Karthika deepam 2 June 5th : జ్యోత్స్నను ఇరికించిన కార్తీక్ బాబు.. దెబ్బకు వణికిపోయిన మరదల్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 4వ తేదీ 375వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్నకు కార్తీక్ బాబు, దీపా చుక్కలు చూపిస్తున్నారు. శివ నారాయణ ఇంట్లో కొత్త గేమ్ మొదలు పెట్టారు. జ్యోత్స్నకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తమ ప్రవర్తనతో జ్యోత్స్నను మరింతగా ఆలోచించేలా చేస్తున్నారు. కార్తీక్ బాబు, దీపా చాలా సంతోషంగా ఒకరికొకరు సరసాలాడుతూ ఉంటారు. జ్యోత్స్న పారుజాతం ముందు మరింతగా ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ అంతకంతకు వాళ్లు జ్యోత్స్నను తిప్పి కొడుతుంటారు. దీంతో జ్యోత్స్న సందిగ్ధంలో పడిపోతుంది.

కార్తీక్ బాబు జ్యోత్స్నకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు. నువ్వు పుట్టిన తర్వాత రిచ్ అయ్యావా, లేక పుట్టుకతోనే రిచ్ అయ్యవా? అని అడుగుతాడు. దాంతో జ్యోత్స్న మైండ్ బ్లాక్ అవుతుంది. కార్తీక్ బాబు తెలిసి అన్నాడా.. తెలియక అన్నడా అని సందిగ్ధంలో పడుతుంది. అసలు విషయం తెలిసిపోయిందా? అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే కార్తీక్ బాబు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా గౌతమ్ ను కలుస్తాడు. తన మరదలు జ్యోత్స్న ను పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఈసారి నేను అస్సలు అడ్డుపడనని చెబుతాడు. దాంతో గౌతమ్ తన వెంటనే ఇంటికి వస్తాడు. శివ నారాయణతో పెళ్లి గురించి మాట్లాడుతాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. తను పెళ్లికి సిద్ధంగానే ఉన్నానని గౌతమ్ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 5వ తేదీ 376 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 376 June 5th 2025

జ్యోత్స్న ను పెళ్లి చేసుకుంటానని గౌతమ్ ఇంటికి వచ్చి చెబుతాడు. కార్తీక్ బాబు ప్లాన్ ప్రకారం.. జ్యోత్స్నకు గౌతమ్ రూపంలో మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు. గౌతమ్ వచ్చి మర్యాద పూర్వకంగా శివనారాయణ, దశరథను కలిసి పెళ్లి గురించి మళ్లీ ప్లాన్ చేస్తాడు. అందుకు శివ నారాయణ, దశరథ కూడా సరేనని అనుకుంటూ ఆలోచనలో పడిపోతారు. అయితే గౌతమ్ కు ఇంకా క్లారిటీ ఇవ్వబోరు. కానీ ఈ నెలలో అన్ని మంచి ముహూర్తాలే ఉన్నాయని అనుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజనే కాబట్టి మంచి ముహూర్తం దొరకడం పెద్ద సమస్యేమీ కాదని అనుకుంటారు. పెళ్లికి ఏర్పాట్లు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చర్చించుకుంటారు. మరీ అందరి అభిప్రాయాలను కూడా తీసుకుందామని శివనారాయణ, దశరథ అనుకుంటారు. ఈ క్రమంలో ముందుగా పారుజాతం అభిప్రాయాన్ని అడుగుతారు.

జ్యోత్స్నతో పెళ్లికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మన చుట్టాలను ఎవ్వరినీ పిలవొద్దని చెబుతుంది. ఎందుకంటే దీపా చేసిన పనికి గౌతమ్ ను అందరూ అనుమానిస్తున్నారని, పెళ్లికి అంగీకరించబోరని అంటుంది. దీపా మాటలను నువ్వు కూడా నమ్ముతున్నావా? అని సుమిత్ర పారుజాతాన్ని ప్రశ్నిస్తుంది. నేను కాదు చుట్టాలు అనుకుంటారు కదా అని అంటుంది. ఇక గౌతమ్ తో పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి దీపాతో గౌతమ్ కు కాఫీ ఇప్పించే ప్లాన్ చేస్తుంది పారు. కానీ కార్తీక్ బాబు, దీపా ముందుగానే ప్లాన్ తో ఉండటంతో దీపా కాఫీ తీసుకొచ్చి గౌతమ్ కు ఇవ్వబోతోంది. గౌతమ్ మొహంపై దీపా కాఫీ కొడుతుందని పారు, జ్యోత్స్న ప్లాన్ చేస్తారు. కానీ దీపా మాత్రం వారిద్దరికీ షాక్ ఇస్తుంది. గౌతమ్ కు కాఫీ ఇవ్వడానికంటే ముందు తను ఓ పని చేస్తానని అంటుంది.

కాఫీని ఇవ్వడానికి బదులు ముందుగా గౌతమ్ కు అందరి ముందు క్షమాపణలు చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా పారుజాతానికి, జ్యోత్స్నకు గుండె పగిలి పోతుంది. వాళ్లు అనుకున్న దానికి విరుద్ధంగా జరగడంతో ఆశ్చర్యపోతారు. దీపా చావు దెబ్బ కొట్టిందని అనుకుంటారు. ఇక దీపా కార్తీక్ బాబుతో మాట్లాడుతూ.. అప్పుడు నిశ్చితార్థంలో నీపై చేయి చేసుకున్నందుకు, అందరు ముందు నీ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించు అని అంటుంది. ఎవ్వరో చెప్పిన మాటలు నమ్మి నేను చూసిందే నిజమని నమ్మాను. కానీ నిన్ను అలా అన్నందుకు ఏమనుకోనని అంటుంది. దాంతో గౌతమ్ కూడా షాక్ అవుతాడు. దశరథ, శివ నారాయణ కూడా దీపా మాటలకు ఆశ్చర్యపోతారు. అందరి ముందే అప్పుడు అవమానించాను కాబట్టి.. అందుకే ఇప్పుడు అందరి ముందే క్షమాపణలు చెబుతున్నానని చెబుతాడు.

ఇక శివనారాయణ కూడా దీపా మాటల తర్వాత జ్యోత్స్న పెళ్లికి పూర్తిగా అంగీకరిస్తున్నానని చెబుతున్నాడు. వెంటనే వెళ్లి మీ అమ్మా నాన్నలతో ఈ విషయాన్ని చెప్పమని అంటాడు. దాంతో గౌతమ్ సంతోష పడుతూ ఉంటాడు. త్వరోనే పెళ్లి చేస్తామని, వీలైతే ఎంగేజ్ మెంట్ కాకుండా అదే రోజు పెళ్లి కూడా జరిపించేద్దామని అంటాడు. కానీ జ్యోత్స్న తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేనని అంటుంది. ఎందుకని దశరథ, సుమిత్ర ప్రశ్నించడంతో నేను ప్రయత్నం బిజినెస్ లు చూసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది. రెస్టారెంట్ ప్రాఫిట్ లోకి వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. కానీ శివ నారాయణ మాత్రం ఏం అవసరం లేదని అంటాడు. నువ్వు పెళ్లి చేసుకున్నాకే ఇంకేదైనా చేసుకో.. ఇదే ఫైనల్ అని చెబుతాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతూ లోపలికి వెళ్లిపోతుంది.

ఇక జ్యోత్స్న బంగ్లాపైకి వెళ్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ చావు దెబ్బ కొట్టారని ఎలా బయట పడలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజం తెలిస్తే ఇంట్లో మర్యాద ఉండదని అనుకుంటుంది. అలాగాని గౌతమ్ తో పెళ్లి చేసుకోలేనని జ్యోత్స్న అంటుంది. ప్రస్తుతం కార్తీక్ బాబు, దీపా, గౌతమ్ లతో తనకు ప్రమాదం పొంచి ఉందని ప్రాథమికంగా సమస్యను అంచనా వేస్తుంది. వెంటనే పెళ్లిని ఆపడానికి ప్లాన్ ఆలోచించాలని అంటుంది. ఇక పారు, జ్యోత్స్న పెళ్లిని ఆపే పనిలో నిమగ్నమైపోతారు. ఇక మరోవైపు రాత్రి కావడంతో కార్తీక్ బాబు, దీపా ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతారు. ఈ క్రమంలో దీపా ఇంటికి వెళ్తున్నాం అమ్మా అని సుమిత్రకు చెబుతుంది. కానీ సుమిత్ర మాత్రం నన్ను అమ్మ అని పిలవొద్దని గట్టిగా చెబుతుంది. ఎలాగైనా పిలచే ప్రయత్నం చేయొద్దని, ఎన్నో తప్పులు చేసి మనస్సుకు గాయం చేశామని, ఏదైనా ఉంటే జ్యోత్స్సకు వచ్చి పోయే వివరాలు చెప్పాలని అంటుంది... దాంతో దీపా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X