Karthika deepam 2 June 14th : కార్తీక్ బాబు, దీపాలకు ఎదురు దెబ్బ.. జ్యోత్స్న మాస్టర్ ప్లాన్

Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 13వ తేదీ 383వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పుట్టిన రోజు సందర్భంగా కూడా జ్యోత్స్న కార్తీక్ బాబు, దీపాలపై పగ సాధించాలని చూస్తుంది. తనే కేక్ కింద పడేసేలా ప్లాన్ చేసి, ఆ నిందను దీపాపై వేస్తుంది.ఇక అక్కడే ఉన్న కార్తీక్ బాబు అందంతా వీడియో తీసి జ్యోత్స్నకు చూపిస్తాడు. నేను చెప్పినట్టు వెంటే సరేనని, లేదంటే అస్సలు ఊరుకోనని చెబుతాడు. దెబ్బకు జ్యోత్స్న సరేనని అంటుంది. వీడియోను, జ్యోత్స్నను అడ్డం పెట్టుకొని సుమిత్రతో దీపాకు కేక్ తినిపించేలా చేస్తాడు కార్తీక్ బాబు. అలాగే దీపాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిస్తాడు. మరోవైపు ఆశీర్వాదం కూడా ఇప్పిస్తాడు.

కానీ సుమిత్ర మాత్రం దీపాపై రగిలిపోతూనే ఉంటుంది. దీపాపై కోపంతో తిరిగి తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. మెట్లపై నుంచి స్పీడ్ గా వెళ్తుండగా.. కాలు జారి పడిపోబోతోంది. వెంటనే అందరూ పట్టుకుంటారు. ఇక దీపా పట్టుకుంటూ ఉంటే వద్దని అంటుంది. కొద్ది సేపటి తర్వాత దీపా సుమిత్ర గదిలోకి వెళ్లి గాయానికి మందు రాస్తుంది. కానీ సుమిత్ర మాత్రం కాలుకు మందు రాస్తున్నది జ్యోత్స్న అనుకొని కళ్లు మూసుకునే మాట్లాడుతుంది. చివర్లో మందు రాస్తున్నది దీపా అని తెలుసుకొని దూరం జరుగుతుంది.నీకు నా కాళ్లు పట్టుకునే అర్హత కూడా లేదని చెప్పి తన గదిలోంచి బయటికి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 14వ తేదీ 384 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 384 June 14th 2025

సుమిత్ర అనరాని మాటలు అనడంతో దీపా చాలా బాధపడుతుంది. కార్తీక్ బాబుతో తన మనస్సులోని బాధను చెప్పుకుంటుంది. ఇక కార్తీక్ బాబు దీపాను ఓదార్చుతాడు. త్వరలోనే నీ బాధలు అన్నీ తొలగిపోతాయని చెబుతాడు. కానీ అప్పటి వరకు ఈ మాటలు, విమర్శలను పెద్దగా మనస్సుకు తీసుకోకని కార్తీక్ బాబు అంటాడు. సుమిత్ర మాత్రం తనను అసలు కూతురిలా కాదు మనిషిలానే చూడటం లేదు. ముందుగా తనను మనిషిలా చూసేలా చేయాలని కార్తీక్ బాబుతో అంటుంది దీపా. ఆ పని త్వరలోనే అవుతుందని కార్తీక్ బాబు అంటాడు. ఇక ఇద్దరూ కలిసి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇక దీపా ఇంట్లో పనులన్నీ ముగించుకొని పూలు అల్లుకునేందుకని మల్లెలు తెంపుకొని ఇంట్లోకి వస్తుంది. వచ్చే సమయంలో కార్తీక్ బాబు ఎదురవడంతో మల్లెలు కింద పడుతాయి. దీంతో ఇద్దరు కలిసి కింద కూర్చొని మల్లెలు ఏరుతుంటారు. ఈ క్రమంలో దీపాతో కార్తీక్ బాబు మరదల అని పిలుస్తూ ఉంటుంది. దాంతో దీపా సిగ్గు పడుతుంది. ఇకపై నుంచి ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు నన్ను బావ అనే పిలవాలని కార్తీక్ బాబు కండీషన్ పెడుతాడు.

నువ్వు నాకు సొంత మేనత్త కూతురివి అని, నా మరదలువి అని, నన్ను బావ అనే పిలవాలని అంటాడు. దీపా సరేనని అంటుంది. ఇకపై నుంచి బావ అనే పిలుస్తానని చెబుతుంది. ఎవరేమనుకున్నా మనం కోనేరు దగ్గర చిన్నప్పుడు ఎలా ఉన్నామో అంతే ప్రేమగా ఉందామని కార్తీక్ బాబు దీపాతో అంటాడు. అందుకు దీపా కూడా సరేనని అంటుంది. ఇక మరోవైపు జ్యోత్స్నపై పారుజాతం మండిపడుతుంది. ఎందుకు నువ్వు పుట్టిన రోజు వేడుకల్లో కార్తీక్ బాబు చెప్పినట్టు తల ఊపుతున్నావని అంటుంది. అసలు ఏం జరిగిందని, కార్తీక్ బాబు నీతో ఏం చెప్పాడు, ఎందుకు నువ్వు అలా ప్రవర్తించావని పారుజాతం జ్యోత్స్న ను నిలదీస్తుంది. దాంతో జ్యోత్స్న అసలు నిజం చెబుతుంది. మనం దీపా గురించే ఆలోచించాం. కానీ కార్తీక్ బాబు గురించి ఆలోచించలేదు. అదే దెబ్బ పడింది. మనం ప్లాన్ చేసి కేక్ ను కింద పడేసిన దృశ్యాన్ని కార్తీక్ వీడియో తీశాడని చెబుతుంది. తను చెప్పినట్టుగా వినకపోతే ఆ వీడియోను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. అందుకే చెప్పినట్టుగా చేయాల్సి వస్తోందని అంటుంది.

దాంతోనే, కార్తీక్ బాబు చెప్పింది చెప్పినట్టుగా చేశానని పారుజాతంతో జ్యోత్స్న అంటుంది. ఇక దీపాపై రివేంజ్ తీర్చుకుందామని ప్లాన్ చేస్తే ఫెయిల్ అయిపోయిందని అంటుంది. లేదంటే పుట్టిన రోజున దీపాకు జరగాల్సిన అవమానం జరిగేదని చెబుతుంది. దీపా ప్రవర్తన మాటలు చూస్తుంటే అసలు వారసురాలు తనే అనే విషయం తెలిసినట్టు ఉందని మనస్సులో అనుకుంటుంది. ఫస్ట్ దాసును దొరకబట్టి ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత దాసును చంపాలని కుట్ర పన్నుతుంది. ఇక సుమిత్రను దశరథ ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తాడు. సుమిత్ర కాలు బెణకడంతో, బాగా నొప్పి వస్తుండటంతోనే ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే సుమిత్రను జ్యోత్స్న దగ్గరికి తీసుకుంటుంది. అంత పెద్దగా నొప్పి వచ్చినప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు పిలవలేదని పారుజాతం దశరథను అడుగుతుంది. త్వరగా వెళ్లాల్సి రావడంతో చికిత్స కోసం వెళ్లామని అంటాడు. ఇక సుమిత్ర మాత్రం జ్యోత్స్నపై బాగా కోపంగా ఉంటుంది. అది గమనించిన జ్యోత్స్న సారీ మమ్మీ అని చెబుతుంది. నావల్లే ఇలా జరిగిందని అంటుంది.

ఇక సుమిత్ర కూడా జ్యోత్స్నపై కోపం చేస్తుంది. పుట్టిన రోజు సందర్భంగా నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ నీకు ఇచ్చాను కదా అని దీపాను ఉద్దేశించి మాట్లాడుతుంది. అసలు నీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఏర్పాట్లలో దీపకు సంబంధం ఏంటీ? నీ కోసం తెప్పించిన కేక్ పై దీపా పేరు ఎందుకు రాయించావని సుమిత్ర ప్రశ్నిస్తుంది. నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదని అంటుంది. అసలు ఎందుకు అలా చేశావో మాకు చెప్పి తీరాలని సుమిత్రి అంటుంది. అందుకు జ్యోత్స్న ఎలాంటి సమాధానం ఇవ్వదు. మరోవైపు దశరథ స్పందిస్తూ నువ్వు అలా చేయడం వెనకాల కార్తీక్ బాబు హస్తం ఏమైనా ఉందా జ్యోత్స్న అని దశరథ అంటాడు. మరోవైపు శివనారాయణ కూడా కచ్చితంగా కార్తీక్ బాబు ప్లాన్ ఉండేఉంటుందని సందేహం వ్యక్తం చేస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఏటు బదులివ్వకుండా మౌనంగా ఉండిపోతుంది.దాంతో శివ నారాయణ పుట్టిన రోజు వేళ ఈ ప్రశ్నలు ఎందుకులే ముందు సుమిత్రను గదిలోకి తీసుకెళ్లండి అని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X