Karthika deepam 2 May 26th : దీపాకు నిజం చెప్పిన కార్తీక్ బాబు.. నమ్మలేని స్థితిలో వంటలక్క

Photo Courtesy: JioHotstar

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 24వ తేదీ 365వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న కార్తీక్ బాబు దగ్గర తెల్లటి అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కొక్కటిగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ కార్తీక్ బాబును ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా సత్యరాజ్ హోటల్ ను తనపై రాయించుకొని కార్తీక్ బాబును ఓనర్ స్థాయి నుంచి పనివాడిగా మార్చేస్తుంది. కార్తీక్ బాబు హోటల్ కు వెళ్లి కార్తీక్ బాబు సీట్ లో కూర్చుంటుంది. అక్కడ కార్తీక్ బాబుతో అడ్డమైన పనులు చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన దీపాను కూడా జ్యోత్స్న అవమానిస్తుంది. తన అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు చెప్పినట్టుగా పని చేయాల్సిందేనని హెచ్చరిస్తుంది.

ఇక ఏం చేయలేని పరిస్థితిలో కార్తీక్ బాబు జ్యోత్స్న చెప్పినట్టుగా వింటాడు. అదే అసలుగా చేసుకొని కార్తీక్ బాబును ఏకంగా శివ నారాయణ ఇంటికి పనోడిగా తీసుకొస్తుంది. మనం ఏది చెబితే కార్తీక్ బాబు అదే చేస్తాడని జ్యోత్స్న చెబుతుంది. అంతే కాదు శివ నారాయణ షూస్ కూడా క్లీన్ చేయిస్తుంది. అంతే కాదు అందరీకి భోజనం కూడా వడ్డించమని అడుగుతుంది. ఇక సంతకం చేసినందుకు గాను కార్తీక్ బాబు ఏమాత్రం వెనక్కిపోకుండా జ్యోత్స్న చెప్పినట్టుగా వింటాడు. జ్యోత్స్న ఎంత అవమానించాలని పని చెప్పినా.. కార్తీక్ బాబు మాత్రం అంతే సంతోషంగా అన్ని పనులు చేస్తాడు. మరోవైపు దీపా ఇంట్లో కాంచనకు జ్యోత్స్న సంగతిని వివరిస్తుంది. ఇక తను కీలక నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. మే 26వ తేదీ 366 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 366 May 26th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపా ప్రాణాలను కాపాడటం కోసం కార్తీక్ బాబు జ్యోత్స్న కండీషన్స్ కు ఒప్పుకుంటాడు. వైట్ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం పెట్టడంతో కార్తీక్ బాబును నానా కష్టాలు పెడుతుంది. ఏకంగా జ్యోత్స్న కార్తీక్ బాబును తన ఇంటి పని మనిషిలా వాడుకుంటుంది. అగ్రిమెంట్ పై సంతకం చేయడంతో జ్యోత్స్న ఏం చేసినా సైలెంట్ గా ఉండిపోతాడు. అసలే కార్తీక్ బాబు జ్యోత్స్నను ఆడుకుందామని అనుకుంటే జ్యోత్స్ననే కార్తీక్ బాబును ఆడుకుంటుంది. అగ్రిమెంట్ పేరుతో కార్తీక్ బాబుకు టార్చర్ చూపిస్తుంటుంది. ఆఫీస్ పనులే కాకుండా, ఇంటి పనులు, పర్సనల్ పనులు కూడా చేయిస్తుంటుంది. అయినా కార్తీక్ బాబు ఒక్క మాట అనకుండా జ్యోత్స్న చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కార్తీక్ బాబు అక్కడ పని మనిషిలా చేసే అన్ని పనులను జ్యోత్స్న వీడియో తీస్తుంది.

ఆ వీడియోలను వెంటనే కాంచన అత్తకు, దీపాకు చూపించి బాధపెట్టాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం కాంచన అత్తకు నేరుగా ఆ వీడియోలను పంపిస్తుంది. ఆ వీడియోలను మొదటగా దీపా చూస్తుంది. శివ నారాయణ షూస్ తుడవటం, అందరికీ భోజనం వడ్డిస్తుండటం, పడుకోవడానికి బెడ్ కూడా సర్దడం వంటి అన్ని వీడియోలను పంపిస్తుంది. ఆ వీడియోలు చూసిన దీపా, కాంచన చాలా బాధపడుతారు. కార్తీక్ బాబు తన కోసం ఎన్నో అవమానాలు పడుతున్నాడని దీపా చాలా బాధపడుతుంది. కాంచన కూడా తన కొడుకు పని మనిషిలా మారడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంతలోనే కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. వేరే పని ఉండటంతో ఇంటికి రావడం ఆలస్యమైందని చెబుతాడు.

కానీ వాళ్లందరూ మాత్రం నమ్మబోరు. పైగా తాము అందరం అక్కడ కార్తీక్ బాబు ఏం చేశాడో వీడియోలన్నీ చూశామని, స్వయంగా జ్యోత్స్ననే పంపించిందని కాంచన, దీపా కార్తీక్ బాబుతో చెబుతారు. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతారు. అవును ఆ ఇంటికే వెళ్లి వస్తున్నాను. నేను అక్కడ చేసే ప్రతి పని వెనకాల ఒక బలమైన కారణం ఉందని, జ్యోత్స్నకు బయపడి మాత్రం చేయడం లేదని చెబుతాడు. జ్యోత్స్న ఎంతలా హింసా పెట్టిన, బాధ పెట్టినా, గుండెల్లో మంట పెట్టిన... ఇంకా ఉక్కులా మారుతానని దీపా, తల్లి కాంచనకు వివరిస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో చెప్పే సమయం కొద్ది రోజుల్లో వస్తుందని చెబుతాడు. కార్తీక్ గట్టిగా చెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోతారు.

కార్తీక్ బాబును అసిస్టెంట్ గా చేసి ఇష్టమొచ్చినట్టుగా జ్యోత్స్న వాడుకుంటుండటంతో దీపా తట్టుకోలేక పోతుంది. అందుకని తనకు కీలక నిర్ణయం తీసుకుంటుంది. కార్తీక్ బాబుకు బదులుగా తానే జ్యోత్స్నకు అసిస్టెంట్ గా వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ముందుగా అసలు జ్యోత్స్న అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుందో తెలుసుకుందామని ఫోన్ చేస్తుంది. నేరుగా జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంది. అప్పటికే జ్యోత్స్న దీపా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీపా నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక దీపా బాధపడుతూ కార్తీక్ బాబు ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నిస్తుంది. నీకు నామీద కోపం కదా? మరీ కార్తీక్ బాబును ఎందుకు హింసిస్తున్నావని, అసలు అగ్రిమెంట్ దేనికోసమని, నువ్వు ఏది అడిగినా నేను చేస్తానని, కార్తీక్ బాబును మాత్రం వదిలేయమని అడుగుతుంది.

జ్యోత్స్న మాత్రం దీపా మాటలకు కరిగిపోదు. నిన్ను రెచ్చగొడితే మళ్లీ ఏదో ఒక పొరపాటు చేస్తావనుకుంటే ఇలా బ్రతిమిలాడుతున్నావేంటీ దీపా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఇక తను అలిసిపోయానని ఏం కావాలో చెబితే అది నీకు ఇచ్చేస్తానని, కార్తీక్ బాబును మాత్రం హింసించడం ఆపేయని అంటుంది. కానీ జ్యోత్స్న ఒప్పుకోదు. నువ్వు ఇచ్చే ఆఫర్లను తీసుకోవడానికి నేను రెడీగా లేనని, కార్తీక్ బాబు నాకే సొంతమని, ఇకపై తనకు ఇష్టమొచ్చినట్టుగా చేస్తానని, కార్తీక్ బాబు కూడా తన మాటే వింటాడనని జ్యోత్స్న దీపాతో అంటుంది. అలాగే తనకోసం ఎక్కడికి పిలిస్తే అక్కడి వస్తాడని కూడా చెబుతుంది. ఇక కోపంతో చిర్రెత్తిపోయినా దీపా కార్తీక్ బాబు అస్సలు రానివ్వనని, అడ్డు పడుతానని జ్యోత్స్నను హెచ్చరిస్తుంది. అది కుదరని పని అని చెప్పి జ్యోత్స్న ఫోన్ కట్ చేస్తుంది.

మరోవైపు కార్తీక్ బాబు జ్యోత్స్న వరుసగా మెసేజ్ లు చేస్తుండటంతో కలిసేందుకు వెళ్తుంటాడు. దీపా కంట పడకుండా వెళ్లాలని ప్రత్నిస్తాడు. కానీ దీపా కార్తీక్ బాబు వెళ్లడాన్ని గమనించి దారికి అడ్డుగా నిలుస్తుంది. ఆ ఇంటికి జ్యోత్స్న కు అసిస్టెంట్ గా నువ్వు వెళ్లడం బాలేదని అంటుంది. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుకు కార్తీక్ బాబు దానికి ఒక బలమైన కారణం ఉందని, ఇప్పుడు నన్ను వెళ్లనివ్వూ అని అంటాడు. జ్యోత్స్న చెప్పినట్టుగా వినడానికి నేనేం తెలివితక్కువ వాడిని కాదని అంటాడు. ఆ ఇంటి నిన్ను కలపాలని చెబుతాడు. ఇప్పుడు ఆ అవసరం ఏముందని, నాకోసం ఆ ఇంటికి వెళ్లాల్సిన పనిలేదని అంటుంది దీపా. కానీ కార్తీక్ బాబు బలమైన కారణం ఉందని, ఎందుకంటే నువ్వు సుమిత్ర అత్త కడుపులో పుట్టిన దానివేనని, నాకు సొంత మరదలువే అని కార్తీక్ బాబు దీపాకు నిజం చెబుతాడు. ఆ తర్వాత దీపా ఎలా రియాక్ట్ అయ్యిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X