Karthika Deepam 2 June 18th : నోరు జారి నిజం చెప్పిన దీపా.. జ్యోత్స్న గుండె గుబేల్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 17వ తేదీ 386వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్నకు కార్తీక్, దీపాలు మాస్టర్ స్ట్రోక్ ఇస్తారు. శివ నారాయణ ఇంట్లో ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ తో సాగుతోంది. ప్రస్తుతం దీపా, సుమిత్రకు, కార్తీక్ బాబు, జ్యోత్స్నలకు మధ్య రక్తవత్తరంగా సన్నివేశాలు సాగుతున్నాయి. దీపానే ఆ ఇంటికి అసలు వారసురాలు అనే విషయం కార్తీక్ బాబుకు తెలియడంతో, దీపాకు కూడా చెబుతాడు. ఇప్పుడు నెమ్మదిగా ఆ ఇంటికి దీపాను దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ కార్తీక్ బాబు ప్రయత్నాలకు జ్యోత్స్న ఎప్పటికప్పుడు అడ్డుపడుతుంది. దీపాను డైరెక్ట్ గా ఏం చేయలేక సుమిత్రను రెచ్చగొడుతూ దీపాపై మండిపడేలా చేస్తోంది.
సుమిత్రకు కాలు బెణకడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. కనీసం కిచెన్ లో వంట చేసుకోలేని స్థితిలో ఉంది. ఈ సందర్భంగా దీపాను ఆ ఇంట్లో వంటలు చేస్తుంటుంది. అయితే దీపా చేతితో చేసిన వంటలు తినని సుమిత్ర అప్పటికే షరత్ పెడుతుంది. అసలు దీపా తన కంట కూడా పడొద్దని చెబుతుంది. దాంతో దీపా మరింతగా బాధపడుతుంది. సుమిత్రకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా పరిస్థితులు మరింత దూరం చేస్తున్నాయని బాధపడుతుంది. ఇక మరోవైపు కార్తీక్ బాబును దీపా జ్యోత్స్న, పారుల ముందే బావ అని పిలిచి షాక్ ఇస్తుంది. మరోవైపు కాంచన ముందు సుమిత్రను మా అమ్మ అంటూ పలుకుతుంది. దీంతో కాంచనకు, జ్యోత్స్నకు దీపా ఏదో విషయాన్ని దాస్తోందని సందేహిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 18వ తేదీ 387 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కాంచనకు, అనసూయకు దీపాపై అనుమానం వస్తుంది. సుమిత్ర ఇంట్లో తను వండిన, కనీసం ముట్టుకున్న భోజనాన్ని కూడా తినడం లేదని కాంచనకు దీపా చెబుతుంది. దాంతో కాంచన సుమిత్ర వదిన ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని కాంచన అంటుంది. దాంతో దీపా బట్టలు మడతబెడుతూ అత్త కాంచనకు బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. మా అమ్మ మొండిదైతే నేను జగమొండిని అత్తయ్య అంటుంది. దాంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. నువ్వేంటి సుమిత్రను సొంత అమ్మలాగా పిలుస్తున్నావని సందేహిస్తాడు. ఇంతకు ముందు ఎప్పుడూ అలా పిలవలేదు కదా అని అంటుంది. మాటల్లో పడి నోరు జారాను అని దీపా అనుకుంటుంది. ఇక వెంటనే కార్తీక్ బాబు జోక్యం చేసుకుని దీపా మాటలను సరిచేస్తాడు. ఆ ఇంట్లో పని చేస్తున్నాం కదా. పనివాళ్లు యజమానులను అమ్మగారు అని పిలవాలి దీపా, అమ్మ అని పిలిస్తే విని వారికి మరోలా అర్థం అవుతుందని కార్తీక్ బాబు అంటాడు.
నువ్వు ఇప్పుడు మా అమ్మ కాంచనను ఎలాగైతే అత్తమ్మ అని పిలుస్తున్నావో సుమిత్రను కూడా అలాగే అమ్మ అని పిలుస్తున్నావని వాళ్లు అనుకుంటున్నారని డైవర్ట్ చేస్తాడు. అయినా సుమిత్రను అమ్మ అని పిలిస్తే తప్పేంటీ అని అంటారు. ఆ రోజు కూడా త్వరలో వస్తుందని అంటాడు కార్తీక్ బాబు. త్వరలో అలా పిలిచే సమయం ఎలా వస్తుందని అనసూయ ప్రశ్నిస్తుంది. అన్ని సమస్యలు పోయి, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య గొడవలు, కోపాలు పోయి కలిసిపోతే.. సుమిత్ర దీపాను నా కూతురు లాంటి దానివని అంటే.. అప్పుడు బేషుగ్గా దీపా సుమిత్రను అమ్మా అని పిలుస్తుంది కదా అని వివరిస్తాడు. మొత్తానికి దీపా తొందరపడి నోరు జారినా కార్తీక్ బాబు అసలు విషయాన్ని బయటకు రాకుండా కవర్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి శివ నారాయణ ఇంటికి సైకిల్ పై వెళ్తుంటారు. ఈ క్రమంలో సుమిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర తనపై కోపంతో భోజనం మానేసిందని దీపా బాధపడుతుంది. దాంతో ఇవ్వాళ ఎలాగైనా ఇవ్వాళ సుమిత్ర అమ్మతో కడుపు నిండా భోజనం తినిపించాలని అనుకుంటారు.
దానికి తన దగ్గర అదిరిపోయే ఉపాయం ఉందని కార్తీక్ బాబు అంటాడు. ఏంటా ఉపాయం అని అడగ్గా చెప్పను, చూపిస్తాను పదా అని అంటాడు కార్తీక్ బాబు. ఇక ఇద్దరు కలిసి శివనారాయణ ఇంటికి చేరుకుంటారు. పారు, శివ నారాయణ బయటనే కూర్చొంటారు. దీంతో కార్తీక్ బాబు, దీపా వెళ్లి నమస్కారం పెద్ద సార్, పెద్దయ్య అని పలకరిస్తారు. ఇక పక్కనే ఉన్న పారును మాత్రం పారు అని పిలుస్తాడు కార్తీక్ బాబు. మనం మనం ఒక్కటని చెబుతాడు. డ్యూటీకి టైమ్ కి రావడం తెలియదు కానీ కబుర్లు బాగానే చెబుతున్నావని శివనారాయణ మండిపడుతాడు. సైకిల్ పంక్ఛర్ అవ్వడంతో లేట్ అయ్యిందని, అయినా పనిపైనా శద్ధతోనే వీలైనంత త్వరగా వచ్చామని చెబుతాడు కార్తీక్ బాబు. శివ నారాయణ సరే సరే అని అంటాడు. దాంతో కార్తీక్ బాబు దీపా ఇంట్లో కి వెళ్లి తమ పనులు చూసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక పారు శివనారాయణను ఇలా ప్రశ్నిస్తుంది. కార్తీక్ బాబు అందరినీ సార్, మేడమ్ అని పిలిచి నన్ను మాత్రమే పారు అని ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కావడం లేదని అంటుంది.
దాంతో శివనారాయణ అసలు విషయం చెబుతుంది. ఇప్పుడు కార్తీక్ బాబు, దీపాలు ఈ ఇంట్లో ఏ పోజిషనల్ లో ఉన్నారని అంటాడు. పని మనిషులుగా అని పారుజాతం బదులిస్తుంది. మన పెళ్లికి ముందు ఈ ఇంట్లో నీ పొజిషన్ కూడా ఏంటని మళ్లీ ప్రశ్నిస్తాడు. అదే పోస్ట్ లే అని పారు గునుగుతూ చెబుతుంది. అందుకే మనం మనం ఒక్కటనీ అంటున్నాడు అని వివరిస్తాడు. అది ప్రేమగా పిలవడం కాదని, నీకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నాడని చెప్పి నవ్వుకుంటాడు. దాంతో పారుజాతానికి కార్తీక్ బాబుపై కోపం వస్తుంది. ఇక సుమిత్ర అమ్మకు భోజనం తినిపించేందుకు కార్తీక్ శౌర్య పాపను పిలిపిస్తాడు. శౌర్య పాప ఇంట్లోకి రావడంతోనే కార్తీక్ బాబుపై ఉన్న కోపాన్ని శౌర్యపై చూపిస్తుంది.
అదే సమయంలో కార్తీక్ బాబు, దీపాలు వచ్చి అడ్డుకుంటారు. ఇక శౌర్య పాప సుమిత్ర అమ్మమ్మను చూసేందుకు వచ్చానని చెబుతుంది. ఆ వెంటనే సుమిత్ర గది దగ్గరకు వెళ్లి తలుపు కొడతారు. సుమిత్రను అమ్మమ్మ అని పిలుస్తుంది. కానీ దీపా అడ్డుకుంటుంది. అమ్మమ్మ కాదు అమ్మగారు అని పిలవాలని చెబుతుంది. దాంతో సుమిత్రకు కోపం వస్తుంది. శౌర్యను లోపలికి పంపించి దీపాతో మండిపడుతుంది. చిన్న పిల్లలతో అలానే పిలిపిస్తావా? అని ప్రశ్నిస్తుంది. మరోవైపు సుమిత్ర దీపాను, శౌర్యను ఎలా బాధపెడుతుందో చూడాలని జ్యోత్స్న, పారు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











