Karthika deepam 2 June 6th : ఇరుక్కుపోయిన జ్యోత్స్న.. కార్తీక్ బాబు మాస్టర్ ప్లాన్ సక్సెస్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 5వ తేదీ 376వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపా శివనారాయణ ఇంట్లో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పబోరు. ముందుగానే వారు ప్లాన్ లో ఉండటంతో అదే విధంగా నడుచుకుంటూ ఉంటారు. భార్యభర్తలు కార్తీక్ బాబు, దీపా ఒకే మాట మీద ఉంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఏ పని చేయబోరు. ఇక జ్యోత్స్న కార్తీక్ బాబును ముప్పు తిప్పలు పెట్టి దీపాను ఏడిపించాలని ప్రయత్నిస్తుంది. ఏదోక రకంగా అవమానించాలని ప్రయత్నిస్తుంది. కానీ జ్యోత్స్న ఎత్తులేమీ సాగవు. దాసు ముందుగానే జ్యోత్స్న కుట్ర గురించి, ఆమె చేసిన దాడుల గురించి, శివనారాయణ అసలు మనవరాలు దీపానే అనే విషయాన్ని చెప్పడంతో కార్తీక్ బాబు మాస్టర్ గేమ్ ను ప్రారంభిస్తాడు.
ఈ సందర్భంగా ముఖ్యంగా జ్యోత్స్న ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తాడు. జ్యోత్స్న ఇంకెలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, జ్యోత్స్న వల్ల సుమిత్ర, దశరథలకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని ప్రయత్నిస్తాడు. అందు కోసం జ్యోత్స్నకు కంటి మీద కునుకు లేకుండా చేయాలని కార్తీక్ బాబు, దీపా అనుకుంటున్నారు. తమ ముందస్తు ప్లాన్ ప్రకారమే కార్తీక్ బాబు వెళ్లి గౌతమ్ ను కలుస్తాడు. నువ్వు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని ఈసారి నేను అస్సలు అడ్డు పడనని చెబుతాడు. వెంటనే ఇంటికి వచ్చి అడుగుమని సూచిస్తాడు. గౌతమ్ కూడా వచ్చి శివనారాయణ, దశరథలను పెళ్లి గురించి అడుగుతాడు. వారు ఒప్పుకుంటారు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 6వ తేదీ 377 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా, కార్తీక్ బాబు పని ముగించుకొని వెళ్లేప్పుడు సుమిత్రమ్మకు చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో సుమిత్ర మండి పడుతుంది. నిన్ను చూడాలంటెనే నాకు ఏదోలా ఉందని, నీతో మాట్లాడమే నాకు నచ్చడం లేదని ఫైర్ అవుతుంది. అందుకే నాకు ఎదురు పడొద్దని అన్నానని అంటుంది. ఏదైనా ఉంటే నిన్ను పనిలో పెట్టుకున్న జ్యోత్స్నకు చెప్పి వెళ్లు అని చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ దీపాను మీరు దూరం పెట్టేంత తప్పు ఏం చేసిందని సుమిత్రను అడుగుతుంది. దాంతో సుమిత్ర మరింతగా రగిలిపోతుంది. ఎన్నో తప్పులు చేసిన దీపాతో మాట్లాడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంది. నా కూతురు జ్యోత్స్న విషయంలో ఎంతో కుట్ర పన్నిందీ దీపా. అప్పుడు గౌతమ్ కాలర్ పట్టుకుంది. ఇప్పుడు దండం పెట్టి క్షమాపణలు చెప్పింది. ఇందంతా కుట్రపూరితంగా నటిస్తున్నది కాదా అని అడుగుతుంది.
అసలు నాటకం ఆడాల్సిన అవసరం ఏముందని కార్తీక్ బాబు మళ్లీ సుమిత్రను అడుగుతాడు. దాంతో సుమిత్ర స్పందిస్తూ.. అవసరం జ్యోత్స్న తో నీకు అవసరం ఉండటం వల్లే ఇలా నటిస్తున్నావని అంటుంది. అది నాటకమని ఎందుకు అనుకుంటున్నావని కార్తీక్ బాబు అంటాడు. దీపా మనస్సులో ఏమీ లేదని, నిజం తెలిసిన రోజు మీకే అంత అర్థం అవుతుందని కార్తీక్ బాబు సుమిత్రతో అంటాడు. దీపా మారి మంచిగా ఉంటే మాత్రం సరే లేదంటే నువ్వు బెదిరించడం కోసం గన్ పట్టుకున్నావేమో గానీ నేను మాత్రం నిజంగానే గన్ పట్టుకుంటానని సుమిత్ర దీపాను హెచ్చరిస్తుంది. నీకు నాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని, నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నేను నీ ప్రాణాలు కాపాడను. సాయానికి సాయం తీరిందని అంటుంది. ఇకపై నా కంట పడకని, నా కూతురు జ్యోత్స్న జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీసేస్తానని, నీకు నీ కూతురు ఎలానో నాకు నా కూతురు జ్యోత్స్న కూడా అలానే అని చెబుతుంది. ఇకపై నీ నాటకాలు సాగనివ్వనని హెచ్చరిస్తుంది.
ఇక దీపా సుమిత్ర అన్న మాటలను తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. సుమిత్ర మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో కార్తీక్ బాబు దీపాను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. సుమిత్ర నీకు సొంత తల్లి అని తెలిసిన తర్వాత నిన్ను ఇన్ని మాటలు అంటుంటే నువ్వు బాధపడటం సహజమే. నీ బాధను నేను అర్థం చేసుకోగలను అని కార్తీక్ బాబు అంటాడు. ఇక దీపా గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇక తను సుమిత్ర అమ్మ అన్న మాటలకు ఏడ్వటం లేదని కార్తీక్ బాబుకు చెబుతుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావని కార్తీక్ బాబు అంటాడు. దాంతో దీపా స్పందిస్తూ నేను ఏడుస్తున్నది కేవలం జ్యోత్స్న ను త తలుచుకొని మాత్రమే అని అంటుంది. జ్యోత్స్న గౌతమ్ లాంటి చెడ్డవాడిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడం లేదని చెబుతుంది. గౌతమ్ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు జ్యోత్స్న నో చెప్పింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ ఒప్పుకుంటే తన గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని భయపడుతుంది.
అలాగే తనకు చిన్నప్పటి నుంచి తనకు తల్లి లేకపోవడంతో నా సొంత తల్లి సుమిత్ర దగ్గర పెరుగుతోంది. ఇక సుమిత్ర అమ్మ జ్యోత్స్నకు సొంత తల్లి కాదని తెలిసిన వెంటనే అదే స్థానంలో ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలోనే తప్పుల మీద తప్పులు చేస్తోందని దీపా అంటుంది. జ్యోత్స్న గురించి నిజాలు తెలిసిన రోజు సుమిత్ర, దశరథ, తాత శివనాయణ ఎంతో బాధపడుతారని, ఇన్ని మోసాలను చూసి వారి తట్టుకోగలరా అని బాధపడుతూ ఉంటుంది. కానీ కార్తీక్ బాబుదీపాను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. మున్ముందు అంతా మంచే జరుగుతుందని, మనం జ్యోత్స్నకు ఎదురు దెబ్బ కొడతామని, తప్పకుండా జ్యోత్స్నకు బుద్ధి చెబుతామని అంటాడు. అంతే కాదు. జ్యోత్స్నను మంచిగా మార్చుకోవాలని, అది మన బాధ్యత అని దీపా అంటుంది. అందుకు కార్తీక్ బాబు సరే అని అంటాడు. కానీ జ్యోత్స్న మీద జాలి చూపించకు అని దీపాకు సూచిస్తాడు. నాకేం జాలి లేదు.. తప్పు ఎవ్వరూ చేసినా బుద్ధి చెప్పాల్సిందే అని అంటుంది.
ఇక మరోవైపు పారుజాతం దశరథ దగ్గరకు వెళ్తుంది. తన కొడుకు దాసు ఇంట్లో లేడని, కనిపించకుండా పోయాడని చెబుతుంది. నాకోసం ఎవ్వరూ వెతకొద్దు నేనే తిరిగి వస్తానని చిట్టిపై రాసి వెళ్లిపోయాడని అంటుంది. అసలు దాసులేడనే విషయం నీకెలా తెలుసు అని దశరథ పారును అడుగుతాడు. మొన్న జ్యోత్స్న నేను వెళ్లామని చెబుతుంది. జ్యోత్స్న అక్కడికి ఎందుకు వెళ్లిందని దశరథ కంగారు పడుతాడు. ఇంకెవ్వరికీ ఈ విషయాన్ని చెప్పకని దశరథ పారుతో అంటాడు. ఇక ఈ విషయాన్ని మొత్తం కార్తీక్ బాబు వింటాడు. పారుకు కార్తీక్ బాబును చూసి అదీ సంగతని చెప్పి వెళ్లిపోతుంది. ఇక దశరథ దగ్గరకు వెళ్లి జ్యోత్స్న పేరు చెప్పగానే ఎందుకు కంగారు పడుతున్నావని కార్తీక్ బాబు అడుగుతాడు. అందుకు దశరథ అసలు విషయం చెబుతాడు. జ్యోత్స్న దాసును చంపాలనుకుంది. నేను నా కళ్లారా చూశాను. కానీ ఎందుకు చంపాలనుకున్నదనే విషయం తెలియదు. అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నానని చెబుతాడు. ఇక కార్తీక్ బాబుకు అప్పటికే నిజం తెలిసినా తెలియనట్టుగా దశరథ చెప్పింది వింటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది


Click it and Unblock the Notifications










