Karthika deepam 2 June 12th : బుర్ర బద్దలు కొట్టుకుంటున్న జ్యోత్స్న.. కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 11వ తేదీ 381వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు జ్యోత్స్న ఆలోచనలకు అంతు చిక్కకుండా ప్లాన్స్ వేస్తున్నారు. కార్తీక్ బాబు ను దెబ్బ తీయాలని జ్యోత్స్న ఎంత తహతహలాడుతుందో.. కార్తీక్ బాబు ఆమె కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. జ్యోత్స్నకు ఊహించని విధంగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. కార్తీక్ బాబు దెబ్బకు జ్యోత్స్న తల బాదుకుంటోంది. శౌర్య పాపకు తన చిన్నప్పటి డ్రెస్ ఇచ్చినందుకు నానా రచ్చ చేసిన జ్యోత్స్నకు కార్తీక్ బాబు గుణపాఠం చెప్పారు. దశరథ, సుమిత్రలకు గుర్తుగా ఉన్న దుస్తులు, ఆట వస్తువులను నేల మీద పడేసి అవమానిస్తుంది. దాంతో వారిద్దరు చాలా బాధపడుతారు. జ్యోత్స్న చేసిన పనికి ఎలా స్పందించాలో తెలియని స్థితిలో మౌనంగా ఉంటారు.
ఇక కార్తీక్ బాబు జోక్యం చేసుకొని జ్యోత్స్న విసిరేసిన బట్టలు, ఆట వస్తువులను తన ఇంట్లో జాగ్రత్తగా ఉంచుతానని సుమిత్ర అత్తతో అంటాడు. ఒక వేళ నీ సొంత మనవరాలికి ఆ బట్టలు, ఆట బొమ్మలు ఇవ్వాలని అనుకుంటే ఆ కోరిక నేరవేరినట్టే అని అంటాడు. జ్యోత్స్న వద్దనుకుంది.. మేం కావాలని అనుకుంటున్నామని కార్తీక్ బాబు సుమిత్రతో అంటాడు. ఇక దీపా స్పందిస్తూ దగ్గరగా ఉన్నప్పుడు దేని విలువ తెలియదని అంటుంది. ఆ తర్వాత వస్తువులన్నీ తీసుకొని తమ ఇంటికి వెళ్తారు. అదే రోజు దీపా పుట్టిన రోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందుకు దీపా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 12వ తేదీ 382 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు దీపాను సర్ ప్రైజ్ చేస్తాడు. దీపా పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా ఇంట్లో సెలబ్రేట్ చేస్తాడు. దీపా పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కేక్ కట్ చేయిస్తాడు. కాంచన, అనసూయ, శౌర్య పాప దీపా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకు దీపా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. తన కోసం మొట్ట మొదటి సారిగా కార్తీక్ బాబు కేక్ ఆర్డర్ చేసి, ఇల్లంతా డెకరేట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరపడంతో చాలా సంతోషిస్తుంది. కార్తీక్ బాబుకు థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు దీపాతో కేక్ కట్ చేయిస్తాడు. అందరికీ కేక్ ముక్కలు పంపిణీ చేస్తారు. ఇక దీపా తన పెంపుడు తండ్రి కుబేరా చిత్ర పటం వద్ద కూడా కేక్ ముక్కను పెడుతుంది. ఆయన ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటుంది. ఈలోగా మళ్లీ కార్తీక్ బాబు దీపాకు సర్ ప్రైజ్ ఇస్తాడు. దీపా పుట్టిన రోజు సందర్భంగా బంగారు గాజులు కొన్నానని చెబుతాడు. తానే స్వయంగా దీపా చేతికి తొడిగిస్తాడు. ఇందుకు దీపా మరింత సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే కార్తీక్ బాబు, దీపా ప్రేమగా ఉండటం చూసి కాంచన, అనసూయ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు.
మరోవైపు దీపా, జ్యోత్స్న పుట్టింది ఒకే రోజు కావడంతో జ్యోత్స్న కూడా శివ నారాయణ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరుపుకునేందుకు సిద్ధం అవుతుంది. దశరథ, సుమిత్ర, శివనారాయణ జ్యోత్స్న పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఇక జ్యోత్స్న తన పుట్టిన రోజు కూడా మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కార్తీక్ బాబు, దీపాలను అవమానించాలని అనుకుంటుంది. మరోవైపు దశరథ, సుమిత్రల దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంది. ముఖ్యంగా తన పుట్టిన రోజు సందర్భంగా దీపాను నిందించాలని, దశరథ, సుమిత్రల మనస్సులో మరింత చెడు ముద్ర వేయాలని అనుకుంటుంది. ఇక మరోవైపు దీపా కూడా పుట్టిన రోజు జరుపుకొని శివనారాయణ ఇంటికి కార్తీక్ బాబుతో వస్తుంది.
సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది. సుమిత్రను అమ్మా అని పిలుస్తుంది. ఆ మాట విన్న సుమిత్ర ఫైర్ అవుతుంది. ఇంకోసారి నన్ను అలా పిలవొద్దని సూచిస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా అలానే ఎందుకు పిలుస్తావని కసురుకుంటుంది. దాంతో కార్తీక్ బాబు జోక్యం చేసుకొని అమ్మతనం ఉందిగా అత్త దీపాను ఆశీర్వదించడంలో తప్పేమీ ఉంది. దీపా అడుగుతుంది కేవలం ఆశీర్వాదమే కదా.. ఆస్తులేమీ అడగటం లేదు కదా అని అంటాడు. కానీ సుమిత్ర దీపాను ఆశీర్వదించేందుకు ఇష్టపడదు. తన మనస్సులో దీపాపై ప్రేమ లేదు, కోపం లేదు. అందుకని ఆశీర్వదించలేదని చెబుతుంది. అయినా కూడా దీపా సుమిత్ర కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. సుమిత్ర దీపాకు దూరంగా వెళ్లి దీపా మనస్సుకు గాయం చేస్తుంది.
ఇక జ్యోత్స్న తన గది నుంచి కేక్ కట్ చేసేందుకు కిందికి దిగుతుంది. జ్యోత్స్న తీరును గమనించిన కార్తీక్ బాబు ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వస్తుందని గమనిస్తాడు. దాంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఇక జ్యోత్స్న కిందికి వచ్చి మంచి దానిలా నటించడం ప్రారంభిస్తుంది. ముందు రోజు బొమ్మలు కింద పడేసి మీ మనస్సు బాధ పెట్టినందుకు క్షమించనమని అడుగుతుంది. తనకు చాలా సంతోషంగా ఉందని, ఈరోజు కేక్ ను దీపాతో కలిసి కట్ చేస్తానని అంటుంది. జ్యోత్స్న మంచితనాన్ని చూసిన కార్తీక్ బాబు షాక్ అవుతాడు. ఇక జ్యోత్స్న వెంటనే వెళ్లి దీపా చేయి పట్టుకొని కేక్ కట్ చేద్దామని పిలుస్తుంది. అదే సమయంలో కేక్ కింద పడేయమని పారుజాతానికి కనుబొమ్మలతో సైగ చేస్తుంది.
దీపాను కావాలని జ్యోత్స్న ముందుకు లాగడంతో టేబుల్ పై పడుతుంది. అదే సమయంలో పారుజాతం టేబుల్ పై వేసి క్లాత్ ను లాగేస్తుంది. దాంతో కేక్ మొత్తం కింద పడుతుంది. దాంతో జ్యోత్స్న దీపాపై నిందారోపణ చేస్తుంది. కనీసం నా జీవితంలో పుట్టిన రోజున కూడా సంతోషంగా ఉండనివ్వవా అని అంటుంది. నిన్న కూడా నువ్వు బొమ్మల విషయంలో ఇలానే చేశామని అంటుంది. జ్యోత్స్న నాటకం తెలియని శివనారాయణ, సుమిత్ర దీపాను తప్పుబడుతాడు. జ్యోత్స్న ఇక బర్డ్ డే జరుపుకోనని ఇంట్లోకి వెళ్లిపోతుంది. అందరూ దీపాను తిడుతుండటంతో కార్తీక్ బాబు జ్యోత్స్నను నేను తీసుకొస్తానని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. తర్వాత జ్యోత్స్నకు జరిగిందంతా వీడియో తీశానని, మర్యాద కిందికి రమ్మని హెచ్చరిస్తాడు. లేదంటే ఆ వీడియో అందరికీ చూపించి మీ బాగోతం బయట పెడుతానని అంటాడు. కిందికి వచ్చి దీపాకు సారీ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తాడు. ఇక దీపా, జ్యోత్స్నల పేరుతో కేక్ ను కూడా ఆర్డర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











