Karthika Deepam 2 June 25th : దీపాపై శివ నారాయణ ఫైర్.. జ్యోత్స్న, పారుల కుట్ర
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 23వ తేదీ 391వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబుకు శివనారాయణ బ్లాంక్ చెక్ ఇచ్చిన ఎందుకు తీసుకోలేదని జ్యోత్స్న ఆలోచిస్తుతుంది. మరోవైపు శివనారాయణ కూడా కార్తీక్ బాబు తన ఇంటికి డబ్బుల కోసమే, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికో, ఆస్తిలో వాటా అడగటానికో రాలేదని తెలుసుకుంటాడు. ఇంకేదో చేయబోతున్నాడని శివనారాయణ పసి గడుతాడు. మరోవైపు జ్యోత్స్న కూడా కార్తీక్ బాబు, దీపాల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తన గురించి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకు తన గుట్టు తెలియక ముందే కార్తీక్ బాబు, దీపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ దీపా జ్యోత్స్నకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తుంది.
శివ నారాయణ కార్తీక్ బాబు చేసిన సాయానికి సెకండ్ హ్యాండ్ స్కూటీ గిఫ్ట్ గా అందిస్తాడు. దానితో కార్తీక్ బాబు, దీపా ఇద్దరు ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వాటిని దీపా కావాలనే జ్యోత్స్నకు పంపిస్తుంది. ఫోన్ చేసి మరీ మేం ఇద్దరం ఎలా ఉన్నామని అడుగుతుంది. నీ అభిప్రాయం తెలుసుకోవాలని దీపా అంటుంది. దాంతో చిర్రెత్తిపోయిన జ్యోత్స్న ఇదంతా మున్నాళ్ల ముచ్చేటనేని, నీ ఆటలు ఇకపై సాగవని జ్యోత్స్న అంటుంది. దాంతో దీపా మాస్టర్ స్ట్రోక్ ఇస్తుంది. నేనూ నీకు అదే చెబుతున్నాను మనది కానిదానిని మనది అనుకోని ఫీల్ అవ్వడం మున్నాళ్ల ముచ్చటే అవుతుందని బదులిస్తుంది. దాంతో దీపాకు నిజం తెలిసిపోయిందని జ్యోత్స్న కన్ఫమ్ అవుతుంది. వెంటనే దీపాను ఇంట్లో నుంచి పంపించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు దొంగతనం నింద వేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 25వ తేదీ 393 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను కార్తీక్ బాబును కలిపి ఇంట్లో ఉంచకూడదని, అలాగైతే తన వ్యూహాలేవీ పారడం లేదని జ్యోత్స్న అభిప్రాయపడుతుంది. అసలే దీపా కార్తీక్ బాబుతో దిగిన ఫొటోలు, వీడియోలు పంపంచి మరీ వార్నింగ్ ఇవ్వడంతో కంగారు పడుతుంది. మనది కాని దాన్ని మనదని కానీ దాన్ని మనదిగా ఫీలవ్వడం మున్నాళ్ల ముచ్చటే అవుతుంది దీపా జ్యోత్స్న తో అంటుంది. దీపా మాటలకు జ్యోత్న్న టెన్షన్ పడుతుంది. దీపాకు కచ్చితంగా నిజం తెలిసిందన స్పష్టం చేసుకుంటుంది. ఇక దాసునే ఈ విషయాన్ని చెప్పి ఉంటాడని అనుమానిస్తుంది. కానీ మధ్యలో పారు రావడంతో అసలు విషయం చెప్పకుండా దాసు వల్ల దీపాకు నేను అసలు వారసురాలిని కాదని తెలిసిపోయిందని చెబుతుంది. కానీ పారు నమ్మదు. ఒకవేళ ఆ అనాథ దీపాకు తెలిసిన ఏం చేస్తుందని జ్యోత్స్నతో అంటుంది. ఇక దీపానే సుమిత్ర అసలు కూతురు అనే విషయం ఇంకా పారుకు తెలియకపోవడంతో దీపా విషయంలో ఇష్టారీతినా ప్రవర్తిస్తున్నావు గ్రానీ అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
కార్తీక్ బాబుతో పాటు దీపాను కూడా ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశానని అనుకుంటుంది జ్యోత్స్న. వెంటనే ఎలాగైనా దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే పారుతూ దీపాపై దొంగతనం నిందమోపేలా ప్లాన్ చేస్తారు. అందుకు పారు జాతం తన చెవి దుద్దుల్లో ఒకటి తీసి కిచెన్ లో ఉన్న దీపా పర్సులో పెట్టి కిచెన్ లోనే దాచేస్తుంది. ఇక బయటికి వచ్చి తన చెవి దుద్దు ఒకటి కనిపించడం లేదని నానా రచ్చ చేస్తుంది. దీపానే తీసి ఉంటుందని బదనామ్ చేస్తుంది. వెంటనే సుమిత్రను తీసుకెళ్లి కిచెన్ లోనే ఎక్కడో ఒక దగ్గర దాచి ఉంటుందని వెతుకుతుంటుంది. ఇక తానే దాయడంతో సుమిత్ర వేరే చోట చూస్తున్న సమయంలో తెలియకుండా దీపా పర్సును తీసి సుమిత్రకు చూపిస్తుంది. దీపా పర్సును చూసి సుమిత్ర షాక్ అవుతుంది. ఇక అందులోనే చెవి దుద్దు ఉండటంతో దీపానే దొంగతనం చేసిందని సుమిత్ర కూడా నమ్ముతుంది.
ఇక బయటకి వచ్చి సుమిత్ర, పారు జ్యోత్స్నను నిందిస్తారు. చెవి దుద్దు దీపా పర్సులోనే ఉందని చెప్పడంతో శివనారాయణ దీపాపై ఫైర్ అవుతాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఈ దొంగతనం చేయడానికేనా ఈ ఇంటిని వదిలి వెళ్లడం లేదని మండిపడుతాడు. ఇక దొంగలను ఈ ఇంట్లో చోటు లేదని జ్యోత్స్న కూడా ఫైర్ అవుతుంది. వెంటనే కార్తీక్ బాబు స్పందిస్తూ దొంగలకు చోటు లేదు అని నువ్వు అన్న మాటను అండర్ లైన్ చేసి పెట్టుకో చివర్లో తేల్చుకుందామని అంటాడు. ఇక దీపా ఆ దుద్దు నేను తియ్యలేదని, అస్సలు నా పర్సులోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదని దీపా చెబుతూ ఉంటుంది. దాంతో కార్తీక్ బాబు దొంగతనం నింద వేస్తే సరిపోదు ఆధారాలతో నిరూపించాలని అంటాడు. అసలు దీపా పర్సులో దొరికిన దుద్దు వర్జినల్ దా ఫేక్ దా అని అంటాడు. మీ తాత శివనారాయణ కొనిచ్చిందే అని చెబుతుంది. ఒకసారి నీ దగ్గర ఉన్న దుద్దు కూడా తీసుకొని రమ్మని చెబుతాడు కార్తీక్ బాబు. ఆ చెవి దుద్దు తీసుకొద్దామని వెళ్లిన పారుజాతానికి షాక్ తగులుతుంది.
అసలు పారుజాతం నగలు మొత్తం కనిపించకుండా పోతాయి. దీంతో బోరున విలపిస్తూ బయటికి వస్తుంది. మొత్తం నగలు కనిపించడం లేదని రోదిస్తుంది. కార్తీక్ బాబు స్పందిస్తూ మళ్లీ దీపానే తీశారని అంటారు. వెళ్లి కిచెన్ లో చూద్దాం రా పారు అని తీసుకెళ్తాడు. కిచెన్ లోకి ఇద్దరు కలిసి వెళ్లాక పారునే దీపా పర్సులో చెవి దుద్దు దాచిన వీడియోను చూపిస్తాడు. దీంతో పారు వణికిపోతుంది. అలాగే తన నగలన్నీ కూడా నేనే తీశానని చెబుతాడు. ఆ వీడియోను శివనారాయణ తాతకు చూపించి ఇంట్లో నుంచి వెళ్లగొడుతానని హెచ్చరిస్తాడు. నేను చెప్పినట్టు చేయాలని డిమాండ్ చేస్తాడు. మర్యాదగా అందరి ముందు దీపా తప్పేమీ లేదని, నువ్వు మర్చిపోయావని చెప్పమని అంటాడు. ఇక వీడియోలో దొరికి పోవడంతో పారు చెప్పినట్టు చేస్తుంది. అందరి ముందు దీపా నిర్దొషి అని చెబుతుంది. తప్పంతా తనదేనని అంటుంది. పారు అలా చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మళ్లీ వీడియోతో బెదిరించాడని పసి గడుతుంది. ఇక శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ పారుజాతాన్ని దారుణంగా తిడుతారు. దీపాకు క్షమాపణలు చెప్పిస్తారు కూడా. ఆ తర్వాత కార్తీక్ బాబును పారు తన నగలన్నీ ఇవ్వమని అంటుంది. సమయం వచ్చినప్పుడు ఇస్తానని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











