Karthika deepam 2 June 2nd : కార్తీక్ బాబు, దీపా మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్నకు షాక్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 మే 31వ తేదీ 372వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపా ఇద్దరూ శివ నారాయణ ఇంట్లోకి వస్తారు. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు ఒక్కడే పని మనిషిగా రావాల్సి ఉంటుంది. కానీ దీపా కూడా కార్తీక్ బాబు వెంటనే వస్తుంది. ఇంట్లో తాను కూడా పని మనిషిగా ఉంటానని చెబుతుంది. అగ్రిమెంట్ కూడా త్వరగా పూర్తి అవుతుందని చెబుతుంది. ఎలాగూ దీపాను ముప్పు తిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తున్న జ్యోత్స్నకు ఇది ఒక అవకాశంగా భావిస్తుంది. దాంతో ఇద్దరినీ పనిలో పెడుతున్నానని తన నిర్ణయాన్ని చెబుతుంది. ఇక దీపా కూడా తన ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అనుకుంటుంది. మరోవైపు దీపా, కార్తీక్ బాబు కూడా ఒక మాట మీద ఉంటారు.
కార్తీక్ బాబు, దీపాల ప్రవర్తన పూర్తిగా మారడంతో తన అసలు తండ్రి దాసుకు గతమేమైనా గుర్తుకు వచ్చిందా? అని తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే దాసు ఇంటికి వెళ్లి కలవాలని ప్రయత్నిస్తుంది. ఇంట్లో కేవలం కాశీ, దిల్ మాత్రమే ఉంటారు. దాసు కనిపించడు. దీంతో జ్యోత్స్న దాసు ఎక్కడికి వెళ్లాడని కాశీని అడుగుతుంది. ఆయన ఇంట్లో లేరని, ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని కాశీ జ్యోత్స్నతో చెబుతారు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్లిపోయాడని అంటారు. అసలు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని, ఆచూకీ కోసం వెతుకుతున్నామని జ్యోత్స్నకు బదులిస్తారు. ఇక జూన్ 2వ తేదీ 373 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాకు కార్తీక్ బాబు నిజం చెప్పిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు కార్ డ్రైవర్ గా, ఇకదీపా కూడా ఇంటి పని మనిషిగా శివ నారాయణ ఇంట్లో ఫిక్స్ అయ్యారు. ఇక సుమిత్ర , దశరథలను జ్యోత్స్న నుంచి కాపాడుకునేందుకు ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఒకరితో ఒకరు ప్లాన్ గురించి చెప్పుకుంటున్నారు. ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలని, తమ ఇద్దరికీ అసలు వారసురాలు విషయం తెలిసిందని జ్యోత్స్నకు తెలిస్తే ప్రమాదమే అనుకుంటారు. పరిస్థితులు తమ దారిలోకి వచ్చేంత వరకు ఓపిగ్గా ఉండాలని, సమయం చూపి జ్యోత్స్న, పారుజాతం సంగతి చూడాలని అనుకుంటున్నారు.
ఇక దీపా, కార్తీక్ బాబు శివ నారాయణ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా జ్యోత్స్న వాళ్లను టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు, దీపా మాత్రం జ్యోత్స్నకే షాక్ ఇచ్చేలా ప్రవర్తిస్తారు. ఇక జ్యోత్స్న, పారుజాతం ఇంటి నుంచి తిరిగి వచ్చాక తన గదిలో కూర్చిపై కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో వెనకాల నుంచి దీపా వచ్చి జ్యోత్స్నకు తల పడుతుంది. దాంతో జ్యోత్స్న అబ్బ ఎంతో హాయిగా ఉందని, దాసు ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి తల బాగా నొప్పి పెడుతుందని, నువ్వు బాగా తల పడుతున్నావు గ్రానీ అంటుంది. తల పడుతుంది పారుజాతం అనుకొని మరిన్ని విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో పారుజాతం యాపిల్ తింటూ జ్యోత్స్న ఎదురుగా వస్తుంది. గ్రానీ ముందుంటే వెనకాల ఉంది ఎవరని తిరిగి చూస్తుంది. వెనకాలే ఉన్న దీపాను చూసి షాక్ అవుతుంది.
అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావని, తల ఎందుకు పడుతున్నావని దీపాను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నేను పని మనిషిని కాబట్టి తల పట్టడం నా బాధ్యత అని చెబుతుంది. అనుమతి లేకుండా తన గదిలోకి మరోసారి రావొద్దని అంటుంది. పని మనిషులు ఇంట్లో ఏ గదిలోకైనా వెళ్తారని, ఏ పనైనా చేస్తారని చెబుతుంది. తను పని మనిషిని కాబట్టి ఏదైనా పని చెప్పమని అంటుంది. జ్యోత్స్న కు బదులు దీపానే తనకు పని చెప్పండి, పని చెప్పండి అంటూ టార్చర్ పెడుతుంది. దాంతో పారుజాతం పలు పనులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అవన్నీ ఎప్పుడో చేసేశానని ఇంకేదైనా పని చెప్పమని అంటుంది. దాంతో జ్యోత్స్న, పారుజాతం షాక్ అవుతారు. వీళ్లను పనిలో పెట్టుకోవడంతో మనకే ఇబ్బంది కలుగుతుంది కదానే అని జ్యోత్స్న పారు జాతం అనుకుంటారు. పని మనిషి ని కాబట్టి మిమ్మళ్లి ఓ కంట కనిపెడుతూ ఉంటానని అంటుంది. ఆ మాట వినగానే జ్యోత్స్న, పారు ఝల్లుమంటారు.
వెంటనే దీపా మళ్లీ మాట మార్చి నా ఉద్దేశం మీకు ఏం కావాలో చూసుకోవడమే అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో జ్యోత్స్న నువ్వు నన్ను ఓ కంట చూడటం కాదు.. నేనే నిన్ను ఓ కంట చూస్తానని అంటుంది. ఈ ఇంటికి వచ్చిన సమయం నుంచి కార్తీక్ బాబు, దీపాల ప్రవర్తన చాలా తేడా ఉందని, దాని వెనకాల ఉన్న మేటర్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు కార్తీక్ బాబు ఇంటి దగ్గర తల్లి కాంచనతో తండ్రి శ్రీధర్ గొడవ పడుతూ ఉంటారు. తన కొడుకు కార్తీక్ బాబును శివనారాయణ ఇంటికి పని మనిషిగా ఎందుకు పంపించావని ప్రశ్నిస్తాడు. ఆ విషయాలన్నీ నీకు చెప్పాల్సిన పని లేదని కాంచన శ్రీధర్ పై మండిపడుతుంది. దాంతో శ్రీధర్ మీకైనా అసలు విషయం తెలుసా అని అడుగుతాడు. అందుకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇంకా తన మాటలతో రెచ్చిపోతాడు. అదే సమయంలో కార్తీక్ బాబు, దీపా ఇంటికి తిరిగి వస్తారు.
శ్రీధర్ ఇంట్లో చేస్తున్న రచ్చ చూసి ఏం జరిగిందని కార్తీక్ బాబు అడుగుతాడు. అసలు ఈ ఇంటికి రావొద్దని చెబుతున్నా కూడా ఎందుకు వస్తున్నారని కార్తీక్ బాబు, దీపా మండి పడుతారు. దాంతో శ్రీధర్ నా భార్య, కొడుకు ఇళ్లు కాబట్టి ఇక్కడికి వస్తున్నానని, కానీ కార్తీక్ బాబు ఆ ఇంటికి పని మనిషిగా ఎందుకు వెళ్తున్నాడని తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో దీపా మీరు చెప్పిన సమాధానమే మీ ప్రశ్నకు బదులని చెబుతుంది. ఇక శ్రీధర్ వెళ్లిపోవడంతో కాంచన కూడా కార్తీక్ బాబు ను ప్రశ్నిస్తుంది. నువ్వు వెళ్లేది గాక దీపాను ఆ ఇంటికి ఎందుకు తీసుకెళ్లావురా అని అడుగుతుంది. తాము ఓ పని చేయబోతున్నామని, తనపై నమ్మకంతో ఓపిగ్గా ఉండమని చెబుతాడు. కొద్ది రోజుల తర్వాత అన్ని విషయాలు మీకే తెలుస్తాయని అంటాడు. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపా శౌర్యతో కాసేపు మాట్లాడుతారు. ఆ తర్వాత కార్తీక్ బాబు దీపాకు ఒక కండీషన్ పెడుతాడు. తనను ఇకపై కార్తీక్ బాబు అని కాకుండా బావ అని పిలవాలని, దీపాను మరదల అని పిలుస్తానని చెబుతాడు. అందుకు దీపా కూడా సరేనని అనుకుంటుంది. అందరూ ప్రశాంతంగా నిద్ర పోతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











