Karthika deepam 2 June 11th : జ్యోత్స్నను ఫూల్ చేసిన కార్తీక్ బాబు.. వంటలక్క జీవితానికి పసిడి బాటలు

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 10వ తేదీ 380వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబును ముప్పు తిప్పలు పెడుదామని ప్లాన్ వేసిన జ్యోత్స్నకే దెబ్బ మీద దెబ్బ పడుతోంది. శివనారాయణ, దశరథ, సుమిత్రలకు దగ్గర అవుదామనే ప్లాన్ తో ఆ ఇంటిలో దిగిన కార్తీక్ బాబు, దీపా తమ ప్లాన్ ను చాలా జాగ్రత్తగా అమలు పరుస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా జ్యోత్స్న కుట్ర పూరితమైన ప్రమాదాలను నుంచి తప్పించేందుకు, జ్యోత్స్న వల్ల ఏర్పడే ముప్పును అడ్డుకునేందుకు కార్తీక్ బాబు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. జ్యోత్స్న ఎంత రెచ్చ గొడుతున్న కార్తీక్ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటున్నారు. దీపానే దశరథ, సుమిత్రల అసలు కూతురు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మంచి సమయం చూసి చెప్పేందుకు ఓపిగ్గా వేచి ఉంటున్నాడు. అయితే, రీసెంట్ ఎపిసోడ్ లో జ్యోత్స్న నానా రచ్చ చేస్తుంది. శౌర్య పాపకు సుమిత్ర జ్యోత్స్న చిన్నప్పటి బట్టలు ఇస్తుంది.

ఆ బట్టల్లో శౌర్య పాప జ్యోత్స్నకు కనిపిస్తుంది.అది చూసిన జ్యోత్స్న తట్టుకోలేక పోతుంది. తన చిన్నప్పటి బట్టలను ఎలా దీపా కూతురు శౌర్యకు ఇస్తారని పెద్ద గొడవ చేస్తుంది. ఇంకెవ్వరికి ఇచ్చినా కూడా సంతోషించేదాన్ని కానీ తనను చంపాలని ప్రయత్నించిన దీపా కూతురుకే ఆ బట్టలను ఎలా ఇస్తారని దశరథ, సుమిత్రలను ప్రశ్నిస్తుంది. అంటే నా గుర్తులు మీకు అవసరం లేదు కాబట్టి, నా చిన్నప్పటి బట్టలు, ఆట వస్తువులు ఏమీ మీ దగ్గర ఉండటానికి వీల్లేదని,అన్నికింద పడేస్తుంది. వాటిని చెత్తకుప్పలో పడేయమని అంటుంది. కానీ కార్తీక్ బాబు ఆ వస్తువుల, ఆట బొమ్మలను తన ఇంటిలో భద్రపరుస్తానని సుమిత్రతో అంటాడు. ఒక వేళ నీ కూతురు బట్టలను నీ మనవరాలికి ఇవ్వాలని అనుకుంటే అది జరిగిపోయిందని అంటాడు. ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 11వ తేదీ 381 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 381 June 11th 2025

కార్తీక్ బాబుకు దీపానే శివనారాయాణ అసలు మనవరాలు అని తెలిసిన తర్వాత మాస్టర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. దీపానే దశరథ, సుమిత్రల సొంత కూతురు అని తెలుసుకున్న కార్తీక్ బాబు ఆ ఇంటికి దీపాను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను, నిందలను భరిస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా తాత శివ నారాయణ ఇంటికి తన కూతురు శౌర్య పాపను పిలిపిస్తాడు. అలాగే కాంచన, అనసూయలు కూడా వస్తారు. అయితే శౌర్యకు జ్యోత్స్న బట్టలు ఇచ్చింనందుకు జ్యోత్స్న నానా రచ్చ చేస్తుంది. దాంతో సుమిత్ర, దశరథలు చాలా బాధపడుతారు. తాము ఎంతో ప్రేమతో దాచుకున్న జ్యోత్స్న చిన్నప్పటి దుస్తులు, ఆట వస్తువులను చిందవందరా జ్యోత్స్న కింద పడేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక కార్తీక్ బాబు మాత్రం ఆ దుస్తులు, ఆట బొమ్మలను తీసుకొని తన ఇంటికి వెళ్లిపోతాడు. సుమిత్ర అత్తకు బాధపడాల్సిన పని లేదని మీరు మీ కూతురుకు పుట్టిన బిడ్డకు ఇవన్నీ ఇవ్వాలని అనుకుంటే ఆ కోరిక తీరినట్లే అని చెప్పి వెళ్తాడు. ఆ మాటలు విన్న పారుజాతం, జ్యోత్స్న కంగారు పడుతారు.

మొదటి నుంచి కార్తీక్ బాబు, దీపా చాలా తేడాగా ఉన్నారని, వారిలో చాలా మార్పులు వచ్చాయని అనుకుంటారు. కార్తీక్ బాబుకు నిజం తెలిసి అలా మాట్లాడుతున్నాడా? లేకా సాధారణంగానే అలా మాట్లాడుతున్నాడా? అనేది అర్థం కావడం లేదని జ్యోత్స్న తల బాదుకుంటుంది. మరోవైపు సుమిత్ర, దశరథలు కూడా నెమ్మదిగా కార్తీక్ బాబు వైపు వెళ్తున్నారని గమనిస్తుంది. ఇక పారుజాతం కూడా జ్యోత్స్నపై మండిపడుతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? అని అడుగుతుంది. నువ్వు దీపాలోని ఆవేశాన్ని వాడుకోని ఇన్నాళ్లు ఎలా గెలిచావో ఇప్పుడు కార్తీక్ బాబు కూడా అదే ఫార్ములా వాడుతున్నాడని చెబుతుంది పారుజాతం. ఇంతకీ నువ్వు ఆవేశానికి పోయి తప్పు మీద తప్పు చేస్తున్నావనే సంగతిని గ్రహిస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది. పారుజాతం చెప్పిన మాటలను జ్యోత్స్న కూడా నమ్ముతుంది. నిజమే కదా అని ఆలోచించుకుంటుంది.

కార్తీక్ బాబు నీ గురించి దశరథ, సుమిత్రలకు ఏదైనా చెడుగా చెబితే, వాళ్లు మారిపోతే నీ పనై పోయినట్లే అని పారుజాతం జ్యోత్స్నను హెచ్చరిస్తుంది కూడానూ. నువ్వు చేసిన రచ్చకు ఇప్పటికే దశరథ, సుమిత్ర బాధపడుతున్నారని, వెంటనే వాళ్ల మనస్సును మార్చి, మళ్లీ నీపై ప్రేమను కురిపించాలంటే మళ్లీ ఏదోక మంచి పని చేయాలని అంటుంది. జ్యోత్స్న కూడా అవునని, ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. మరోవైపు బాలు దీపాకు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాడు. జ్యోత్స్న, దీపా పుట్టింది ఒకే రోజు కాబట్టి, జ్యోత్స్న పుట్టిన రోజు గుర్తు ఉండటంతో దీపాకు పుట్టిన రోజు సెలబ్రేషన్స్ నిర్వహిస్తాడు. బెలూన్ తో డెకరేట్ చేస్తాడు. పెద్ద కేక్ ఆర్డర్ చేసి దీపాను అర్ధరాత్రి నిద్రలేపి సర్ ప్రైజ్ చేస్తాడు. మొదటిసారిగా తనకు పుట్టిన రోజు వేడుకలు జరుతుండటంతో దీపా సంతోషిస్తుంది.

కానీ ఇదంతా ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తుంది. నా మరదల్ పుట్టిన రోజును నేను కాకపోతే ఇంకెవ్వరు సెలబ్రేట్ చేస్తారని కార్తీక్ బాబు అంటాడు. దాంతో మరదల్ ఏంటని అందరూ షాక్ అవుతారు. అదే జ్యోత్స్న నా మరదల్ కదా, తన పుట్టిన రోజునే దీపా కూడా పుట్టింది అని చెప్పబోయననని సర్దుకొస్తాడు. ఇక దీపాకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లుగా అనాథగా ఉన్న దీపాకు శివ నారాయణ ఇల్లు పుట్టింటిలా దొరికిందని అంటాడు. తర్వలో అన్ని సర్దుకుంటాయని చెబుతాడు. మరోవైపు కార్తీక్ బాబు మాటల్లో తేడాను గమనించిన కాంచన అటు కార్తీక్ బాబు, ఇటు దీపాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంతకీ మీరిద్దరూ ఆ ఇంటికి వెళ్లడం వెనకాల ఏదో కారణం ఉందని కార్తీక్ బాబును ప్రశ్నిస్తుంది. అందుకు బాలు అవును ఉందని బదులిస్తాడు. దీపా, నువ్వే కారణమని చెబుతాడు. మీ ఇద్దరికి ఆ ఇంట్లో సరైన గౌరవం దక్కే వరకు వెళ్లాల్సి ఉంటుందని అంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X