Karthika deepam 2 June 16th : జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. కార్తీక్ కు ఊహించని దెబ్బ
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 14వ తేదీ 384వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇకపై ఎవ్వరు ఏమనుకున్నా నన్ను బావ అనే పిలవాలని కార్తీక్ బాబు దీపాకు కండీషన్ పెడుతాడు. నువ్వు నాకు సొంత మేనత్త కూతురివి, నా మరదలువి కాబట్టి కేవలం బావ అనే పిలవాలని అంటాడు. అందుకు దీపా సరేనని అంటుంది.మరోవైపు జ్యోత్స్నపై పారుజాతం కోపం చేస్తుంది. కార్తీక్ బాబు చెప్పినట్టుగా ఎందుకు వింటున్నావని మండిపడుతుంది. దాంతో జ్యోత్స్న అసలు విషయం చెబుతుంది. తాము కేక్ కింద పడేయాలని ప్లాన్ చేసిన విషయాన్ని ఫోన్ లో వీడియో తీశాడని చెబుతుంది. అందుకే కార్తీక్ బాబు చెప్పినట్టుగా వినాల్సి వచ్చిందని చెబుతాడు. దీపా ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, అసలు వారసురాలు తనే అన్న సంగతి తెలిసిపోయిందా? అని మనస్సులో అనుకుంటుంది.
మరోవైపు దాసును త్వరగా కనుగోనాలని, దాసు తన చేతికి చిక్కితే అసలు విషయం బయటకు వస్తుందని మనస్సులో అనుకుంటుంది. ఇక సుమిత్ర కాలు పెయిన్ ఎక్కువ అవడంతో ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుంది. రాగానే జ్యోత్స్న వెళ్లి మాట్లాడుతుంది. దాంతో సుమిత్ర జ్యోత్స్న పై మండిపడుతుంది. నీ వల్ల దీపాతో మాట్లాడాల్సి వచ్చిందని, కేక్ కూడా తినిపించి, శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చిందని కోపంగా ఉంటుంది. ఇంతకీ నువ్వు అలా ఎందుకు చేశావని సుమిత్ర, దశరథలు జ్యోత్స్నను ప్రశ్నిస్తారు. అందుకు జ్యోత్స్న మౌనంగా ఉంటుంది. శివనారాయణ జోక్యం చేసుకొని జ్యోత్స్న ను ఇంట్లోనికి పంపిస్తారు. ఈ ఘటన వెనకాల కార్తీక్ బాబే ఉన్నారని శివ నారాయణ అనుమానిస్తాడు. దాంతో జ్యోత్స్న, పారుజాతం కంగు తింటారు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 16వ తేదీ 385 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబును దీపా బావ అని పిలుస్తుంది. కార్తీక్ బాబు పెట్టిన కండీషన్ తో దీపా కూడా బావ అనే పిలుస్తుంది. అయితే శివ నారాయణ ఇంటికి వెళ్లాలి కాబట్టి కార్తీక్ బాబు అప్పటికే రెడీ అయ్యి దీపాను త్వరగా రమ్మని అంటాడు. దీపా వస్తూ వస్తూ.. హా వస్తున్నాను బావ అని అంటుంది. దీపా అలా పిలవడం చూసి అందరూ షాక్ అవుతారు. అందేంటీ దీపా నిన్ను బావ అని పిలుస్తుందని కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఎప్పుడూ నువ్వు కార్తీక్ బాబును బావ అని పిలవలేదు కదా అని అంటుంది. కొత్తగా ఈ పిలుపు ఏంటనీ కార్తీక్ బాబుతో కాంచన అంటుంది. దీపా అలా పిలిస్తే తప్పేంటనీ కార్తీక్ బాబు అంటాడు. తప్పేమీ లేదురా కానీ ఒకేసారి అనే పిలిచేసరికి అడిగాను. అయినా అలా వరసలు పెట్టుకొని పిలిస్తేనే బంధం మరింత బలపడుతుందని చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు, దీపా కూడా సంతోషిస్తారు. ఇకపై దీపా నన్ను బావ అనే పిలుస్తుంది.. పిలవాలి కూడానూ అని కార్తీక్ బాబు అంటాడు. అప్పుడు దీపాను నేను మరదల అని పిలుస్తాను అని అంటాడు.
కార్తీక్ బాబు మాటలు విన్న కాంచన ఆనందంతో ఉప్పొంగి పోతుంది. ఇకపై దీపాను నేను కూడా మేన కోడలా అనే పిలుస్తానని చెబుతుంది. అంతేకాదు దీపా కూడా నన్ను అత్తమ్మ అనే పిలవాలని అంటుంది. అందుకు దీపా కూడా సరేనని బదులిస్తుంది. నువ్వు సొంత మేనత్తవే, మనది రక్త సంబంధమే అని దీపా మనస్సులో అనుకుంటుంది. నిజాలు తెలియడానికి ఇంకాస్త సమయం పడుతుందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని అనుకుంటూ సంతోష పడుతుంది. ఇక కార్తీక్ బాబు వెళ్దామా? అని అనడంతో సరేనని అంటుంది. ఇక ఇద్దరు కలిసి శివనారాయణ ఇంటికి వెళ్తారు. అక్కడ సుమిత్ర దీపాను చూసి అక్కడే ఆమని అంటుంది. నువ్వు ఇంట్లోకి రావొద్దని అంటుంది. ఆమె ఇకపై ఈ ఇంట్లోకి రాకూడదని చెబుతుంది. జ్యోత్స్న అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సుమిత్ర ఫైర్ అవుతుంది. నువ్వు నోరు మూసుకోమని అంటుంది. దీపా ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉండటం లేదని అంటుంది. ఎందుకు అలా అంటున్నావని, దీపా వల్ల ఏం తప్పు జరిగిందని దశరథ అడుగుతాడు. నీ భార్య కాలుకు తగిలిన గాయం చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నావెందుకు అని శివ నారాయణ దశరథను అడుగుతాడు.
తన కోపమే తన శత్రువు అన్నట్టు సుమిత్ర కోపంలో మెట్లు ఎక్కుతూ వెళ్లింది. తొందర్లో జారి కిందపడబోబోయిందని అంటాడు దశరథ. మీరెందుకు దీపాను ఇక్కడే ఉంచాలని ప్రయత్నిస్తున్నారని అంటుంది. మనకు నచ్చని మనిషి మన కళ్ల ముందే ఉంటే మనస్సుకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలుసా? దీపా నా కళ్ల ముందే తిరుగుతూ ఉంటే నాకు ఏమాత్రం నచ్చడం లేదని సుమిత్ర అంటుంది. దీపా ఇంట్లో ఉండటానికి నేను ఏమాత్రం ఒప్పుకోనని చెబుతుంది. దీపాను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని అంటుంది. ఇక శివ నారాయణ కూడా సుమిత్రను సపోర్ట్ చేస్తాడు. దీపాను ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదని చెబుతాడు. కానీ దశరథ, జ్యోత్స్న మాత్రం దీపా ఇంట్లోనే ఉండాలని అంటారు. దీపాను దీపాలా కాకుండా పని మనిషిలానే చూడమని సుమిత్రకు జ్యోత్స్న అంటుంది. అలా కూడా కురదని దీపా ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతుంది.
దాంతో దీపా స్పందిస్తూ మీరు చెప్పినట్టే ఇప్పుడే వెళ్లిపోతాను అమ్మ.. కానీ నాదొక కండీషన్. నాతోపాటే నా భర్తను కూడా తీసుకెళ్లి పోతానని అంటుంది. నా భర్తను తీసుకెళ్లిపోవడం అంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నానని మీరు ఒప్పుకున్నట్టే అని చెబుతుంది. దాంతో జ్యోత్స్న స్పందిస్తూ అది మాత్రం కుదరదని అంటుంది. శివనారాయణ కూడా దీపా ఒక్కదాన్ని వెళ్లగొడతాం కార్తీక్ డ్రైవర్ గా అగ్రిమెంట్ ప్రకారం పని చేయాల్సిందేనని అంటాడు. అలా కుదరదని దీపా తెగేసి చెబుతుంది. పోతే ఇద్దరం పోతాం.. అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతంది.లేదంటే నేను కూడా ఇక్కడే పనిచేస్తానని దీపా చెబుతుంది. ఇక చేసేదేమీ లేక సుమిత్రనే కాంప్రమైజ్ అవుతుంది. దీపాను ఉండనిచ్చేందుకు అనుమతినిస్తుంది. కానీ వరుసలు పెట్టి పిలవొద్దని, నాకు ఎదురు పడకూడదని కండీషన్ పెడుతుంది.దాంతో కార్తీక్ బాబు కూడా ఈ కుటుంబానికి మనకి ఏ సంబంధం లేదని మనం పనిమనుషుల్లానే ఉందామని, అందరినీ సార్, మేడమ్ అని పిలుద్దామని అందరి ముందే దీపాతో అంటాడు. అందుకు దీపా కూడా సరేనని అంటుంది. ఇక దీపా కార్తీక్ బాబును దెబ్బ తీసేలా ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











