Karthika Deepam 2 June 21st : కార్తీక్ బాబు, దీపాల గుట్టు తెలుసుకున్న జ్యోత్స్న.. వంటలక్క పతనానికి వ్యూహం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 20వ తేదీ 387వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. భోజనానికి దీపా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా సుమిత్ర మాత్రం నీ చేతి వంటలు తినదు కదా అని అంటుంది. ఇవ్వాళ ఎలాగైనా తినిపిస్తామని దీపా, కార్తీక్ బాబు అంటారు. అస్సలు తినదని, కనీసం దీపా ముట్టుకుంటేనే భోజనం మానేస్తానని సుమిత్ర చెప్పింది కదా అని పారుజాతం అంటుంది. దాంతో కార్తీక్ బాబు ఇవ్వాళ కచ్చితంగా తినిపిస్తానని అంటుంది. అస్సలు తినదని జ్యోత్స్న కూడా గట్టిగా చెబుతుంది.సరే ఒక పందెం పెట్టుకుందామని కార్తీక్ బాబు అంటాడు. సుమిత్ర భోజనం చేస్తే నేను గుంజీలు తీస్తానని, మరి తినకపోతే నువ్వు గుంజీలు తీస్తావా? అని జ్యోత్స్న సవాల్ విసురుతుంది. కార్తీక్ బాబుకు బదులు నేను గుంజీలు తీస్తానని దీపా చెబుతుంది. ఇక జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ తో సుమిత్రను ఇంటి నుంచి రెస్టారెంట్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అందరూ టేబుల్ పై భోజనానికి కూర్చొంటే జ్యోత్స్న సుమిత్రను రెస్టారెంట్ కు తీసుకెళ్లి తినిపిస్తానని చెబుతుంది. అమ్మ దీపా చేతి వంట తినదని చెబుతుంది.

జ్యోత్స్న చెప్పినట్టుగానే సుమిత్ర కూడా దీపా చేతి వంట నేను తినని చెబుతుంది. ఇప్పుడు కాలుకు పెద్ద ఇబ్బంది లేదని, నేను కారులోనే వెళ్తాను కాబట్టి రెస్టారెంట్ లోనే తినేసి వస్తామని అంటుంది. కానీ దశరథ అడ్డుకుంటాడు. ఇక్కడ ఇన్ని వెరైటీలు ఉండగా నువ్వు మళ్లీ రెస్టారెంట్ కు వెళ్లి తినడం ఎందుకని ప్రశ్నిస్తాడు. ఈరోజు అన్నీ నీకు నచ్చిన వంటలే చేశారని చెబుతాడు దశరథ. అయినా సుమిత్ర తినని అంటుంది. దాంతో కార్తీక్ బాబు మరో ప్లాన్ వేస్తాడు. రివర్స్ సైకాలజీని వాడి సుమిత్రను దారిలోకి తెస్తాడు. సుమిత్రతో భోజనం తినిపిస్తాడు. దాంతో పందెం ఓడిపోయిన జ్యోత్స్నతో గుంజీలు కూడా తీయిస్తాడు. ఇక కార్తీక్ బాబు, దీపాలపై జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. వాళ్లకు నిజం తెలిసిపోయినట్టు ఉందని జ్యోత్స్న పారుజాతంతో చర్చిస్తుంది.ఈ క్రమంలో ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 21వ తేదీ 390 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 390 June 21st 2025

దీపాపై జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. అసలు మనవరాలు దీపానే అనే విషయం తెలిసిపోయిందా అని సందేహిస్తుంది. వెంటనే ఆ గుట్టు తెలుసుకోవాలని అనుకుంటుంది. ముందు దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, దాసు వీళ్లకు నిజం చెప్పేసినట్టు ఉన్నాడని అనుమానిస్తుంది. మనకు ముందుగా దాసు దొరికితేనే అసలు విషయం తెలుసుకోగలమని జ్యోత్స్న పారుజాతంతో అంటుంది. దాంతో పారుజాతం కూడా మండిపోతుంది. దాసుకు గతమే గుర్తుకు లేదని, వాడి వల్ల ఎలాంటి సమస్య రాదని అంటుంది. కానీ కార్తీక్, దీపా నిన్ను ఈ ఇంటికి వారసురాలిని కాకుండా చేస్తున్నారని, మరోవైపు దశరథ, శివనారాయణ కూడా ఎప్పటికప్పుడు తమ ప్లాన్స్ పై దెబ్బ కొడుతూనే ఉన్నారని పారుజాతం అంటుంది. కానీ వారివల్ల ఎలాంటి నష్టం జరగదని, ఏదైనా విపత్తు వస్తే మాత్రం ఇంటిల్లిపాదిని చంపేస్తానని పారుజాతం అంటుంది. ఇదిలా ఉంటే జ్యోత్స్నకు మరోవైపు తమ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి సమస్య ఎదురవుతుంది.

తమకు కొన్నాళ్లుగా జీతాలు పెరగడం లేదని, బోనస్ లు ఇవ్వడం లేదని మండిపడుతారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులంతా శివ నారాయణ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు. మా సమస్యలను పరిష్కరించకపోతే మొత్తం 400 మంది ఉద్యోగులతో స్ట్రైక్ చేస్తామని హెచ్చరిస్తారు. కంపెనీ సీఈవో బాధ్యతలు చూస్తున్న జ్యోత్స్న తమకు జీతాల పెంపు, బోనస్ లు ఉండవని తేల్చి చెప్పారని, కానీ మా డిమాండ్లను పరిష్కరిస్తేనే తిరిగి ఉద్యోగంలో చేరుతామని హెచ్చరిస్తారు. జ్యోత్స్న మేడమ్, శివ నారాయణ గారు మా సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చే జీతాలకు మా కుటుంబాన్ని కూడా పోషించలేకపోతున్నామని చెబుతారు. రెండు రోజుల్లో తమ సమస్యను పరిష్కరించాలని సమయం ఇచ్చి వెళ్లిపోతారు. ఇక శివనారాయణ వర్కర్స్ డిమాండ్లను విని రగిలిపోతాడు. ముందుగా ఇంతటి పరిస్థితి తీసుకొచ్చిన జ్యోత్స్నపై మండిపడుతాడు. కంపెనీ సీఈవో బాధ్యతలు అప్పగించినందుకు నువ్వు నిండా ముంచావు కదా అని జ్యోత్స్న పై శివనారాయణ ఫైర్ అవుతాడు.

ఇక తమ ముందు రెండే రెండు దార్లు ఉన్నాయని శివనారాయణ అంటాడు. వర్కర్స్ డిమాండ్లను నెరవేర్చడం, లేదంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీలను మూసివేయడం తప్ప మరే దారిలేదని మండిపోతాడు. అయితే ఉద్యోగులు వచ్చి తమ డిమాండ్లను చెప్పడం, జ్యోత్స్న పై శివ నారాయణ మండిపడటం వంటి విషయాలను కార్తీక్ బాబు, దీపా పక్కనే ఉండి గమనిస్తూ ఉంటారు. ఇక శివ నారాయణ చాలా బాధపడుతుంటే దీపా చూస్తూ ఊరుకోకుండా సమస్యను పరిష్కరించమని కార్తీక్ బాబును కోరుతుంది. మనం సాయం చేసినా వారు తీసుకోరని, ఒక డ్రైవర్ సలహానిస్తే తీసుకునే స్థాయిలో లేమని అంటారని దీపాకు చెబుతాడు. కానీ దీపాకోసం కార్తీక్ బాబు సలహానిచ్చేందుకు ఒప్పుకుంటాడు. వెళ్లి సాయం చేస్తానని, తన దగ్గర ఐడియా ఉందని చెబుతాడు. ముందుగా ఉద్యోగులందరినీ పిలిపించమని కార్తీక్ బాబు అంటాడు. అయితే కార్తీక్ బాబు ఊహించినట్టుగా డ్రైవర్ గా పని చేస్తున్న వాడి సలహా మాకేమద్దు అని శివ నారాయణ అంటాడు.

కానీ, దశరథ మాత్రం కార్తీక్ బాబును సలహానిచ్చేందుకు అనుమతిస్తాడు. కార్తీక్ బాబు క్వాలిఫికేషన్ డ్రైవర్ ఉద్యోగం కాదని, ఒకప్పుడు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు సీఈవోగా పని చేశారని గుర్తు చేస్తాడు. అలాగే డౌన్ లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ ను తన తెలివి తేటలతో సిటీలోనే నెంబర్ వన్ 1గా మార్చాడని దశరథ చెబుతాడు. ఇలాంటి సమయంలో కార్తీక్ బాబు వంటి వాళ్ల సలహాలు అవసమని దశరథ వివరిస్తాడు. దాంతో శివనారాయణ సరేనని అంటాడు. ఒక వేళ కార్తీక్ బాబు చెప్పిన ఐడియా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలని అడుగుతాడు. జ్యోత్స్న కు అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చే డబ్బుల్లో ఇంకో 10% శాతం పెంచుకోండి అని అంటాడు. మరీ గెలిస్తే ఏమీస్తారని దీపా శివనారాయణను అడుగుతుంది. ఏదీ అడిగితే అదే ఇస్తానని చెబుతాడు. ఇక కార్తీక్ బాబు వెంటనే ఉద్యోగులను పిలిపించి మాట్లాడుతాడు. ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉందని, అయినా మీరు అన్నుకున్న దానికంటే ఎక్కువనే డబ్బులు ఇస్తామని చెబుతాడు. ఇప్పటికిప్పుడు మీ జీతాలు పెంచలేము గానీ, మీకు వడ్డీలేని రుణాలు ఇస్తాం, అలాగే కంపెనీ లాభాల్లో 25 శాతం మీకే పంచుతామని నచ్చ చెబుతాడు. దాంతో అందరూ అంగీకరిస్తారు. ఇక శివ నారాయణతో పందెం గెలుస్తాడు. అందరూ కార్తీక్ బాబును మెచ్చుకుంటారు. శివ నారాయణ మాత్రం కార్తీక్ బాబును మాట్లాడాలని చెప్పి ఇంట్లోనికి రమ్మంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X