Karthika deepam 2 May 28th : కార్తీక్ బాబును నమ్మలేని స్థితిలో దీపా.. అందుకే ఆమె దగ్గరికి వెళ్లి..

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 27వ తేదీ 368వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎట్టకేళలకు కార్తీక్ బాబు దీపాకు అసలు విషయం చెబుతాడు. రెండు కుటుంబాలను కలపాలని ప్రస్తుతం బాలు పడుతున్న తపన, అందుకోసం జ్యోత్స్న ఎన్ని అవమానాలు, కష్టాలూ పెట్టిన కూడా భరిస్తున్నానని వివరించే ప్రయత్నంలో నిజం చెప్పేస్తాడు. కానీ దీపా కార్తీక్ బాబు మాటలను నమ్మబోదు. సుమిత్ర అత్త కడపులో పుట్టిన అసలు కూతురువి నువ్వే అని చెబుతాడు. దీంతో దీపా షాక్ అవుతుంది. నీకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పారని దీపా కార్తీక్ బాబును ప్రశ్నిస్తుంది. దాసు మామనే చెప్పాడని దీపాకు వివరిస్తాడు.

అసలు దాసు బాబాయ్ కి మతిస్థిమితమే లేదు కదా.. అలాంటప్పుడు దాసు చెప్పిన మాటలను నువ్వేలా నమ్ముతున్నావని దీపా అడుగుతుంది. దీంతో కార్తీక్ బాబు దీపాకు మరో నిజం చెబుతాడు. దాసు బాబాయ్ కి ఎప్పుడో గతం గుర్తుకు వచ్చిందని అంటాడు. గతం గుర్తుకు వచ్చిన వెంటనే మన ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఈ నిజం చెప్పాడని దీపాకు వివరిస్తాడు. దాంతో దీపాకు ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతాయి. కార్తీక్ బాబుపై ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అలాగే కార్తీక్ బాబు చెప్పిన విషయాలను అనసూయతో సరిపోల్చుకోవాలని చూస్తుంది. ఆ తర్వాత దీపా ఎలా స్పందించిందనేది ఆసక్తికరంగా మారింది. మే 28వ తేదీ 369 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 369 May 28th 2025 Here is full story

దీపా పరిస్థితి మొత్తం అయోమయంలో ఉంది. తన అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేల్చుకోలేని స్థితి ఉంది. ఒక్కసారి కార్తీక్ బాబు దీపాకు అసలు విషయం చెప్పడంతో అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో తేల్చుకోలేకపోతోంది. సుమిత్ర - దశరథల అసలు కూతురువు నువ్వేనని కార్తీక్ బాబు దీపాకు చెప్పడంతో ఆశ్చర్యపోతోంది. ఎలా స్పందించాలో కూడా తెలియదు దీపాకు. కార్తీక్ చెప్పిన మాటలను నమ్మబోదు. ఈ విషయాన్ని నమ్మడానికి దీపాకు కొంత టైమ్ పడుద్దాని, అనసూయమ్మను అడిగితే నీకు అసలు విషయం తెలుస్తుందని దీపాకు కార్తీక్ బాబు సూచిస్తాడు. దీంతో దీపా వెంటనే ఇంట్లోకి వెళ్లి అనసూయను అసలు తను ఎవరి కూతురునని అడుగుతుంది. దాంతో కుబేరా కూతురువేనని చెబుతుంది. అసలు నేను పుట్టినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేను కుబేర దంపతులకు పుట్టానా? అని గట్టిగా అనసూయను మరోసారి ప్రశ్నిస్తుంది.

దీంతో అనసూయ కంగారు పడుతుంది. దీపాకు కుబేర అసలు తండ్రి కాదనే విషయం తెలిసిపోయిందా? అని సందేహిస్తుంది. అప్పటికే కుబేరాకు ఇచ్చిన మాట కోసం అవును నేను నువ్వు పుట్టిన సమయంలో అక్కడే ఉన్నానని, మీ తండ్రి కుబేరా ఎంతో మురిసిపోయడని, మొదటగా నిన్ను ఎత్తుకొని ఉయ్యాలా పడుకోబెట్టిందే నేనని అనసూయ దీపాతో అంటుంది. అనసూయ కంగారు పడుతూ చెబుతుండటంతో వెంటనే తన తండ్రి ఫొటో తీసుకొచ్చి ప్రమాణం చేసి నిజం చెప్పమని దీపా అనసూయను అడుగుతుంది. అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో అనసూయ నిజం చెబుతుంది. నువ్వు కుబేరా అసలు కూతురు కాదని చెబుతుంది. దాంతో దీపా షాక్ అవుతుంది. అసలు ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది. మా తమ్ముడే ఎవ్వరికి చెప్పకూడదని అన్నాడని అంటుంది.

దీపాకు నిజం చెప్పాల్సి వచ్చింది అనసూయ కుమిలిపోతోంది. కానీ దీపాకు అసలు తల్లిదండ్రులు సుమిత్ర - దశరథ అనే విషయం ఆమెకు తెలియదు. ఇక దీపాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. కార్తీక్ బాబు చెప్పిన మాటలను, అనసూయ చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గుడికి వెళ్లి అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కార్తీక్ బాబు దీపాను వెత్తుకుంటూ గుడికి వస్తాడు. ఇక దీపా అనసూయను అడిగి నిజం తెలుసుకున్నానని ఒప్పుకుంటుంది. కానీ అనసూయకు తనకు ఎవరో చెప్పలేదని అంటుంది. ఇక నా జీవితం ప్రశ్నార్థకం అయ్యిందని కార్తీక్ బాబుతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనకు నిజం తెలియడం వల్ల ఉపయోగం ఏమీ లేదని, ఇప్పుడు ఆ కుటుంబానికి దగ్గర అయినా వాళ్లు నమ్ముతారా? నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకుంటారా? అని ప్రశ్నించుకుంటుంది. నేనే వాళ్ల అసలు కూతురు అని తెలిసినా నా మీద ఉన్న కోపం, అసహ్యం పోతుందా? అని కార్తీక్ బాబుతో అంటుంది.

ఇక ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని కార్తీక్ బాబును కోరుతుంది. తన ఈ మనుషులకు దూరంగా వెళ్లిపోతానని అంటుంది. దాంతో కార్తీక్ బాబు కోపం చేస్తాడు. నీ కన్న తల్లిదండ్రులు జ్యోత్స్న వల్ల ఆపదలో ఉంటే వదిలేసి వెళ్లిపోతావా? అని అడుగుతాడు. వాళ్లను కాపాడాల్సింది పోయి దూరంగా వెళ్లిపోతావా? అని ప్రశ్నిస్తాడు. ఇక అంతకు మించి ఏం చేయాలని అంటుంది. నువ్వే వెళ్లి జ్యోత్స్న గుట్టును రట్టు చేయొచ్చు కదా అని అంటుంది దీపా. కానీ కార్తీక్ బాబు అందుకు ఒప్పుకోడు. ఇప్పుడే జ్యోత్స్న ను ఏమనలేమని అంటాడు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆ ఇంటికి జ్యోత్స్న వల్ల ప్రమాదం తప్పదని అంటాడు. ఇలాంటి సమయంలో నువ్వు నాకు బలమైన అండగా ఉండాలని, అప్పుడే అందరికీ అసలు నిజాన్ని చెప్పి నమ్మించగలనని అంటాడు. లేదంటే జ్యోత్స్న తీసుకునే నిర్ణయాలకు ఎవరో ఒకరు బలైపోతారని అంటాడు. నువ్వు, నేను కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని అంటాడు.

మనం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే జ్యోత్స్న పంతం నెగుతుందని, పరిస్థితులు అన్ని తనకే సపోర్ట్ గా మారుతాయని, ఇప్పుడు మనం ఆవేశంగా ఏ పని చేసినా అది జ్యోత్స్నకు అనుకూలంగా మారిపోతుందని అంటాడు. సమయం వచ్చే వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని అంటాడు. ఇప్పటికే దాసు మామ ప్రమాదంలో ఉన్నాడని, ఇప్పుడు నీకు కూడా అసలు విషయం తెలిసిందని జ్యోత్స్న కు తెలిస్తే ఒక్కొక్కరిని చంపేందుకు కూడా వెనకాడబోదని అంటాడు. అప్పుడు పరిస్థితి మన చేతిలో ఉండదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయ్యిందని, నువ్వు త్వరగా మారాలని, బలంగా మారాలని, ఈ సమస్యను కలిసి ఎదుర్కోవాలని అంటాడు. ఇక దీపా కూడా అందుకు సరేనని అంటుంది. ఆ తర్వాత వాళ్లు ఇద్దరు కలిసి ఏం చేయబోతన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X