Karthika Deepam 2 May 21st Episode: కార్తీక్ పక్కనుంచి నీ స్థానం లాగేసుకొంటా.. దీపకు జ్యోత్న్స వార్నింగ్

తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్‌ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 17వ తేదీ 360వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. స్వయంకృషితో రెస్టారెంట్‌ను నడుపుతున్న కార్తీక్‌కు ఆనందపడే వార్త అందింది. ఇక మరోవైపు కార్తీక్ బాబుకు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి గుడ్ న్యూస్ అందుతుంది.

తాత శివన్నారాయణపై ఛాలెంజ్ చేసి రెస్టారెంట్ నిర్వహిస్తున్న కార్తీక్‌ను బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వరిస్తుంది. కార్తీక్ బాబు, వంటలక్క కృషికి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు దక్కింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నావు అని సత్యరాజ్ ప్రశంసలతో ముంచెత్తుతాడు. జ్యోత్స్న చేసిన రచ్చ కారణంగా దీప, శౌర్య, తన కుటుంబ సభ్యులను బెస్ట్ రెస్టారెంట్ అవార్డుకు దూరంగా ఉంచాలని కార్తీక్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కార్తీక్‌ను కాదని వారంతా అవార్డు ఫంక్షన్‌కు వచ్చారు. అయితే కార్తీక్‌కు అవార్డు అందుకోవడానికి అర్హత లేదు. సత్య రాజ్ రెస్టారెంట్ పార్ట్‌నర్‌ను నేను అంటూ జ్యోత్న్స మెలికపెట్టింది. దాంతో స్వయంగా కార్తీక్ ఈ అవార్డును అందుకోవాలని జ్యోత్న్సను వేదికపైకి ఆహ్వానించాడు.

Karthika deepam 2 Serial Today s Episode 363 May 21st 2025

ఆ మాటలు విన్న దీప కోపంతో ఊగిపోయింది. జ్యోత్స్న ఆనందంలో మునిగిపోయింది. కార్తీక్‌ను అలా మార్చేస్తావా? అంటే.. ఇప్పుడు కేవలం సత్యరాజ్ రెస్టారెంట్‌లోనే మార్చేశాను. ఆ తర్వాత ఆయన వద్ద నుంచి నీ స్థానం కూడా మార్చేస్తాను అంటూ జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది. ఈ ట్విస్టుతో మే 20వ తేదీ ఎపిసోడ్ ముగిసింది. ఇక మే 21వ తేదీన 363 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబుకు బెస్ట్ రెస్టారెంట్ అవార్డును అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఇక అవార్డును అందుకోవడం కోసం కార్తీక్ బాబు కుటుంబ సమేతంగా అవార్డ్ ఫంక్షన్ కు హాజరవుతారు. ఆ ఈవెంట్ కు శివనారాయణ, జ్యోత్స్న కూడా హాజరవుతారు. అయితే కార్తీక్ బాబు అవార్డును అందుకోబోతుంటే జ్యోత్స్న ఊహించని షాక్ ఇస్తుంది. అత్యాశతో దూకుడుగా వ్యవహరిస్తున్న జ్యోత్స్న అవార్డు తనకే దక్కాలని తహతహ లాడుతుంది. అందుకు తన కుట్ర పూరితమైన వ్యూహాలను ముందుకు తీసుకొస్తుంది.

కార్తీక్ బాబు అందుకోవాల్సిన బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఈయర్ అవార్డును జ్యోత్స్న అందుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ ను అస్త్రంగా వాడుతుంది. కార్తీక్ బాబు రన్ చేస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ లో పార్ట్నర్ షిప్ ను రాసిచ్చినట్టుగా అగ్రిమెంట్ ను రెడీ చేయిస్తుంది. దీపా ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్న సమయంలో బ్లడ్ ఇచ్చి మరీ కార్తీక్ బాబుతో వైట్ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ అగ్రిమెంట్ లోని ఒక పేపర్ ను తీసి కార్తీక్ బాబు రన్ చేస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ లో పార్ట్ నర్ షిప్ రాసిచ్చినట్టుగా అవార్డు ఫంక్షన్ లో తెలియజేస్తుంది.

కార్తీక్ బాబు అవార్డు అందుకోబోతున్నాడని అందరూ సంతోషంలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలో జ్యోత్స్న బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ను కార్తీక్ బాబుకు ఇవ్వడానికి వీల్లేదని, ఆ అవార్డ్ కు నేనే అర్హురాలినని అంటుంది. అంతే కాదు వేదికపైకి కార్తీక్ బాబును సాదరంగా ఆహ్వానించిన సమయంలో కార్తీక్ బాబుకు బదులుగా జ్యోత్స్న వెళ్తుంది. ఆ అవార్డు అందుకునేది నేనేనని మైక్ లో కూడా అనౌన్స్ చేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పటికే అగ్రిమెంట్ గురించి చెప్పి అవార్డు విషయంలో షాక్ ఇస్తుంది. ఆ రెస్టారెంట్ బాధ్యతలను తనకు అప్పగించిన సందర్భంగా ఆ అవార్డ్ కూడా తమకే దక్కుతుందని అంటుంది.

ఆ అవార్డ్ ను కూడా తన బావ కార్తీక్ బాబు చేతుల మీదుగా అందించాలని కూడా కోరుకుంటుంది. ఇక కార్తీక్ బాబు కూడా అవార్డ్ ను అందించేందుకు ఒప్పుకుంటాడు. కానీ దీపా అవార్డ్ ను ప్రదానం చేసే సమయంలో అడ్డుకుంటుంది. తను స్టేజ్ పైకి వెళ్లి అవార్డు జ్యోత్స్న దక్కడం సరికాదని, ఆమె అర్హురాలు కాదని చెబుతుంది. ఎందుకో కూడా చెబుతానని వివరిస్తుంది. అసలు కార్తీక్ బాబుకు బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ను ఎందుకు ఇవ్వాలని నిర్ణయించారని సత్యరాజ్ ను అడుగుతుంది. దానికి ఆయన స్పందిస్తూ.. రెస్టారెంట్ ను అన్ని విషయాల్లో బెస్ట్ గా నిలిపారని, అందుకే అవార్డ్ ను నిర్ణయించామని బదులిస్తాడు.

అలాగే వెంటనే జ్యోత్స్న ను కూడా దీపా ప్రశ్నిస్తుంది. మీకు కార్తీక్ బాబు రెస్టారెంట్ లో పార్ట్ నర్ షిప్ ఎప్పుడు ఇచ్చారని అడుగుతుంది. దాంతో ఐదు రోజుల కింద బదిలీ చేశారని అంటుంది. ఆ వెంటనే దీపా సత్యరాజ్ ను మరో ప్రశ్న అడుగుతుంది. కేవలం ఐదు రోజులను ఉద్దేశించే ఈ బెస్ట్ అవార్డును నిర్ణయించారా? అని ప్రశ్నిస్తుంది. అందుకు సత్యరాజ్ కాదని బదులిస్తాడు. ఏడాది పాటు కార్తీక్ బాబు చేసిన కృషికి అవార్డును ప్రకటించామని చెబుతాడు. మరీ అలాంటప్పుడు అవార్డ్ న్యాయంగా ఎవరికి రావాలో కూడా చెప్పాలని దీపా డిమాండ్ చేస్తుంది. న్యాయంగా అయితే ఆ అవార్డ్ కార్తీక్ బాబుకే రావాలని సత్యారాజ్ తన అభిప్రాయాన్ని చెబుతాడు. అంతే కాకుండా తాత శివనారాయణ కూడా అవార్డ్ ఎవరికీ దక్కాలో చెప్పాలని దీపా ప్రశ్నిస్తుంది. దీంతో శివనారాయణ కూడా అందరూ కార్తీక్ బాబు అని తమ నిర్ణయాలు చెప్పడంతో తాను కూడా కార్తీక్ బాబుకే ఇవ్వాలని అంటాడు.

దాంతో జ్యోత్స్న ప్లాన్ విఫలమై బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ కార్తీక్ కు దక్కుతుంది. పైగా శివనారాయణ చేతుల మీదుగానే ఆ అవార్డు ను అందుకుంటాడు. తాత మీద సవాల్ చేసి అదే శివనారాయణ చేతుల మీదుగానే నువ్వు గెలిచావ్ అని అవార్డ్ తీసుకుంటున్నానని కార్తీక్ బాబు అంటాడు. ఇక శివ నారాయణ తనకు ఇష్టం లేకున్నా కూడా అవార్డ్ ను కార్తీక్ బాబుకు ప్రదానం చేస్తాడు. ఆ వెంటనే జ్యోత్స్న పై మండిపడుతూ.. వెంటనే ఇంటికి కదులు అంటాడు. అసలు ఆ అగ్రిమెంట్ సంగతేంటో మాట్లాడాలని రగిలిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X