Karthika deepam 2 June 13th : జ్యోత్స్న గుండెల్లో గుబులు.. కార్తీక్ బాబు దెబ్బ మీద దెబ్బ

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 12వ తేదీ 382వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా పుట్టిన సందర్భంగా కార్తీక్ బాబు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. తొలిసారిగా దీపాకు కార్తీక్ బాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో చాలా సంతోషించింది. పైగా కార్తీక్ బాబు దీపాకు బంగారు గాజులు కొనిచ్చి తానే స్వయంగా చేతులకు తొడుగుతాడు. దీంతో ఆనందానికి అవధులు ఉండవు. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపా ఇద్దరూ శివనారాయణ ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా జ్యోత్స్న పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. దీపా, జ్యోత్స్న ఒకే రోజు పుట్టడంతో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ముందుగా దీపా సుమిత్ర పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని అడుగుతుంది. కానీ సుమిత్ర దీపాను దగ్గరికి రానివ్వదు. పైగా సూటిపోటు మాటలతో దీపా మనస్సుకు గాయం చేస్తుంది.

మరోవైపు పుట్టిన రోజు వేడుకలను అడ్డుగా పెట్టుకొని జ్యోత్స్న పెద్ద గొడవ చేయాలని ప్రయత్నిస్తుంది. దీపాను అందరి ముందు అవమానించాలని ప్లాన్ చేస్తుంది. ముందు రోజు తన చిన్నప్పటి దుస్తులు, ఆట బొమ్మలను నేలపై పడేసి రచ్చ చేయడంతో పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆ తప్పును సరిదిద్దుకోవాలని చూస్తుంది. అదే సమయంలో దీపాను చెడు చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ ను దీపాతో కలిసి కట్ చేస్తానని చెబుతుంది. దీపా చెయి పట్టుకొని కేక్ దగ్గరికి బలవంతంగా తీసుకువస్తుంది. ఇదే సమయంలో పారుజాతాన్ని కేక్ కింద పడేయమని సైగ చేస్తుంది. ఆమె కేక్ ను కింద పడేస్తుంది. ఇక దీపా వల్లే కేక్ కింద పడిపోయిందని నిందిస్తుంది. పుట్టిన రోజున కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని నానా మాటలు అంటుంది. కానీ బాబు కేక్ పారునే కింద పడేసిన వీడియోను జ్యోత్స్నకు చూపించి షాక్ ఇస్తాడు. మర్యాద తనకు చెప్పినట్టు చేయాలని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 13వ తేదీ 383 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 383 June 13th 2025

జ్యోత్స్నను కార్తీక్ బాబు ఆటాడుకుంటాడు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా జ్యోత్స్న దీపాపై నిందలు వేస్తుంది. కేక్ కింద పడేసిందంటూ అందరి ముందు నిలదీస్తుంది. దీపాను తప్పు చేస్తుంది. దాంతో అందరూ దీపాపై మరింత కోపం పెంచుకుంటారు. ముఖ్యంగా సుమిత్ర దీపాను శత్రువులా చూస్తుంది. మరోవైపు కార్తీక్ బాబు కేక్ కింద ఎలా పడిందో తీసిన వీడియోను జ్యోత్స్నకు చూపించి షాక్ ఇస్తాడు. దాంతో జ్యోత్స్న కార్తీక్ బాబు చెప్పినట్టు చేస్తుంది. వీడియోను అడ్డుగా పెట్టుకొని దీపాతో కేక్ కట్ చేయించడం, సుమిత్రతో కేక్ తినిపించడం, సుమిత్రతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పించడం, ఆశీర్వాదం ఇప్పించడం వంటివన్నీ చేయిస్తాడు. దాంతో దీపా సంతోషిస్తుంది. కానీ సుమిత్ర మాత్రం దీపాపై కోపంతో రగిలిపోతుంది. కోపంగానే జ్యోత్స్న కోసం కేక్ తినిపించి, ఇష్టం లేకపోయినా శుభాకాంక్షలు చెబుతుంది. మరోవైపు శివ నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్న దీపాను ఆయన దగ్గరికి రానివ్వడు. తన మనవరాలిని దీవించిన చేతులతో అనాథలను దీవించలేనని దీపా గుండె పగులేలా మాట్లాడుతాడు.

సుమిత్ర, శివనారాయణ మాటాలకు దీపా ఎంతగానో బాధపడుతుంది. అలాగే జ్యోత్స్న కూడా దీపాపై, కార్తీక్ బాబుపై మండిపడుతుంది. సమయం వచ్చినప్పుడు మీ సంగతి చెబుతానని అనుకుంటుంది. ఇక సుమిత్ర దీపాపై రగిలిపోతూ తిరిగి తన గదిలోకి వెళ్తుంటుంది. మెట్లు ఎక్కుతుండటంతో కాలు జారుతుంది. దాంతో బెణుకుతుంది. ఈ సమయంలో అందరూ వచ్చి పడిపోబోతున్న సుమిత్రను పట్టుకుంటారు. మరోవైపు దీపా కూడా వచ్చి పట్టుకుంటుంది. కానీ సుమిత్ర మాత్రం దీపాను పట్టుకోవద్దని చెబుతుంది. నువ్వు నన్ను పట్టుకోవాల్సిన పనేమీ లేదని అంటుంది. ఇక దశరథనే సుమిత్రను పట్టుకొని నెమ్మదిగా గదిలోకి తీసుకెళ్తాడు. సుమిత్ర రెస్ట్ తీసుకుంటుంది. సుమిత్ర బాధలోనూ తనపైనే కోపం చూపిస్తోందని దీపా బాధపడుతుంది. అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయని కార్తీక్ బాబు దీపాకు సర్ది చెబుతాడు. తనవల్లే సంతోషంగా ఉండాల్సిన అమ్మ బాధపడుతుందని దీపా ఇంకా బాధపడుతుంది.

సుమిత్ర అమ్మ కాలికి గాయం అవ్వడంతో మందు రాయడానికి దీపా సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. అప్పటికే పడుకున్న సుమిత్ర కాలికి నెమ్మదిగా మందు రాస్తుంది. దీపా చేతి స్పర్శతో సుమిత్ర జ్యోత్స్న వచ్చిందనుకొని మొహం చూడకుండానే మాట్లాడుతుంది. జ్యోత్స్న నువ్వు కాలికి మందు రాస్తుంటే నయం అయినట్టుగా అనిపిస్తోందని అంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం జ్యోత్స్న, నీపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ జీవితంలోకి రావాల్సిన వెలుగును ఆ దీపా వచ్చి తన్నుకుపోయింది. ఇంకా నీతో చాలా విషయాలను మాట్లాడాలని ఉందని అంటుంది సుమిత్ర. మరోవైపు ఇవ్వాళ నీ పుట్టిన రోజు కదా, ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లలేదా అని అడుగుతుంది. దాంతో దీపా మౌనంగా ఉంటుంది. ఎంతకీ బదులివ్వకపోవడంతో కళ్లు తెరిచి చూస్తుంది. ఆలోపు జ్యోత్స్న బయటి నుంచి ఇంట్లోకి వస్తున్న జ్యోత్స్న కనిపిస్తుంది. మరీ కాలికి మందు రాస్తున్నది ఎవరని లేచి చూస్తుంది. దీపా కనిపించడంతో కసురుకుంటూ తన కాలిని వెనక్కి లాక్కుంటుంది.

అసలు నిన్ను నా గదిలోకి ఎవరు రానిచ్చారని అంటుంది. జ్యోత్స్న వెనకాలే వచ్చిన దశరథ నేనే పంపించాను అని సుమిత్ర ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. కాలికి మందు రాస్తానంటే పంపించాను అని చెబుతాడు దాంతో సుమిత్ర ఇంకా కోపం తెచ్చుకుంటుంది. మీరు ఉన్నారు కాబట్టే ఈవిడ ఆటలు సాగుతున్నాయని దీపాను అంటుంది.ఇంకోసారి నా గదిలోకి రాకూడదని, మనుషుల ప్రాణాలనే తీసే నీకు, కాలికి గాయమైతే జాలి కలగిందా? అంటూ దీపాను బాధపెట్టేలా ప్రశ్నిస్తుంది. నీలాంటి దానికి నా కాలిని కూడా తాకే అర్హత లేదని అంటుంది. దాంతో దీపా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ జ్యోత్స్న నుంచి మిమ్మల్ని కాపాడుకుంటానని, అందు కోసం ఎన్ని మాటలైనా పడుతానని మనస్సులో అనుకుంటుంది. గదిలో నుంచి బయటికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X