Karthika Deepam 2 May 22nd Episode: నీ స్థాయి చెప్పుతోనే కొట్టిస్తా.. జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్

Photo Courtesy: JioHotstar

తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్‌ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 22వ తేదీ 364వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. స్వయంకృషితో రెస్టారెంట్‌ను నడుపుతున్న కార్తీక్‌కు ఆనందపడే వార్త అందింది. ఇక మరోవైపు కార్తీక్ బాబుకు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి గుడ్ న్యూస్ అందుతుంది.

కార్తీక్‌కు అవార్డు అందుకోవడానికి అర్హత లేదు. సత్య రాజ్ రెస్టారెంట్ పార్ట్‌నర్‌ను నేను అంటూ జ్యోత్న్స మెలికపెట్టింది. దాంతో స్వయంగా కార్తీక్ ఈ అవార్డును అందుకోవాలని జ్యోత్న్సను వేదికపైకి ఆహ్వానించాడు. ఆ మాటలు విన్న దీప కోపంతో ఊగిపోయింది. జ్యోత్స్న ఆనందంలో మునిగిపోయింది. కార్తీక్‌ను అలా మార్చేస్తావా? అంటే.. ఇప్పుడు కేవలం సత్యరాజ్ రెస్టారెంట్‌లోనే మార్చేశాను. ఆ తర్వాత ఆయన వద్ద నుంచి నీ స్థానం కూడా మార్చేస్తాను అంటూ జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది.

Karthika deepam 2 Serial

అయితే జ్యోత్స్న ఎత్తులకు పై ఎత్తులు వేసి దీప ఆమెకు చెక్ పెడుతుంది. దాంతో బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ కార్తీక్ కు దక్కుతుంది. పైగా శివనారాయణ చేతుల మీదుగానే ఆ అవార్డు ను అందుకుంటాడు. తాత మీద సవాల్ చేసి అదే శివనారాయణ చేతుల మీదుగానే నువ్వు గెలిచావ్ అని అవార్డ్ తీసుకుంటున్నానని కార్తీక్ బాబు అంటాడు. ఇక శివ నారాయణ తనకు ఇష్టం లేకున్నా కూడా అవార్డ్ ను కార్తీక్ బాబుకు ప్రదానం చేస్తాడు. ఆ వెంటనే జ్యోత్స్న పై మండిపడుతూ.. వెంటనే ఇంటికి కదులు అంటాడు. అసలు ఆ అగ్రిమెంట్ సంగతేంటో మాట్లాడాలని రగిలిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ట్విస్టుతో మే 21వ తేదీ ఎపిసోడ్ ముగిసింది. ఇక మే 22వ తేదీన 364 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

గాలి ముచ్చట్లు, ఊక దంపుడు ఉపన్యాసాలు కాదు.. గెలుపు అంటే ఏమిటో కార్తీక్ చూపించాడు. అటువైపు నేను వెళ్లొద్దని అనుకొన్నాను. అలాంటిది నువ్వు ఎలా వెళ్తావు. పైగా సత్యరాజ్ ఫోన్ చేసి.. కార్తీక్ అవార్డు అందుకోవడాన్ని అడ్డుకోమని నీ మనవరాలిని పంపావా? అని అన్నాడు. ఇంతకు కార్తీక్‌తో చేసుకొన్న అగ్రిమెంట్ ఏమిటో చెప్పు అంటూ శివన్నారాయణ నిలదీశాడు. అయితే జ్యోత్న్స మాత్రం మౌనంగా ఉండటంతో శివన్నారాయణ భార్య కూడా ప్రశ్నించింది. అగ్రిమెంట్ ఏమిటి? ఆ షేర్స్ కొనడం ఏమిటి? అని శివన్నారాయణ అంటే.. నేను ఏది చేసినా కుటుంబం పరువు కోసమే చేస్తాను అని జ్యోత్న్స అంది. అయితే పరువు అనీ అనకు. అది బూతులా వినిపిస్తుంది అని శివన్నారాయణ కోపంతో ఊగిపోయాడు. మళ్లీ ఆ అగ్రిమెంట్ ఏమిటో చెప్పు అంటూ అమ్మమ్మ అనడంతో.. నేను అంతా చెబుతా.. జాగ్రత్తగా వినండి అంటూ జ్యోత్స్న చెప్పడం ప్రారంభించింది.

దీపను ఎవరో కత్తితో పొడిచాడు. బ్లడ్ కోసం కార్తీక్ బావ ఇంటి వచ్చాడు. అప్పుడు నేనే నలుగురిని తీసుకెళ్లాను. అప్పుడు బావకు డబ్బు అవసరం ఏర్పడింది. నన్ను చూసి డబ్బు అడిగి.. రెస్టారెంట్‌ను తాకట్టు పెట్టాడు. చాలా పెద్ద మొత్తానికి నాకు రెస్టారెంట్‌ను తాకట్టు పెట్టాడు. ఆ సమయంలో నేను ఇచ్చిన డబ్బుకు అగ్రిమెంట్ రాయమన్నాడు. ఆ సమయంలో ముందు, వెనుక ఆలోచించకుండా భార్య కోసం సంతకం చేశాడు. అగ్రిమెంట్‌లో నేను బానిసగా కూడా పనిచేస్తాను అనే అగ్రిమెంట్‌పై సంతకం చేశాడు. దేనికి తగ్గనని, తాతకు చెప్పమని బావ సవాల్ విసిరాడు. అయితే అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే.. 24 గంటల్లో 10 కోట్లు కట్టాలని అగ్రిమెంట్‌లో రాయించాను అని జ్యోత్స్న చెబితే.. నీవు చెప్పిన దాంట్లో ఏది నమ్మాలో నాకు అర్ధం కావడం లేదు అని శివన్నారాయణ అన్నాడు. అయితే మన కూతురు సాయం చేయలేదు. సాయాన్ని బేరం పెట్టింది అని తండ్రి అన్నాడు.

అగ్రిమెంట్ విషయాన్ని మాకు ముందు ఎందుకు చెప్పలేదు? అని అంటే.. అవార్డును తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆ విషయం చెప్పాలని అనుకొన్నాను అని ఆమె చెప్పింది. అయితే సత్యరాజ్ రెస్టారెంట్‌లో సగం వాట మనది అని శివన్నారాయణ అడిగితే.. అవును. జ్యోత్న్స గ్రూపులో ఒకటిగా పనిచేస్తుంది అంటూ చెప్పింది. అయితే దీప అడ్డుపడింది కదా అని అమ్మమ్మ అంటే.. నా చేతుల మీదుగానే నేనే వారికి అవార్డు ఇచ్చాను. జ్యోత్స్న ఈ విషయం ముందే చెప్పి ఉంటే కథ వేరేలా ఉండేది అంటూ శివన్నారాయణ అసహనంతో ఊగిపోయాడు. అయితే జ్యోత్స్నను అనుమానిస్తున్నావా? అంటే.. కాదు.. బావపై పగ తీర్చుకొనే ఛాన్స్ మిస్ అయింది. తాతను అవమానించాడు. మన హోటల్ సిబ్బంది మనపై తిరగబడేలా చేశాడు. మనకంటే టాప్ రెస్టారెంట్ అని నిరూపించుకొన్నాడు. దాన్ని దెబ్బ తీయడానికే అగ్రిమెంట్ రాయించాను. ఫలితం తొందర్లోనే అనుభవిస్తాడు అంటూ జ్యోత్న్స ఊగిపోయింది.

Karthika deepam 2

Photo Courtesy: JioHotstar

కార్తీక్ త్వరలోనే ఫలితం అనుభవిస్తాడు. దీప జైల్లో నుంచి రాదనుకొన్నాడు. దీప బతకదని అనుకొన్నాడు. కానీ బతికింది. బతికించుకొన్నాడు. సాయం చేయమని మనతోనే సాయం చేయించుకొని ఆమెను బతికించుకొన్నాడు. సంతకం పెట్టించుకొన్న నీవు గెలిచినట్టా? వాడు గెలిచినట్టా? మన చేతుల మీదుగానే అవార్డు అందుకొన్నాడు. నీవు వాడిని గుప్పిట్లో పెట్టుకొన్నావని అనుకొంటున్నావు. కానీ వాడు చాలా తెలివిగా ప్లాన్ వేశాడు అని శివన్నారాయణ క్లాస్ పీకాడు. దాంతో నా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావా? అని జ్యోత్న్స అంటే.. నీవు కార్తీక్‌తో పెట్టుకోకు. అది నీకే మంచిది కాదు. పగ ప్రతీకారాలు అవసరమా? అని తల్లి, తండ్రి హెచ్చరించారు. దాంతో నాన్నకు ఇదే జరిగితే ఒప్పుకొంటావా? అని తల్లిని ప్రశ్నించింది. దాంతో నీవు పోగొట్టుకొన్నది చాలా ఎక్కువ అని తల్లి అంది. సుమిత్ర అది కరెక్టే చేసింది? ఇప్పుడైనా జ్యోత్న్స వైపు నిలబడు అని తల్లి హెచ్చరించింది. అగ్రిమెంట్‌తో తన సత్తా ఏమిటో చూపించింది. కార్తీక్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం ఉద్దేశం ఏమిటి? అని ఫ్యామిలీ అంతా ఆలోచించడం మొదలు పెట్టింది.

నీవు జ్యోత్న్సకు సపోర్టుగా ఎందుకు మాట్లాడావు. దీప లేకపోతే ఈ అవార్డు వాళ్ల ఇంట్లో ఉండేది అని కార్తీక్ తల్లి అంది. అంతలోనే జ్యోత్న్స కార్తీక్, దీప ఇంటికి వచ్చి.. అగ్రిమెంట్‌ గురించి మొత్తం మా ఇంట్లో తెలిసింది. ఇక మీకు దాని గురించి తెలియాలి. భార్యగా కార్తీక్ చేసిన అగ్రిమెంట్ గురించి మీరు తెలుసుకోవాలి అంటూ కాగితాలు దీప చేతిలో పెట్టింది. అగ్రిమెంట్ చేసుకోవడానికి నీవే కారణం. బావకు నీవంటే ప్రాణం. డాక్టర్లు నువ్వు బతకవని చెప్పాడు. రేర్ బ్లడ్ గ్రూప్ కావాలన్నారు. అప్పుడు డబ్బు, బ్లడ్ నేను ఇస్తానని చెప్పాను. అదే అదను చూసుకొని అగ్రిమెంట్ ఆలోచన వచ్చింది. దాంతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేలా చేశాను. ఇక నుంచి బావ పేరు మీద ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ నాదే. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. ఉదయం తొమ్మిది గంటల నుంచి నేను చెప్పేంత వరకు నాకు అసిస్టెంట్‌గా ఉంటాడు. నా కింద పనివాడిగా ఉంటాడు. ఈ రోజు నుంచి బావ నాకు పనివాడే అని జ్యోత్న్స చెప్పింది.

జ్యోత్న్స చెప్పింది నిజమే అంటూ కార్తీక్ చెబితే.. ఆమె నీ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నది తల్లి అంటే.. నేను నీ కోడలు ప్రాణాలు కాపాడాను అని జ్యోత్న్స అంది. అయితే నా భార్య ప్రాణాలు కాపాడావనే క్రెడిట్ నీకు ఇవ్వను అని అంటే.. అగ్రిమెంట్ గురించి చెప్పాలనుకొన్నాను చెప్పాను. ఇక నుంచి నీవు నా పని మనిషివి. నిన్ను రోడ్డు మీద బజ్జీలు అమ్ముకొనేలా చేశాను. వాటర్ క్యాన్లు మోసేలా చేశాను. అన్ని పనులు చేసి నీ స్థాయిని నీవే తగ్గించుకొన్నావు. నేను ఏమీ చెప్పినా.. చేసేలా నీకు హోదా లేదు? అని జ్యోత్న్స క్లాస్ పీకింది. దాంతో మిస్ ఆంధ్రా.. నీకు బీపీ బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడు అంటూ కామెంట్ చేశాడు. అత్త మా తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జోత్స్న అంటే.. మేన కోడల్ని భార్యగా చేసుకొంటానని మీ నాన్నకు మా అమ్మ మాటిచ్చింది అని కార్తీక్ చెప్పాడు. అయితే ఆ ఇంటికి వారసురాలినైనా నేను మేనకోడలిని కదా అంటూ జ్యోత్న్స ప్రశ్నించింది.

అసలైన మేన కోడలు ఎవరో త్వరలోనే తెలుస్తుంది అని కార్తీక్ మనసులో అనుకొంటే.. కార్తీక్ అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అని జ్యోత్న్స ప్రశ్నించింది. రక్త బంధాలను మా నాన్న నిలబెట్టుకొన్నాడా? దీపకు ఉన్న బంధం కూడా అలాంటిందే. తనే మా అమ్మకు నిజమైన మేన కోడలు. ఇది భగవంతుడు ఇచ్చిన బంధం. ఎవరూ కూడా వేరు చేయలేదు. నీకు అసలు విషయం తెలిస్తే.. చేపలా గిలగిలా కొట్టుకొంటావు అని కార్తీక్ అన్నాడు. నీ బంధం ఎలా ఉంటుందో నేను చూస్తాను. 10 కోట్లు నీవు కట్టాల్సిందే అంటూ జ్యోత్న్స మెలిక పెట్టింది. దాంతో నీవు మాట్లాడుతున్న మాటలకు చెప్పుతో కొట్టాలని ఉంది అని కార్తీక్ తల్లి అంటే.. నన్ను కొట్టే చెప్పుకు నా స్థాయి ఉండాలి అని జ్యోత్న్స బదులిచ్చింది. దాంతో కంగారు పడకు నీ స్థాయి చెప్పుతోనే నిన్ను కొట్టిస్తాను అని కార్తీక్ ఛాలెంజ్ విసిరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X