Karthika deepam 2 May 16th : కార్తీక్ బాబుకు జ్యోత్స్న ఎదురుదెబ్బ.. దీపాపై దిమ్మతిరిగే ప్లాన్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 15వ తేదీ 358వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న, పారుజాతం దాసు వాళ్ల ఇంటికి వెళ్తారు. దాసు కార్తీక్ బాబు ఇంట్లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను చూసి వెంటనే దాసును పరీక్షించాలని అనుకుంటుంది. అందుకే వెంటనే దాసును కలిసేందుకు పారుజాతాన్ని వెంట పెట్టుకొని వెళ్లుంది. ఆ ఇంటికి వెళ్లగానే పారు, జ్యో ను చూసి కాశీ ఇంట్లోకి రా అని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో దిల్ వచ్చి వారు ఎందుకు వచ్చారోనని కోపం తెచ్చుకుంటుంది. పారు, జ్యోల కుట్ర పూరిత బుద్ధికి దిల్ దిమ్మతిరిగి పోయే కౌంటర్లు ఇస్తుంది. వారి మాటలను తిప్పి కొడుతుంది. మీరు ఈ ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉండలేమని మండి పడుతుంది.

ఇక దాసు వచ్చిన తర్వాత పారు, దాసు, జ్యో ముగ్గురు కలిసి దాసు రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుంటారు. కొద్దిసేపటి తర్వాత పారుజాతాన్ని జ్యో బయటికి పంపించి దాసుతో మాట్లాడుతుంది. నీకు గతం గుర్తుకు వచ్చినా రానట్లు నటిస్తున్నావు కదా నన్నా అని పక్కనే కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటుంది. అందుకు దాసు ఎలాంటి స్పందన ఇవ్వడు. ఇక జ్యోత్స్న మాత్రం నీకు గతం గుర్తుకు వచ్చి, నా గురించి ఎవ్వరికైనా చెబితే మాత్రం నిన్ను అస్సలు బతకనివ్వను నాన్న అని హెచ్చరించి వెళ్లిపోతుంది. ఇక ఆ విషయాన్ని వెంటనే దాసు కార్తీక్ బాబుకు తెలియజేస్తాడు. జ్యోత్స్న అగ్రిమెంట్ ను ఉపయోగించి ఏదైనా కీడు చేస్తే ఎలా అని సందేహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మే 16వ తేదీ 359 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 359 May 16th 2025

జ్యోత్స్న పక్కనే పారుజాతం ఉండటంతో తను రాక్షసురాలిగా మారిపోతోందని దాసు అంటాడు. ముఖ్యంగా ఆ అమ్మ పారుజాతం జ్యోత్స్నకు అన్నీ నూరిపోస్తోంది. తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్లతో నిన్ను ఇరికించే పని చేస్తే ఏం చేస్తావని కార్తీక్ బాబుతో అంటాడు. ఆ అగ్రిమెంట్లో కార్తీక్ బాబును పెళ్లి చేసుకోమని, తనతో కలిసి బతకాలని రాస్తే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. అందుకు కార్తీక్ బాబు స్పందిస్తూ జ్యోత్స్న అగ్రిమెంట్ లో ఏం రాసుకున్న పర్లేదని అంటాడు కార్తీక్ బాబు. జ్యోత్స్న ఏం రాసినా తనకే రివర్స్ అవుతుందని అంటాడు. నిజం మనకు తెలిసి పోయిందన్న కంగారులో జ్యోత్స్న రెండు మూడు రోజుల్లో ఏదోక నిర్ణయం తీసుకుంటుంది. దానికి కౌంటర్ గా మనం మరో ప్లాన్ రెడీ చేద్దామని అంటాడు.

ఏదీ చేసినా త్వరగా చేయి అల్లుడు అని దాసు కార్తీక్ బాబుతో అంటాడు. చేస్తానని చెబుతాడు. ప్రస్తుతం జ్యోత్స్న తనను ఏం చేయలేదని అంటాడు. ముందుగానే తనే రెండు కేసుల్లో ఇరుక్కోనుందని చెబుతాడు. ఒకటి దశరథ ఛాతిలో దిగిన బుల్లెట్ ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తారనేది, అందులో జ్యోత్స్ననే నిందితురాలిగా తేలనుందని అంటాడు. మరోకటి దీపాను పొడిచిన ముసుగు మనిషి ఎవరనే కేసులోనూ ఆమె చిక్కుల్లో పడనుందని అంటాడు. అలా తనకు విశ్రాంతి లేకుండా పోలీసుల విచారణల్లోనే సమయం గడిచిపోతుందని అంటాడు. జ్యోత్స్న ఏం చూస్తుందో చూసి ఆ తర్వాత తమ మాస్టర్ ప్లాన్ ను స్టార్ట్ చేద్దామని కార్తీక్ బాబు దాసు తో అంటాడు. అలాగే దీపాను కూడా తన సొంతింటికి తిరిగి చేర్చాలని, అలాగే జ్యోత్స్నను నీ కూతురిగా మంచిగా మార్చి తిరిగి ఇవ్వాలి. ఇవన్నీ నా ముందున్న టార్గెట్లు అని అంటాడు. దాంతో దాసు ఏం చేసిన త్వరగా చేయమని కార్తీక్ బాబుతో దాసుతో అంటాడు.

ఇక నువ్వేమీ టెన్షన్ పడకని, ఇలా అర్థరాత్రుల్లో ఇంటికి వస్తే నీకు గతం గుర్తుకు వచ్చిందని అందరూ సందేహిస్తారని చెబుతాడు. త్వరగా ఇంటికి తిరిగి వెళ్లండని చెబుతాడు. దాంతో దాసు తిరిగి వెళ్లిపోతాడు. అయితే కార్తీక్ బాబును దాసు కలవడం, వారు మాట్లాడుకోవడం దీపా దూరం నుంచి చూస్తుంది. తనకు ఒంట్లో ఓపికా లేకపోవడంతో వాళ్ల దగ్గరి వరకు వెళ్లదు. కానీ కార్తీక్ బాబు ఇంట్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఏంటీ దాసు బాబాయ్ ను బయటి నుంచే పంపించేశారు. మీరిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు? అసలు ఎందుకు దాసు బాబాయ్ వచ్చి వెళ్తున్నాడని అడుగుతుంది దీపా. దానికి కార్తీక్ బాబు స్పందిస్తూ నీ గురించే అడగటానికి వచ్చాడని, నీకు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొని వెళ్తున్నాడని దీపాకు కార్తీక్ బాబు సమాధానం ఇస్తాడు.

కానీ దీపా కార్తీక్ బాబు మాటలను నమ్మబోదు. దాసు బాబాయ్ కి గతం గుర్తుకు లేదు కదా? అసలు మన ఇంటికి ఒక్కడే ఎలా వచ్చాడని? మళ్లీ ఎలా తిరిగి వెళ్తాడని? అసలు నేను దాసు బాబాయ్ కి గుర్తుకు ఉండను కదా? నన్ను ఎందుకు అడుగుతున్నాడని కార్తీక్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దానికి కార్తీక్ బాబు స్పందిస్తూ ఇన్నీ ప్రశ్నలు వేయడం మానేసి నువ్వు రెస్ట్ తీసుమని చెబుతాడు. త్వరలోనే నీకే అన్ని విషయాలు అర్థమవుతాయని అంటాడు. నిన్ను నీ ఇంటికి చేర్చే పనిలోనే బిజీగా ఉన్నానని, త్వరలోనే జ్యోత్స్న ప్లేస్ ల నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని నీ దగ్గరికి చేరుస్తానని మనస్సులో అనుకుంటాడు. జ్యోత్స్న తిక్క కూడా కుదుర్చుతానని నిర్ణయించుకుంటాడు.

మరోవైపు శౌర్య పాపా బయట ఆడుకుంటూ ఉండగా.. రక్తంతో నిండిపోయిన కత్తి కనిపిస్తుంది. వెంటనే నాన్న నాన్న అని అరుస్తుంది. ఏమైందోనని కార్తీక్ బాబు హడావుడిగా బయటికి వచ్చి చూస్తాడు. ఏమైంది రౌడీ అని అడగ్గా నేలపై పడి ఉన్న కత్తిని చూపిస్తుంది. అది చూసిన కార్తీక్ బాబు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు వచ్చి కత్తిని ఆధారంగా సేకరిస్తారు. ల్యాబ్ రిపోర్ట్స్ కు పంపిస్తామని, కత్తిపై ఉన్న బ్లడ్, దీపా ఒంట్లోని రక్తంతో మ్యాచ్ అయితే హంతకుడి చేతి ముద్రలతో ఈజీగా పట్టుకోవచ్చని అంటాడు. ఇంకా మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న, గౌతమ్ లపై అనుమానం ఉందని కార్తీక్ బాబు చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X