Karthika deepam 2 May 29th : కార్తీక్ బాబు, దీపా వార్ షురూ.. జ్యోత్స్నకు వణుకుపుట్టించేలా ప్లాన్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 28వ తేదీ 369వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాకు అసలు విషయం చెప్పేస్తాడు కార్తీక్ బాబు. జ్యోత్స్న శివ నారాయణ అసలు మనవరాలు కాదని, నువ్వే శివ నారాయణ అసలు మనవరాలివి అని చెబుతాడు. ఆ ఇంటికి అసలు వారసురాలివి నువ్వే అని వివరిస్తాడు. సుమిత్ర - దశరథల అసలు కూతురు నువ్వే దీపా అని కార్తీక్ బాబు నిజం చెప్పేస్తాడు. 100ల కోట్ల ఆసక్తి ఎకైక వారసురాలు దీపానే అని చెబుతాడు. కానీ కార్తీక్ బాబు చెప్పిన మాటలకు దీపా నమ్మబోదు. ఆ వెంటనే అనసూయమ్మ దగ్గరకు వెళ్లి తన సందేహాలను నివృత్తి చేసుకుంటుంది. కుబేరా తన అసలు తండ్రి కాదా? అని ప్రశ్నిస్తుంది. అందుకు అనసూయ మొదట నిజం చెప్పదు. కానీ ఒత్తిడి చేయడంతో ఏం చేయలేక నిజం చెప్పేస్తుంది.

ఇక పూర్తిగా తన తల్లిదండ్రులు అని సుమిత్ర - దశరథలను నమ్ముతుంది. దీంతో తన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని, ఎందుకు తనకే తల్లిదండ్రులు దూరమైపోతున్నారని అంటుంది. తను పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమై బస్టాండ్ లో పడిపోవడం ఏంటని, కుబేరా తన తండ్రిగా మారిన కొద్దిరోజులకే యాక్సిడెంట్ లో చనిపోవడం ఏంటని బాధపడుతుంది. ఇక ఇప్పుడు సుమిత్ర - దశరథలు తన తల్లిదండ్రులు అని తెలిసినా నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని బాధపడుతుంది. తను నిజం తెలిసిందనే విషయం జ్యోత్స్నకు తెలిసిందే మళ్లీ తన తల్లిదండ్రులైన సుమిత్ర - దశరథలకు ప్రాణాపాయం ఉంటుందని ఆందోళన చెందుతుంది. ఇలాంటి ఆలోచనల్లో ఉన్న దీపాకు కార్తీక్ బాబు ధైర్యం చెబుతాడు. కలిసి పోరాడాలని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలని అంటాడు. జ్యోత్స్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపా ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. మే 29వ తేదీ 370 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 370 May 29th 2025 Here is full story

కార్తీక్ బాబు జ్యోత్స్న దగ్గరకు వెళ్లడానికి బయల్దేరిన సందర్భంలో దీపా అడ్డుకుంటుంది. అసలు ఎందుకు జ్యోత్స్న దగ్గరికి వెళ్లాల్సిన పని ఏముందని అంటుంది. దాంతో దీపాకు కార్తీక్ బాబు అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో జ్యోత్స్న కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని కార్తీక్ బాబు, దీపా అనుకుంటారు. ఇక జ్యోత్స్న ఓవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం అసిస్టెంట్ గా కార్తీక్ బాబు చెప్పినప్పుడు రావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు రాలేదని ఆలోచిస్తుంది. దీంతో కంగారు పడుతుంది. రాకపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలోగా పారుజాతం జ్యోత్స్న కంగారు పడటాన్ని గమనించి ఏంటని అడుగుతుంది. కార్తీక్ బాబు ఇంకా రావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని అనుకుంటుంది. దీపా వల్లనే రాలేకపోయి ఉంటాడని పారుజాతం అంటుంది. అలా ఎలా కుదురుతుంది. అగ్రిమెంట్ ప్రకారం త్వరగా రావాలి కదా అని జ్యోత్స్న అంటుంది. కానీ ఆ విషయం దీపాకు అనవసరం కదా అని పారుజాతం అంటుంది. కార్తీక్ బావ రాకపోతే ఎలా రప్పించాలో తనకు బాగా తెలుసని జ్యోత్స్న అంటుంది.

ఇక జ్యోత్స్న అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేరుగా కార్తీక్ బాబు ఇంటికి వెళ్తుంది. అప్పటికే దీపా ఇంటికి రాలేదని అనసూయ, కాంచన కంగారు పడుతూ ఉంటారు. అసలు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయిందని ఆందోళన పడుతారు. అదే సమయంలో జ్యోత్స్న కారులో ఇంటికి వస్తుంది. కారు దిగి ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంతో కాంచన జ్యోత్స్న ను చూసిన వెంటనే మండి పడుతుంది. జ్యోత్స్న ను ఇంట్లోకి రావొద్దని అంటుంది. దాంతో జ్యోత్స్న ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నువ్వు చేసే పనులకు అసలు నిన్నేలా ఇంట్లోకి రానివ్వాలని అడుగుతుంది. దాంతో కాంచన నువ్వు కార్తీక్ బావతో అగ్రిమెంట్ రాయించుకొని ఎంతలా హింస పెడుతున్నావో మాకు తెలుసు అని అంటుంది. కార్తీక్ బాబుతో నువ్వు అలా ప్రవర్తించడం సరికాదని అంటుంది. దీంతో జ్యోత్స్న కఠినంగా స్పందిస్తుంది. కార్తీక్ బాబుకు ఓనర్ గా ఇక్కడికి వచ్చాను అంటుంది. అందుకే ధైర్యంగా కార్తీక్ బాబును తీసుకోని వెళ్లడానికి వచ్చానని అంటుంది. కార్తీక్ బాబు రాకపోతే రూల్ బ్రేక్ చేసినట్టే అని అంటుంది. అగ్రిమెంట్ ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరిస్తుంది.

ఇదే సమయంలో దీపా, కార్తీక్ బాబు తిరిగి ఇంటికి వస్తారు. అక్కడ ఉన్న జ్యోత్స్నను చూసి షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న ఎందుకు ఇవ్వాళ రాలేదని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు వస్తున్నాను అని చెబుతాడు. నువ్వు లేట్ చేసినా కొద్ది సాయంత్రం లేట్ గా పంపిస్తానని చెబుతుంది. అందుకు కూడా కార్తీక్ బాబు సరేనని అంటాడు. మరోవైపు దీపా కూడా సరేనని అంటుంది. కార్తీక్ బాబు కూడా త్వరగా వెళ్లు నేను రెడీ అయ్యి వస్తానని అంటాడు. దీపా కూడా సంతోషంగా పంపిస్తానని అంటుంది. జ్యోత్స్నకు దీపా ప్రవర్తన చూసి సందేహం కలుగుతుంది. ఏదో జరిగింది అని అందుకే దీపాలో ఛేంజ్ అయ్యిందని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడికి వెంటనే కార్తీక్ బాబు కూడా వెళ్తాడు. కార్తీక్ బాబు లేట్ గా వెళ్లినందుకు ఇంట్లో వాళ్లందరూ కార్తీక్ బాబుపై మండి పడుతారు. ఇలా లేట్ గా వస్తే కుదరదని, అగ్రి మెంట్ బ్రేక్ చేస్తే మళ్లీ రివర్స్ లో 10 కోట్లు కట్టాల్సి ఉంటుందని అంటారు.

అలా అస్సలు జరగదని, నేను అగ్రిమెంట్ కు లోబడే ఉంటానని కార్తీక్ బాబు అంటాడు. అయినా కూడా శివ నారాయణ, పారుజాతం, జ్యోత్స్న, సుమిత్రలు కార్తీక్ బాబుపై నానా మాటలు అంటారు. అసలు ఆ ఇంటితో అతని సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడి బాధపెడుతారు. ఇదే సమయంలో దీపా ఆ ఇంటికి వెళ్తుంది. కార్తీక్ బాబు విషయంలో అసలు ఏమాత్రం న్యాయం జరగడం లేదని అంటుంది. శివనారాయణ తాతకు కాస్తా ఆలోచించాలని అంటుంది. ఇక నువ్వు ఎందుకు ఈ ఇంటికి తిరిగి వచ్చావని శివ నారాయాణ అడుగుతాడు. నా భర్తకు మద్దతుగా వచ్చానని, నాకు రక్త దానం చేసి ప్రాణాలు కాపాడిన ఈ ఇంటి రుణం తీర్చు కోవడానికి వచ్చానని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X