Karthika Deepam 2 May 23rd Episode: రెస్టారెంట్‌లో పనివాడిగా కార్తీక్.. జ్యోత్న్స శాడిజాన్ని తట్టుకోలేకపోయిన ద

Photo Courtesy: JioHotstar

తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్‌ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 22వ తేదీ 366వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రెస్టారెంట్ అవార్డు విషయంలో జ్యోత్స్న చేసిన రచ్చకు దీప గట్టి షాక్ ఇచ్చింది. శివన్నారాయణ చేతుల మీదుగానే కార్తీక్ అవార్డు అందుకొన్నాడు. ఈ క్రమంలో జ్యోత్న్స అగ్రిమెంట్ బయటకు తీసి.. రెస్టారెంట్ ఓనర్ నేను కాబట్టి.. నీవు నా బానిసవు. రేపటి నుంచి నేను ఏం చెబితే అది చేయాలి అంటూ ఆర్డర్ వేసింది. ఇంకా 23వ తేదీ 366 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

నా కొడుకు ఎక్కడికి రాడు పో.. ఏం చేసుకొంటావో చేసుకో అని కార్తీక్ తల్లి గట్టిగా జ్యోత్న్సకు వార్నింగ్ ఇవ్వడంతో.. అయితే నీ కొడుకు రానంటే.. 24 గంటల్లో 10 కోట్ల కట్టాల్సి ఉంటుంది అని జ్యోత్న్స బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో కార్తీక్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే జ్యోత్న్స తీరును చూసి.. నిన్ను చెప్పుతో కొట్టిస్తాను అంటూ కార్తీక్ తల్లి అంటే.. ఓకే కానీ నా స్థాయి చెప్పుతో కొట్టించు.. నీ కోడలు స్థాయి చెప్పుతో కొట్టించకు అని జ్యోత్న్స అంది. దాంతో కొట్టిస్టాను. చెప్పుతోనే కొట్టిస్తాను. చెప్పు తెగే దాక కొట్టిస్తూనే ఉంటాను అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.

Karthika deepam 2 Serial Today s Episode 366

Photo Courtesy: JioHotstar

అవార్డు అందుకొన్న జోష్‌లో ఏదైనా మాట్లాడుతారు. కానీ రేపటి నుంచి నేను చుక్కలు లెక్కించే ప్రొగ్రాం ఉంటుంది. నీవు నా బానిసవు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని రేపు రా అంటూ జ్యోత్స అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కార్తీక్ తల్లి ఆవేదన చెందుతూ... మన అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇలా చేస్తుందా? నీవు దానికి లొంగిపోతావా? అని అంటే.. ఇందంతా నా కోసమే చేశారు. నన్ను చావుకు వదిలేస్తే ఈ సమస్య వచ్చేది కాదు అంటూ దీప ఏడుస్తూ వెళ్లిపోయింది. నీ భార్య కోసం నిన్ను త్యాగం చేసుకొన్నందుకు ఆనంద పడాలో.. లేదా జ్యోత్న్సకు బానిసగా మారినందుకు బాధపడాలో అని తల్లి అంటే.. నాకు ఏం చేయాలో తెలుసు. నేను గుడ్డిగా సంతకం పెట్టలేదు. దీపను కాపాడుకోవాలని అగ్రిమెంట్ సంతకం చేశాను. అంతా మన మంచికే జరిగింది. నీ నమ్మకాన్ని నేను పోగొట్టను అంటూ కార్తీక్ తన తల్లికి ఊరట కలిగించే మాటలు చెప్పాడు.

దీప బాధపడుతుంటే.. ఓదార్చేందుకు ప్రయత్నిస్తే.. నన్ను కాపాడేందుకు నీవు త్యాగం చేసుకొంటావా? జ్యోత్న్స ఏం చేస్తుందో చూశావా? అని దీప అంటే... నా ప్లేస్‌లో నీవు ఉంటే.. ఇలానే చేసే దానివి కదా.. చిన్నప్పుడు నా ప్రాణాలు రక్షించడానికి కోనేటిలో దూకావు. అప్పుడు నీ ప్రాణం గురించి ఆలోచించావా? కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. నీవు ఇలా బాధపడుతుంటే.. ఇంట్లో అందరూ బాధపడుతారు. నేను ఇలా తల దించుకొంటే.. ఎక్కడ తల ఎత్తుకోవాలనేది నీకు తెలుసు. నీవు బాధపడకు అంటూ కార్తీక్ అన్నాడు. దీపను తీసుకొని భోజనం చేయడానికి వెళ్లాడు. అయితే నీవు రెస్టారెంట్‌కు రేపు వెళ్తావా? అంటే.. అదంతా నేను చూసుకొంటాను అని కార్తీక్ చెప్పాడు.

Karthika deepam 2 Serial Today s Episode 366

Photo Courtesy: JioHotstar

మరుసటి రోజు రెస్టారెంట్‌కు వెళ్లిన కార్తీక్‌కు తన కుర్చీలో జ్యోత్న్స కూర్చోవడం చూసి కోపంతో ఊగిపోయాడు. దాంతో నీ సీట్‌లో కూర్చొన్నందుకు కోపం వచ్చిందా? అంటే.. నిన్న నీవు ఇంటికి రాకుండా ఉండాల్సింది అని కార్తీక్ అంటే.. అవార్డు ఫంక్షన్‌కు దీపను రాకుండా చేయాల్సింది. నీవు ఆమెతో సంతోషంగా ఉండటం నేను చూడలేను. దానిని నాశనం చేయడానికి ట్రై చేస్తాను. నీవే నా సర్వం. నాతోనే ఉండాలి. నాతోనే తాగాలి. నాతోనే తినాలి. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే.. 24 గంటల్లో 10 కోట్లు ఇవ్వాలి అని జ్యోత్న్స అంటే..పదే పదే అగ్రిమెంట్ గురించి గుర్తు ఎందుకు చేస్తావు అంటే.. నీవు బానిసవు కదా.. అందుకే.. ముందుగా నీవు టేబుల్ మీద డస్ట్ ఉంది. దానిని క్లీన్ చేయి జ్యోత్న్స అంటే.. బాయ్ ఉన్నాడు కదా.. అతడితో చేయించు అని కార్తీక్ అంటే.. ఇప్పుుడు నీవు నా బాయ్‌వి జ్యోత్న్స ఆర్డర్ వేసింది. దాంతో ఇది నా క్యాబిన్.. నా టేబుల్‌ను క్లీన్ చేయడానికి మొహమాటపడను అంటూ కార్తీక్ టేబుల్ క్లీన్ చేస్తుండగా.. దీప వచ్చి చూసి బాధపడింది.

దీప రాకను గమనించిన జ్యోత్న్స.. నీవు కూడా వచ్చావా? అంటూ సెటైర్ వేసింది. కార్తీక్ టేబుల్ తుడుస్తుంటే.. నీవు ఈ పని చేయడమేంటి? ఆమె నీ కుర్చీలో కూర్చోవడం ఏంటి? అని ఆవేదన చెందింది. దాంతో నిన్న ఇంటికి వచ్చి చెప్పాను కదా.. ఇంకా అర్ధం కాలేదా అంటూ దీపతో జ్యోత్న్స అంది. అగ్రిమెంట్ జిరాక్స్ ఇచ్చాను. చదువుకోలేదా? లేదా అర్ధం కాలేదా? అని జ్యోత్న్స అంటే.. నీవు మనిషివేనా? నీవు మేనకోడలివి కదా.. ఇలాంటి పనులు చేస్తావా? దీప అంటే.. కార్తీక్‌పై నా ప్రేమను నీవు పెళ్లిగా మార్చావు. నేను ఉప్పు కారం తింటున్నాను. నా ప్రేమ నాకు దూరమైతే.. నీకు ఎలా మండుతుందో నాకు అలానే మండుతుంది. మండింది కాదా అని నేను ఒక్కదానిని ఏడవడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఏడిపిస్తాను అని జ్యోత్న్స అంటే.. దేవుడు చూస్తాడు అంటూ దీప తిట్టింది. దాంతో నీ భార్య నన్ను తిడుతుంది ఏమిటి? అంది. అలాగే ఫ్లాస్కులో కాఫీ ఉంది. నీవు కప్‌లో పోసి ఇవ్వు అంటే.. కార్తీక్ నీవు ఆ పని చేయకు కార్తీక్ అని దీప అంటే.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోంటే.. 10 కోట్లు కట్టాలి అది గుర్తుంచుకోండి అని కార్తీక్ అన్నాడు. నేను చేసిన పని స్పృహతోనే చేశాను అంటూ కార్తీక్ .. కప్పులో కాఫీ పోసి ఇచ్చాడు. అయితే కాఫీని కావాలని టేబుల్‌పైన పోసి.. టేబుల్ మీద కాఫీ పడింది. క్లీన్ చేయి అంటూ జ్యోత్న్స ఆర్డర్ వేసింది.దాంతో కాఫీ కప్పుతో నీ ముఖం పగలకొడుతాను అంటూ దీప ఆవేశపడితే.. నీవు నా రెస్టారెంట్‌కు రావొద్దు.. నీకు వంటపని కావాలంటే.. నేను ఇస్తాను అంటూ జ్యోత్న్స ఎద్దేవా చేసింది. అయితే ఆ విషయాన్ని దీప తట్టుకోలేకపోతే.. నీవు ఇంటికి వెళ్లు. మళ్లీ ఎప్పుడు రాకు అంటూ కార్తీక్ నచ్చ చెప్పాడు. దాంతో వినపడిందా? మళ్లీ ఎప్పుడు రాకు అంటూ జ్యోత్న్స వార్నింగ్ ఇచ్చింది.

దాంతో కార్తీక్ అలాంటి పనులు చేయించకు. కావాలంటే నేను ఆ పనులు చేస్తాను అని దీప అంటే.. నీవు త్యాగమూర్తివి అనే విషయం నాకు తెలుసు. కానీ నాకు కావాల్సింది నా బావ. నీవు కాదు. ఇక బయలు దేరు అని ఆర్డర్ వేసింది. దాంతో దీప వెళ్లు అంటూ కార్తీక్ చెబితే.. ఆమె అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయింది. ఇలా శాడిస్తుగా బిహేవ్ చేస్తావా? అంటే.. దీపను ఏడించడమే నా ధ్యేయం. ఆమె వచ్చి నా కాళ్లపై పడాలి. అప్పటి వరకు నేను ఇలానే ఏడిపిస్తాను. నీవు పనులు చేస్తున్నప్పుడు వీడియో తీశానని నీకు తెలియదు కదా.. నా ఇంట్లో.. తాతను సంతోష పడేలా చేస్తాను అంటూ వీడియోను తన తాత శివన్నారాయణకు పంపింది. అయితే ఆ వీడియోను తన ఇంటి సభ్యులకు చూపిస్తూ.. నా పొగరు బోతు కార్తీక్‌తో ఎలాంటి పనులు చేయిస్తుందో చూశారా? వాడు ఇప్పుడు నా మనవరాలు వద్ద పనివాడు. వాడిని ఎలా ఆడుకొంటుందో చూసిందో చూశావా అంటూ ఆనందపడిపోయాడు. దాంతో ఇదే గెలవడం అంటే కోడలు అంటే.. పాపం రెస్టారెంట్ ఓనర్ కాస్తా.. పనివాడు అయ్యాడు. అంటే.. కార్తీక్ తల్లి చూస్తే.. బాధపడిపోతుంది. వాడు అవార్డు గెలిచాడు. ఈ రోజు నా మనవరాలు గెలిచింది. నా పరువును జ్యోత్న్స నిలబెట్టింది. ఇంతకంటే కార్తీక్‌కు అవమానం ఏముంటుంది అని శివన్నారాయణ ఆనందపడిపోయాడు. ఇక ఇంటికి ఏడుస్తూ వచ్చిన దీపను చూసి కార్తీక్ తల్లి బాధపడింది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు. జ్యోత్స్న రెస్టారెంట్‌కు వచ్చిందా అంటూ తల్లి ఆవేదన చెందింది. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X