Karthika deepam 2 June 3rd : జ్యోత్స్న గుండె గుబేల్.. కొత్త సినిమా చూపించిన కార్తీక్ బాబు, దీపా

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 2వ తేదీ 373వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాకు కార్తీక్ బాబు నిజం చెప్పిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు కార్ డ్రైవర్ గా, ఇకదీపా కూడా ఇంటి పని మనిషిగా శివ నారాయణ ఇంట్లో ఫిక్స్ అయ్యారు. ఇక సుమిత్ర , దశరథలను జ్యోత్స్న నుంచి కాపాడుకునేందుకు ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఇక దీపా, కార్తీక్ బాబు శివ నారాయణ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా జ్యోత్స్న వాళ్లను టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు, దీపా మాత్రం జ్యోత్స్నకే షాక్ ఇచ్చేలా ప్రవర్తిస్తారు.

జ్యోత్స్న, పారుజాతం ఇంటి నుంచి తిరిగి వచ్చాక తన గదిలో కూర్చిపై కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో వెనకాల నుంచి దీపా వచ్చి జ్యోత్స్నకు తల పడుతుంది. దీపా తల పట్టడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పని మనిషికి ఇలా నా గదిలోకి ఎందుకు వచ్చావని అంటుంది. పని మనిషిని కదా ఏ గదిలోకైనా వెళ్తానని, నాకు పని చెప్పండి అని రివర్స్ లో జ్యోత్స్నకు షాక్ ఇస్తుంది. అలాగే దీపా శివనారాయణ ఇంటికి తిరిగి వెళ్లడంతో శ్రీధర్, కాంచనలకు అనుమానం వస్తుంది. కానీ నిజం ఎవ్వరికీ తెలియకుండా కార్తీక్ బాబు, వంటక్క దాచేస్తాడు. ఇక జూన్ 3వ తేదీ 374 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 374 June 3rd 2025

కార్తీక్ బాబు, దీపా జ్యోత్స్నకు చుక్కులు చూపిస్తున్నారు. తాము పనిమనుషుల మంటూ పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నారు. ప్రతి పనిలోనూ కార్తీక్ బాబు, దీపా సంతోషంగా మాట్లాడుకుంటూ మరింత రొమాంటిక్ గా సమయం గడుపుతూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్నకు కడుపు మండిపోతుంది. అసలు కార్తీక్ బాబును ముప్పు తిప్పలు పెడుదామని, అవమానిద్దామని, దాంతో దీపా కంట్లో కన్నీళ్లు చూడొచ్చని ఊహించిన జ్యోత్స్నకు చుక్కెదురైంది. ఏ పని చెప్పినా దీపా అతి వినయంతో మంట పెడుతుంది. తన అతి మర్యాద, అతి సేవలతో కావాలనే జ్యోత్స్న, పారుజాతంలకు చిరాకు తెప్పిస్తోంది. ఇక కార్తీక్ బాబు కూడా తన మాటలతో ఓవైపు చురకలు అంటిస్తూనే మరోవైపు జ్యోత్స్న, పారుజాతంల గుట్టు రట్టు చేస్తానని పరోక్షంగా ఎప్పటికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే పారుజాతం ఏదైనా సినిమాకు వెళ్దామా అని అంటుంది. ఏం వద్దు అని జ్యోత్స్న అంటుంది. కానీ కార్తీక్ బాబు కూడా వెళ్దామని అంటాడు. ఇంతకీ ఏం సినిమాలు ఉన్నాయని అనడంతో కొడితే.. అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చిందని చెబుతాడు కార్తీక్ బాబు. అదేం సినిమారా అని పారుజాతం అంటుంది. చాలా మంచి సినిమా అమ్మమ్మ అని చెబుతాడు. కథ, ట్విస్ట్ లు వేరే లెవల్లో ఉంటాయని జ్యోత్స్నను ఓరగా చూస్తూ చెబుతాడు. ఇంతకీ ఆ సినిమా నువ్వు చూశావా? చూస్తే కథేంటో చెమని అంటుంది. ఆ సినిమా ఇప్పటికే చూశానని, కథ సూపర్ ఉంటుందని చెబుతాడు కార్తీక్ బాబు. విలన్స్ ఇద్దరూ భార్యా భర్తలను చంపాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ విషయం తెలుసుకొని భార్యాభర్తలిద్దరే ఆ విలన్స్ ఇద్దరిని లేపేస్తారని... అదే కథ అని చెబుతాడు.

బాలు చెప్పి కథ తమను ఉద్దేశించే అని జ్యోత్స్న, పారుజాతం అనుకుంటారు. ఒకరి మొహం మరొకరు చూసుకోని సందిగ్ధంలో పడిపోతారు. ఇక కార్తీక్ బాబు మాట్లాడుతూ మున్ముందు ఆ భార్యాభర్తలు ఇచ్చే ట్విస్టులకు ఆ ఇద్దరు విలన్స్ కు చావు భయం పుడుతుందని అంటాడు. దాంతో జ్యోత్స్న మరింతగా కార్తీక్ బాబుపై అనుమానం వ్యక్తం చేస్తుంది. మాటలు ఆపి పని చూడంటి అంటూ కార్తీక్ బాబు, దీపాలను హాలు నుంచి పంపించేస్తుంది. కార్తీక్ బాబు చెప్పిన సినిమా కథ విన్న తర్వాత జ్యోత్స్న ఇంకా ఆలోచనల్లో పడి పోతుంది. కార్తీక్ బాబు దగ్గర ఏదో పెద్ద ప్లానింగే ఉందని, అందుకే అంత ధైర్యంగా, చాలా స్పష్టంగా తనను హెచ్చరిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఆ ప్లానింగ్ ఏంటనేది తెలుసుకోవాలని అనుకుంటుంది.

ఇక మరోవైపు కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ శివ నారాయణ ఇంటికి వస్తాడు. తన కొడుకు కార్తీక్ బాబును ఈ ఇంటికి పని మనిషిగా ఎలా పెట్టుకుంటారని, అడిగే వారు లేరని ఇష్టమొచ్చినట్టు చేస్తారా? అని శ్రీధర్ మండి పడుతాడు. వెంటనే తన కొడుకు అక్కడి నుంచి పంపించాలని, లేదంటే తను అస్సలు ఊరుకోనని అంటాడు. కానీ కార్తీక్ బాబు మాత్రం నువ్వు నాకోసం ఇక్కడికి ఎందుకు వచ్చావని, నేను ఇష్టంగానే ఇక్కడ పని చేస్తున్నానని చెబుతాడు. ఇక దీపానే ఆ ఇంటికి అసలు వారసురాలు అనే సంగతి తెలియని శ్రీధర్ ఇంటమొచ్చిన్టటు తిడుతాడు. దీపాతో తిరిగి మరీ అద్వాన్నంగా తయారయ్యావని, లండన్ లో ఎంబీబీఎస్ చేసి, రెస్టారెంట్ కు సీఈవోగా పని చేసి ఇలా పని మనిషిలా మారడం ఏంటని అసహ్యించుకుంటాడు.

అంతలోనే శివనారాయణ అక్కడికి వచ్చి ఏంటీ గొడవ అని, ఎందుకు ఈ మనిషిని ఇంట్లోనికి రానిచ్చారని శ్రీధర్ ను పట్టుకొని అంటాడు. తన కొడుకును పంపించే వరకు అక్కడి నుంచి వెళ్లానని, నిరసన చేస్తానని ఇంట్లోనే కూర్చుంటాడు. ఇక కార్తీక్ బాబు జోక్యం చేసుకొని శ్రీధర్ బాబును తిట్టి, పిన్ని, కావ్యకు చెబుతానని బెదిరించి శివ నారాయణ ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఇక శ్రీధర్ బాబు తిరిగి తన ఇంటికి వెళ్లే సరికి అక్కడ కాశీ, స్వప్న ఉంటారు. కావ్య తన కూతురు, అల్లుడిని భోజనానికి ఇంటికి పిలుస్తుంది. అదే సమయంలో శ్రీధర్ తిరిగి వస్తాడు. అల్లుడు కాశీని, దిల్ ను చూసి మండి పడుతాడు. వాళ్లను భోజనం చేయకుండా తేపకో మాట మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటాడు. కానీ దిల్ కూడా తిరిగి తన తండ్రి శ్రీధర్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇక శివ నారాయణ ఇంటికి వెళ్లి వచ్చిన సంగతి తమకు తెలిసిపోయిందని దిల్ అంటుంది. అవును వెళ్లానని, అక్కడ కార్తీక్ బాబు డ్రైవర్ గా, దీపా పని మనిషిగా చేరారని చెబుతాడు. అది విన్న కాశీ, దిల్ షాక్ అవుతారు. అక్కడ కార్తీక్ బాబు, దీపాల పరిస్థితి ఎలా ఉందోనని కాశీ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X