Karthika deepam 2 June 7th : దశరథకు నిజం చెప్పిన కార్తీక్ బాబు.. జ్యోత్స్న మొదలైన గండం
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 6వ తేదీ 377వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా, కార్తీక్ బాబు ఒకే మాట మీద ఉంటున్నారు. తమ గురించి, తమ ప్లాన్ గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు పరిస్థితి తమకు సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు మాస్టర్ ప్లాన్ వేస్తూ జ్యోత్స్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కార్తీక్ బాబు జ్యోత్స్నకు ఊహించని షాక్ ఇచ్చాడు. తను నడిచిన దారిలోనే కార్తీక్ బాబు కూడా వెళ్లి అదే తరహాలో దెబ్బ కొట్టాలని అనుకుంటాడు. ఏ గౌతమ్ తోనైతే జ్యోత్స్న ఆట మొదలు పెట్టింది. అదే గౌతమ్ తో కార్తీక్ బాబు కొత్త గేమ్ ను ప్రారంభించాడు.
కార్తీక్ బాబు గౌతమ్ ను కలిసి జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. అందుకు గౌతమ్ శివ నారాయణ ఇంటికి అడుగుతాడు. దాంతో ఇంట్లో వాళ్లు కూడా గౌతమ్ జ్యోత్స్న కు సంబంధించిన పెళ్లికి ఓకే అని అంటారు. అయితే జ్యోత్స్న పెళ్లిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దాంతో కార్తీక్ బాబు జ్యోత్స్న పైనే ఓ కన్నేసి ఉంటాడు. ఇదే క్రమంలో దాసు కనిపించకపోవడంతో పారు జాతం టెన్షన్ పడుతుంది. దశరథను వెతకమని అడుగుతుంది. మరోవైపు దాసును చంపాలని చూసింది జ్యోత్స్ననే అని దశరథ కార్తీక్ బాబుతో చెబుతాడు. అప్పటికే కార్తీక్ బబుకు ఆ విషయం తెలిసి ఉండటంతో నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 7వ తేదీ 378 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దాసుకు ఏం జరిగిందో అని దశరథ టెన్షన్ పడుతూ ఉంటాడు. కార్తీక్ బాబుకు దశరథను కర్రతో తలపై కొట్టింది జ్యోత్స్ననే అని దశరథ కార్తీక్ బాబుకు చెబుతాడు అంతే కాదు.. చంపాలని కూడా ప్రయత్నించిందని చెబుతాడు. కానీ ఎందుకు జ్యోత్స్న దాసును చంపాలనుకుంది అనేది అంతు చిక్కడం లేదని అంటాడు. ఈ విషయం నా ఒక్కడికి మాత్రమే తెలుసని, ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, కనీసం సుమిత్రకు కూడా చెప్పలేదని అంటాడు. కానీ ఈ విషయం నాకు తెలుసనే సంగతి ఎవరికొ ఒక్కరి తెలియాలి కదా.. నాకు ఏమౌతుందో తెలియకుందని, నాకు శత్రువులు ఉన్నారని , అందుకు ఈ విషయం నీకు చెబుతున్నానని అంటాడు. నాకు చెప్పావు కదా మామ ఇక నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు అని కార్తీక్ బాబు దశరథతో అంటాడు.
అయినా దశరథ టెన్షన్ పడుతూనే ఉంటాడు. ముఖ్యంగా దాసు ఎక్కడ ఉన్నాడో నాకు త్వరగా తెలియాలని, వీలైనంత త్వరగా దాసును కనుగొనాలని దశరథ కార్తీక్ బాబు తో అంటాడు. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ నీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదని, దాసు జాగ్రత్తగానే ఉన్నాడని, నేను చెప్పే వరకు నువ్వు దాసు గురించి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని కార్తీక్ బాబు చెబుతాడు. దాంతో దశరథ కూడా సరేనని వెళ్లిపోతాడు. ఇక దశరథ పడుతున్న టెన్షన్ చూసి కార్తీక్ బాబుకు జ్యోత్స్నపై కోపం పెరుగుతుంది. జ్యోత్స్న వల్ల దశరథ మామ ఎంతగానో టెన్షన్ పడుతున్నాడని ఆలోచిస్తాడు. త్వరలోనే జ్యోత్స్న ఆటలకు చెక్ పెట్టాలని మనస్సులో అనుకుంటాడు.
ఇక జ్యోత్స్స మరోవైపు దీపాను టెన్షన్ పెట్టే పని చేస్తుంది. దీపా, కార్తీక్ బాబు ఇంట్లో లేకపోవడంతో శౌర్య పాప కంగారు పడుతుంది. అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారని కాంచన, అనసూయను అడుగుతుంది. ముందుగా అనసూయను శౌర్య కార్తీక్ బాబు దగ్గరకు తీసుకెళ్లు అని ఇబ్బంది పెడుతుంది. ఇక కాంచన శౌర్య అల్లరిని తట్టుకోలేక మొదటగా దీపాకు ఫోన్ చేస్తుంది. సడెన్ గా కాంచన నుంచి ఫోన్ రావడంతో శౌర్యనే అనుకొని మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే మధ్యలోనే జ్యోత్స్న వచ్చి ఫోన్ లాగేసుకుంటుంది. పనివేళలలో ఫోన్ మాట్లాడకూడదని దీపా మనస్సును బాధపెడుతుంది. మరోవైపు శౌర్య పాప కార్తీక్ బాబుకు ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్ బాబు శివ నారాయణ దగ్గరకి వెళ్తున్న సమయంలో ఫోన్ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు.
ఈ టైంలో ఎందుకు కాల్ చేశావ్ శౌర్య పాప అని అడుగుతాడు. నన్ను ఎందుకు వదిలేసి వెళ్లారని, దీపా జ్యో వాళ్ల ఇంట్లోనే ఉందా? అని శౌర్య అడుగుతుంది. ఆ విషయం నీకెవ్వరు చెప్పారని కార్తీక్ బాబు అడుగుతాడు. దీపాకు కాల్ చేస్తే జ్యో వాయిస్ వినపడిందని అంటాడు. ఇక కార్తీక్ బాబు మాట్లాడుతూ మేం వేరే పనిలో ఉన్నాం ఇప్పుడు రావడం కుదరదు అని చెబుతాడు. కానీ కార్తీక్ బాబు మాటలు విన్న శివ నారాయణ.. పిల్లలు ఉన్నారు సెలవు కావాలి అని అడగొచ్చు కాదు.. కావాలంటే సెలవు తీసుకోమని కార్తీక్ బాబుతో శివనారాయణ అంటాడు. మండిపోయిన శివ నారాయణ.. రౌడీని, కాంచనను, అనసూయనే ఆ ఇంటికి రమ్మని చెబుతాడు. నేను ఇక్కడ ఉన్నాను మీరు ధైర్యంగా చెబుతాడు. దాంతో వాళ్లు వచ్చేందుకు రెడీ అవుతారు. కానీ శివ నారాయణ కార్తీక్ బాబు మాటలు విని కోపం తెచ్చుకుంటాడు. నీ సొంత ఇల్లు అయినట్టు ఎవరిని రమ్మంటున్నావ్ అని అడుగుతాడు. మన వాళ్లనే అని చెబుతాడు. అయినే నా వాళ్లు ఉంటారు.. లేదంటే నీ వాళ్లు ఇంటారు. అంతేగానీ మనవాళ్లు అంటూ ఉండని చెబుతాడు.
ఇక మరోవైపు దీపా శివనారాయణకు కాఫీ ఇవ్వడానికి కప్పు పట్టుకొని వెళ్తుంటుంది. అదే సమయంలో దశరథ మెట్లు దిగుతూ ఉంటాడు. అదే సమయంలో మెట్లపై కాలు జారి కిందపడబోతుంటాడు. దాంతో దీపా వెంటనే దశరథను నాన్న, నాన్న అని పిలుస్తూ పట్టుకుంటుంది. అయితే దీపా దశరథను నాన్న అని పిలవడాన్ని జ్యోత్స్న, పారుజాతం వింటారు. ఇక జ్యోత్స్న రగిలిపోతుంది. మా నాన్నను ఏమని పిలిచావ్ అని దీపాను నిలస్తుంది. నా తండ్రిని పట్టుకొని పనివాళ్లు నాన్న అని పిలవకూడదని అంటుంది. అలా పిలిచే హక్కు నీకు లేదని దీపాతో అంటుంది. చెంప పగలగొట్టేందుకు చేయి లేపుతుంది. ఇక కార్తీక్ బాబు వచ్చి జ్యోత్స్న చేయిని పట్టుకుంటాడు. అంతలోనే శివనారాయణ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. అందుకు కార్తీక్ బాబు జరిగిన విషయం చెబుతాడు. జ్యోత్స్న అనవసరంగా ఫైర్ అవుతోందని కార్తీక్ బాబు మండిపడుతాడు. అసలు విషయం చెబుదామా? అని మనస్సులో అనుకుంటాడు. కానీ ఇది సమయం కాదని ఊరుకుంటాడు. ఇక జ్యోత్స్నదే తప్పు అని సాయం చేసినందుకు ఇలా ప్రవర్తించడం ఏంటనీ సీన్ మొత్తం జ్యోత్స్న వైపు తిప్పుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











