Karthika deepam 2 May 14th : దీపాపై జ్యోత్స్న కుట్ర.. కార్తీక్ బాబుకు చిక్కిన నకిలీ మనవరాలు
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 13వ తేదీ 356వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్నపై మొదటి నుంచి దశరథకు అనుమానం ఉంటూనే ఉంది. ఇంట్లో వాళ్లందరిపై దాడులు చేయిస్తున్నది, హత్యాహత్నాలు చేస్తున్నది కూడా జ్యోత్స్ననే అని దశరథ సందేహిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు మాత్రం జ్యోత్స్నను ముక్కుసూటిగా ప్రశ్నిస్తాడు. తనపై కాల్పులు జరిపింది.. దీపాను చంపాలని చూసిన ముసుగు మనిషి ఒక్కరేనని, అది కూడా తమకు ఎంతో కావాల్సిన వ్యక్తులే చేశారని జ్యోత్స్నను చూస్తూ అంటాడు. దాంతో జ్యో కంగారు పడి పోతుంది. తండ్రి దశరథకు అసలు విషయం తెలిసిపోయిందా? అని భయపడుతుంది.
కానీ దశరథ మాత్రం దాసుకు గతం గుర్తుకు వచ్చేంత వరకు జ్యోత్స్న ను ఏమనొద్దని కండీషన్ పెట్టుకుంటాడు. అసలు జ్యోత్స్న ఎందుకు అందరినీ చంపాలని ప్రయత్నిస్తుందని, అసలు జ్యోత్స్న మనసులో ఏం ఉందనే విషయాలను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకోసం ఎంతో ఓపిగ్గా, సహనంతో ఉంటాడు. మరోవైపు జ్యోత్స్న దీపాను అసలు కూతురు అంటూ కార్తీక్ బాబు మాట్లాడటంతో కాస్తా కంగారు పడుతుంది. అసలు కార్తీక్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందో తనకు తెలియాలంటూ పారుజాతం ను పంపిస్తుంది. పారుజాతం ఆ ఇంటికి వెళ్లి అనసూయ కంట్లో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మే 14వ తేదీ 357 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

పారుజాతం చెత్త ఏరుకునే దానిలా కార్తీక్ బాబు ఇంటికి వెళ్తుంది. అక్కడ అనసూయ చేతికి దొరుకుతుంది. అనసూయను చూసి పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. కానీ అనసూయ వేగంగా వచ్చి ఆగమని అడుగుతుంది. దాంతో పారుజాతం వెంటనే ఆగుతుంది. దొరికిపోతానేమోనని భయపడుతుంది. ఇక మారువేషంలో ఉన్న కూడా అనసూయ గుర్తుపడుతుందని భయపడుతారు. తన ముఖ కదలికలు, గొంతు మార్చి మాట్లాడటంతో అనసూయ కూడా గుర్తు పట్టదు. ఇక ఈ ఇంటి వైపునకు ఎందుకు వచ్చావంటూ అనసూయ మారువేశంలో ఉన్న పారుజాతంను అడుగుతుంది. ఇంట్లో ఏదైనా తినడానికి దొరుకుతుందా అని అడిగేందుకు వచ్చానని అంటుంది పారుజాతం. దాంతో అనసూయ ఇంట్లో చేసిన పాయసాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఒక స్పూన్ కూడా ఉంటే ఇవ్వమని అంటుంది పారుజాతం. అనసూయ మండిపడుతుంది.
ఏదో గొప్పింటి దానిలా స్పూన్ ఉంటేనే రోజూ తినేదానిలా అడుగుతున్నావేంటీ అని కోపం చేస్తుంది. నానా మాటలు అంటుంది. దీంతో పారుజాతం గట్టిగా మాట్లాడుతుంది. దాంతో ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందని, చాలా దగ్గరి వ్యక్తి గొంతులాగా ఉందని అంటుంది. దాంతో మళ్లీ పారుజాతం గొంతు సవరించుకుంటుంది. ఇక పాయసం తీసుకొని పక్కకు వెళ్లబోతుంది. ఇదే సమయంలో కాశీ, స్వప్న, దాసు కార్తీక్ బాబు ఇంటికి వస్తారు. దీపాను పరామర్శించేందుకు అందరూ కలిసి ఆటోలో వస్తారు. ఇక వారిని చూసిన పారుజాతం గుండె జారిపోతుంది. చెత్త ఏరుకునే గెటప్ లో ఉన్న తనను చూసి కచ్చితంగా గుర్తు పడుతారని భయపడుతుంది. దాంతో పక్కనే ఉన్న గట్టుపైకి వెళ్తుంది.
కానీ ఇంట్లోకి వస్తుండగా దాసు పారుజాతం ను అమ్మా అని పిలుస్తాడు. దాంతో దొరికిపోయానని భయపడుతుంది. కానీ పక్కనే పడిపోయిన వాటర్ బాటిళ్లు తీసుకొని వెళ్లమని అంటాడు. దాంతో పారుజాతం ఊపిరి తీసుకుంటుంది. గుర్తు పట్టకపోవడంతో కాస్తా శాంతిస్తుంది. ఇక దాసు, కాశీ, స్వప్న ఇక్కడి వాచ్చరంటే ఏదో జరగబోతుందని, జ్యోత్స్న ఊహించినట్టుగానే ఏదో చేయబోతున్నారనేది తెలుసుకుంటుంది. ఇక వాళ్లు మాట్లాడుకునే విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కిటికి దగ్గర నుంచి వీడియో తీస్తూ ఉంటుంది. ఇక ఇంటి లోపల దాసు దీపాను పరామర్శిస్తాడు. ఇలా జరగడం బాధకరం అంటాడు. మొత్తానికి దీపా ప్రాణాలతో తిరిగి ఇంటికి రావడం సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని తెలుపుతాడు. మరోవైపు కాశీ, స్వప్న కూడా దీపా ఆరోగ్యం బాగా ఉండేలా చూసుకోవాలని అంటారు. కానీ ముసుగులో వచ్చి పొడిచిన వ్యక్తిని మాత్రం వదలకూడదని అంటారు.
అదే సమయంలో దాసు గతం గుర్తుకు రావడంతో ముసుగు మనిషి ఏంటీ దీపాను కత్తితో పొడిచిన వ్యక్తి తెలిసిపోయింది కదా అని అంటాడు. వెంటనే శిక్ష పడేలా చేయాలని నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే కార్తీక్ బాబు హాలులోకి వచ్చి దాసు మామ నిజం చెప్పేందుకు సిద్ధమయ్యాడని గ్రహిస్తాడు. జ్యోత్స్న గురించి నిజం చెప్ప బోతుంటే వెంటనే కార్తీక్ బాబు దాసును అడ్డు కుంటాడు. భుజం మీద చేయి వేయడంతో దాసు తన మాట మార్చుకుంటాడు. ఎవరు ఎవర్ని కొట్టారని టాపిక్ మార్చేస్తాడు. ఇక కాశీ, స్వప్న ఎంత అడిగినా కానీ చెప్పడు. ఇక కార్తీక్ బాబు అందరి నోరు మూయించి దాసును బయటికి తీసుకెళ్తాడు. ఆయన పరిస్థితి అందరికీ తెలిసిందే కదా ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని చెబుతాడు.
ఇక దాసును బయటికి తీసుకెళ్లిన తర్వాత కార్తీక్ బాబు మండిపడుతాడు. నువ్వేంటి మామ ఇంట్లో వాళ్లందరికీ నిజాలు చెబుతున్నావని అంటాడు. దీపానే శివనారాయణ అసలు మనవరాలు అనే సంగతిని నువ్వు ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదని, అలా చేస్తే అందరూ అలర్ట్ అవుతారని వివరిస్తాడు. ఎవ్వరికీ చెప్ప కూడదని మరోసారి గట్టిగా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక దాసు మామను ఆపడం కష్టమేనని, ఎవరికో ఒకరి ఈ నిజాన్ని చెప్పే దాకా ఊరుకునేలా లేడని, ఈ వ్యవధిలోనే జ్యోత్స్న స్థానంలో దీపాను నిల్చోబెట్టాలని కార్తీక్ బాబు అనుకుంటాడు. ఇక మరోవైపు పారుజాతం తను ఇక్కడ తీసిన వీడియోను జ్యోత్స్నకు చూపిస్తుంది.
దాసు మాట్లాడిన మాటలను జ్యోత్స్నకు వీడియో ద్వారా చూపిస్తుంది. దాంతో జ్యోత్స్న ఇంకా భయపడుతుంది. కార్తీక్ బాబుకు అసలు విషయం తెలిసి పోయిందని, శివనారాయణ అసలు మనవరాలు, దశరథకు బుల్లెట్ తగలడానికి అసలు కారణం తనేననే విషయం తెలిసిపోయిందని స్పష్టం చేసుకుంటుంది. ఇకా ఎలాగైనా తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. వెంటనే తన అసలు తండ్రి దాసును కలవాలని పారుజాతం చెబుతుంది. ఇక అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతుంది? ఎలాంటి ప్లాన్ వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











