Karthika deepam 2 May 30th : జ్యోత్స్నకు దిమ్మతిరిగేలా దీపా కౌంటర్.. షాక్ లో కార్తీక్ బాబు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 30వ తేదీ 370వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాకు అసలు విషయం తెలిసి పోవడంతో ప్రస్తుత సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి. కార్తీక్ బాబుకు షాక్ ఇద్దామని కాంచన ఇంటికి వచ్చిన జ్యోత్స్నకు ఊహించని షాక్ తగిలింది. జ్యోత్స్న వచ్చే సమయానికి దీపా, కార్తీక్ బాబు తిరిగి ఇంటికి వస్తారు. అక్కడ ఉన్న జ్యోత్స్నను చూసి షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న ఎందుకు ఇవ్వాళ రాలేదని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు వస్తున్నాను అని చెబుతాడు. కార్తీక్ బాబు త్వరగా రెడీ అయ్యి వస్తానని అంటాడు. దీపా కూడా సంతోషంగా పంపిస్తానని అంటుంది. జ్యోత్స్నకు దీపా ప్రవర్తన చూసి సందేహం కలుగుతుంది. ఏదో జరిగింది అని అందుకే దీపాలో ఛేంజ్ అయ్యిందని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడికి వెంటనే కార్తీక్ బాబు కూడా వెళ్తాడు. కార్తీక్ బాబు లేట్ గా వెళ్లినందుకు ఇంట్లో వాళ్లందరూ కార్తీక్ బాబుపై మండి పడుతారు. ఇలా లేట్ గా వస్తే కుదరదని, అగ్రి మెంట్ బ్రేక్ చేస్తే మళ్లీ రివర్స్ లో 10 కోట్లు కట్టాల్సి ఉంటుందని అంటారు.

అలా అస్సలు జరగదని, నేను అగ్రిమెంట్ కు లోబడే ఉంటానని కార్తీక్ బాబు అంటాడు. అయినా కూడా శివ నారాయణ, పారుజాతం, జ్యోత్స్న, సుమిత్రలు కార్తీక్ బాబుపై నానా మాటలు అంటారు. అసలు ఆ ఇంటితో అతని సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడి బాధపెడుతారు. ఇదే సమయంలో దీపా ఆ ఇంటికి వెళ్తుంది. కార్తీక్ బాబు విషయంలో అసలు ఏమాత్రం న్యాయం జరగడం లేదని అంటుంది. శివనారాయణ తాతకు కాస్తా ఆలోచించాలని అంటుంది. ఇక నువ్వు ఎందుకు ఈ ఇంటికి తిరిగి వచ్చావని శివ నారాయాణ అడుగుతాడు. నా భర్తకు మద్దతుగా వచ్చానని, నాకు రక్త దానం చేసి ప్రాణాలు కాపాడిన ఈ ఇంటి రుణం తీర్చు కోవడానికి వచ్చానని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపా ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. మే 30వ తేదీ 371 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 371 May 30th 2025

అగ్రిమెంట్ పై కార్తీక్ బాబు సంతకం పెట్టాడు కాబట్టి ఈ ఇంటికి పని మనిషిలా వచ్చాడు. మరీ దీపా ఎందుకు వచ్చిందని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. దాంతో తన ప్రాణాలు కాపాడిన ఈ ఇంటి సభ్యుల రుణం తీర్చుకోవడానికి వచ్చానని చెబుతుంది. తన భర్త కార్తీక్ బాబు తన ప్రాణాలు కాపాడటం కోసం జ్యోత్స్న కు అగ్రిమెంట్ పేపర్లపై సంతకం పెట్టాడని, అందుకోసం మీరు పనివాడిలా రమ్మన్నారు కదా.. కార్తీక్ బాబు తన ప్రాణాలు కాపాడటం కోసమే అగ్రిమెంట్ మీద సంతకం చేశాడని, అందుకు మీ రుణం తీర్చుకోవడంలో నాకూ భాగం ఉంటుందని చెబుతుంది. ఇంట్లో తన భర్తతో పాటే కలిసి పని చేస్తానని అంటుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపాను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నిస్తూ ఉంటే దీపానే స్వయంగా వచ్చి పనిమనిషిలా పని చేస్తాననడటంతో సంతోష పడుతుంది.

దాంతో కార్తీక్ బాబుతో పాటు దీపాను కూడా కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తుంది. కానీ జ్యోత్స్న నిర్ణయాన్ని శివ నారాయణ ఒప్పుకోడు. అటు సుమిత్ర కూడా దీపాను వారింట్లో కార్తీక్ బాబుతో కలిసి పని చేయడానికి ఒప్పుకోదు. దీపాను ప్రతి రోజూ చూస్తూ ఉండలేనని సుమిత్ర అంటుంది. దీపాపై నానా మాటలు మాట్లాడుతుంది. అసలు దీపాను చూడటమే ఇష్టం లేనప్పుడు తనతో ఎలా పని చేయించుకుంటామని శివనరాయణ, సుమిత్రలు ప్రశ్నిస్తారు. ఈ సందర్భంగా జ్యోత్స్న స్పందిస్తూ వాళ్లే పని చేస్తామంటే మనకెందుకు అభ్యంతరం అని చెబుతుంది. జ్యోత్స్న మాటలను పారుజాతం కూడా గట్టిగా సమర్దిస్తుంది. అయితే అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు పని చేస్తే ఏడాది లో పూర్తైతే ఇద్దరం కలిసి పనిచేస్తే 6 నెలల్లోనే అగ్రిమెంట్ పూర్తి అవుతుందని అంటుంది. దీనికి కూడా అంగీకరించాలని అంటుంది. ఎలాగైనా దీపాను హింస పెట్టాలని ఆలోచించి జ్యోత్స్న ఒప్పుకుంటుంది. శివ నారాయణ, సుమిత్ర మాత్రం వద్దని అంటారు.

దీపా కళ్ల ముందే ఉంటుందనే సంబరంతో దశరథ ఒప్పుకుంటాడు. ఇక జ్యోత్స్న, పారు జాతం కూడా ఒక్కమాట మీద ఉండటంతో శివ నారాయణ కూడా ఒప్పుకుంటారు. మరీ వీరద్దరూ ఏఏ పనులు చేస్తారని అంటాడు. దాంతో జ్యోత్స్న స్పందిస్తూ కార్తీక్ బాబు ఇప్పటి నుంచి శివ నారాయణ తాతకు డ్రైవర్ గా పనిచేస్తాడు. రోజు కార్లను కడుగుతూ డ్రైవర్ గా అందుబాటులో ఉంటాడని చెబుతుంది. ఇక దీపాను ఇంట్లో పని మనిషిలా వాడుకోండి అని చెబుతుంది. దీపాను దీపాలా చూడకండి అని కార్తీక్ భార్యగా, పని మనిషిగా చూడండి అని జ్యోత్స్న చెబుతుంది. దాంతో శివ నారాయణ కూడా సరేనని చెబుతాడు. సుమిత్ర మాత్రం దీపాను తన కంటపడకని చెబుతుంది. దాంతో దీపా చాలా బాధ పడుతుంది. ఇక శివ నారాయణ డ్రైవర్ కార్తీక్ బాబును కారు కడిగించమని చెప్పి వెళ్లిపోతాడు.

దశరథ మాత్రం దీపాను తమ ఇంట్లోనే ఉండేందుకు అందరూ ఒప్పుకోవడంతో సంతోషిస్తాడు. పెద్దగా దీపాతో మాట్లాడకపోయినా తన సంతోషాన్ని కళ్లల్లో వ్యక్తం చేసి లోపలికి వెళ్లిపోతాడు. ఇక వెంటనే జ్యోత్స్న కార్తీక్ బాబును కారు కడగాలని, ఫస్త్ తను ఫ్రెష్ అయ్యి వస్తానని అప్పటి వరకు వెయిట్ చేయమని కార్తీక్ బాబుకు చెబుతుంది. అదే వరుసలో పారుజాతం కూడా మాటలు జారుతుంది. దీంతో కార్తీక్ బాబు వెంటనే ఫైర్ అవుతాడు. తన డ్రైవర్ గా చేసినా తన వెంట యూనియన్ ఉందని, అగ్రిమెంట్ పేరుతో ఇబ్బంది పెడితే వాళ్లందరినీ పిలిచి ధర్నా చేయిస్తానని పారుజాతాన్ని హెచ్చరిస్తాడు.

దాంతో పారుజాతం భయపడి పోతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు దీపాను బయటికి తీసుకెళ్లి అసలు నువ్వు ఇక్కడి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తాడు. నిన్ను రావొద్దని చెప్పాను కదా అని అంటాడు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకని ఇక్కడ పని చేయడానికి ఒప్పుకున్నావని ప్రశ్నిస్తాడు. అసలు నీ మనస్సులో ఏముందని అడుగుతాడు. దీంతో దీపా స్పందిస్తూ మీకు తోడుగా ఉందామని, అలాగే జ్యోత్స్న వల్ల ప్రమాదంలో ఉన్న తన తల్లిదండ్రులను కాపాడుకోవడానికి అని చెబుతుంది. తనకు ఆ ఇంట్లో దశరథ సపోర్ట్ చేసుకున్నారు కదా అని, అలాగే అందరూ తనవైపు మళ్లుతారని చెబుతుంది. ఇక జ్యోత్స్న కూడా తన చెల్లెలే కాబట్టి తనను కూడా పూర్తిగా మార్చాలని అనుకుంటున్నట్టు చెబుతుంది. మనవాళ్ల ఇంట్లో కొన్నాళ్లు పని మనిషిలా ఉండటం తప్పేమీ కాదనుకుంటున్నట్టు చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X