Karthika deepam 2 May 13th : కార్తీక్ బాబు వార్నింగ్.. వణికిపోతున్న జ్యోత్స్న, పారు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 12వ తేదీ 355వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు దీపాను ఆస్పత్రి నుంచి నేరుగా శివనారాయణ ఇంటికి తీసుకొస్తాడు. దీంతో దీపా షాక్ అవుతుంది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు చెబుతాను పదా అని అంటాడు. మున్ముందు అన్నీ విషయాలు నీకే తెలుస్తాయని, నీ ఇంటికే నిన్ను తీసుకొచ్చానని దీపాతో అంటాడు. ఇంటిలోపలికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయోనని, వారందరూ ఏమని తిడుతారోనని భయపడుతుంది. ఇక కార్తీక్ బాబు మాత్రం దీపాను ఆ ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అప్పటికే హాలులో దశరథ, సుమిత్ర, పారుజాతం ఉంటారు. దీపాను సోఫాలో కూర్చొబెడుతాడు. సుమిత్ర స్పందిస్తూ ఈ ఇంటి శత్రువును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా కార్తీక్ అని అడుగుతుంది.

కార్తీక్ బాబు మాట్లాడుతూ నీ కూతురుని నీ ఇంటికి తీసుకొచ్చాను అని చెబుతాడు. అందుకు సుమిత్ర మండిపడుతుంది. దీపాను నీ కడుపులో పుట్టిన బిడ్డలా చూసుకుంటానని చెప్పావు కదా? అత్త.. అందుకే నీ కూతురును నీ దగ్గరికే తీసుకొచ్చానని అంటాడు. నీ కూతురికి రక్తదానం చేసినందుకు ధన్యవాదాలు అని చెబుతాడు. ఇక బుల్లెట్ వెనక దాగి ఉన్న వ్యక్తి ఎవరు? దీపాను కత్తితో పొడిచిన ముసుగు మనిషి ఎవరనే విషయాలు తెలిసిన తర్వాత మళ్లీ మాట్లాడుదామని శివనారాయణతో అంటాడు. ఇక పారుజాతంతో మాట్లాడుతూ త్వరలోనే ఎవరు మంచి వాళ్లు, ఎవరు చెడ్డ వాళ్లే విషయాలు తేలిపోతాయని అంటాడు. దాంతో పారుజాతం భయపడుతుంది.

Karthika deepam 2 Serial Today s Episode 356 May 13th 2025

ఇక దశరథ మాత్రం దీపాను ఎలా ఉందని అప్యాయంగా అడుగుతాడు. అందుకు కార్తీక్, దీపా సంతోష పడుతారు. తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత కార్తీక్ బాబు ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. మే 13వ తేదీ 356 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను ఆసుపత్రి నుంచే నేరుగా శివ నారాయణ ఇంటికి తీసుకువెళ్లి కార్తీక్ బాబు తనకు తెలిసిన నిజాన్ని చెప్పాలని ప్రయత్నిస్తాడు. దీపానే శివ నారాయణ అసలు మనవరాలు అని, పారిజాతం దురుద్దేశంతో చిన్నప్పుడే దీపాను రోడ్డుపై విసిరిసిందని, జ్యోత్స్న దాసు మామ కూతురిని, దీప బతికి ఉంటే ఆస్తి మొత్తం తమ చేతికి రాదని, ఎన్ని హత్యలు, దాడులకు ప్రయత్నిస్తున్నారని కార్తీక్ బాబు వివరంగా చెప్పాలని అనుకున్నాడు. కానీ ప్రతిదానికి శివ నారాయణ సాక్ష్యాలు సరైన ఆధారాలు అడుగుతుండడంతో కాస్త వెనుకడుగు వేస్తాడు. పక్క ఆధారాలు తన చేతికి వచ్చిన తర్వాతనే అసలు గుర్తు బయట పెడతానని తన మనసులో అనుకుంటాడు. ఇక రక్తదానం చేసినందుకు అత్త సుమిత్రకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతాడు.

అయితే కార్తీక్ బాబు వచ్చి మాట్లాడిన మాటలకు అటు జోత్స్న, ఇటు పారుజాతం వణికిపోతారు. కార్తీక్ బాబు ఏదో నిజం తెలిసిన వ్యక్తి లాగా మాట్లాడుతున్నాడని పారుజాతం భయపడుతుంది. ఇక దీపాను సుమిత్రకు కూతురు అంటూ కార్తీక్ బాబు నొక్కి చెప్పడంతో జ్యోత్స్న కూడా కంగారుపడుతుంది. కార్తీక్ బాబుకు నిజం తెలిసిపోయింది ఆయన మాటలతో కన్ఫామ్ చేసుకుంటుంది. జ్యోత్స్న భయపడుతున్న సంగతిని పారిజాతం గమనిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ బాబు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత జ్యోత్నను వేరే గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా ప్రశ్నిస్తుంది. కార్తీక్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరెవరిని చంపాలని ప్రయత్నించావు, దీపాలు పొడిచిన ముసుగు మనిషి ఎవరు? అని జోష్నాపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది పారిజాతం.

ఇక జ్యోత్స్న వెంటనే స్పందించి వాటన్నింటితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. కానీ జోష్నా మాటలను పారిజాతం నమ్మదు. నీకేమీ తెలియకపోతే కార్తీక్ బాబు అలా మాట్లాడుతూ ఉంటే ఎందుకు భయపడుతున్నామని మళ్లీ ప్రశ్నిస్తుంది పారిజాతం. అందుకు జోష్నా స్పందిస్తూ నేను భయపడుతున్నది అందుకు కాదని చెబుతుంది. మరి ఇంకెందుకు అని పారిజాతం మళ్లీ ప్రశ్నిస్తూ ఉంది. ఇక వెంటనే జ్యోత్స్నా కార్తీక్ బాబుతో సంతకం చేయించుకున్న అగ్రిమెంట్ పేపర్లను చూపిస్తుంది. కార్తీక్ బావను తన కాళ్ల వద్దకు తెచ్చుకునేందుకే ఈ అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేయించానని చెబుతుంది. ఈ పేపర్లో అంత పవర్ ఉందా అని పారిజాతం ప్రశ్నిస్తుంది. అందుకు జోష్నా అవునని బదిలిస్తుంది. ఈ అగ్రిమెంట్తో కార్తీక్ తను చెప్పినట్టుగా ఉంటాడని, జ్యో బదులు ఇస్తుంది.

మరి ఆ ముసుగు మనిషి ఎవరు అని, బుల్లెట్ వెనకాల ఉన్నది ఎవరు అని పారు ప్రశ్నిస్తుంది. ఆ విషయాలన్నీ తనకు తెలియదని, ఈ అగ్రిమెంట్ పేపర్ల గురించే కార్తీక్ బాబు ఇంట్లో చెప్పాలని ప్రయత్నించాడేమోనని జ్యో అంటుంది. ఈ అగ్రిమెంట్ పేపర్లతో ఆస్తి మొత్తం తన వైపు వచ్చేలా చేస్తానని జోష్నా అంటుంది. ఇదంతా జరగాలంటే నువ్వు నాకు సహాయం చేయాలని పారిజాతమును సాయం కోరుతుంది. ఏం చేయాలో క్షుణ్ణంగా వివరిస్తుంది కూడా. ఇక పారిజాతం జోష్నా చెప్పిన ప్లాన్ లో నిమగ్నమైపోతుంది. మరోవైపు జోష్నా తన తండ్రి దశరథను తన దారిలోకి తెచ్చుకునేందుకు, దీపా పై ఇంకా కోపం పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు తన తండ్రి దగ్గరికి జ్యూస్ తీసుకొని వెళ్తుంది.

అప్పటికే జోష్నాపై అనుమానంతో ఉన్న దశరథ ఆ జ్యూస్ తాగడానికి కూడా సందేహిస్తాడు. దాసు చెప్పిన మాటలను, తనకు బుల్లెట్ తగిలిన విషయాన్ని, దీపాను కత్తితో పొడిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక జోష్నా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా తాగకపోవడంతో కంగారుపడుతుంది. జ్యూస్ లో ఏదైనా విష పదార్థం కలిపి ఇచ్చానని అనుకుంటున్నాడేమోనని సందేహిస్తూ ఉంటుంది. అనుకున్నట్టుగానే దశరథ ఆ జ్యూస్ ను తాగుబోడు. చూసినా చేతిలో నుంచి తీసుకొని టేబుల్ పై పెడతాడు. ఇక జోష్నాపై తన సందేహాలను నివృత్తి చేసుకోవాలని అనుకుంటాడు. ఇదే సమయంలో జోత్స్న దీపా పై వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. దీపతో ఎందుకు అంత ప్రేమగా మాట్లాడుతున్నారు డాడీ అని, ఆమె యోగక్షేమాలు ఎందుకు తెలుసుకుంటున్నారని ప్రశ్నిస్తుంది.

అందుకు దశరథ స్పందిస్తూ.. దీప తనను చంపాలని ప్రయత్నించలేదని సంగతి స్పష్టంగా తెలుస్తోందని అంటాడు. ఎందుకు అలా అంటున్నారని జోష్నా దశరథను ప్రశ్నిస్తుంది. ఆరోజు నువ్వు అసలు ఇంకా ఎందుకు తీసావ్ అని దశరథ అడుగుతాడు. దీపం నన్ను చంపుతుందని భయంతో గన్ తీశానని అంటుంది. మరి అలాంటప్పుడు నీ చేతిలో నుంచి దీప కూడా గన్ తీసుకోవడం తప్పేమీ కాదు కదా అని ప్రశ్నిస్తాడు. కను తీసుకోవడమే కాదు నేను కాల్చింది కూడా అని జోష్నా బదిలిస్తుంది. కానీ ఆ బుల్లెట్ దీప పట్టుకున్న గన్నులో నుంచి వచ్చింది కాదని కోర్టు స్పష్టం చేసింది కదా అని అంటాడు. ఈలోగా దశరథ వచ్చి అలా ఏం కాదు దీపాన్ని చంపింది అని, కార్తీక్ బాబు తెలివితో దీపను కాపాడాడని అంటాడు. ఈ విషయాన్ని అందరూ నమ్మాల్సిందేనని చెబుతాడు.

కానీ దశరథ మాత్రం దీప చంపలేదని, తనకు చంపాల్సిన పని ఏమీ లేదని దశరథ అంటాడు. బెయిల్ పై ఇంటికి తిరిగి వచ్చిన దీపాను కేవలం రెండు రోజుల్లోనే ఎవరో ముసుగు మనిషి కత్తితో దాడి చేయడం చూస్తూ ఉంటే.. మా ఇద్దరికీ తెలిసిన వ్యక్తినే ఇదంతా చేస్తున్నారని అంటాడు. ఇదే విషయాన్ని జ్యోను అడుగుతాడు. కానీ జ్యోత్స్న అలా ఎవరు ఉంటారని అంటుంది. ఎందుకు ఉండరు అని దశరథ ప్రశ్నిస్తాడు. ఉండాల్సిన రూల్ ఏముందని, దీపానే అని చెబుతున్నా అర్థం కావడం లేదా అని శివ నారాయణ అంటాడు. ఇక వారికి సమాధానం చెప్పలేక దశరథ కాస్త మౌనంగా ఉంటాడు. మరోవైపు పారిజాతం జ్యోత్స్న చెప్పినట్టుగా కార్తీక్ బాబు ఇంటికి చెత్త ఏరుకునే గెటప్ లో వెళ్లి అక్కడి గుట్టు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ పారిజాతంను వెనకనుంచి అనసూయ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది.. నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X