Karthika Deepam 2 May 20th Episode: 24 గంటల్లో 10 కోట్లు కట్టండి..కార్తీక్‌కు జ్యోత్న్స షాక్

తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్‌ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 17వ తేదీ 360వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. స్వయంకృషితో రెస్టారెంట్‌ను నడుపుతున్న కార్తీక్‌కు ఆనందపడే వార్త అందింది. ఇక మరోవైపు కార్తీక్ బాబుకు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి గుడ్ న్యూస్ అందుతుంది.

తాత శివన్నారాయణపై ఛాలెంజ్ చేసి రెస్టారెంట్ నిర్వహిస్తున్న కార్తీక్‌ను బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వరిస్తుంది. సత్యరాజ్ వచ్చి.. స్వీట్ తినిపించిన తర్వాతే గుడ్ న్యూస్ చెబుతానని అంటాడు. కార్తీక్ బాబు, వంటలక్క కృషికి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు దక్కింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నావు అని సత్యరాజ్ ప్రశంసలతో ముంచెత్తుతాడు. ఈ వార్తను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే జ్యోత్స్న వచ్చి షాకిస్తుంది. ఆ రెస్టారెంట్‌ను తాను నిన్ననే కొనుగోలు చేశాను. ప్రస్తుతం ఆ రెస్టారెంట్‌ నా ఓనర్‌షిప్‌లో ఉంది. కాబట్టి నీవు నేను చెప్పినట్టు చేయాలి. నీవు దీపతో కాకుండా నాతో కలిసి అవార్డు స్వీకరించాలి అని తనతో కార్తీక్ చేసుకొన్న అగ్రిమెంట్‌ను బయటపెట్టింది.

Karthika deepam 2 Serial Today s Episode 362 May 20th 2025

అయితే నీవు ఇంకా భ్రమలో ఉన్నావు. ఏదో రోజు నీవు చెప్పే అసత్యాలు బయటపడుతాయి అని కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు. మనవడి చేతిలో ఓడిపోవడంతో శివన్నారాయణ ఊగిపోయాడు. ఇలాంటి ట్విస్టులతో మే 19వ తేదీ ఎపిసోడ్‌ను ముగించారు. మే 20 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

మరదలు జ్యోత్న్స ఇచ్చిన ట్విస్టుతో బెస్ట్ రెస్టారెంట్ అవార్డు ఫంక్షన్‌కు రాకుండా దీప, శౌర్యను ఆపాలి అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. ఇంతలో శౌర్య వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంటుందని అడిగింది. అంతలో దీప వచ్చి వేరే డ్రస్ వేసుకోమని చెప్పానుగా అంటూ కోపం వ్యక్తం చేయబోయింది. దాంతో రేపు అవార్డు ఫంక్షన్‌కు ఇదే అవార్డు వేసుకొంటాను. బాగుంటుందా? అని అడిగితే.. రేపు నీవు ఫంక్షన్‌కు రావడం లేదు అంటూ కార్తీక్ చెప్పేశాడు. అయితే నన్ను వదిలేసి నీవు, అమ్మా వెళ్తావా? అంటే.. అమ్మ కూడా రాదు అంటూ కార్తీక్ అనడంతో దీప, కుటుంబ సభ్యులు షాకైంది. నువ్వే కాదు.. అమ్మ, అనసూయ రావడం లేదు. దీప ఆరోగ్యం బాగా లేదు. అందుకే అవార్డు ఫంక్షన్‌కు వద్దని అనుకొంటున్నాను. ఆమెను మీరిద్దరూ చూసుకోండి. నేను ఒక్కడికి వెళ్తాను అంటూ కార్తీక్ మాట మార్చే ప్రయత్నం చేశాడు.

నీరసంగా ఉండటం నిజమే కానీ.. అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత హుషారు అయిపోయాను అని దీప అంటే.. అవార్డు ఫంక్షన్ నేను తీసుకోవడం లేదు. జ్యోత్న్స తీసుకొంటుందని, ఆమె పక్కన నేను ఉన్నానని చూస్తే మీరు మరింత బాధపడుతారు అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. అయితే దీప ఎందుకు వద్దు అంటే..ఆరోగ్యం బాగలేదు అంటే.. మీరు చేయి పట్టుకొంటే నేరుగా తాతయ్య ఇంటికే వచ్చాను. అలాంటిది అవార్డు ఫంక్షన్‌కు రాలేనా? అంటూ దీప ప్రశ్నించింది.

అయితే లేదు.. లేదు నేను ఒక్కడినే వెళ్తాను. అవార్డు తీసుకొనేది ఫోన్‌లో చూపిస్తాను అని కార్తీక్ అంటే.. సరేలే.. వాడిని అర్ధం చేసుకొందామని తల్లి అంటే.. థ్యాంక్స్ అమ్మా.. నన్ను అర్ధం చేసుకొన్నందుకు అని కార్తీక్ జవాబిచ్చాడు. అయితే నాన్నమ్మ అంటే శౌర్య బాధపడితే.. నాన్న వెళ్లనివ్వండి.. ఆ తర్వాత మనం క్యాబ్‌లో వెళ్దాం అని అంటే.. శౌర్య సంతోషం వ్యక్తం చేసింది. అయితే నీవు వెళ్లు.. నీతో మేము రావడం ఇష్టం లేకపోతే.. వేరుగా వస్తాం అని దీప చెప్పింది. దాంతో కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు. జ్యోత్న్స తనే అవార్డు తీసుకొంటానని బెట్ చేస్తుందా? అని ఆలోచించాడు. అంతలో నీవు అవార్డు తీసుకోవడం నా చిరకాలపు కోరిక. నీవు కంపల్సరీ అవార్డు తీసుకో అని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

బెస్ట్ అవార్డు ఫంక్షన్‌ వేదిక వద్ద కార్తీక్‌కు సన్మానం కోసం అన్నీ ఏర్పాట్లు, హంగులు పూర్తయ్యాయి. అవార్డు రానందుకు మీరు రారని అనుకొన్నాను. కానీ శివన్నారాయణ నిన్ను బాగానే పంపించాడు అని అవార్డు నిర్వాహకుడు జ్యోత్న్సతో అన్నాడు. జ్యోత్న్స వెళ్లి ఓ సీటులో కూర్చోబోతే..అది అవార్డు తీసుకొనే ఫ్యామిలీకి కేటాయించిన సీట్లు.. మీరు వేరే చోట కూర్చో అంటే.. అవార్డు తీసుకోబోయేది నేనే.. కావాలంటే కార్తీక్‌ను అడుగు అంటూ నిర్వాహకుడికి జ్యోత్న్స ట్విస్ట్ ఇచ్చింది. ఆయన పక్కకు తీసుకుపోతుంటే.. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు అందరి ముందే చెప్పేద్దాం అని జ్యోత్న్స అంది.

అయితే నేను అవార్డు తీసుకొంటుంటే.. నీవు చప్పట్లు కొట్టడానికి సూట్ వేసుకోని రావడం నాకు సంతోషంగా ఉంది బావా అంటూ జ్యోత్స్న సెటైర్ వేసింది. దాంతో దీప షాక్ అయింది. అయితే నిర్వాహకుడు అందుకు ఒప్పుకోకుండా.. కార్తీక్ నీవే అవార్డు తీసుకోవాలి అని అన్నాడు. దాంతో నాన్న నీవు అవార్డు తీసుకోవా? అని శౌర్య అడిగింది. అయితే నాన్న శివన్నారాయణ అవార్డు తీసుకోనివ్వకపోతే.. ఊరుకోను అంటూ ఆయన మనవడు ఊగిపోయాడు. ఈ కన్‌ఫ్యూజన్ ‌క్లియర్ చేస్తూ.. సత్యరాజ్ హోటల్‌లో పార్ట్‌నర్‌షిప్‌ జ్యోత్న్సది. అందుకే అవార్డు ఆమెనే తీసుకొంటుంది అని చెప్పాడు. అయితే కార్తీక్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. జ్యోత్న్సకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాంతో అగ్రిమెంట్ ప్రకారం నీవు రియాక్ట్ కాకపోతే.. అందుకు నష్టంగా నాకు 24 గంటల్లో 10 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని జ్యోత్న్స కొత్త క్లాజ్‌ను తెరపైకి తేవడంతో కార్తీక్ షాక్ అయ్యాడు.

కార్తీక్‌కు జ్నోత్స్న కౌంటర్ ఇవ్వడం చూసి దీప ఆవేశపడిపోతే.. ఈ అగ్రిమెంట్‌కు కారణం నువ్వే అంటూ దీపకు అసలు విషయం జ్యోత్స్న చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇంటి సభ్యులు గందరోగోళానికి గురి అయితే.. నేను ఇంటికి వెళ్లిన తర్వాత అంతా క్లియర్‌గా నీకే చెబుతాను అంటూ కార్తీక్ సర్ది చెప్పబోయాడు. ఈ లోపు ఈ అవార్డును నువ్వే తీసుకోవాలి అని నిర్వాహకుడు షాక్ ఇచ్చాడు. అయితే కంగారు పడిన జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నారంటే.. మీకు ఏం చెప్పిన అర్ధం కావడం లేదు. మీకు అర్ధమయ్యేలా ఓ వ్యక్తిని పిలిచాను అంటూ నిర్వాహకుడు పిలవడంతో శివన్నారాయణ వచ్చాడు. అతడిని చూసి అందరూ షాక్ అయ్యారు.

ఈ అవార్డు వచ్చింది సత్యరాజ్‌ రెస్టారెంట్‌కు వచ్చింది. కార్తీక్ అవార్డు తీసుకోవాలి. నీవు ఇక్కడికి వచ్చి పరువు తీయకు అని శివన్నారాయణ అన్నాడు. దాంతో సత్యరాజ్‌ రెస్టారెంట్ ప్రస్తుతం మనది. మనకు అగ్రిమెంట్ జరిగింది అని జ్యోత్స్న అంది. అయితే కుటుంబ సభ్యుల గొడవ అవుతుంటే చూసి.. ఇంటికి వెళ్దాం పద అంటూ శివన్నారాయణ అంటే.. అవార్డు తీసుకొని వెళ్లాల్సిందే అని జ్యోత్స్న పట్టుపట్టింది. అగ్రిమెంట్‌ ప్రకారం.. అవార్డు నేను తీసుకోవాలి. లేకపోతే ఎంత కట్టాలో నీకు తెలుసా? అని జ్యోత్స్న కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి అగ్రిమెంట్‌పై ఎందుకు సంతకం చేశావు. జ్యోత్స్న వద్ద అప్పు చేశావా? అని దీప నిలదీసింది. ఇంతలో కార్తీక్‌ను అవార్డు తీసుకోవడానికి రమ్మని వేదికపైకి పిలిచారు. అయితే పైకి వెళ్లి ఏం చెప్పాలో అదే చెప్పు అంటూ జ్నోత్స్న డిమాండ్ చేసింది. దాంతో వెళ్లి అవార్డు అందుకోండి అని దీప చెప్పడంతో కార్తీక్ వేదికపైకి వెళ్లాడు.

కార్తీక్ అవార్డు అందుకొంటూ.. ఈ అవార్డు సత్యరాజ్ రెస్టారెంట్‌కు వచ్చింది. ఇందులో జ్యోత్న్స పార్ట్‌నర్. కాబట్టి ఆమె ఈ అవార్డును అందుకోవాలి అని కార్తీక్ అన్నాడు. ఆ మాటలు విన్న దీప కోపంతో ఊగిపోయింది. జ్యోత్స్న ఆనందంలో మునిగిపోయింది. కార్తీక్‌ను అలా మార్చేస్తావా? అంటే.. ఇప్పుడు కేవలం సత్యరాజ్ రెస్టారెంట్‌లోనే మార్చేశాను. ఆ తర్వాత ఆయన వద్ద నుంచి నీ స్థానం కూడా మార్చేస్తాను అంటూ జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది. ఈ ట్విస్టుతో మే 20వ తేదీ ఎపిసోడ్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X