Karthika deepam 2 June 4th : జ్యోత్స్నకు కొత్త టెన్షన్.. కార్తీక్ బాబు, దీపా మాస్టర్ స్ట్రోక్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 3వ తేదీ 374వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపా జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తున్నారు. పనిమనుషుల మంటూ పదే పదే గుర్తు చేస్తూ దెప్పిపొడుస్తున్నారు. ప్రతి పనిని కార్తీక్ బాబు, దీపా సంతోషంగా ఉంటారు. అది చూసిన జ్యోత్స్నకు కడుపు మండిపోతుంది. అసలు కార్తీక్ బాబును ముప్పు తిప్పలు పెడుదామని, అవమానిద్దామని, దాంతో దీపా కంట్లో కన్నీళ్లు చూడొచ్చని ప్లాన్ వేసిన జ్యోత్స్నకు వారే దిమ్మతిరిగేలా మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నారు. ఓవైపు దీపా మరోవైపు కార్తీక్ బాబు కూడా తన మాటలతో ఓవైపు చురకలు అంటిస్తూనే ఉంటున్నారు. అంతేకాకుండా గడికోసారి జ్యోత్స్న, పారుజాతంల గుట్టు రట్టు చేస్తానని పరోక్షంగా తమ మాట్లాడుతూ ఉన్నారు. దాంతో జ్యోత్స్నకు వాళ్లిద్దరిపై బలమైన అనుమానం ఏర్పడింది.
మరోవైపు కార్తీక్ బాబు ఓ సినిమా కథ చెప్పి జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. వాళ్లిద్దరిని ఉద్దేశించే కార్తీక్ బాబు సినిమా కథ చెబుతున్నాడని జ్యోత్స్న, పారుజాతం అనుమానిస్తారు. ఇక మున్ముందు ఆ భార్యాభర్తలు ఇచ్చే ట్విస్టులకు ఆ ఇద్దరు విలన్స్ కు చావు భయం పుడుతుందని కార్తీక్ బాబు అంటాడు. మరోవైపు కార్తీక్ బాబు తండ్రి శ్రీధర్ శివ నారాయణ ఇంటికి వస్తాడు. తన కొడుకు కార్తీక్ బాబును ఈ ఇంటికి పని మనిషిగా ఎలా పెట్టుకుంటారని, అడిగే వారు లేరని ఇష్టమొచ్చినట్టు చేస్తారా? అని శ్రీధర్ మండి పడుతాడు. నానా రచ్చ చేస్తాడు. కానీ కార్తీక్ బాబు కాస్తా భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక శ్రీధర్ ఆ విషాయాన్ని కాశీ, స్వప్నకు కూడా చెబుతాడు. వాళ్లు కంగారు పడుతారు. ఇక జూన్ 4వ తేదీ 375 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు, దీపా శివ నారాయణ ఇంట్లో కొత్త గేమ్ మొదలు పెట్టారు. జ్యోత్స్నకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తమ ప్రవర్తనతో జ్యోత్స్నను మరింతగా ఆలోచించేలా చేస్తున్నారు. జ్యోత్స్న కూడా కార్తీక్ బాబు, దీపాల ప్రవర్తన ఒక్కసారిగా మారడంతో షాక్ అవుతుంది. దీంతో వాళ్ల ప్రతి మూమెంట్ ను గమనిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ బాబు, దీపా చాలా సంతోషంగా ఒకరికొకరు సరసాలాడుతూ ఉంటారు. జ్యోత్స్న పారుజాతం ముందు మరింతగా ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ అంతకంతకు వాళ్లు జ్యోత్స్నను తిప్పి కొడుతుంటారు. దీంతో జ్యోత్స్న సందిగ్ధంలో పడిపోతుంది. అసలు వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక దీపా తన అసలు తల్లిదండ్రులు సుమిత్ర, దశరథల కోసం ప్రత్యేక వంటలు వండుతూ ఉంటుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబు వచ్చి దీపాకు సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాదు దీపాతో మరదలు అని పిలుస్తూ సరసలాడుతాడు. దాంతో దీపా అలా గట్టిగా అరవకని కార్తీక్ బాబు ను అంటుంది. ఎవరైనా వింటే పెద్ద సమస్య అవుతుందని, నెమ్మదిగా మాట్లాడమని చెబుతుంది. నీ ఇంట్లో నువ్వు ఏదీ మాట్లాడినా నడుస్తుందని అంటాడు కార్తీక్ బాబు. అసలు వారసురాలు ఈ ఇంటికి పని మనిషిలా, దొంగ వారసురాలు ఈ ఇంట్లో సర్వభోగాలను అనుభవించడం చూస్తుంటే కడుపు మండిపోతుందని దీపాతో కార్తీక్ బాబు అంటాడు. ఎవరైనా వింటారు అంటూ మళ్లీ దీపా కార్తీక్ బాబు నోరు మూయించే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం ఎవ్వరూ విన్న పర్లేదు కానీ ఆ జ్యోత్స్న మాత్రం వినకుండా ఉంటే సరిపోతుందని అంటాడు.
అదే సమయంలో జ్యోత్స్న కార్తీక్ బాబు మాటలను వింటుంది. ఏంటీ నా గురించి ఏదో గుట్టుగా మాట్లాడుకుంటున్నారని అంటుంది. నీ గురించి ఏమీ కాదులే అని కార్తీక్ బాబు జ్యోత్స్నకు బదులిస్తాడు. నా పేరు పెట్టి మాట్లాడటం నేను విన్నాను అని, ఎందుకు నా పేరుతో మాట్లాడారని కార్తీక్ బాబును ప్రశ్నిస్తుంది. అందుకు కార్తీక్ బాబు స్పందిస్తూ ఆ పేరుతో నువ్వొక్కదానివే లేవు కదా.. మేం వేరే వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నామని చెబుతాడు. ఎవరు వాళ్లు అని జ్యోత్స్న అడుగుతుంది. అందుకు దీపా స్పందిస్తూ మా చెల్లి పేరు కూడా జ్యోత్స్ననే అని, తన గురించే మాట్లాడుకుంటున్నామని బదులిస్తుంది. నీకు చెల్లి కూడా ఉందా? అని దీపాను ప్రశ్నిస్తుంది. అందుకు దీపా అవును ఉందని చెబుతుంది. తనకు కస్తా తలతిక్క కుదిరిందని, దాని గురించే మాట్లాడుకుంటున్నామని చెబుతుంది.
అదే సరేగానీ కిచెన్ లో డ్రైవర్ వు నువ్వేం చేస్తున్నావని కార్తీక్ బాబును అంటుంది జ్యోత్స్న. ఇక వెంటనే బాబు స్పందిస్తూ... నా భార్యకు సాయం చేస్తున్నానని చెబుతాడు. మొగుడు పెళ్లాలు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా అని అంటాడు. నీకు పెళ్లైతే ఇలాంటి ప్రేమలు అన్ని తెలిసేవి నీకు పెళ్లి పెటాకులు లేవు కాబట్టి తెలిసే ఛాన్స్ లేదులే అని అంటాడు. మరోవైపు దీపా కూడా కార్తీక్ బాబుపై ప్రేమను ఒళకబోస్తుంది. ఒకరితో ఒకరు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ జ్యోత్స్నకు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. తన ముందే కార్తీక్ బాబు, దీపా ప్రేమించుకోవడం చూసి తట్టుకోలేకపోతుంది. ఇక కార్తీక్ బాబును వెంటనే ఆఫీస్ కు వెళ్లాలి కారు తీయమని చెబుతుంది. కానీ కార్తీక్ బాబు తన ఒక గంట పర్మిషన్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్ ను కలిసే పని ఉందని, గంటలో తిరిగి వచ్చేస్తానని చెబుతాడు. దాంతో జ్యోత్స్న పర్మిషన్ ఇచ్చి ముందు బయటికి వెళ్లిపో అని చెబుతుంది.
కార్తీక్ బాబు వెళ్లిపోగానే దీపాపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మీరు మీరులా లేరు దీపా, ఇంత మార్పు ఎలా? ఎందుకు మీరు ఇంతలా మారిపోయారు? అని ప్రశ్నిస్తుంది. అసలు నీకు దాసు ఎక్కడికి వెళ్లాడో తెలుసా? అని అడుగుతుంది. దీపా మాత్రం దశరథను కాల్చింది ఎవరో తెలుసా? అని ప్రశ్నిస్తుంది. అందుకు నిన్ను కత్తితో పొడిచింది ఎవరో తెలుసుకున్నావా? అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ వెంటనే లైసెన్స్ గన్ లోని బుల్లెట్ ఏమైందని దీపా అడుగుతుంది? ఇలా వారి మధ్య మాటల తూటాలు పేలుతాయి. జ్యోత్స్న ఇక దీపా ధైర్యాన్ని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ బాబు గౌతమ్ ను కలుస్తాడు. జ్యోత్స్నను మళ్లీ పెళ్లిచేసుకోమని చెబుతాడు. ఈ సారి తను, తన భార్య దీపా అడ్డుపడమని చెబుతాడు. అందుకు గౌతమ్ కూడా సరేనని చెప్పి నీ వెంటనే ఇంటికి వస్తానని అంటాడు. అప్పటికే జ్యోత్స్న కార్తీక్ బాబు, దీపా ఏం చేయబోతున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











