Karthika deepam 2 June 17th : జ్యోత్స్నకు దిమ్మతిరిగిపోతోందిగా.. కార్తీక్ బాబు, దీపాల మరో ట్విస్ట్
Karthika deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 16వ తేదీ 385వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబును దీప బావ అని పిలుస్తుంది. దాంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఎప్పుడు లేనిది దీప కార్తీక్ బాబును కొత్తగా బావ అని పిలవడం ఏంటని ఆశ్చర్యపోతారు. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ దీప బావ అని పిలవడంలో తప్పేముందని అంటాడు. ఇకపై దీప నన్ను అలానే పిలుస్తుందని, నేను దీపాను మరదలా అని పిలుస్తానని కార్తీక్ బాబు చెబుతాడు. అలా వరసలు పెట్టి పెంచుకోవడం నాకు కూడా సంతోషంగానే ఉంటుందని కాంచన అంటుంది. ఇకపై తనను కూడా అత్త అని పిలువమని, తను కూడా మేన కోడలా అని పిలుస్తానని కాంచన దీపాతో అంటుంది. అందుకు దీప కూడా సంతోషిస్తుంది. నేను నీ మేనకోడలినే అని దీప మనసులో అనుకుంటుంది. త్వరలోనే అన్ని నిజాలు మీకు కూడా తెలిసిపోతాయని అనుకుంటుంది. మరోవైపు దీపాను సుమిత్ర, శివ నారాయణ తమ ఇంట్లోకి రావద్దని హెచ్చరిస్తారు. ఇకపై నువ్వు మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదని చెబుతారు.
కానీ జ్యోత్స్న, దశరథ మాత్రం దీపా ఇంట్లో పనిచేయడం వల్ల వచ్చే సమస్య ఏంటని ప్రశ్నిస్తారు. మనకు నచ్చని మనుషులు మన ఇంట్లోనే మన కండ్ల ముందే తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఏదేమైనా దీప ఈ ఇంట్లో పని చేయడానికి వీలులేదని చెబుతుంది. దాంతో దీప కూడా నేను ఇంట్లో పని చేయబోనని, ఇప్పుడే వెళ్లిపోతానని, కానీ నాతో పాటు నా భర్త కార్తీక్ బాబును కూడా తీసుకెళ్లి పోతానని అంటుంది. అందుకు జ్యోత్స్న ఒప్పుకోదు. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు ఇంట్లో పని చేయాల్సిందేనని అంటుంది. దీపాను కూడా పనిచేయడానికి అనుమతిస్తుంది. సుమిత్ర, శివ నారాయణలను ఒప్పిస్తుంది. కానీ వరుసలు పెట్టి పిలవడానికి వీల్లేదని సుమిత్ర, శివ నారాయణ వాళ్ళిద్దరికీ కండిషన్లు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 17వ తేదీ 386 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కారీక్ బాబు, దీపాలను ఇంట్లోనే కలిసి పనిచేసుకునేందుకు అనుమతినిస్తారు. దాంతో మళ్లీ తమ పనుల్లో బిజీ అయిపోతారు. అయితే జ్యోత్స్నకు కార్తీక్ బాబు, దీపాలపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని మళ్లీ ప్లాన్ చేస్తుంది. ఇక వారిద్దరూ కిచెన్ లో వంట చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీపాతో సుమిత్ర మాట్లాడటం లేదని బాధపడుతుంది. ఇక కార్తీక్ బాబు దీపాను ఓదార్చుతాడు. అలాంటివేవీ మనస్సులో పెట్టుకోకని చెబుతాడు. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయని దీపాకు ధైర్యం చెబుతాడు. ఇక కార్తీక్ బాబు, దీపా కిచెన్ లో మాట్లాడుకుంటూ ఉంటే పారుజాతం వస్తుంది. తనకు, జ్యోత్స్నకు స్ట్రాంగా రెండు కాఫీలు ఇవ్వమని అడుగుతుంది.దాంతో కార్తీక్ బాబు సరే పారు అని చెబుతాడు. అయితే వరుసలు మారినప్పటి నుంచి పారును మాత్రం పారు అనే పిలుస్తుండటం, చివర్లో చెప్పా అనడంతో అదేంటనీ పారు కార్తీక్ బాబును అడుగుతుంది. అందుకు కార్తీక్ బాబు మళ్లీ చివర్లోనే చెబుతానని అంటాడు.
కాఫీ తీసుకురావడం ఆలస్యం అవ్వడంతో జ్యోత్స్ననే కిచెన్ లోకి వస్తుంది. కార్తీక్ బాబు, దీపాలతో కలిసి పారు ముచ్చట్లు పెడుతుండటంతో మండిపడుతుంది. అసలు నీకు వీళ్లతో పనేంటనీ ప్రశ్నిస్తుంది.అదేం లేదే కిందికే వస్తున్నానని పారుజాతం బదులిస్తుంది. ఆ తర్వాత కాఫీ బాగుండాలని, లేదంటే కప్పు కిచెన్ పడుతుందని జ్యోత్స్న కార్తీక్ బాబును హెచ్చరిస్తుంది. దాంతో కార్తీక్ బాబు కూడా ఘాటుగానే స్పందిస్తాడు. చెప్పు తెగుద్దని అంటాడు. ఎవరినీ అంటున్నావని పారు, జ్యోత్స్నలు కార్తీక్ బాబుపై ఫైర్ అవుతారు. నేను అన్నది మిమ్మల్ని కాదులే.. పాల వాడిని అని చెబుతాడు. కాఫీ బాగా లేదని అంటే పాల వాడు సరిగా పాలు పోయలేదనే కదా అర్థమని అంటాడు. అలాంటప్పుడు నాకు కూడా కోపం వస్తుందని కదా అంటూ బదులిస్తాడు. ఆ వెంటనే దీపా మరో షాక్ ఇస్తుంది. పారు, జ్యోత్స్నల ముందే కార్తీక్ బాబును బావ అనిపిస్తుంది.
దాంతో పారు, జ్యో షాక్ అవుతారు. అదేంటీ కార్తీక్ బాబును దీపా బావ అని పిలుస్తుందని ప్రశ్నిస్తుంది. నా పెళ్లాం నన్ను బావ అని పిలిస్తే పెద్ద మేడమ్ జ్యోత్స్నకు ప్రాబ్లం ఏంటనీ అంటాడు కార్తీక్ బాబు. లేదు దీపా బావ అని పిలవడానికి వీల్లేదని అంటుంది. కారణాలు లేవని, పిలువొద్దంటే పిలవద్దు అని అంటుంది జ్యోత్స్న. ఒక్కసారి కాదు వంద సార్లు పిలుస్తానని జ్యోత్స్న తో అంటుంది. దాంతో జ్యోత్స్న ఇంకా మండిపోతుంది. పిలువొద్దని నాకు మాత్రమే బావ అని పిలిచే అర్హత ఉందని జ్యోత్స్న అంటుంది. లేదు బావ అని పిలిచే అర్హత కేవలం నాకు మాత్రమే ఉందని దీపా అంటుంది. అవసరమైతే బావ అని చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంటానని అంటుంది. దాంతో చిర్రెత్తిపోయిన జ్యోత్స్న దీపాపై చేయి చేసుకోవడానికి వెళ్తుంది. ఇక కార్తీక్ బాబు జ్యోత్స్నను అడ్డుకుంటాడు. తన కామిక్ సెన్స్ తో పారును అడ్డం పెట్టుకొని సమస్యను సర్దుమణిగేలా చేస్తాడు.ఆ తర్వాత పారుజాతాన్ని జ్యోత్స్న కిందికి వెళ్లిపోమ్మని చెబుతుంది. ఇక కార్తీక్ బాబును వెళ్లి కారు క్లీన్ చేయమని ఆర్డర్ వేస్తుంది. అలాగే రెండు కాఫీలు పంపించామని దీపాకు చెప్పి వెళ్లిపోతుంది.
ఇక కార్తీక్ బాబు జ్యోత్స్న, పారుజాతంపై మండిపడుతారు. పని మనిషిలా చేరి మా తాతను పెళ్లి చేసుకొని పచ్చటి కుటుంబంలో మంటలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అసలు మనవరాలిని దూరం చేసి తన మనవరాలిని ఈ ఇంటికి యజమానురాలిగా మార్చాలని చూస్తున్నదని రగిలిపోతాడు. వీళ్ల ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. కోపంతో ఊగిపోతాడు. ఇక దీపా కార్తీక్ బాబును శాంత పరుస్తుంది. ఆ తర్వాత భోజనాలకు వెళ్తారు. అందరూ తినడానికి వస్తారు. దీపా చేసిన వంటలను సుమిత్ర తిననని చెబుతుంది. దాంతో జ్యోత్స్న రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడుతుంది. ఈ భోజనాన్ని దీపా సుమిత్రకు వడ్డించబోతుంటే సుమిత్ర కింద పడేస్తుంది. నీ చేతితో తాకితే తినను, తాగను అని చెబుతుంది. తినకుండానే వెళ్లిపోతుంది. ఆ తర్వాత అందరూ తినకుండానే వెళ్లిపోతారు. ఇక దీపా చాలా బాధపడుతుంది. సుమిత్ర చేసిన పనులన్నీ ఇంట్లో కాంచనతో చెబుతారు. కాంచన సుమిత్ర ప్రవర్తనకు షాక్ అవుతుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ దీపా సుమిత్రను మా అమ్మ మొండిదైతే .. నేను జగమొండిని అని అంటుంది. కార్తీక్ బాబు కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











