Karthika deepam 2 May 31th : దీపా మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్నకు షాకిస్తున్న వంటలక్క

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 30వ తేదీ 371వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివనారాయణ అసలు మనవరాలు, వందల కోట్ల ఆసక్తికి యజమాని దీపానే అనే అసలు విషయం తెలిసిపోవడంతో ప్రస్తుత సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి. అగ్రిమెంట్ ప్రకారం.. కార్తీక్ బాబును టార్చర్ పెట్టాలని చూస్తున్న జ్యోత్స్నకు వంటలక్క షాక్ ఇస్తోంది. ప్రస్తుతం కార్తీక్ బాబుతో పాటు వంటలక్క కూడా శివ నారాయణ ఇంట్లోనే పని మనుషులుగా సెటిల్ అయ్యారు. దీపాకు కార్తీక్ బాబు నిజం చెప్పడంతో జ్యోత్స్న ఆటలు కట్టించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లో పని మనుషులుగా సెటిల్ అయ్యారు.

జ్యోత్స్న కార్తీక్ బాబును శివ నారాయణకు కారు డ్రైవర్ గా చేయమని చెబుతుంది. మరోవైపు దీపాను పని మనిషి ఉండమని, ఇంట్లో చెప్పిన పనులన్నీ చేయాలని అంటుంది. అందుకు ఇద్దరూ సరేనని చెబుతారు. అయితే దీపా ఆ ఇంట్లో ఉండటం శివ నారాయణ, సుమిత్రలకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ జ్యోత్స్న, పారుజాతం, సుమిత్రల వల్ల ఉండాల్సి రావడంతో సరేనని ఒప్పుకుంటారు. ఇక వారిని పని మనుషులు లాగే చూడాలని అంటుంది జ్యోత్స్న. మరోవైపు దీపా కార్తీక్ బాబు తమ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని అనుకుంటారు. జ్యోత్స్న తలపెట్టే ప్రమాదం నుంచి తన తల్లిదండ్రులు, కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. ఈ సందర్భంగా కార్తీక్ బాబు, దీపా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మే 31వ తేదీ 372 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 372 May 31th 2025

కార్తీక్ బాబు, దీపా ఇద్దరూ శివ నారాయణ ఇంట్లోకి వస్తారు. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు ఒక్కడే పని మనిషిగా రావాల్సి ఉంటుంది. కానీ దీపా కూడా కార్తీక్ బాబు వెంటనే వస్తుంది. ఇంట్లో తాను కూడా పని మనిషిగా ఉంటానని చెబుతుంది. అగ్రిమెంట్ కూడా త్వరగా పూర్తి అవుతుందని చెబుతుంది. ఎలాగూ దీపాను ముప్పు తిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తున్న జ్యోత్స్నకు ఇది ఒక అవకాశంగా భావిస్తుంది. దాంతో ఇద్దరినీ పనిలో పెడుతున్నానని తన నిర్ణయాన్ని చెబుతుంది. ఇక దీపా కూడా తన ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అనుకుంటుంది. మరోవైపు దీపా, కార్తీక్ బాబు కూడా ఒక మాట మీద ఉంటారు. తాము అనుకున్నది జరిగే వరకు ఇలాగే ఉండాలని, నిజం బయటికి పొక్కకుండా జాగ్రత్తగా సమస్యను పరిష్కరించాలని అనుకుంటారు. వీరిద్దరూ ఇలా బయట మాట్లాడుకుంటూ ఉండగా పారుజాతం వస్తుంది.

పనివాళ్లు మాటలు ఆపి పనిలోకి దిగుతారా? అని అంటుంది. దాంతో కార్తీక్ బాబు గుర్రుమని చూస్తాడు. వెళ్లి ఎవరి పనుల్లో వాళ్లు ఉండండి అని ఆర్డర్ వేస్తుంది. దీపాను జ్యూస్ తీసి ఇంటి యజమానికి ఇవ్వమని అంటుంది. అందుకు దీపా వెంటనే లోపలికి వెళ్తుంది. జ్యూస్ తీసి సుమిత్ర అమ్మకు తీసుకెళ్లి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే సమిత్ర దీపాపై ఇంకా రగిలిపోతూ ఉంటుంది. ఇక దీపా వెనకాల నుంచి జ్యూస్ తీసుకొని వచ్చి సుమిత్రకు ఇస్తుంది. దీపాను చూసిన సుమిత్ర ఇంకా మండిపోతుంది. అసలు నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదని, చెప్పినా కూడా నాకు ఎందుకు ఎదురు పడ్డావని అంటుంది. అసలు నీలాంటి దాన్ని మళ్లీ మళ్లీ చూడాలని ఎవరూ అనుకోరని తిడుతూ ఉంటుంది. దీపాను తిడుతూ ఉంటే వెనకాల నుంచి జ్యోత్స్న, పారుజాతం వచ్చి వింటూ సంతోషిస్తారు.

అసలు నాకు జ్యూస్ ఇవ్వమని నీకు ఎవరు చెప్పారు. నాకు సేవలు చేయడానికి నా కూతురు జ్యోత్స్న ఉంది. తల్లిని చూసుకోవడానికి కన్న కూతురు సరిపోతుందని, పనివాళ్లు చేయాల్సిన పనిలేదని అంటుంది. అసలు నువ్వెందుకు జ్యూస్ తెచ్చావని అంటుంది. దీంతో పారజాతం ఇంటి యజమానికి జ్యూస్ ఇవ్వమని చెప్పారని అంటుంది. పారు షాక్ అవుతుంది. తనను ఇంటి యజమానిగా అనుకుంటే, సుమిత్రను ఇంటి యజమానికి అని చెప్పేలా జ్యూస్ అటు ఇచ్చావా? అని పారు మనస్సులో అనుకుంటుంది. ఇక సుమిత్ర వెళ్లిపోతూ దీపాను ఇంకోసారి తన కంట పడొద్దని చెబుతుంది. నీలాంటి మోసపూరితమైన మనసుషులను చూడటమే తనకు ఇష్టం లేదని అంటుంది. దాంతో దీపా బాధపడుతుంది. ఈరోజు మీరు నిజమని నమ్ముతుంది రేపు అబద్ధం అవుతుందని అంటుంది. దీపా ఆ మాట అనడంతో దెబ్బకు జ్యోత్స్న షాక్ అవుతుంది.

దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంటే.. వెంటనే పారుజాతం తల్లిదండ్రులు లేని దానికి తల్లి విలువ ఎలా తెలుస్తుందని అంటుంది. ఆ మాటతో దీపా చాలా బాధపడుతుంది. నాకు తల్లిదండ్రులు ఉన్నారని అంటుంది. ఎక్కడ? అని అడగటంతో ఇక్కడే ఉన్నారని చెబుతుంది. వెంటనే పారు స్పందిస్తూ కొంపదీసి సుమిత్రనే నీ కన్న తల్లి అంటావా? అని అడుగుతుంది. జ్యోత్స్న స్పందిస్తూ మాట వరుసకు కూడా అలాంటి మాట అనకు అని అంటుంది. ఇక సుమిత్ర కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక జ్యోత్స్న, పారుజాతాన్ని తీసుకొని మనం ఒక ప్లేస్ కు వెళ్లాలని అంటుంది. వెంటనే దాసు వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ జ్యోత్స్న, పారుజాతానికి షాక్ తగులుతుంది.

కార్తీక్ బాబు, దీపాల ప్రవర్తన పూర్తిగా మారడంతో తన అసలు తండ్రి దాసుకు గతమేమైనా గుర్తుకు వచ్చిందా? అని తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే దాసు ఇంటికి వెళ్లి కలవాలని ప్రయత్నిస్తుంది. ఇంట్లో కేవలం కాశీ, దిల్ మాత్రమే ఉంటారు. దాసు కనిపించడు. దీంతో జ్యోత్స్న దాసు ఎక్కడికి వెళ్లాడని కాశీని అడుగుతుంది. ఆయన ఇంట్లో లేరని, ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని కాశీ జ్యోత్స్నతో చెబుతారు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్లిపోయాడని అంటారు. అసలు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని, ఆచూకీ కోసం వెతుకుతున్నామని జ్యోత్స్నకు బదులిస్తారు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మరీ దాసు ఎక్కడికి వెళ్లాడని ఆలోచిస్తూ ఉంటుంది. గతం గుర్తుకు వచ్చి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పడానికి వెళ్లాడా అని సందేహిస్తుంది. వెంటనే ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X