొస్తాడు. దీంతో దీపా షాక్ అవుతుంది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు చెబుతాను పదా అని అంటాడు. మున్ముందు అన్నీ విషయాలు నీకే తెలుస్తాయని, నీ ఇంటికే నిన్ను తీసుకొచ్చానని దీపాతో అంటాడు. ఇక దీపా అయోమయంలో పడుతుంది. పరిస్థితి ఏంటనేది తెలియకపోవడంతో కాస్తా కంగారు పడుతుంది. ఆ ఇంటిలోపలికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయోనని, వారందరూ ఏమని తిడుతారోనని భయపడుతుంది. ఇక కార్తీక్ బాబు మాత్రం దీపాను ఆ ఇంటి లోపలికి తెలుకెళ్తాడు. అప్పటికే హాలులో దశరథ, సుమిత్ర, పారుజాతం ఉంటారు. దీపాను సోఫాలో కూర్చొబెడుతాడు. అసలు దీపాను ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడని కార్తీక్ బాబుపై సుమిత్ర, పారుజాతం అసహ్యంగా చూస్తారు. కనీసం దీపాను కూడా ఎలా ఉన్నావ్ అంటూ అడగరు. పైగా నానా మాటలు అంటారు.
సుమిత్ర స్పందిస్తూ ఈ ఇంటి శత్రువును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా కార్తీక్ అని అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు మాట్లాడుతూ నీ కూతురుని నీ ఇంటికి తీసుకొచ్చాను అని చెబుతాడు. నా కూతురు ఎంటీ? ఇంటిని నిండా ముంచేసిన ఆమె నాకు కూతురు ఎలా అవుతుంది? అని సుమిత్ర మండిపడుతుంది. అసలు దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ముందు ఆ విషయం తేల్చూ అంటుంది సుమిత్ర. దీపాను నీ కడుపులో పుట్టిన బిడ్డలా చూసుకుంటానని చెప్పావు కదా? అత్త, అందుకే నీ కూతురును నీ దగ్గరికే తీసుకొచ్చానని కార్తీక్ బాబు అంటాడు. అదే సమయంలో జ్యోత్స్న శివనారాయణ కూడా వస్తారు. జ్యోత్స్న కార్తీక్ మాటలు విని భయపడుతుంది. ఏంటీ దీపాను సుమిత్ర అత్త కూతురు అంటూ మాట్లాడుతున్నాడు అంటూ మనసులో అనుకుంటుంది. కార్తీక్ బాబు దీపానే అదోరకంగా చూస్తూ ఉంటడంతో శివనారాయణ అసలు కూతురు దీపా అని తెలిసిపోయిందని జ్యో కన్ఫమ్ చేసుకుంటుంది.
కానీ కార్తీక్ బాబు ఇప్పుడే నిజాన్ని బయట పెట్టాలని చూడడు. శివనారాయణ, పారుజాతం ఎన్ని మాటలు అన్నా కూడా తప్పుగా తీసుకోడు. ఇదే సమయంలో దీపాకు బ్లడ్ ఇప్పించి కాపాడినందుకు ధన్యవాదాలు చెబుదామని దీపాను ఇక్కడికి తీసుకొని వచ్చానని అంటాడు కార్తీక్ బాబు. నీ కూతురికి రక్తదానం చేసినందుకు ధన్యవాదాలు అని చెబుతాడు. బుల్లెట్ వెనక దాగి ఉన్న వ్యక్తి ఎవరు? దీపాను కత్తితో పొడిచిన ముసుగు మనిషి ఎవరనే విషయాలు తెలిసిన తర్వాత మళ్లీ మాట్లాడుదామని శివనారాయణతో అంటాడు. ఇక పారుజాతంతో మాట్లాడుతూ త్వరలోనే ఎవరు మంచి వాళ్లు, ఎవరు చెడ్డ వాళ్లే విషయాలు తేలిపోతాయని అంటాడు. దాంతో పారుజాతం భయపడుతుంది. ఇక దశరథ మాత్రం దీపాను ఎలా ఉందని అప్యాయంగా అడుగుతాడు. అందుకు కార్తీక్, దీపా సంతోష పడుతారు. తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత కార్తీక్ బాబు ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











