Karthika deepam 2 May 27th : ఆవేశంలో నోరుజారిన కార్తీక్ బాబు.. అయోమయంలో దీపా
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 26వ తేదీ 367వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబును అసిస్టెంట్ గా చేసి ఇష్టమొచ్చినట్టుగా జ్యోత్స్న వాడుకుంటుండటంతో దీపా తట్టుకోలేక పోతుంది. అందుకని కీలక నిర్ణయం తీసుకుంటుంది. కార్తీక్ బాబుకు బదులుగా తానే జ్యోత్స్నకు అసిస్టెంట్ గా వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ముందుగా జ్యోత్స్నకు ఫోన్ చేసి అసలు జ్యోత్స్న అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుందో తెలుసుకుందామని ఫోన్ చేస్తుంది. అప్పటికే జ్యోత్స్న దీపా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీపా నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక దీపా బాధపడుతూ కార్తీక్ బాబు ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నిస్తుంది. నీకు నామీద కోపం కదా? మరీ కార్తీక్ బాబును ఎందుకు హింసిస్తున్నావని, అసలు అగ్రిమెంట్ దేనికోసమని, నువ్వు ఏది అడిగినా నేను చేస్తానని, కార్తీక్ బాబును మాత్రం వదిలేయమని అడుగుతుంది.
కార్తీక్ బాబును మాత్రం హింసించడం ఆపేయని అంటుంది. కార్తీక్ బాబును ఇప్పటి నుంచి నువ్వు పిలిచి దగ్గరికి అస్సలు రానివ్వనని, అడ్డు పడుతానని జ్యోత్స్నకు సవాల్ విసురుతుంది. అది కుదరని పని అని చెప్పి జ్యోత్స్న ఫోన్ కట్ చేస్తుంది. ఇక కార్తీక్ బాబు జ్యోత్స్న దగ్గరకి వెళ్దామని రెడీ అవ్వగా.. అడ్డుపడుతుంది. వెళ్లడానికి వీల్లేదని చెబుతుంది. కానీ తప్పకుండా వెళ్లాలని, నేను వెళ్లడం వెనుక బలమైన కారణం ఉందని కార్తీక్ బాబు అంటాడు. ఆ కారణమేంటో చెప్పమని దీపా ఒత్తితేవడంతో అసలు విషయం చెబుతాడు కార్తీక్ బాబు. నువ్వు సుమిత్ర - దశరథల సొంత కూతురువని, నిన్ను ఆ కుటుంబంతో కలపడమే నాకున్న లక్ష్యమని కార్తీక్ బాబు చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న దీపా షాక్ లో ఉంటుంది. ఇక ఆ తర్వాత దీపా ఎలా స్పందించిందనేది ఆసక్తికరంగా మారింది. మే 27వ తేదీ 368 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఎట్టకేళలకు కార్తీక్ బాబు దీపాకు అసలు విషయం చెబుతాడు. రెండు కుటుంబాలను కలపాలని ప్రస్తుతం బాలు పడుతున్న తపన, అందుకోసం జ్యోత్స్న ఎన్ని అవమానాలు, కష్టాలూ పెట్టిన కూడా భరిస్తున్నానని వివరించే ప్రయత్నంలో నిజం చెప్పేస్తాడు. అసలు నువ్వు ఎవ్వరో కాదు.. నువ్వు సుమిత్ర - దశరథ అత్తమామల సొంత కూతురివి. శివ నారాయణ అసలు మనవరాలివి. వందల కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలివి. నువ్వు కుబేర అంకుల్ కు సొంత కూతురివి కాదు పెంపుడు కూతురువు. సుమిత్ర అత్త కడపులో పుట్టిన అసలు కూతురువి నువ్వే అని చెబుతాడు. దీంతో దీపా షాక్ అవుతుంది. అసలు నేను సొంత కూతురు ఏంటీ, ఆ ఇంటికి నేను అసలు వారసురాలిని ఏంటని సందేహిస్తుంది. అసలు నీకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పారని దీపా కార్తీక్ బాబును ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ బాబు ఇంకా వివరంగా చెబుతాడు. దాసు మామనే నాకు ఈ విషయం చెప్పాడని దీపాకు వివరిస్తాడు.
దాంతో దీపా స్పందిస్తూ అసలు దాసు బాబాయ్ కి మతిస్థిమితమే లేదు కదా.. అలాంటప్పుడు దాసు చెప్పిన మాటలను నువ్వేలా నమ్ముతున్నావని దీపా అడుగుతుంది. దీంతో కార్తీక్ బాబు దీపాకు మరో నిజం చెబుతాడు. దాసు బాబాయ్ కి ఎప్పుడో గతం గుర్తుకు వచ్చిందని అంటాడు. గతం గుర్తుకు వచ్చిన వెంటనే మన ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఈ నిజం చెప్పాడని దీపాకు వివరిస్తాడు. ఆ రోజు రాత్రి మేమిద్దరం ఇంటి ముందు మాట్లాడుకుంటున్న విషయం ఇదేనని చెబుతాడు. ఇక దీపాకు అసలు విషయం తెలియడంతో నమ్మలేని స్థితిలో ఉంటుంది. ఎన్నో సందేహాలు దీపా మనస్సుల్లో ఉత్పన్నమవుతుంటాయి. కార్తీక్ బాబుపై ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. వాటంన్నింటిని బాలు నివృత్తి చేస్తుంటాడు. మరీ నేను సుమిత్ర అమ్మకు అసలు కూతురిని అయితే జ్యోత్స్న ఎవరి కూతురు అని దీపా కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో దాసు మామ అసలు కూతురు జ్యోత్స్న అని చెబుతాడు.
జ్యోత్స్నకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. నువ్వే ఆ ఇంటికి అసలు వారసురాలువు అనే విషయం తెలిసే జ్యోత్స్న ఘోరాతిఘోరాలకు పాల్పడుతోందని కార్తీక్ బాబు వివరిస్తాడు. అంతే కాదు దాసు బాబాయ్ కి కూడా ఈ విషయం తెలుసని చంపడానికి ప్రయత్నించిందని చెబుతాడు. అందుకే దాసు మామ గతాన్ని కోల్పోయాడని చెప్తాడు. ఇదంతా జ్యోత్స్న కేవలం ఆస్తికోసమే చేస్తుందని చెబుతాడు. నువ్వే శివ నారాయణ అసలు మనవరాలువి అని నిజం తెలిసిన వ్యక్తులు కేవలం ముగ్గురే. నాకు, దాసు బాబాయ్ కి, జ్యోత్స్న కు మాత్రమే అసలు విషయం తెలుసని దీపాతో చెబుతాడు. అయినా దీపా నమ్మబోదు.. దీంతో దీపా పుట్టక నుంచి జరిగిన విషయాలను చెప్తాడు. చిన్నప్పుడే నిన్ను సుమిత్ర అమ్మకు దూరం చేసి రొడ్డున పడేసింది. దాసు - కళ్యాణి అత్తకు పుట్టిన పాప జ్యోత్స్నను నీ స్థానంలో పెట్టింది పారుజాతం. నువ్వు అనుభవించాల్సిన భోగభాగ్యాలను తన మనవరాలు జ్యోత్స్న అనుభవించేలా చేసింది. కానీ చివరికి దాసు బాబాయ్ ప్రశ్చాత్తాపం పడి అసలు నిజం చెప్పడంతో ఇప్పుడు అసలు విషయం బయట పడిందని కార్తీక్ బాబు పూర్తిగా వివరిస్తాడు.
ఇక కుబేరా నిన్ను ఇంటికి తీసుకెళ్లి కన్న కూతురిగా పెంచాడని చెబుతాడు. కుబేరా నీ అసలు తండ్రి కాదనే సంగతి అనసూయకు తెలుసని కావాలంటే అక్కడి నుంచి నువ్వు అసలు విషయం తెలుసుకోవచ్చని సూచిస్తాడు. ఇక దీపా ఇవన్నీ విషయాలను కార్తీక్ బాబు ద్వారా తెలుసుకుని షాక్ అవుతుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లుంది. అనసూయ కనిపించడంతో అసలు విషయం అడుగుతుంది. నేను పుట్టినప్పుడు నువ్వు మా అమ్మకు ఎవ్వరు పురుడు పోశారో చూశావా? అని అడుగుతుంది. దాంతో అనసూయ జంకుతూ సమాధానం చెబుతుంది. ఇక వెంటనే కుబేర ఫొటోను తీసుకొచ్చి ప్రమాణం చేసి అసలు విషయం చెప్పమని దీపా అనసూయను ఒత్తిడి చేస్తుంది... ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











