Karthika deepam 2 May 17th : జ్యోత్స్నకు కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్.. ఊహించని దెబ్బ

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 16వ తేదీ 359వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని వెంటనే దాసు కార్తీక్ బాబుకు వెళ్లి చెబుతాడు. ఇక జ్యోత్స్న పక్కనే తన తల్లి పారుజాతం ఉండటంతో ఇంకా రాక్షసురాలిగా మారిపోతోందని అంటాడు. తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్లతో నిన్ను ఇరికించే పని చేస్తే ఏం చేస్తావని కార్తీక్ బాబుతో అంటాడు. ఆ అగ్రిమెంట్లో కార్తీక్ బాబును పెళ్లి చేసుకోమని, తనతో కలిసి బతకాలని రాస్తే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. అందుకు కార్తీక్ బాబు స్పందిస్తూ జ్యోత్స్న అగ్రిమెంట్ లో ఏం రాసుకున్న పర్లేదని అంటాడు. జ్యోత్స్న ఏం రాసినా తనకే రివర్స్ అవుతుందని అంటాడు. నిజం మనకు తెలిసి పోయిందన్న కంగారులో జ్యోత్స్న రెండు మూడు రోజుల్లో ఏదోక నిర్ణయం తీసుకుంటుంది. దాంతో ఊహించని దెబ్బ తింటుందని అంటుంది.

ఇక మరోవైపు శౌర్య పాపా బయట ఆడుకుంటూ ఉండగా.. రక్తంతో తడిచిన కత్తి కనిపిస్తుంది. వెంటనే అందరినీ పిలిచి చెబుతుంది. ఇక కార్తీక్ బాబు హడావుడిగా బయటికి వచ్చి నేలపై పడి ఉన్న కత్తిని చూస్తాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు వచ్చి కత్తిని ఆధారంగా సేకరిస్తారు. ల్యాబ్ కు పంపిస్తామని, కత్తిపై ఉన్న బ్లడ్, దీపా ఒంట్లోని రక్తంతో మ్యాచ్ అవ్వాలని, అలాగే హంతకుడి చేతి ముద్రలు కూడా లభిస్తే ముసుగులో ఉన్న హంతకుడిని ఈజీగా పట్టుకోవచ్చని అంటాడు. అలాగే మీకెవ్వరిపైనైనా అనుమానం ఉంటే చెప్పండి అంటూ పోలీసులు అడుగుతారు. దాంతో జ్యోత్స్న, గౌతమ్ లపై అనుమానం ఉందని కార్తీక్ బాబు చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. మే 17వ తేదీ 360 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 360 May 17th 2025

కార్తీక్ బాబు ఇంట్లో దొరికిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇక నేరుగా శివనారాయణ ఇంటికి వెళ్తారు. కార్తీక్ బాబుకు జ్యోత్స్న, గౌతమ్ లపై అనుమానం ఉందని చెప్పడంతో ఆ ఇంటికి వెళ్లి విచారాణ చేస్తారు. గౌతమ్ ను కత్తితో పొడిచిన ముసుగు వ్యక్తితో ఈ ఇంటి వారికి సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నామని పోలీసులు శివనారాయణకు చెబుతారు. కార్తీక్ బాబు ఇంట్లో దొరికిన కత్తిని కూడా చూపిస్తారు. మా దగ్గర ముసుగు మనిషి దీపాను కత్తితో పొడిచి ఆ ఇంట్లో వదిలిన కత్తి దొరికిందని, దానిపై ఉన్న వేలి ముద్రలతో దోషిని పట్టుకుంటామని చెబుతాడు. మరోసారి పోలీసులు ఇంటికి రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పోలీసులు విచారణ విచారణ అంటుండటంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. ఆ విషయాన్ని పారుజాతం గమనిస్తుంది.

వెంటనే జ్యోత్స్నను పిలిచి దీపాను హత్య చేయాలని చూసింది నువ్వేనా అని పారుజాతం అడగుతుంది. దానికి జ్యోత్స్న నేను కాదని చెబుతుంది. ఏదైనా ఉంటే నాతో చెప్పుకోవే అని నానమ్మ పారుజాతం అంటుంది. కానీ జ్యోత్స్న నీతో చెప్పేది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయని కంగారు పడుతున్నాను.. అంతకంటే ఇంకేమీ లేదని జ్యోత్స్న పారుజాతంతో అంటుంది. మరోవైపు పోలీసులపై సుమిత్ర మండిపడుతుంది. ఎవరో ఏదో ఆధారాలు చూపించారని, అనుమానం వ్యక్తం చేశారని ఈ ఇంటికి వచ్చి అందరనీ కంగారు పెట్టడం సరికాదని అంటుంది. మీ దగ్గర ఏదైనా పక్కా సాక్ష్యాధారాలు ఉంటేనే మళ్లీ రండి అని చెబుతుంది.

అందుకు ఎస్సై స్పందిస్తూ.. కమిషనర్ గారు జ్యోత్స్న బుల్లెట్ కేసు ను కూడా మాకే అప్పగించారు. ఆ కేసు లోనైనా జ్యోత్స్న విచారణకు హాజరు కావాల్సిందే. ఇక ఈ కత్తిపై ఉన్న వేలి ముద్రలతో అసలు నిందితుడు ఎవరనేది మేం తెలుసుకుంటాం. అప్పటి వరకు కేసు విచారణకు సహకరించాలని చెప్పి వెళ్లిపోతారు. ఇక పారుజాతం పోలీసులు వెళ్లిపోయాక కార్తీక్ బాబు కావాలనే పదే పదే ఇలా చేస్తున్నాడని, మనం వెంటనే ఆ ఇంటికి వెళ్లి కాంచన, కార్తీక్ బాబు, దీపాలను కడిగి పారేద్దామని అంటుంది. అందుకు శివనారాయణ మాత్రం మనం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటాడో పెట్టుకోనివ్వండి.. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ఎక్కడ సమాధానం ఇవ్వాలో అక్కడే ఇస్తాను అని చెబుతాడు.

వెంటనే దశరథతో పారుజాతం మాట్లాడుతూ కనీసం ఫోన్ చేసైనా మీ చెల్లి కాంచనకు నాలుగు చివాట్లు పెట్టు అని అంటుంది. అందుకు దశరథ ఒప్పుకోడు. పోలీసులు విచారించడంలో, కార్తీక్ బాబు అనుమానించడంలో తప్పేమీ ఉందంటూ తిరిగి పారుజాతంను ప్రశ్నిస్తాడు. గతంలో జ్యోత్స్న, దీపాలకు గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ గొడవలు కాస్తా కోర్టు మెట్ల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే మళ్లీ దీపాపై హత్యాయత్నం జరిగింది. ఇలాంటప్పుడు పోలీసులు వచ్చి విచారించడంలో తప్పేమంటారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని, నిందితులకు మాత్రమే శిక్ష పడుతుందని అంటాడు. అందులో జ్యోత్స్న భయపడాల్సిన పనేమీ లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

ఇక పరిస్థితులు రోజురోజుకు విషమంగా మారుతుండటంతో జ్యోత్స్నలో టెన్షన్ తో మొదలవుతుంది. దీంతో కార్తీక్ బాబును ఆపేందుకు వ్యూహాలు రచిస్తూ ఉంటుంది. ఇప్పటికే తనను బుల్లెట్ కేసు, దీపా హత్యాయత్నం కేసు రెండు వైపులా చుట్టుముడుతున్నాయని మనసులో అనుకుంటుంది. ఇక తను కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ పై పెట్టించిన సంతకాలను ఉపయోగించి కొత్త వ్యూహాన్ని రచిస్తుంది. కార్తీక్ బాబుకు ఊహించని షాక్ ఇవ్వాలని, ఆ దెబ్బ నుంచి కోలుకో లేకుండా చేయాలని, దాంతో ఈ కేసులపై తన దృష్టిని మళ్లించాలని అంటుంది.

అందుకు అగ్రిమెంట్ పై ఏదో కండీషన్ ను రాసి పెడుతుంది. పారుజాతంకు కూడా ఆ విషయాన్ని చెప్పబోదు. ఇక మరోవైపు కార్తీక్ బాబుకు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. కార్తీక్ బాబు, వంటలక్క కృషికి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు దక్కిందని స్వయంగా సత్యరాజే వచ్చి చెబుతారు. దీంతో ఇంటిల్లిపాది ఆనందంతో పొంగిపోతుంది. ఆరోజు తాత శివనారాయణపై చేసిన సవాల్ ను నెగ్గించానని కార్తీక్ బాబు అంటాడు. అవార్డు పట్టుకొని నేరుగా ఆ ఇంటికి అరిచి మరి చెబుతాను అని అంటాడు.. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X