Karthika Deepam 2 June 23rd : పట్టుకోల్పోతున్న జ్యోత్స్న.. పెత్తనం మొత్తం ఇక కార్తీక్ బాబుకే
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 21వ తేదీ 390వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ నారాయణ ఇంట్లో కొత్త సమస్య మొదలవుతుంది. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కు సీఈవోగా పనిచేస్తున్న జ్యో వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటారు. వారిని సరిగా చూసుకోవడం లేదని అందరూ ఇంటికి వచ్చి ధర్నా చేస్తారు. తమకు జీతాలు పెంచడం లేదని, బోనస్ లు ఇవ్వడం లేదని, ఇంకా తమ సమస్యలు అస్సలు పట్టించుకోవడం లేదని ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం వందలాది మంది ఉద్యోగులతో ధర్నా చేస్తామని హెచ్చరిస్తారు. రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేదంటే అస్సలు ఊరుకోబోమని చెబుతారు. ఇక శివనారాయణ చాలా టెన్షన్ పడుతారు. ఎప్పుడూ లేనిది ఉద్యోగులు ఇంటికి వచ్చి నిలదీయడాన్ని జీర్ణించుకోలేక పోతారు.
ఉద్యోగులు ఇంటి ముందు నుంచి వెళ్లిపోయిన తర్వాత శివనారాయణ జ్యోత్స్నపై మండిపడుతాడు. కంపెనినీ దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చావని ఫైర్ అవుతాడు. సీఈవోగా బాధ్యతలు ఇచ్చినందుకు గొప్ప ఘనకార్యం చేశావని మందలిస్తాడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇలా ఎదురు తిరగలేదని, ఇక నువ్వు కంపెనీని ఎలా చూసుకుంటున్నావో నాకు అర్థమైపోయిందని అంటాడు. ఇక జ్యోత్స్న చేసిన ఘనకార్యానికి కేవలం రెండు దారులే ఉన్నాయని అంటాడు. అయితే కంపెనీ నష్టాల్లో ఉన్నా కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, లేదంటే కంపెనీని మూసుకోవడం తప్ప మరే దారి లేదని శివ నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తాడు. కానీ ఆ సమస్యను పరిష్కారం ఉందని కార్తీక్ బాబు ఉద్యోగులతో మాట్లాడి పరిష్కరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 23వ తేదీ 391 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

శివనారాయణ కంపెనీకి వచ్చిన సమస్యను కార్తీక్ బాబు పరిష్కరించడంతో దశరథ, శివనారాయణ సంతోషిస్తాడు. అంతకు ముందు తను గెలిస్తే శివనారాయణ అడిగింది ఇవ్వాలని కార్తీక్ బాబు అంటాడు. ఓడిపోతే జ్యోత్స్నకు ఇవ్వాల్సిన అప్పును ఇంకా పెంచుకోండి అని అంటారు. ఇక కార్తీక్ బాబు ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంతో పోటీలో నెగ్గుతాడు. అయితే ఉద్యోగులంతా వెళ్లిపోవడంతో పారుజాతానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది శ్రీధర్ నుంచి. ఆ ఉద్యోగులను ధర్నాకు పంపించిందే నేనని పారుతో చెబుతాడు. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. ఇక ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యిందని, కానీ ఈ సమస్యను పరిష్కరిస్తే శివనారాయణ కార్తీక్ బాబుకు అడిగి ఇస్తానని హామీనిచ్చాడని చెబుతుంది. దాంతో శ్రీధర్ చాలా సంతోష పడుతాడు. ఇక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడని, దాంతో నా కొడుకు ఆ ఇంటి నుంచి పని మనిషిగా వెళ్లిపోయి నా పరువు కాపాడుతాడని అంటుంది.
ఇక శివనారాయణ వెంటనే కార్తీక్ బాబుతో పాటు అందరూ ఇంట్లో వస్తారు. దీంతో కార్తీక్ బాబు చేసిన పనికి మెచ్చుకుంటాడు దశరథ. నీ సామర్థ్యం, సమర్దతత అన్నీ నాకు తెలుసని, నువ్వు ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన తీరు ఎంతగానో నచ్చిందని అంటాడు. ఇక శివనారాయణ కూడా ఊరికే నీ సాయం మాకేం వద్దు. అయినా నువ్వు పోటీలే గెలిస్తే ఏదైనా ఇస్తానని చెప్పాను కాబట్టి.. నువ్వు ఏది అడిగినా ఇస్తానని అంటాడు. నీకు కావాల్సింది కోరుకోమని చెబుతాడు.దాంతో కార్తీక్ బాబు మరీ ఏదీ అడిగినా ఇవ్వాలని, ఇందుకు మళ్లీ ఇంట్లో వాళ్లు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని అంటాడు. వాళ్లందరి తరుఫున నేనే మాటిస్తున్నాను, నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానని శివ నారాయణ చెబుతాడు. దీంతో కార్తీక్ నాకు అగ్రిమెంట్ ను క్యానిల్స్ చేయడం కావాలని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే కార్తీక్ బాబు తన చేతిలో నుంచి జారిపోతాడని పారుతో అంటుంది. ఏదైనా ఉపాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇదే సమయంలో శివ నారాయణ స్పందిస్తూ నువ్వు అవకాశ వాదివి అనే సంగతి నాకు ఎప్పుడో తెలుసురా అని కార్తీక్ బాబును అంటాడు. నువ్వు సరిగ్గా అగ్రిమెంట్ నే క్యాన్సిల్ చేయమని అడుగుతావనుకున్నాను. ఇప్పుడు అలాగే అడిగావని అంటాడు. కానీ కార్తీక్ బాబు మళ్లీ వెంటనే మాట మార్చేస్తాడు. నేను అలాగే అంటానని మీరందరూ అనుకున్నారు కదా.. కానీ నేను అది అడగను అని అంటాడు. మరీ ఇంకేం కావాలో చెప్పమని దశరథ, శివనారాయణ అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు నేను అడుగుతానులే అని బదులిస్తాడు. ఇక శివనారాయణ మాత్రం నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇవ్వాలి అనుకున్నప్పుడే ఇస్తానని అంటాడు. దాంతో వెంటనే చెక్ బుక్ తీసుకొచ్చి బ్లాంక్ చెక్ పై సంతకం చేసి ఇస్తాడు. ఎంత కావాలో రాసుకోమని అవకాశం ఇస్తాడు. ఇక ఆ బ్లాంక్ చెక్ ను కార్తీక్ బాబు వాడుకోకుండా నేరుగా జ్యోత్స్నకు ఇస్తాడు. నీకు అప్పు ఉన్నాను కదా.. ఈ చెక్ లో ఎంత రాసుకుంటావో రాసుకో.. అంత బాకీ తీరిపోయినట్టు అవుతుందని అంటాడు.
కానీ జ్యోత్స్న కార్తీక్ బాబుకు షాక్ ఇస్తుంది. బ్లాంక్ చెక్ పై కేవలం ఒక రూపాయి మాత్రమే రాస్తుంది. దాంతో కార్తీక్ బాబు,దీపా ఆశ్చర్యపోతారు. నువ్వు ఇచ్చిన చెక్ పై నేను ఒక్క రూపాయి మాత్రమే రాశాను. అంటే మీరు నాకు ఇంకా 99,99,99,999 రూపాయాలు అప్పు తీర్చాలని అంటుంది. ఇక కార్తీక్ బాబు కూడా సరేనని అంటాడు. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నందుకు నేనేమీ చేయలేను అని శివనారాయణ వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ మీకో గిఫ్ట్ ఇస్తున్నానని చెబుతాడు. ఇంటి ముందు ఉన్న స్కూటీని మీరే ఉంచుకోండి, పెట్రోల్ ఖర్చులు కూడా మేమే ఇస్తామని అంటాడు. దాంతో కార్తీక్ బాబు, దీపా సంతోషిస్తారు. ఇక శివనారాయణ సమస్యను పరిష్కరించినందుకు కార్తీక్ బాబుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతాడు. అది చూసిన జ్యోత్స్న జీర్ణించుకోలేక పోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










