Karthika Deepam 2 May 19th Episode: నీవు బానిసవు.. కార్తీక్‌కు షాకిచ్చిన జ్యోత్న్స
తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 17వ తేదీ 360వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. స్వయంకృషితో రెస్టారెంట్‌ను నడుపుతున్న కార్తీక్‌కు ఆనందపడే వార్త అందింది. ఇక మరోవైపు కార్తీక్ బాబుకు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి గుడ్ న్యూస్ అందుతుంది.

సత్యరాజ్ వచ్చి.. స్వీట్ తినిపించిన తర్వాతే గుడ్ న్యూస్ చెబుతానని అంటాడు. కార్తీక్ బాబు, వంటలక్క కృషికి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు దక్కింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నావు అని సత్యరాజ్ ప్రశంసలతో ముంచెత్తుతాడు. గతంలో కార్తీక్ తాను ఆవేశంగా చేసిన ఛాలెంజ్‌ను గుర్తు చేసుకొంటాడు. దీంతో ఇంటిల్లిపాది ఆనందంతో పొంగిపోతుంది. ఆరోజు తాత శివనారాయణపై చేసిన సవాల్ ను నెగ్గించానని కార్తీక్ బాబు అంటాడు. అవార్డు పట్టుకొని నేరుగా ఆ ఇంటికి అరిచి మరి చెబుతాను అని అంటాడు.. తాజా ఎపిసోడ్ అంటే మే 19వ తేదీ 361వ ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?
అమ్మ నీవు స్వీట్ తినలేదు. అమ్మకు స్వీట్ తినిపించు. నాన్న మీకు మెసేజ్ వచ్చింది అని కూతురు చెబితే.. ఫోన్‌లో మెసేజ్ చూసి.. కంగారుపడిపోతాడు. మీరు మాట్లాడుతుండండి. నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు హడావిడిగా వెళ్లిపోయాడు. బయట తన మరదలు జ్యోత్స్న ఉండటం చూసి ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చాను అర్జెంట్‌గా రమ్మని మెసేజ్ చేశాడు. అంటూ కార్తీక్ అన్నాడు. దాంతో ఆమె కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చిందా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
నీవంటే ఎంత ప్రేమో నీకు తెలియదు. నీవు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు అని మరదలు అంటే.. నేను తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయను అంటూ కార్తీక్ ముఖం మీదే చెప్పాడు. దాంతో కొంత మంది నిద్రలో కలగంటారు. అదే నిజమనుకొంటున్నారు. కానీ మెలుకువ వస్తే కానీ తెలియదు అది కల అని అని జ్యోత్స్న అంటే.. నేను నిద్రలోనే ఉండొచ్చు. నీవు భ్రమలో ఉన్నావు. నిజాలు బురదలో మొలిచే కమలాలు లాంటివి. ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ ఏదో రోజు అవి బయటకు వస్తాయి అంటూ కార్తీక్ గట్టిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
దీప ప్రాణాలతో బయటపడినప్పటి నుంచి నీవు కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటే.. కొత్త విషయాలు బయటపడినప్పుడు అన్ని కొత్తగానే అనిపిస్తాయి అని కార్తీక్ అంటే.. ఏంటో ఆ కొత్త విషయాలు అంటూ మరదలు ప్రశ్నించింది. దాంతో సోది ఆపి నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్పు. లోపల అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు అంటూ కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడు. దాంతో నీవు ఛాలెంజ్ చేశావు. గెలిచావు. కంగ్రాట్స్ బావా అంటూ జ్యోత్స్న షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత బెస్ట్ రెస్టారెంట్ అందుకోబోతున్నందుకు దీప చాలా హ్యపీగా ఉంది కదా అని ఆమె అంటే.. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు.
దాంతో నేను సర్‌ప్రైజ్ ఇవ్వాలి అంటూ ఓ కాగితం అందించింది. ఆ కాగితాన్ని చూసి అగ్రిమెంటా? నోటికి వచ్చింది రాశారా? లేదా చేతికి వచ్చినట్టు రాశారా? అని కార్తీక్ ప్రశ్నించాడు. దాంతో అన్నీ ప్రేమతో రాశాను అని ఆమె అంటే.. మాటలే సరిగా ఉండవు. రాతలు సరిగా ఉంటాయా? ఏదో తలనొప్పి తెచ్చి ఉంటావు అని కార్తీక్ ఆ అగ్రిమెంట్ చదువుతుంటే.. పైకి చదువు. అక్షర దోషాలు ఉంటే సరిచేసుకొంటాను అని ఆమె అంది. దాంతో అక్షరాలే దోషాలు అయినప్పుడు సరి చేసుకోవడానికి ఏం ఉంటుంది అని కౌంటర్ ఇచ్చాడు. దాంతో వినడానికి మజాగా ఉంటుంది. పైకి చదువు అని అంది.
జ్యోత్స్నకు మనస్పూర్తిగా రాసిచ్చిన అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. జ్యోత్న్స ఏది చెబితే అది చేయాలి. దానికి సంబంధించిన సర్వ అధికారాలు, సర్వ హక్కులు ఉన్నాయి. జోత్న్స ఏం చెప్పినా ఏం చేసినా చేయడానికి సర్వం సిద్దంగా ఉన్నాను .. ఇట్లు కార్తీక్ అని చదువుతుంటే.. దీని ప్రకారం నేను ఏదీ చెప్పినా చేయాల్సిందే అని జోత్న్స డిమాండ్ చేస్తే.. మాటిచ్చాను కదా అని హద్దులు దాటి రాసుకొన్నావు అని కార్తీక్ అన్నాడు. దాంతో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని జ్యోత్స్న అంది.
నీవు నాకు రాజువి. నీవు మంత్రివి. నీవు డ్రైవర్‌వీ.. కారు నడపాలి. నీవు అసిస్టెంట్‌వి పని చేసి పెట్టాలి. నీవు సీఈవో.. అసరమైతే నా ఆఫీస్‌ను రన్ చేయాలి. నీవు నా వంట మనిషివి. నాకు వంట చేసి పెట్టాలి. నీవు నా ఆఫీస్ బాయ్‌వి.. చిటుకేస్తే పని చేసి పెట్టాలి. నీవు నా బానిసవు అంటూ మాటలతో చెలరేగిపోయింది. నీ జీవితాన్ని నాకు తాకట్టు పెట్టావు. భార్య దీప కోసం అన్నీ త్యాగం చేయడానికి సిద్దపడ్డావు. నాకు నచ్చిన పని చేయడానికి నీవు తాకట్టు పెట్టావు. అన్ని ఒప్పుకొనే సంతకం పెట్టావు. ప్రాణం పోయినా మాట తప్పవని తెలుసు అని ఆమె అంటే.. నేను ఏదైనా చేయడానికి సిద్దం అంటూ కార్తీక్ జవాబు ఇచ్చాడు. దాంతో షాక్ తిన్న ఆమె.. నీవు ఏ ఒక్కదానికైనా నో చెప్పవా? ఆర్గ్యూ చేయవా? అంటే... నేను ఎదురు చూసే అవకాశం వస్తే.. నేను ఎందుకు వద్దంటాను అని కార్తీక్ అంతే జోష్‌గా సమాధానం ఇచ్చాడు. దాంతో నేను వింటున్నది నిజమేనా? నీవేనా మాట్లాడుతున్నది? అని జ్యోత్న్న అంటే.. నేను ఇప్పుడే మొదలు పెట్టాను. వద్దనే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పుడే ఎందుకు షాక్ తింటున్నావు అంటూ కామెంట్ చేశాడు.
దాంతో అగ్రిమెంట్‌లో ఏముందో అర్ధమైందా? అంటే.. నీవు తెలుగులోనే రాశావు కదా.. మలయాళంలో రాయలేదుగా అన్నాడు. నీవు ఎవరో అసలు బయటపెడుతాను అని మనసులో అనుకొన్నాడు. కానీ కార్తీక్‌కు జ్యోత్స్న షాకిస్తూ.. సత్యరాజ్ రెస్టారెంట్‌లో నీవు పనిచేస్తున్నావు. కానీ నిన్నటి నుంచే ఆ రెస్టారెంట్ ఓనర్ షిప్ నా పేరు మీదకు వచ్చింది. కాబట్టి నీవు అవార్డు తీసుకోవడానికి అర్హత లేదు అని జ్యోత్స్న భారీ షాకిచ్చింది. దాంతో కార్తీక్ గట్టిగా అరిచాడు. నేను దీపతో కలిసి అవార్డు తీసుకోవాలని అనుకొన్నాను అని కార్తీక్ అంటే.. అది కుదరదు. కావాలంటే.. నాతో కలిసి నా పక్కన నిలుచొని నాతో అవార్డు తీసుకో అంటూ కసిగా జ్యోత్స్న చెబుతూ ఆనందపడిపోయింది. పరాయి భర్త పక్కన నిలుచుంటే.. నీకు హాయిగా ఉంటుందో కానీ.. నాకు ఆనందంగా ఉండదు అని కార్తీక్ అన్నాడు. అవార్డు ఫంక్షన్‌కు నీ కూతురును కూడా తీసుకు రా.. రేపు అవార్డు ఫంక్షన్‌లో కలుద్దాం అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో చిన్న మరదలా? నీకు ముందుంది ముసళ్ల పండగ అంటూ.. ఏదైనా ఫేస్ చేయాల్సిందే అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొడుకు చేతిలో ఓడిపోవడంతో శివన్నారాయణ ఊగిపోయాడు. పెళ్లాం డబ్బులతో హోటల్ రన్న చేస్తున్నా కార్తీక్.. మనం కోట్లు పెట్టి రెస్టారెంట్ చేస్తున్నాం. మనం ఎందుకు ఓడిపోవాలి అని అంటే.. నీవు ఓటమిని జీర్ణించుకోలేవు అంటూ జ్యోత్స్న, మనవడు అన్నారు. కార్తీక్ గెలువడాన్ని జీర్ణించుకోలేకోపోయాడు. కార్తీక్ నా మనవడు కాదు. నేను నాశనం కావాలనుకొంటున్నాడు అని తాత అన్నాడు. అయితే తాతను కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ.. నిన్ను తలదించుకోనివ్వను అంటూ జ్యోత్న్స అంటూ సవాల్ చేసింది.
ఇదిలా ఉండగా, అవార్డు గెలుచుకొన్న కార్తీక్, దీప కోసం సూట్, చీరెలను తన సోదరి తెచ్చింది. అయితే మనమంతా ఒకే కుటుంబం అంటూ సోదరి, బావ కాశీ అన్నారు. శివన్నారాయణ మంచి మనిషి కాదు. కార్తీక్ గెలువడాన్ని సహించడు అని సోదరి అంటే.. తాతకు అలాంటి ఫీల్ ఉండదు అని దీప అంది. అయితే తనకు డ్రస్ తీసుకు రాలేదని కార్తీక్ కూతురు ప్రశ్నించింది. అయితే రేపు అవార్డు ఫంక్షన్‌కు వెళ్లడం లేదని ఎలా చెప్పాలి అంటూ కార్తీక్ తనలో తాను మదనపడిపోయాడు. దాంతో రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తిని క్రియేట్ చేస్తూ.. మే 19వ తేదీ ఎపిసోడ్‌ను ముగించారు.


Click it and Unblock the Notifications










