Karthika deepam 2 June 9th : శివనారాయణకు షాకిచ్చిన కార్తీక్ బాబు.. దెబ్బకు సీన్ రివర్స్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 7వ తేదీ 378వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దాసు ఇంట్లో నుంచి వెళ్లిన సంగతి తెలుసుకున్న జ్యోత్స్న ఫుల్ షాక్ లో ఉంటుంది. గతం గుర్తుకు వచ్చి వెళ్లిపోయాడా? లేకా మతిస్థిమితం లేకుండానే వెళ్లిపోయాడా? అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలోగా కార్తీక్ బాబు గౌతమ్ తో మరో షాక్ తగిలేలా చేస్తాడు. గౌతమ్ ను ఇంటికి పిలిచిపించి మరీ జ్యోత్స్నను పెళ్లి చేసుకునేలా మాట్లాడిస్తాడు. దాంతో జ్యోత్స్నకు ఎటు దారిలేకుండా పోతుంది. తన గురించి ఇంట్లో వాళ్లకు తెలిస్తే చాలా ప్రమాదమే అని గ్రహిస్తుంది. ఇక దెబ్బకు సైలెంట్ గా అయిపోతుంది. ఏం చేయాలో తోచక పరిస్థితి ఎలా నడిస్తే అలా ముందుకు వెళ్తుంది.

ఇక పారుజాతం దాసు కనిపించకపోవడంతో ఆ విషయాన్ని దశరథకు చెబుతాడు. దశరథ జ్యోత్స్న వల్లనే దాసు వెళ్లిపోయి ఉంటాడని అనుమానిస్తాడు. ఇక జ్యోత్స్న దాసును చంపాలనుకున్న విషయాన్ని కార్తీక్ బాబు కు చెబుతాడు. కానీ ఎందుకు అనే విషయం తెలియడం లేదని అంటాడు. కానీ అప్పటికే జ్యోత్స్న ఎందుకు దాసును చంపాలనుకున్నదో పూర్తిగా వివరాలు తెలిసిన కార్తీక్ బాబు మౌనంగా ఉండిపోతాడు. దాసుకు ఏం కాదని హామీనిస్తాడు. ఇక మరోవైపు శివనారాయణతో కార్తీక్ బాబుకు కాస్తా వాగ్వాదం అవుతుంది. శౌర్య పాప కార్తీక్ బాబు, దీపాను చూడాలని ఫోన్లు చేస్తూ ఉంటే.. ఒక నేరుగా శివనారాయణ ఇంటికే రండి అని పిలుస్తాడు. వాళ్ళని పిలవడానికి నీ సొంత ఇల్లు కాదిది అని శివనారాయణ కార్తీక్ బాబు ను అంటాడు. అయినా కార్తీక్ బాబు వాళ్లను ధైర్యంగా రమ్మని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 9వ తేదీ 379 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 379 June 9th 2025

దశరథం మెట్లు దిగుతూ కాలు జారి పడిపోబోతాడు. దాంతో పక్కనే ఉన్న దీపా పట్టుకుంటుంది. ఆ కంగారులోనే తన తండ్రి దశరథ అని అప్పటికే తెలిసిన దీపా నాన్న నాన్న అంటూ అరుస్తుంది. ఆ మాటలను విని జ్యోత్స్న నానా రచ్చ చేస్తుంది. తన తండ్రిని పట్టుకొని నువ్వేందుకు నాన్న అని పిలుస్తున్నావని దీపాపై జ్యోత్స్న మండిపడుతుంది. నువ్వు అలా పిలవడానికి వీల్లేదని అంటుంది. ఇంకోసారి అలా పిలస్తే బాగుండదని హెచ్చిరిస్తుంది. అప్పటికే చేయి చేసుకోబోతుంది. దాంతో కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇక జ్యోత్స్న చేస్తున్న రచ్చను అడ్డుకుంటాడు. అయినా జ్యోత్స్న ఏమాత్రం తగ్గదు. అస్సలు తన తండ్రిని దీపా నాన్న అని పిలవొద్దని అంటుంది. అది ముమ్మాటికీ తప్పే అని వాదిస్తుంది. కానీ కార్తీక్ బాబు జోక్యం చేసుకొని దీపా చేసిందంటే తప్పేంటని, తండ్రి వయస్సున్న వారిని నాన్న అని పిలవడం ఎలా తప్పు అవుతుందని అడుగుతాడు. అందుకు జ్యోత్స్న స్పందిస్తూ కంటేనే తల్లి, పెంచితేనే తండ్రిని అంటుంది.

ఆ మాటతో కార్తీక్ బాబు రగిలిపోతాడు. జ్యోత్స్న మాటలకు కోపాన్ని ఆపుకోలేకపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావని అంటాడు. అప్పటికే జ్యోత్స్న అసలు కూతురు కాదని, దీపానే దశరథ, సుమిత్రల కూతురు అని తెలిసిన కార్తీక్ నిజం చెప్పబోతాడు. కంటేనే కూతురు, పెంచితేనే తండ్రి అని అన్నావ్ కదా అని మరీ దీపానే అసలు.. అంటూ చెప్పబోయి ఆగుతాడు. ఏరా పూర్తిగా చెప్పమని పారుజాతం శివనారాయణ అంటారు. కానీ తొందరపడి నిజం చెప్పకుండా ఆగిపోతాడు కార్తీక్ బాబు. ఇక మాట మార్చుకొని దీపా కూడా మీ మనవరాలి వయస్సే కదా, అలాగే దశరథను తండ్రి అని పిలిచినా తప్పు లేదు కదా అని అంటాడు. అసలు దశరథ కింద పడబోయి ఉంటే.. అదే స్థానంలో సుమిత్ర అత్త ఉండి పట్టుకొని నువ్వేందుకు కాపాడవని అడిగితే నువ్వు ఏం చేస్తావని అడుగుతాడు సుమిత్రను. దాంతో చెంప పగలగొడుతానని చెబుతుంది. మరీ దీపా చెంప పగల గొట్టమని అంటాడు కార్తీక్ బాబు. దీంతో జ్యోత్స్న అనుకున్న దానికంటే సీన్ రివర్స్ అవుతుంది.

జ్యోత్స్న చెంప పగిలిపోయేలా కొట్టు అత్త అని కార్తీక్ బాబు అంటాడు. జ్యోత్స్న కూడా భయపడుతుంది. ఇక శివనారాయణపైన కూడా కార్తీక్ బాబు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అసలు ఈ ఇంట్లో న్యాయం ఉందా? లేదా? పెద్దరికంపైనే ఈ ఇల్లు నడుస్తుందా? లేదా అని ప్రశ్నిస్తాడు. ఎంత సేపు దీపా నాన్న అని పిలిచిన దానికే విమర్శిస్తున్నారు కానీ, ఎందుకని దీపా చేసిన సాయాన్ని చూడటం లేదని అంటాడు. దీపా చేసిన సాయానికి అభినందించక పోగా, నిందలు వేయడం సరైనది కాదని అంటాడు. అందుకు జ్యోత్స్న దీపాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు. కానీ అందుకు జ్యోత్స్న ఒప్పుకోదు. ఇక న్యాయమేంటో శివనారాయణే చెప్పాలని కార్తీక్ బాబు శివ నారాయణపైనే భారం వేస్తాడు. శివనారాయణ స్పందిస్తూ దీపా నాన్న అని పిలవడం తప్పైనా, చేసింది మంచి కాబట్టి అభినందిస్తున్నాను అంటాడు. మరోవైపు జ్యోత్స్న క్షమాపణలు చెప్పాలని అంటాడు. దీపా వద్దని చెప్పినా కార్తీక్ బాబు దగ్గరుండి మరీ క్షమాపణలు చెప్పిస్తాడు.

దీని తర్వాత ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు. కిందపడి పగిలిపోయిన కాఫీ కప్పు ముక్కలును దీపా, కార్తీక్ బాబు ఏరుతూ ఉంటారు. ఈ కాఫీ కప్పులాగే ఈ కుటుంబం చిన్నాభిన్నం అయ్యిందని, మనమే దగ్గర చేయాలని దీపాతో అంటాడు. దీపా కూడా సరేనని చెబుతుంది. ఇక మరోవైపు కాంచన, శౌర్య పాప, అనసూయ శివనారాయణ ఇంటికి వస్తారు. అసలే తమ ఇంటికి రావొద్దని శివనారాయణ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ కాంచన, శౌర్య పాప, అనసూయ రావడంతో అందరూ కంగారు పడుతారు. ఇక శౌర్య పాప దశరథను, శివనారాయణను, సుమిత్రలను పలకరిస్తుంది. శివ నారాయణ కూడా శౌర్యతో ప్రేమగా మాట్లాడుతాడు. పెద్దలపై ఉన్న కోసం పిల్లలపై చూపించడం సరికాదని అంటాడు. సుమిత్ర కూడా శౌర్య పాపను దగ్గర చేస్తుంది. ఇదంతా చూసిన జ్యోత్స్న, పారులకు ఒళ్లు మండిపోతుంది. ఇక తనకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని పారుజాతంతో అంటుంది. పారుజాతం ఎందుకని అడిగినా బదులివ్వదు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X