Karthika Deepam 2 June 20th : జ్యోత్స్నను గుంజీలు తీయించిన కార్తీక్ బాబు.. ఆయన్ని చంపేందుకు పారు కుట్ర
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 19వ తేదీ 388వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుమిత్ర భోజనం చేయడం లేదని దీపా చాలా బాధపడుతుంది. దీపాపై ఉన్న కోపంతో సుమిత్ర అస్సలు భోజనం చేయదు. దీపా చేతులతో వండిన భోజనాన్ని తినని చెబుతుంది. ఇక జ్యోత్స్న కూడా సుమిత్రను ఇంట్లో భోజనం చేయనివ్వకుండా చేస్తుంది. దాంతో దీపా ఇంకా బాధపడుతుంది. పైగా జ్యోత్స్న సుమిత్ర అస్సలు భోజనం చేయ్యదని, దీపా చేతి వంటను అస్సలు తినదని అంటుంది. అంతే కాదు కార్తీక్ బాబుతో పందెం కూడా కాస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం సుమిత్రతో భోజనం తినిపిస్తానని చెబుతాడు. అస్సలు జరగదని జ్యోత్స్న అంటుంది. ఒక వేళ పందెం ఓడిపోతే నేను గుంజీలు తీస్తానని, లేకపోతే నువ్వు గుంజీలు తీస్తావా? అని జ్యోత్స్న కార్తీక్ బాబుతో అంటుంది. దాంతో కార్తీక్ బాబు సరేనని అంటాడు.
ఇక సుమిత్ర అమ్మను భోజనం చేయించడానికి దీపా ప్రయత్నిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి భోజనం చేయ్యడానికి కూర్చొంటారు. ఇదే సమయంలో సుమిత్ర, జ్యోత్స్న కిందికి వస్తారు. మేం బయటికి వెళ్లి తింటామని, సుమిత్ర అమ్మను రెస్టారెంట్ కు తీసుకెళ్తున్నానని చెబుతుంది. కానీ దశరథ, శివనారాయణ మాత్రం ఇంట్లోనే భోజనం చేయొచ్చు కదా అని అడుగుతారు. అందుకు సుమిత్ర చేయనని చెబుతుంది. ఆ మనిషి వండిన వంటలు నేను తిననని చెబుతుంది. ఇక కార్తీక్ బాబు మాత్రం సుమిత్రను రెచ్చగొట్టి మరీ భోజనం చేసేలా చేస్తాడు. దీపా చేతితోనే వండిన వంటలను, దీపానే స్వయంగా వడ్డించి, సుమిత్ర తినేలా కార్తీక్ బాబు మాటలతో రెచ్చగొడుతాడు. ఎక్కడ దీపా వంటలను మెచ్చుకోవాల్సి వస్తుందోననే భయంతోనే నువ్వు తినడం లేదు అని అంటాడు. నేను తిన్నకూడా మెచ్చుకోనని, దీపాపై నా అభిప్రాయం అస్సలు మారదని అంటుంది సుమిత్ర. ఆ మాట తిన్నాక చెప్పమని కార్తీక్ బాబు అనడంతో వెంటనే తినడానికి ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 20వ తేదీ 389 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

సుమిత్రతో కార్తీక్ బాబు భోజనం తినిపించాలని ప్రయత్నించి సఫలమౌతాడు. కార్తీక్ బాబు రెచ్చగొట్టడంతో సుమిత్ర దీపా చేసిన వంటలను తింటుంది. అన్ని రకాల కూరలను రుచి చూస్తుంది. లోలోపల దీపా వంటలను మెచ్చుకుంటుంది. కానీ బయటికి మాత్రం అస్సలు దీపాను మెచ్చుకోదు. పూర్తిగా భోజనం తింటుంది. సుమిత్ర కడుపు నిండా భోజనం తినడంతో అందరూ సంతోషిస్తారు. కార్తీక్ బాబు, దీపా కూడా ఎంతో ఆనంద పడుతారు. కానీ జ్యోత్స్న, పారు జాతం మాత్రం అస్సలు జీర్ణించుకోలేక పోతారు. సుమిత్ర ఇంతలా షాక్ ఇచ్చిందేంటనీ కంగారు పడుతారు. ఇక సుమిత్ర పూర్తిగా భోజనం తిన్న తర్వాత దీపాపై షాకింగ్ గా స్పందిస్తుంది. దీపా వండిన వంటలు తిన్నా కూడా నాకు ఆమెపై ఎలాంటి అభిప్రాయం మారలేదని చెబుతుంది. నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ హంతకురాలు లానే ఉంటావని కఠినంగా మాట్లాడుతుంది. నేను నీపై పెంచుకున్న నమ్మకాన్ని నువ్వు హత్య చేశావని సుమిత్ర దీపాతో అంటుంది. ఈ జీవితంలో నిన్ను క్షమించబోనని, నీతో బంధం మళ్లీ కుదరదని చెబుతుంది.
సుమిత్ర ఇంత కఠినంగా మాట్లాడటంతో దీపా చాలా బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న, పారులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. దీపాను సుమిత్ర దూరం చేస్తుండటంతో ఆనందపడుతారు. కానీ జ్యోత్స్న కార్తీక్ బాబుతో కట్టిన పందెంలో మాత్రం ఓడిపోతుంది. సుమిత్రతో కార్తీక్ బాబు భోజనం తినిపించి పందెంలో నెగ్గడంతో గుంజీలు తీయించాలని అనుకుంటాడు. దీంతో నెమ్మదిగా హాలులో నుంచి జారుకుంటున్న జ్యోత్స్న, పారులను అడ్డుకుని గుంజీలు తీయాలని అంటాడు. సుమిత్రకు దీపాపై ఇంకా కోపం పోలేదు కదా అని జ్యోత్స్న అంటుంది. పందెం ప్రకారం సుమిత్ర గారెతో భోజనం చేయించానని కార్తీక్ బాబు చెబుతాడు. అందుకు నువ్వు ఓడిపోయావు కాబట్టి గుంజీలు తీయాల్సిందేనని అంటాడు. ముందు జ్యోత్స్న గుంజీలు తీయడానికి అస్సలు ఒప్పుకోదు. కానీ కార్తీక్ బాబు పట్టుబట్టి మరీ జ్యోత్స్న తో గుంజీలు తీయిస్తాడు.
జ్యోత్స్న తో కార్తీక్ బాబు గుంజీలు తీయిస్తాడు. జ్యోత్స్న కూడా పందెంలో ఓడిపోయాన ని ఒప్పుకుంటుంది. ఎన్ని గుంజీలు తీయాలని అడుగుతుంది. నేను ఆపమని చెప్పే వరకు నువ్వు గుంజీలు తీస్తూనే ఉండాలని అంటాడు. అందుకు సరేనని జ్యోత్స్న గుంజీలు తీయడం ప్రారంభిస్తుంది. జోష్ణ గుంజీలు తీస్తుంటే దీప లెక్కబెడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న పారిజాతం ఇక ఆపమని చెప్పొచ్చు కదా అని కార్తీక్ బాబుతో అంటుంది. జ్యోత్స్నకు బదులుగా నువ్వు గుంజీలు తీస్తానంటే ఆపుతానని కార్తీక్ బాబు అంటాడు. నావల్ల కాదని పారిజాతం తప్పించుకుంటుంది. ఇక జ్యోత్స్నతో కార్తీక్ బాబు ఏకంగా 50 గుంజీలు తీయిస్తాడు.
జోష్ణ చాలా అలసిపోతుంది. ఒంట్లో శక్తి తగ్గి కింద పడబోతుంది. అదే సమయంలో పారిజాతం పట్టుకుంటుంది. ఇక అంత గుంజీలు తీసినప్పటికీ కార్తీక్ బాబుపై జ్యోత్స్న మరో సవాల్ చేస్తుంది. ఏదో ఒక రోజు నీతో 100 గుంజీలు తీస్తానని హెచ్చరిస్తుంది. సరే చూసుకుందాంలే అని కార్తీక్ బాబు కూడా అంటాడు. ఇక కార్తీక్ బాబు దీప ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడ శౌర్య పాప సుమిత్ర గురించి కాంచన, అనసూయలతో మాట్లాడుతుంది. అమ్మమ్మ చాలా మంచిదని, తనకు ఆపిల్ కూడా తినిపించిందని చెబుతుంది. కానీ భోజనం చేయలేదు కదా అని కాంచన ఉంటుంది. అదే సమయానికి కార్తీక్ బాబు దీప వచ్చి సమాధానం ఇస్తారు. భోజనం చేయకుంటే మేము ఎలా ఊరుకుంటామని అంటాడు.
సుమిత్ర అమ్మవారితో భోజనం చేయించామని చెబుతారు. ఎంత భోజనం చేయించిన సుమిత్రమ్మ దీపాను కూతురిలా చూడడం లేదు కదా అని కాంచన అంటుంది. మరోవైపు దీపాపై అనసూయకు అనుమానం వస్తుంది. సుమిత్ర విషయంలో అంతలా భావోద్వేగం అవుతున్న దీప ఏదో దాస్తుందని సందేహిస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు జ్యోత్స్నకు గుంజీలు తీయడంతో కాళ్లు నొప్పులు వస్తాయి. ఇక పారు మందు రాస్తూ సాయం చేస్తుంది. దాసు నిజం చెప్పినట్టు ఉన్నాడని, అందుకే దీపా కార్తీక్ బాబుల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని అంటుంది జ్యోత్స్న. నా కొడుకు దాసు అసలు కనిపించడమే లేదు. పైగా గతం మర్చిపోయాడు కాబట్టి చెప్పే అవకాశం లేదు. ఇక నేను నిన్ను ఈ ఇంట్లో ఏ స్థానంలో చూడాలనుకున్ననో అది చేసి తీరుతానని, అవసరం అయితే ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











