Karthika Deepam 2 June 19th : జ్యోత్స్న కు షాక్ ఇచ్చిన సుమిత్ర.. దీపా అసలైన గేమ్ స్టార్ట్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 18వ తేదీ 387వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపానే శివనారాయణ అసలు మనవరాలు అని, శివ నారాయణ వందల కోట్ల ఆసక్తికి వారుసురాలు అనే విషయం కార్తీక్ బాబు, దీపాకు కూడా తెలియడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జ్యోత్స్న ఆటలను, కుట్రలను కార్తీక్ బాబు దీపా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ జ్యోత్స్నను దెబ్బ తీస్తున్నారు. ఇప్పటికే దీపా కార్తీక్ బాబును బావ అని వరసపెట్టి పిలుస్తుండటంతో తట్టుకోలేక పోతుంది. ఎలాగైనా దీపాపై ప్రతీకారం తీర్చుకోవాలని జ్యోత్స్న రగిలి పోతోంది. అందుకు మాస్టర్ ప్లాన్స్ వేస్తూనే ఉంది. దీపా చేతితో సుమిత్రను భోజనం తినకుండా చేస్తుంది.

దీపాను చూచస్తేనే ఒళ్లు మండిపోయేలా, రక్తం మరిగిపోయేలా సుమిత్రను మార్చేస్తుంది. దాంతో దీపాపై కోపంతో సుమిత్ర భోజనం చేయకుండా అలానే పస్తులు ఉంటుంది. ఇక కార్తీక్ బాబు ఎలాగైనా దీపా చేసిన వంటలను సుమిత్రతో తినిపించాలని అనుకుంటాడు. దాంతో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. శౌర్య పాపను పిలిపించి సుమిత్రతో కడుపునిండా భోజనం తినిపించే ప్రయత్నం చేస్తాడు. శౌర్య వచ్చి అమ్మమ్మ అంటూ సుమిత్రను పిలుస్తుంది. అలా పిలవొద్దని, అమ్మగారు అని పిలవాలని దీపా శౌర్యకు చెబుతుంది. దాంతో సుమిత్ర దీపాను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 19వ తేదీ 388 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 388 June 19th 2025

దీపాపై కోపంతో సుమిత్ర తినడం మానేస్తుంది. దీపా చేతితో వండిన వంటలను అస్సలు ముట్టుకోనని, అస్సలు తినని చెబుతుంది. హోటల్ నుంచి తెప్పించిన భోజనాలను కూడా దీపా ముట్టుకుందని సుమిత్ర కోపంతో కింద పడేస్తుంది. ఆ తర్వాత నుంచి అస్సలు తినడానికి రాదు. తన గదిలోనే పస్తులు ఉంటుంది. దీపాను ఇంట్లో నుంచి పంపించిన తర్వాతనే తృప్తిగా భోజనం చేస్తానని అనుకుంటుంది. ఇదే క్రమంలో సుమిత్రమ్మతో ఎలాగైనా కడుపునిండా భోజనం చేయించాలని కార్తీక్ బాబు, దీపా అనుకుంటారు. అందుకు శౌర్య పాపను శివనారాయణ ఇంటికి పిలుస్తారు. శౌర్యతో కనీసం యాపిల్ అయినా తినిపించాలని అనుకుంటారు. ఈ సమయంలో సుమిత్ర గది దగ్గరకు వెళ్లి దీపా డోర్ కొడుతుంది. ఈలోపే శౌర్య సుమిత్రను అమ్మమ్మ అని పిలుస్తుంది. దాంతో దీపా శౌర్యను హెచ్చరిస్తుంది. అమ్మమ్మ కాదు అమ్మగారు అని పిలవాలని చెబుతుంది. ఆ మాటలు విన్న సుమిత్ర దీపాపై మండిపడుతుంది.

శౌర్యను తన గది లోపలికి పంపించి డోర్ పెట్టి బయట దీపాకు క్లాస్ పీకుతుంది. చిన్న పిల్లతో కూడా ఎందుకు అలా అమ్మగారు అని పిలిపిస్తున్నావని అడుగుతుంది. యజమానులను పనిమనుషులు, వారి పిల్లలు అమ్మగారు అనే పిలవాలి కదా అని దీపా సుమిత్రకు బదులిస్తుంది. నువ్వు పని మనిషివే కావచ్చు.. ఇంకేదైనా కావొచ్చు నీతో నాకు ఎలాంటి సంబంధమే లేదు. నువ్వు అస్సలు ఈ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు ఇక్కడే ఉండేందుకు భీష్మించుకొని కూర్చున్నావు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో శౌర్యకు నాకు సంబంధం ఉంది. కేవలం శౌర్యకు నాకు మాత్రం బంధం ఉంది. నీతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. ఆ మాట విన్న కార్తీక్ బాబు సంతోషిస్తాడు. శౌర్య నీ సొంత కూతురి బిడ్డనే అని మనస్సులో అనుకుంటాడు. ఇక జ్యోత్స్న కూడా చాటుగా ఈ మాటలు వింటూ.. తెలిసి అన్న తెలియక అన్న శౌర్య నీ రక్తమే మమ్మీ అని అనుకుంటుంది.దీపా కూడా ఇదే మాట కోసం ఎదురు చూస్తున్నానని అనుకుంటుంది.

ఇక సుమిత్ర తన గదిలోకి వెళ్తుంది. శౌర్యతో మాట్లాడుతుంది. దీపా చెప్పినట్టుగానే శౌర్య సుమిత్రను అమ్మగారు అని పిలుస్తుంది. మీరు ఏం తినడం లేదని అందరూ చెబుతున్నారు. కనీసం ఈ యాపిల్ తినండి అమ్మగారు అని శౌర్య పాప అడుగుతుంది. అసలు నువ్వు నన్ను అమ్మగారు అని ఎందుకు పిలుస్తున్నావే అని సుమిత్ర శౌర్య పాపను అడుగుతుంది. మా అమ్మ చెప్పింది కదా అని అలా పిలుస్తున్నాను అని అంటుంది. నువ్వు నన్ను ముందలానే పిలవాలి, లేదంటే మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్ చేస్తానని అంటుంది. దాంతో శౌర్య పాప ముందులాగే అమ్మమ్మ అని పిలుస్తానని అంటుంది. ఇక యాపిల్ తినమని శౌర్య పాప ఎంత బతిమిలాడిన తినదు. నేను ఇప్పుడు జ్యూస్ తాగేశానని అబద్ధం చెబుతుంది. అదే విషయాన్ని కార్తీక్ బాబు, దీపాలకు శౌర్య పాప చెబుతుంది. అమ్మమ్మ యాపిల్ తినలేదని, జ్యూస్ తాగానని చెప్పిందని చెబుతుంది. ఇక శౌర్య పాప అదే ఇంట్లో ఉంటానని మారం చేయడంతో కార్తీక్ బాబు బలవంతంగా పంపిస్తాడు. త్వరలోనే మనం అందరం ఇక్కడే ఉండబోతున్నామని చెబుతాడు. ఆ మాటలను జ్యోత్స్న, పారులు వింటారు.

ఇక భోజనానికి దీపా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా సుమిత్ర మాత్రం నీ చేతి వంటలు తినదు కదా అని అంటుంది. ఇవ్వాళ ఎలాగైనా తినిపిస్తామని దీపా, కార్తీక్ బాబు అంటారు. అస్సలు తినదని, కనీసం దీపా ముట్టుకుంటేనే భోజనం మానేస్తానని సుమిత్ర చెప్పింది కదా అని పారుజాతం అంటుంది. దాంతో కార్తీక్ బాబు ఇవ్వాళ కచ్చితంగా తినిపిస్తానని అంటుంది. అస్సలు తినదని జ్యోత్స్న కూడా గట్టిగా చెబుతుంది.సరే ఒక పందెం పెట్టుకుందామని కార్తీక్ బాబు అంటాడు. సుమిత్ర భోజనం చేస్తే నేను గుంజీలు తీస్తానని, మరి తినకపోతే నువ్వు గుంజీలు తీస్తావా? అని జ్యోత్స్న సవాల్ విసురుతుంది. కార్తీక్ బాబుకు బదులు నేను గుంజీలు తీస్తానని దీపా చెబుతుంది. ఇక జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ తో సుమిత్రను ఇంటి నుంచి రెస్టారెంట్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అందరూ టేబుల్ పై భోజనానికి కూర్చొంటే జ్యోత్స్న సుమిత్రను రెస్టారెంట్ కు తీసుకెళ్లి తినిపిస్తానని చెబుతుంది. అమ్మ దీపా చేతి వంట తినదని చెబుతుంది.

జ్యోత్స్న చెప్పినట్టుగానే సుమిత్ర కూడా దీపా చేతి వంట నేను తినని చెబుతుంది. ఇప్పుడు కాలుకు పెద్ద ఇబ్బంది లేదని, నేను కారులోనే వెళ్తాను కాబట్టి రెస్టారెంట్ లోనే తినేసి వస్తామని అంటుంది. కానీ దశరథ అడ్డుకుంటాడు. ఇక్కడ ఇన్ని వెరైటీలు ఉండగా నువ్వు మళ్లీ రెస్టారెంట్ కు వెళ్లి తినడం ఎందుకని ప్రశ్నిస్తాడు. ఈరోజు అన్నీ నీకు నచ్చిన వంటలే చేశారని చెబుతాడు దశరథ. అయినా సుమిత్ర తినని అంటుంది. దాంతో కార్తీక్ బాబు మరో ప్లాన్ వేస్తాడు. రివర్స్ సైకాలజీని వాడి సుమిత్రను దారిలోకి తెస్తాడు. దీపా వంటలు తింటే దీపాపై కోపం పోయి ప్రేమ వస్తుందనే తినడం లేదు కదా మీరు.. తినడానికి చాలా భయపడుతున్నారని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. నేను తిన్నాతినకపోయినా దీపాపై అభిప్రాయం మారదని సుమిత్ర చెబుతుంది. కానీ భయం మాత్రం ఉంది మీలో అంటూ కార్తీక్ బాబు పదే పదే అంటాడు. దాంతో సుమిత్ర భోజనం తిని దీపాపై ఎలాంటి అభిప్రాయం మారలేదని చెబుతానని వచ్చి తింటుంది. రుచికరమైన వంటలు తింటూ లోలోపల సంతోషిస్తుంది. పూర్తిగా తిన్న తర్వాత మాత్రం దీపాపై తనకు ఏ అభిప్రాయం మారలేదని అంటుంది. నా మనస్సుకు గాయం చేసిన హంతకురాలిగానే దీపా ఉండిపోతుందని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో దీపా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X