Karthika Deepam 2 May 24th Episode: బావ నీవు హాట్‌గా ఉన్నావు.. బెడ్ రూమ్‌లో కార్తీక్‌తో జ్యోత్న్స అలా..
తెలుగు బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం 2 సీజన్ గ్రాండ్‌గా సాగుతున్నది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ తమదైన శైలిలో నవ వసంతం అంటూ తమ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సీరియల్ టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. కార్తీక దీపం 2 మే 23వ తేదీ 367వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రెస్టారెంట్ అవార్డు విషయంలో జ్యోత్స్న చేసిన రచ్చకు దీప గట్టి షాక్ ఇచ్చింది.
శివన్నారాయణ చేతుల మీదుగానే కార్తీక్ అవార్డు అందుకొన్నాడు. ఈ క్రమంలో జ్యోత్న్స అగ్రిమెంట్ బయటకు తీసి.. రెస్టారెంట్ ఓనర్ నేను కాబట్టి.. నీవు నా బానిసవు. రేపటి నుంచి నేను ఏం చెబితే అది చేయాలి అంటూ ఆర్డర్ వేసింది. అంతేకాకుండా కార్తీక్‌తో టేబుల్ తుడిపించడం, టేబుల్‌పై కావాలని కాఫీ పోసి తుడిపించింది. అది చూసి దీప తట్టుకోలేకపోయింది.

ఈ రోజు నా మనవరాలు గెలిచింది. నా పరువును జ్యోత్న్స నిలబెట్టింది. ఇంతకంటే కార్తీక్‌కు అవమానం ఏముంటుంది అని శివన్నారాయణ ఆనందపడిపోయాడు. ఇక ఇంటికి ఏడుస్తూ వచ్చిన దీపను చూసి కార్తీక్ తల్లి బాధపడింది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు. జ్యోత్స్న రెస్టారెంట్‌కు వచ్చిందా అంటూ తల్లి ఆవేదన చెందింది. ఇంకా 24వ తేదీ 367 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
ఏమైందని అడిగితే చెప్పడం లేదు. జ్యోత్స్న రెస్టారెంట్‌కు ఏమైనా వచ్చిందా? అని కార్తీక్ తల్లి అడిగింది. అయితే దీప ఏడుస్తుండటంతో ఎందుకు ఏడుస్తున్నావు అని అనసూయ ప్రశ్నించింది. దాంతో ఏడుస్తూనే జ్యోత్న్స రెస్టారెంట్‌కు వచ్చి కార్తీక్ బాబు కుర్చీలో కూర్చున్నది. కార్తీక్ బాబుతో పనోడితో చేయించే పనులు చేయిస్తున్నది. కాఫీ కావాలని అడిగింది. కావాలనే టేబుల్‌పై పోసి కాఫీని తుడిపించింది. అది చూసి నేను.. కావాలంటే నేను చేస్తాను అంటే ఒప్పుకోలేదు. ఇక ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. వేరే దారి కనిపించడం లేదు అని దీప చెప్పింది. దాంతో అక్కా పద వెళ్తాం అని కార్తీక్ తల్లి అంటే.. ఎక్కడికి అని దీప అడిగింది. శివన్నారాయణతో గొడవ పెట్టుకొంటారా? అని దీప అడిగింది. అగ్రిమెంట్ సంతకం పెట్టించుకొని కార్తీక్‌ను కూలీ వాడిగా పనిచేయించుకొంటుదా? ఇలా గాలికి వదిలేస్తుందా.. నాన్న అడిగేద్దాం అంటూ ఆవేశంగా కార్తీక్ తల్లి అంది.

అయితే అగ్రిమెంట్ అనుగుణంగా పనిచేయడానికి కార్తీక్ సిద్దంగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అవసరమైతే తనను తాను వదులుకొంటాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అని దీప చెప్పగానే.. ఇప్పుడు నా కొడుకు ఎలా కాపాడుకోవాలో చెప్పు అని కార్తీక్ తల్లి అంది. నాపై ఉన్న కసిని కార్తీక్ మీద చూపిస్తున్నది. నా ప్రాణాలు కాపాడి తాను ప్రమాదంలో పడ్డాడు అని దీప ఏడ్చింది. మనమందరం ఒక మాట మీద ఉంటే.. కార్తీక్ బాబు అలా చేయకుండా ఉండొచ్చు అని అనసూయ అంటే.. కార్తీక్ బాబును ఇంటికి రమ్మని చెప్పండి. అది చూసిన తర్వాత నేను ఒక పని చేయాలని అనుకొంటున్నాను అని దీప అంది.
ఇక శివన్నారాయణ తన కుటుంబంతో కూర్చొని.. గత నెల కంటే ఈ నెల ఆర్డర్లు పెరిగాయి. జ్యోత్న్స కంపెనీ బిజినెస్ బాగుంది. ఇంకా బెటర్‌గా చేయాలని అన్నాడు. అంతలోనే పదండి భోజనాలు చేద్దాం అని అంటే.. జ్యోత్న్స రాలేదు కదా.. అని శివన్నారాయణ కోడలు అంటే.. రెస్టారెంట్‌లో కార్తీక్‌తో అడ్డమైన పనులు చేయించే పనిలో ఉంది అని శివన్నారాయణ సంతోషంతో అన్నాడు. అంతలోనే జ్యోత్న్స ఇంట్లోకి వచ్చి.. పని పూర్తి అయ్యాకనే పనివాడు ఇంటికి వెళ్లాలి అంది. అయితే చేతిలో బ్యాగ్ ఏది అని తల్లి అడిగితే.. నా పనివాడు తెస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టగానే కార్తీక్ తన బ్యాగ్ మోసుకొంటూ వచ్చాడు. అయితే మీరు నేను పంపిన వీడియో చూడలేదా? అంటే..చూశాం సంతోషంలో స్వీట్లు కూడా బాగా తిన్నాం అని శివన్నారాయణ రెండో భార్య అంటే.. ఎక్కువ తినకండి.. మీకు షుగర్ ఉంది. పోయావంటే.. తాతకు ఈ వయసులో మూడో పెళ్లి చేయలేం అంటూ కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు.

కార్తీక్ ఇప్పుడు నేను ఏది చెబితే అది చేస్తాడు. మీరు కూడా ఏ పని అయినా చెప్పొచ్చు అని జ్యోత్న్స అంటే.. అలా కనిపించడం లేదే అంటూ నాన్నమ్మ అడిగితే.. నీవు వెళ్లి తాత షూస్ తీసుకురా. దాంతో పాటు షూ క్లీనింగ్ సెట్ తీసుకురా అంటుంటే.. జోత్న్స తండ్రి ఏంటి మాట్లాడుతున్నావు అంటూ అరిచాడు. అయితే శివన్నారాయణ నీవు ఎందుకు అపుతున్నావు అని అన్నాడు. అయితే షూస్ తుడుస్తుంటే.. శివన్నారాయణ ఇది నీ స్థాయి అంటే.. నా స్థాయి కాదు.. చిన్నప్పుడు నా బాల్యం గుర్తుకు వస్తున్నది అని కార్తీక్ జవాబిచ్చాడు. చిన్నప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని. స్కూల్ వెళ్లే ముందు నీవు నా షూ క్లీన్ చేసేవాడివి. అయితే నీవు ఎందుకు చేయడం పనివాడు లేడా? అంటే.. మనవడి షూ క్లీన్ చేయడం తాతకు అందమైన అనుభవం అని అన్నావు గుర్తుందా? అప్పుడు నాకు షూ తొడిగి ముద్దు పెట్టి స్కూల్‌కు పంపించే వాడివి. తాతకే కాదు.. మనవడికి కూడా ఇది అందమైన గుర్తు అని కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో పనిని కూడా ఇలా సెంటిమెంట్‌గా మార్చుకొన్నావా అంటూ తాత ఎద్దేవా చేశాడు.
అయితే అంతలోనే పద భోజనం చేద్దాం జ్యోత్న్స అని తల్లి అంటే.. ఏంటి? పనివాడిని కూడా మనతో భోజనం చేయిస్తావా? అని శివన్నారాయణ రెండో భార్య అంది. సారీ గ్రానీ.. బావను పిలిచింది తినడానికి కాదు. టేబుల్ శుభ్రం చేయించడానికి.. వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కొని రా.. అంటూ జ్యోత్న్స అరిచింది. అయితే తన మామ తన వద్దకు వచ్చి.. ఏంటి రా కార్తీక్ అంటే.. తండ్రి మాట కోసం ఓ కొడుకు అడివికి వెళ్లాడు. జూదంలో ఓడిన ఐదుగురు రాజ్యాన్ని కోల్పోయారు అని గతంలో కథలుగా విన్నాం. కానీ భార్య కోసం భర్త ఓ పనివాడిగా మారాడని నీవు ఎప్పుడైనా విన్నావా? మామయ్య అంటూ కార్తీక్ అన్నాడు. దాంతో ఒక రాజు సేవకుడిగా మారిన సీన్ చూస్తున్నాను అంటూ మామయ్య అంటే.. నేను కుటుంబం కోసం ఏదైనా భరిస్తాను అని అంటే.. నా చెల్లి కాంచన రాముడిని కన్నది. కానీ నేను సీతను కనలేకపోయాను అని కార్తీక్ మామయ్య ఆవేదన చెందాడు.
అయితే టేబుల్ వద్ద కూర్చొని ఉన్న వాళ్లను చూస్తూ.. పదండి.. తినడం మొదలుపెట్టండి అంటూ ప్రేమతో కార్తీక్ వడ్డించడం మొదలుపెట్టాడు. తాత నీకు దోసకాయ పచ్చడి ఇష్టం కదా అని కార్తీక్ అంటే.. పనివాడి కంటే.. నీకే అన్ని గుర్తున్నాయ్ అని అత్త అంటే..పనివాడు కదా.. అన్నీ చేయాలని ఏదో అనబోతే.. నీకు పైత్యం ఎక్కువైంది. ధనియాల పొడిలో నెయ్యి కలుపుకొని తిను పైత్య తగ్గుతుంది అని జ్యోత్న్సకు కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో నీకు కొంచెం కూడా బాధ లేదా అని అత్త అంటే..ఎందుకు బాధ? మీరంతా నా ఫ్యామిలే కదా అని అత్త అంటే.. చిన్నప్పుడు నన్ను బాగా చూసుకోలేదా? నా మూతి తుడువలేదా? నేను ఇప్పుడు చేస్తే తప్పేంటి అంటూ అందరికి వడ్డిస్తూ కనిపించాడు. అయితే కార్తీక్ చేసే పనులను వీడియో తీస్తూ జ్యోత్న్స కనిపించింది. అయితే కార్తీక్ నీవు కూడా తిను అని మామయ్య అంటే.. ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. వారితో కలిసి తింటాను అని కార్తీక్ అన్నాడు. ఇక నేను వెళ్లొచ్చా? అని కార్తీక్ అంటే.. నా బ్యాగ్ సోఫాలో ఉంది. అది తీసుకెళ్లి నా రూమ్‌లో పెట్టు అంటూ జ్యోత్న్స చెప్పింది. ఆ తర్వాత వీడియోలను చూస్తూ.. ఇవన్నీ దీపకు పంపాలి. అది చూసి ఆమె గుండె బ్లాస్ట్ అవ్వాలి అని జ్యోత్న్స ఆనందపడిపోయింది.

ఇదిగో బ్యాగ్ అంటూ కార్తీక్ అంటే.. నేను వెళ్లమనే వరకు నీవు ఇక్కడే ఉండు. కాస్త ఏసీ పెంచు అంటూ ఆర్డర్ వేసింది. కార్తీక్ ఏసీ పెంచుతుంటే.. ఆనందపడిపోతూ.. ఏసీ గాలి ఒంటికి తగిలితే జువ్వు మంటున్నది అని కార్తీక్ దగ్గరకు వచ్చి అదోలా మాట్లాడితే.. రెండు చెప్ప దెబ్బలు తగిలిస్తే.. ఒళ్లు జువ్వమంటుంది అని కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు. ఇంత హాట్‌గా ఉన్నావు బావా.. చల్లగాలి తగిలితే.. నిద్రపోవాలని అనిపించడం లేదా అని జ్యోత్న్స అంటే.. ఫ్యామిలీ ఉంటే దాని విలువ తెలుస్తుంది అని కార్తీక్ అన్నాడు. దాంతో నీవు కొత్తగా కనిపిస్తున్నావు అని జ్యోత్న్స అంటే.. నాకు కూడా నీవు కొత్తగానే కనిపిస్తున్నావు అని కార్తీక్ బదులిచ్చి.. నేను బయలు దేరొచ్చా అంటే.. బెడ్ షీట్ సరిగా లేదు. పిల్లో సర్దు అంటూ కార్తీక్ వెళ్తూ.. నా ఫ్యామిలీకి దగ్గరగా చేసినందుకు థ్యాంక్స్. కొద్ది రోజులైనా ప్రశాంతంగా పడుకో అని అన్నాడు. కార్తీక్ మాటలు విని షాక్‌లో ఉండిపోయింది. నా గురించి కార్తీక్ ఏమైనా తెలిసిందా? అదోలా మాట్లాడుతున్నాడు అని కంగారు పడింది. అయితే ముందుగా ఈ వీడియోలన్నీ దీపకు పంపించి వాళ్లు చూసేలా చేస్తాను అంటూ జ్యోత్న్స కార్తీక్ పని వీడియో పంపించే పనిలో పడింది.
అయితే జ్యోత్న్స తీరు చూసి సుమిత్ర, దశరథ్ బాధపడ్డారు. జ్యోత్న్స చేసే పని సరికాదు అని దశరథ్ అంటే.. జ్యోత్న్సను కార్తీక్ బాధపెట్టడం లేదా అని సుమిత్ర అంది. అయితే వారి మధ్య ఏం అగ్రిమెంట్ ఉందో మనకు తెలియదు. మనం ఇంకా మన పిల్లల్ని చిన్నవాళ్లగానే చూస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. జ్యోత్న్స చేసేది తప్పు. ఈ విషయం తెలిసి నా చెల్లెలు ఎంత బాధపడుతుందో అని దశరథ్ బాధపడ్డాడు. దాంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications









