Karthika deepam 2 May 15th : దాసుతో జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. కార్తీక్ బాబు విఫల ప్రయత్నం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 14వ తేదీ 357వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పారుజాతం చెత్త ఏరుకునే వాళ్లలా గెటప్ మార్చి కార్తీక్ బాబు ఇంటికి వెళ్తుంది. అక్కడ అనసూయ చేతికి దొరుకుతుంది. మారువేషంలో ఉన్న కూడా అనసూయ గుర్తుపడుతుందని భయపడుతుంది. ముఖ కదలికలు, గొంతు మార్చి మాట్లాడటంతో అనసూయ కూడా గుర్తు పట్టదు. ఇదే సమయంలో కాశీ, స్వప్న, దాసు కార్తీక్ బాబు ఇంటికి వస్తారు. దీపాను పరామర్శించేందుకు అందరూ కలిసి ఆటోలో వస్తారు. ఇక వారిని చూసిన పారుజాతం గుండె జారిపోతుంది. చెత్త ఏరుకునే గెటప్ లో ఉన్న తనను చూసి కచ్చితంగా గుర్తు పడుతారని భయపడుతుంది. దాంతో పక్కనే ఉన్న గట్టుపైకి వెళ్తుంది.
కానీ ఇంట్లోకి వస్తుండగా దాసు పారుజాతంను అమ్మా అని పిలుస్తాడు. పక్కనే పడిపోయిన వాటర్ బాటిళ్లు తీసుకొని వెళ్లమని అంటాడు. దాంతో పారుజాతం దొరికిపోలేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక దాసు గతం గుర్తుకు రావడంతో దీపాను చంపేందుకు చూసిన వారి గురించి తెలుసని అంటాడు. వెంటనే శిక్ష పడేలా చేయాలని నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే కార్తీక్ బాబు వచ్చి అడ్డుకుంటాడు. కార్తీక్ బాబు అందరి నోరు మూయించి దాసును బయటికి తీసుకెళ్తాడు. ఆయన పరిస్థితి అందరికీ తెలిసిందే కదా ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని చెబుతాడు. ఇక దాసుతో దీపానే శివనారాయణ అసలు మనవరాలు అనే సంగతిని నువ్వు ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదని చెబుతాడు. మరోవైపు జ్యోత్స్నకు ఈ విషయం అంతా పారుజాతం చేరవేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మే 15వ తేదీ 358 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపానే సుమిత్ర, దశరథల అసలు కూతురు అని, శివనారాయణ అసలు మనవరాలు అని దాసు చెప్పిన మాటలను దీపాకు చెప్పాలని కార్తీక్ బాబు ప్రయత్నిస్తాడు. దీంతో శౌర్య లాకెట్ ను చూసి ఈ లాకెట్ మీ అమ్మగారిది కదా అని అడుగుతాడు. అందుకు దీపా అవునని అంటుంది. మరీ మీ అమ్మగారిని నువ్వు ఎప్పుడైనా చూశావా? అని కార్తీక్ బాబు ప్రశ్నిస్తాడు. అందుకు దీపా లేదని అంటుంది. చిన్నప్పుడు ఒక ఫొటో ఉండేది కానీ అది చిన్నప్పుడే పోయింది. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందని చెబుతుంది. అది నిజం కాకపోతే ఎలా ఉంటుందని దీపాతో కార్తీక్ బాబు అంటాడు. అంటే మీ అసలు అమ్మనాన్న వేరే వాళ్లు అయ్యింటే ఎలా ఉంటుందని కార్తీక్ బాబు అంటాడు. వేరే వాళ్లు ఎలా అవుతారని దీపా కార్తీక్ బాబును అడుగుతుంది.
అదే నువ్వొకసారి మీ తల్లికి పిండం పెట్టాలని చూసినప్పుడు ఒక సాధువు వచ్చి బతికి ఉన్న వారికి పిండం పెడితే చెల్లదని, మీ అమ్మనాన్న బతికే ఉన్నారని చెప్పారు కదా అని అంటాడు. అవును ఆ విషయాలన్నీ నీకెవ్వరు చెప్పారని దీపా అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు మాట్లాడుతూ మా అత్త చెప్పిందని అంటాడు. ఇక వెనకాల నుంచి కార్తీక్ బాబు మాటలను అనసూయ వింటుంది. దీపా పుట్టుక గురించి కార్తీక్ బాబు మాట్లాడుతుండటంతో భయపడి పోతుంది. వెంటనే కార్తీక్ బాబును అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు వెళ్లి దీపాకు పాలు ఇచ్చి తాగమని చెబుతుంది. అనసూయ రావడంతో కార్తీక్ బాబు వెంటనే టాపిక్ మార్చేస్తాడు.
ఇక దీపాను పాలు తాగి వెంటనే పడుకోమని, ఎంత బాగా నిద్రపోతే అంత త్వరగా నయం అవుతుందని అంటుంది. ఇక కార్తీక్ బాబు కూడా దీపాను ప్రశ్నలు అడగటం మానేస్తాడు. ఇద్దరూ పడుకుంటారు. ఇక దీపాకు త్వరలోనే అసలు విషయం చెబుతానని, తను ఊహించలేని జీవితాన్ని చూపిస్తానని అనుకుంటాడు కార్తీక్ బాబు. ఆ రోజు త్వరగానే వస్తుందని అంటాడు. ఇక మరోవైపు జ్యోత్స్న, పారుజాతం దాసు వాళ్ల ఇంటికి వెళ్తారు. దాసు కార్తీక్ బాబు ఇంట్లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను చూసి వెంటనే దాసును పరీక్షించాలని అనుకుంటుంది. అందుకే వెంటనే దాసును కలిసేందుకు పారుజాతాన్ని వెంట పెట్టుకొని వెళ్లుంది. ఆ ఇంటికి వెళ్లగానే పారు, జ్యో ను చూసి కాశీ ఇంట్లోకి రా అని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో దిల్ వచ్చి వారు ఎందుకు వచ్చారోనని కోపం తెచ్చుకుంటుంది.
పారు, జ్యోల కుట్ర పూరిత బుద్ధికి దిల్ దిమ్మతిరిగి పోయే కౌంటర్లు ఇస్తుంది. వారి మాటలను తిప్పి కొడుతుంది. మీరు ఈ ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉండలేమని మండి పడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి అసలు మీరు ఎందుకు ఇక్కడి వచ్చారో ఆ సంగతి చెప్పమని అడుగుతుంది. దాంతో వెంటనే పారుజాతం స్పందిస్తూ నీకోసం ఎవ్వరూ రాలేదని నా కొడుకు దాసుతో మాట్లాడటం కోసం వచ్చానని అంటుంది. అదే సమయంలో దాసు వచ్చి తన తల్లి పారుజాతంతో మాట్లాడుతాడు. పారు, దాసు, జ్యో ముగ్గురు కలిసి దాసు రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుంటారు. దాసు ఆరోగ్యం ఎలా ఉందని పారుజాతం అడుగుతుంది. ఇక కార్తీక్ బాబు గతం మర్చిపోయినట్టు నటించమన్నారు కాబట్టి అలానే నటిస్తాడు. నాకేం అయ్యిందని, బాగానే ఉందని, ఈమె ఎవరని జ్యోత్స్నను చూపించి అడుగుతాడు. మీ దశరథ అన్నయ్య కూతురు అని చెబుతాడు దాసు. ఇక జ్యోత్స్నకు మాత్రం దాసుపై డౌట్ ఉంటుంది.
అందుకు పారుజాతాన్ని బయటికి పంపించి దాసుతో మాట్లాడుతుంది. నీకు గతం గుర్తుకు వచ్చినా రానట్లు నటిస్తున్నావు కదా నన్నా అని పక్కనే కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటుంది. అందుకు దాసు ఎలాంటి స్పందన ఇవ్వడు. ఇక జ్యోత్స్న మాత్రం నీకు గతం గుర్తుకు వచ్చి, నా గురించి ఎవ్వరికైనా చెబితే మాత్రం నిన్ను అస్సలు బతకనివ్వను నాన్న అని హెచ్చరించి వెళ్లిపోతుంది. ఇక ఆ విషయాన్ని వెంటనే దాసు కార్తీక్ బాబుకు తెలియజేస్తాడు. నాకు వార్నింగ్ ఇచ్చిందని అంటాడు. జ్యోత్స్న నీపై పగసాధిస్తుందని, అగ్రిమెంట్స్ లో దీపాతో విడిపోవాలని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఏం చేస్తావని దాసు ప్రశ్నిస్తాడు. అందుకు కార్తీక్ బాబు సందిగ్ధంలో పడిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











