Karthika deepam 2 June 10th : జ్యోత్స్న కు దిమ్మతిరిగే కౌంటర్.. దీపా దెబ్బకు షాక్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 7వ తేదీ 379వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దశరథను దీపా నాన్న అని పిలిచినందుకు జ్యోత్స్న రగిలిపోతుంది. తన తండ్రిని ఎవ్వరూ నాన్న అని పిలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. కంటేనే తల్లి, పెంచితే నాన్న అని గుర్తు పెట్టుకోవాలని అంటుంది. జ్యోత్స్న మాటలతో బాలుకు తీవ్రంగా కోపం వస్తుంది. వెంటనే జ్యోత్స్న అసలు కూతురు కాదని, దీపానే అసలు కూతురు అని, తన తండ్రిని తను నాన్న అని పిలిస్తే తప్పేంటని గట్టిగా అరిచి చెప్పాలనుకుంటాడు. కానీ సమయం కాదని సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక దీపా చేసింది తప్పేమీ కాదని సమర్దిస్తూ వస్తాడు. సాయం చేస్తే నిందిస్తారా? ఇదేనా న్యాయం అంటూ శివ నారాయణను ప్రశ్నిస్తాడు. అందుకు శివనారాయణ కూడా ఆలోచనలో పడిపోతాడు.
దీపా దశరథను నాన్న అని పిలవడం తప్పే అయినా.. తను చేసిన సాయం మంచిది కాబట్టి అభినందిస్తామంటాడు. అలాగే దీపాపై చేయి ఎత్తిన జ్యోత్స్న వెంటనే క్షమాపణలు చెప్పాలని అంటాడు శివనారాయణ. దీంతో తర్వాత ఆ ఇంటికి కాంచన, శౌర్య, అనసూయ వస్తారు. శౌర్య పాప ఇంట్లో వాళ్లందరినీ పలకరిస్తూ ముందుగా దశరథను తాత అంటూ పలకరిస్తుంది. దశరథ కూడా పాపతో ప్రేమగా మాట్లాడుతాడు. అటు శివనారాయణ కూడా రాగానే శౌర్య పలకరిస్తుంది. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మరోవైపు సుమిత్ర కూడా ప్రేమగా చిన్నారిని దగ్గర చేస్తుంది. ఇదంత చూసిన పారు, జ్యోత్స్నలకు తల తిరిగిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 10వ తేదీ 380 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న, పారులకు కార్తీక్ బాబు, దీపా చుక్కులు చూపిస్తూ ఉంటారు. తమ ప్రతి మూవ్ మెంట్ తో వారిద్దరికి భయం పుట్టిస్తూ ఉంటారు. కార్తీక్ బాబు శౌర్య పాపను నేరుగా ఇంటికే రమ్మని చెప్పటంతో అందరూ ఇంటికి వస్తారు. శౌర్య పాపను మాత్రం శివ నారాయణ, సుమిత్ర, దశరథ దగ్గర చేస్తారు. అయితే శౌర్య పాపకు సుమిత్ర మంచి డ్రెస్ ఇస్తుంది. అది కూడా జ్యోత్స్న చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్ కావడం విశేషం. జ్యో చిన్నప్పటి డ్రెస్ తనకు ఇచ్చినందుకు శౌర్య పాప చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే జ్యోత్స్న కోసం చిన్నప్పుడు కొన్న బొమ్మలు, టెడ్డీ బేర్, బట్టలు, టాయ్స్ అన్నీ శౌర్యకు ఇస్తుంది. శౌర్య పాప ఆనందం వ్యక్తం చేస్తుంది. జ్యోకు చిన్నప్పుడు కొనిచ్చిన టాయ్ గన్ ను తీసుకుంటుంది. ఆ గన్ తో ఆడుకుంటూ ఉంటుంది.
మరోవైపు అనసూయతో పారుజాతం గొడవ పడుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులు, కిచెన్ లోని సామాగ్రిని అనసూయ పరిశీలిస్తుంటే పారుజాతం వచ్చి సూటిపోటు మాటలు మాట్లాడుతుంది. ఏం ఎత్తుకెళ్దామని చూస్తున్నావని అంటుంది. అందుకు అనసూయ స్పందిస్తూ నోట్ల కట్టల కోసం చూస్తున్నానని ఎటకారంగా బదులిస్తుంది. అయినా మీది ఎత్తుకుపోయే బుద్ధే కదా అని పారుజాతం అంటుంది. దాంతో అనసూయ పారుపై మండిపడుతుంది. ఇష్టమొచ్చినట్టు తిడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. మరి నన్ను తిట్టినప్పుడు నాకు ఎలా ఉంటుందని అనసూయతో పారుజాతం అంటూ నోరు జారుతుంది. నేను నిన్ను ఎప్పుడూ తిట్టానని అడుగుతుంది. దాంతో పారు నోరు కరుచుకుంటుంది. చెత్త ఏరుకునే గెటప్ వేసింది పారునే అని సంగతి ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడుతుంది. బయటికి మాత్రం గంభీరంగా మాట్లాడుతుంది.
కానీ అనసూయ పారుజాతం ఆ చెత్త ఏరుకునే గెటప్ లో వచ్చిందని గుర్తు పడుతుంది. అది నువ్వే కదా అని అడుగుతుంది. అందుకు పారుజాతం నాకు చెత్త ఏరుకునే కర్మ ఏం పట్టిందని అంటుంది. అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక పారు, జ్యోత్స్న ఇద్దరూ తన గదిలో కూర్చుంటారు. దీపా హాలు ఊడుస్తూ ఉంటుంది. అదే సమయంలో శౌర్య పాప దీపా, కార్తీక్ బాబులను వెతుక్కుంటూ ఆ గదిలోకి వస్తుంది. వస్తూ వస్తూనే తన చేతిలో ఉన్న బొమ్మ తుపాకీతో జ్యోత్స్న నుదిటిన పేల్చుతుంది. ఆ డమ్మీ బుల్లెట్ వచ్చి అతుక్కుంటుంది. దాంతో జ్యోత్స్న చిర్రెత్తిపోతుంది. అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? అని మండిపడుతుంది. ఇంటికి వచ్చిన దానివి ఏదో మూలన పడి ఉండక ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉన్నావని చిరాకు పడుతుంది. అదే సమయంలో జ్యోత్స్న శౌర్య వేసుకున్న డ్రెస్ చూసి షాక్ అవుతుంది.
ఈ డ్రెస్ నీకు ఎవ్వరు ఇచ్చారని శౌర్యను అడుగుతుంది. అమ్మమ్మ ఇచ్చిందని చెబుతుంది. ఆ డ్రెస్ ఎవరిదో నీకు తెలుసా అని జ్యోత్స్న అడుగుతుంది. తెలుసు, నీదే జ్యో అని బదులిస్తుంది. మరీ నా డ్రెస్ నువ్వేందుకు వేసుకున్నావని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నువ్వు వేసుకోలేవుగా అని శౌర్య అనడంతో కోపంతో రగలిపోతుంది. శౌర్యపై చేయి ఎత్తుతుంది. దాంతో పక్కనే ఉన్న దీపా అడ్డుకుంటుంది. తన కూతురిపై చేయి వేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తుంది. ఇక ఈ విషయాన్ని ఎక్కడ తేల్చాలో అక్కడే తెలుస్తానని జ్యోత్స్న శౌర్యను తీసుకొని సుమిత్ర, దశరథల గదిలోకి వెళ్తుంది. అసలు నా డ్రెస్ శౌర్యకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తుంది. చిన్నపాపే కదా అని ఇచ్చామని బదులిస్తారు. అయినా అలా ఎలా ఇస్తారని మండిపడుతుంది. ఇంత చిన్న దానికి ఎందుకు అంత పెద్ద గొడవ చేస్తున్నావని దశరథ జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు.
ఇది మీకు చిన్న విషయమా.. నా చిన్నప్పటి గుర్తులను వేరొకరికి ఇచ్చేయడం మీకు చిన్న విషయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది. నా గుర్తుగా మీ దగ్గర భద్రంగా దాచి పెట్టుకున్న దుస్తువులు, ఆట బొమ్మలు, వస్తువులు మీరు ఇంకొక్కరికి ఇవ్వడానికి మనసు ఎలా ఒప్పిందని అంటుంది. మీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి. రోడ్డున పోయేవారు ఎవరూ నా దుస్తువులు, ఆట వస్తువులు తీసుకున్న కూడా బాధపడేదాన్ని కాదు కానీ నన్ను చంపాలని చూసిన దీపా కూతురుకు ఇవ్వడం నాకు నచ్చలేదని చెబుతుంది. అందుకే మీ దగ్గర ఉన్న నా చిన్నప్పటి వస్తువులు, ఆట బోమ్మలు అన్నీ చెత్త కుప్పలో పడేయండి అని అంటుంది. సుమిత్ర, దశరథ అడ్డుకున్నా వినదు. అన్నీ వస్తువులు కింద పడేస్తుంది. ఇక కార్తీక్ బాబు ఆ వస్తువలన్నీ తమ ఇంటికి తీసుకెళ్లి భద్రంగా ఉంచుకుంటామని, ఆమె వద్దు అనుకుంటుంది, మేము కావాలి అనుకుంటున్నామని సుమిత్ర మనస్సుకు దగ్గరయ్యేలా మాట్లాడుతాడు కార్తీక్ బాబు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











