Karthika Deepam 2 June 24th : శివనారాయణ మనస్సు మార్చేసిన కార్తీక్ బాబు.. జ్యోత్స్నకు బిగుస్తున్న ఉచ్చు
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 23వ తేదీ 391వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న వల్ల వచ్చిన సమస్యను కార్తీక్ బాబు పరిష్కరిస్తాడు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఉద్యోగుల సమస్యలతో శివ నారాయణ ఇంటికి వచ్చి ధర్నా చేస్తుంటారు. దీంతో కార్తీక్ బాబు వారికి కావాల్సినవి ఇస్తామంటూనే మరోవైపు కంపెనీకి ఉద్యోగులు చేయాల్సిన పనిని కూడా వివరిస్తాడు. దాంతో వారందరూ సరేనని అంటారు. ఇక ఉద్యోగుల సమస్యను పరిష్కరించినందుకు గాను శివనారాయణ కార్తీక్ బాబును అభినందిస్తాడు. ఇదే విషయమై పందెం వేయగా కార్తీక్ బాబు నెగ్గుతాడు. దీంతో ఏది కోరుకున్నా కూడా ఇస్తానని అంటాడు.
ఇక కార్తీక్ బాబు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అనబోయి మాట మార్చుతాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను లే అని అంటాడు.అప్పటి వరకు నేను ఆగలేనని శివనారాయణ కార్తీక్ బాబుకు బ్లాంక్ చెక్ రాసిచ్చి ఎంత కావాలో రాసుకోమని అంటాడు. ఇక ఆ బ్లాంక్ చెక్ ను కార్తీక్ బాబు జ్యోత్స్న కు ఇస్తాడు. నీకు ఇవ్వాల్సిన అప్పులో ఎంత కావాలో అంత రాసుకోమని కార్తీక్ బాబు చెబుతాడు. కానీ జ్యోత్స్న ఒక్క రూపాయి మాత్రమే రాస్తుంది. దీంతో నువ్వు నాకు ఒక్క రూపాయి తక్కువ 10 కోట్లు చెల్లించాలని కార్తీక్ బాబుకు షాక్ ఇస్తుంది. ఇక కార్తీక్ బాబుకు శివనారాయణ మరో గిఫ్ట్ గా స్కూటీ ఇస్తాడు. దాంతో కార్తీక్ బాబు, దీపా సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 24వ తేదీ 392 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు జ్యోత్స్నకు షాక్ ఇద్దామని అనుకుంటే.. జ్యోత్స్నకే కార్తీక్ బాబుకు షాక్ ఇస్తుంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో శివనారాయణ కార్తీక్ బాబును మెచ్చుకుంటారు. ఈ క్రమంలో కార్తీక్ బాబును ఇంట్లోకి పిలిచి నువ్వు కోరుకున్నది ఇస్తానని అంటాడు. ఏం కావాలో చెప్పమని అంటాడు. కార్తీక్ బాబు ఇప్పుడేం వద్దని, అవసరం ఉన్నప్పుడు అడుగుతానని అనడంతో అలా కుదరదని అంటాడు శివనారాయణ. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వలేను.. నేను ఇస్తాననుకున్నప్పుడు మాత్రమే ఇస్తానని చెబుతాడు. దీంతో కార్తీక్ బాబుకు బ్లాంక్ చెక్ రాసిస్తాడు.ఆ బ్లాంక్ చెక్ ను కార్తీక్ బాబు జ్యోత్స్నకు ఇస్తాడు. జ్యోత్స్న కార్తీక్ బాబు దగ్గర తీసుకోవాల్సిన అప్పులో కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకుంటుంది. అయితే ఇందంతా కార్తీక్ బాబు ఎందుకు చేశాడని శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా అడగమని అన్నప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడగొచ్చు కదా, లేదంటే డబ్బు, నగలు.. చివరిగా బ్లాంక్ చెక్ నైనా వినియోగించుకోవాలి కదా కానీ కార్తీక్ బాబు అలా చేయలేదు. చెక్ ను కూడా జ్యోత్స్నకు ఇచ్చేశాడు.
కేవలం నేనిచ్చిన సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకొని మురిసిపోతన్నాడు. ఈ విషయంలోనే నాకు కార్తీక్ బాబుపై అనుమానం వ్యక్తం అవుతోందని శివనారాయణ అంటాడు. అసలు మన ఇంటికి కార్తీక్ బాబు డబ్బు కోసం రాలేదని, ఆస్తిలో వాట కోసం కూడా రాలేదని స్పష్టం అవుతోంది. ఇంకేదో వాడి మనస్సులో ఉందని శివనారాయణ అంటాడు.దాంతో కొడుకు దశరథ స్పందిస్తూ కార్తీక్ బాబుకు మనమంటే పిచ్చి ప్రేమ నాన్న, అంతకు మెచ్చి ఇంకేమీ లేదని చెబుతాడు. అది ప్రేమే అయితే జ్యోత్స్న మీద కేసులు ఎందుకు పెడుతాడు, పోలీసులను మన ఇంటికి పదే పదే ఎందుకు పంపిస్తాడని శివనారాయణ అంటాడు. అది కేవలం జ్యోత్స్నపై ఉన్న అనుమానంతో మాత్రమే నాన్న అని చెబుతాడు. జ్యోత్స్న తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడ ఉంది. దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని అంటాడు. కార్తీక్ బాబు మంచి వాడని శివనారాయణకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. బయటికి కార్తీక్ బాబుపై ప్రేమను చూపించకపోయినా కార్తీక్ బాబు ఏదో మార్చే ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం సందేహిస్తాడు.
మరోవైపు కార్తీక్ బాబు ఎప్పుడో మారిపోయాడని, ఇప్పుడు వాడు మన కార్తీక్ కాదని, దీపా భర్త కార్తీక్ బాబు అని అంటుంది సుమిత్ర. ఇక మారింది కార్తీక్ బాబు కాదు మన కూతురు జ్యోత్స్న అని దశరథ మనస్సులో అనుకుంటాడు. జ్యోత్స్న వైపే కన్నార్పకుండా చూస్తుంటాడు. జ్యోత్స్న మనకు తెలియకుండా ఏదో ఏదో చేస్తుందని, చాలా దారుణాలకు పాల్పడుతున్నదని అంటాడు. ఇంకా ఏం చేస్తుందో తెలియడం లేదని కంగారు పడుతాడు. ఇక జ్యోత్స్ననే అలా చూస్తూ ఉండటంతో దశరథను ఏమైంది డాడీ అని అడుగుతుంది. దాంతో దశరథ తేరుకొని భోజనం చేద్దాం రామ్మ అని పిలుస్తాడు. జ్యోత్స్న ఇక నాకు ఆకలిగా లేదని చెప్పి పైన తన గదిలోకి వెళ్లిపోతుంది. అసలు కార్తీక్ బాబు, దీపాలకు ఏదో జరిగిందని, శివ నారాయణ అసలు వారసురాలి గురించి నిజం తెలిసి పోయిందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అంత పెద్ద బ్లాంక్ చెక్ ఇచ్చినా కూడా కార్తీక్ బాబు తీసుకోలేదని అంతుచిక్కక తల బాదుకుంటుంది. ఇదే సమయంలో జ్యోత్స్నకు మరో షాక్ తగులుతుంది.
దీపా జ్యోత్స్న మొబైల్ కు కార్తీక్ బాబు, దీపాలు ఇద్దరు కలిసి శివనారాయణ ఇచ్చిన స్కూటీపై దిగిన ఫొటోలు, వారిద్దరూ డ్యూయెట్ పాడుకున్న ఫొటోలను, వీడియోలను పంపిస్తుంది. అది కూడా కార్తీక్ బాబు ఫోన్ నుంచి సెండ్ చేస్తుంది. ఆ ఫొటోలు, వీడియోలు చూసిన జ్యోత్స్న మండిపోతుంది. అసలు వాళ్ల ఫొటోలు, వీడియోలు నాకెందుకు పంపించారని జ్యోత్స్న అనుమాన పడుతుంది. ఆ వెంటనే దీపా ఫోన్ చేస్తుంది. నీకు పంపించినా ఫొటోలు వీడియోలు ఎలా ఉన్నాయని అడుగుతుంది. అవి నాకెందుకు పంపించావని జ్యోత్స్న మండిపోతుంది. అందరూ ఆ ఫొటోలు చాలా బాగున్నాయని అంటున్నారు. ఇక నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫొటోలు పంపించాను. స్కూటీపై మా స్టిల్స్ బాగున్నాయా? లేదా? అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న చిర్రెత్తిపోతుంది. ఇదంతా మున్నాళ్ల ముచ్చటలేనని, నీది కాని బావతో ఎన్నాళ్లు సంబర పడుతావో సంబరపడమని అంటుంది. ఇక దీపా కూడా అదే రిపీట్ చేస్తుంది. నీది కాని దానిని నీ సొంతంగా అనుభవించడం కూడా మున్నాళ్ల ముచ్చటే అవుతుందని, ముందు ముందు నీకే అన్ని తెలుస్తాయని అంటుంది. ఇక దీపాకు నిజం తెలిసి పోయిందని, వెంటనే దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. దీపాపై దొంగతనం నిందమోపించి ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











