Karthika Deepam 2 June 26th : జ్యోత్స్నకు కార్తీక్ బాబు ఊహించని షాక్.. శివనారాయణ సైతం ఆగ్రహం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 25వ తేదీ 393వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాపై దొంగతనం నిందారోపణ చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. అందుకు పారుజాతాన్ని పావుగా వాడుకుంటుంది. దీపా పర్సులో తన చెవి దుద్దులు పెట్టి దొంగగా దీపాను నిరూపించాలని అనుకుంటుంది. కానీ కార్తీక్ బాబు పారుజాతం చేసే కుట్రను మొత్తం సీక్రెట్ కెమెరా ద్వారా వీడియో తీస్తాడు. ఆ వీడియో రికార్డును తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటాడు. ఇక పారుజాతం ఎప్పుడైతే దీపాపై నిందారోపణ చేస్తుందో.. వెంటనే కార్తీక్ బాబు పారును పక్కకు తీసుకెళ్లి ఆ వీడియోను చూపిస్తాడు. తను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోను అందరికీ చూపిస్తానని హెచ్చరిస్తాడు. అంతే కాదు తన దగ్గర ఉన్న పూర్తి నగలు కూడా తానే కొట్టేశానని చెబుతాడు. ఇప్పుడు నువ్వు అందరి ముందు నిజం ఒప్పుకోకపోతే నీ పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరిస్తాడు.

ముఖ్యంగా తన భార్య దీపా ఎలాంటి తప్పు చేయలేదని అందరి ముందు ఒప్పుకోమని కార్తీక్ బాబు బెదిరిస్తాడు.దాంతో పారుజాతం అందరి ముందు దీపా దుద్దులను దొంగలించలేదని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత శివ నారాయణ, దశరథ, సుమిత్రలు పారుజాతంపై చిరాకు పడుతారు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తాడు. ఇక కార్తీక్ బాబు పారుజాతం దగ్గర ఉన్న పూర్తి నగలను కొట్టేసి ఆటపట్టిస్తాడు. సమయం వచ్చినప్పుడు తిరిగి ఇస్తానని అంటాడు. అంత వరకు చెప్పినట్టు వినాలని సూచిస్తాడు. దీపాకు ఏం జరిగిందో తెలియక అయోమయంలో చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు పారుజాతం తన నగలన్నీ ఇవ్వమని కార్తీక్ బాబును బతిమిలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో నెక్ట్స్ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 26వ తేదీ 394 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 394 June 26th 2025

కార్తీక్ బాబు, దీపాలపై జ్యోత్స్న ఎన్నో కుట్రలు చేస్తోంది. ఎలాగైనా కార్తీక్ బాబు నుంచి దీపాను దూరం చేసి తన వశం చేసుకోవాలని ప్లాన్ చేస్తూనే ఉంది. వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తూ వస్తోంది. కానీ కార్తీక్ బాబు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే దీపా ఇచ్చిన షాక్ కు వెంటనే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని దొంగతనం నేరం మోపుతుంది. పారుజాతంతో తన దుద్దులు దీపానే దొంగలించిందని అందరి ముందు అబద్ధం చెప్పిస్తుంది. దాంతో దీపాను అందరు తిడుతాడు. ఇక కార్తీక్ బాబు అప్పటికే వీడియో తీసి ఉండటంతో మళ్లీ పారుజాతం తగ్గి దీపా నిర్దోషి అని చెబుతుంది. దాంతో అందరికీ దీపాపై సాఫ్ట్ కార్న్ ఏర్పడుతుంది. మరోవైపు పారుజాతంపై చిర్రెత్తిపోతారు. వయస్సు తగ్గ పనులు చేయమని హెచ్చరిస్తారు. దీపాకు పారుతూ క్షమాపణలు కూడా చెప్పిస్తారు. ఇక ఇదే విషయాన్ని కార్తీక్ బాబు, దీపా కాంచనకు చెబుతారు. కాంచన కూడా పారుజాతం, జ్యోత్స్నలకు మంచిగా బుద్ధి చెప్పారని అంటుంది.

కానీ శివనారాయణ అంత పెద్ద చెక్కు ఇచ్చినప్పుడు జ్యోత్స్న బాకీ తీర్చేసి ఆ ఇంటి నుంచి వచ్చేయొచ్చు కదా అని కాంచన అంటుంది. కానీ కార్తీక్ బాబు మౌనంగా ఉంటారు. మున్ముందు మీకే తెలుస్తుందని మనస్సులో అనుకుంటాడు. అందుకు కాంచననే బదులు ఇచ్చుకుంటుంది. ఏదైనా అడిగితే ఈ రెండు కుటుంబాలను కలపడానికి అని చెబుతున్నారు. మీరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే సత్యరాజ్ రెస్టారెంట్ పోయి, ఇడ్లీ బండీ పోయి, ఉపాధి పోయి ఇలా వాళ్ల దగ్గర కూలిగా పని చేయడం ఏంట్రా అని కంగారు పడుతుంది. అసలు మీ భవిష్యత్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదా? అని అంటుంది. ఆ జ్యోత్స్నకేంటి పెళ్లి చేసుకొని అమెరికాకైనా వెళ్తుంది. లేదంటే ఇక్కడే ఉండి 100ల కోట్ల ఆస్తిని అనుభవిస్తూ ఉంటుందని వాపోతుంది. కానీ అలా జరగనివ్వనని కార్తీక్ బాబు తల్లి కాంచనతో అంటాడు. మున్ముందు అన్ని విషయాలు తేలిపోతాయని చెబుతుంది.

ఇక మరోవైపు కార్తీక్ బాబును తనవైపు తిప్పుకోవాలని జ్యోత్స్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కార్తీక్ ను ప్రేమగా బావ అని పిలుస్తూ కార్తీక్ మనస్సులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. తన గురించి ఏదైనా నిజం తెలిసిందా అని తెలుసుకోవాలని అనుకుంటుంది. దాంతో కార్తీక్ బాబుపై ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అసలు నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని అంటుంది. నాలో కాదు ఈ ఇంట్లో వాళ్లలో చాలా మార్పు రావాలని, కొందరి వల్ల వీలుపడటం లేదని కార్తీక్ బాబు అంటాడు. మున్ముందు అన్నీ లెక్కలు తేలుతాయని, నీ బాగోతం బయటపెడుతానని అంటాడు. దాంతో నా గురించి ఏం చెబుతావో చెప్పమని జ్యోత్స్న అంటుంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని అంటుంది.

ఇక మరోవైపు కాంచన తన వీల్ చైర్ పై నుంచి కింద పడిపోతుంది. అప్పటికే అనసూయ కూరగాయలు తీసుకొస్తానని మార్కెట్ కు వెళ్తుంది. కాంచన కింద పడటంతో తలకు బలంగా గాయమవుతుంది. దాంతో తన పక్కనే పడ్డ సెల్ ఫోన్ నుంచి కార్తీక్ బాబుకు కాల్ చేస్తుంది. కానీ అప్పటికే కార్తీక్ బాబు ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి పెట్రోల్ కొట్టించేందుకు కారులో బయటికి వెళ్తాడు. ఇక మోగుతున్న ఫోన్ ను దీపా లిఫ్ట్ చేస్తుంది. దాంతో కాంచన జరిగిన విషయం చెప్పి తనకు ఓపికా లేదని పడిపోతుంది. దీపా కంగారు పడుతూ ఇంటికి బయల్దేరుతుంది. కానీ జ్యోత్స్న అడుపడుతుంది. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలని అంటుంది. మళ్లీ ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. దాంతో దీపాను ఇంటి నుంచి బయటికి రాకుండా, కనీసం కార్తీక్ బాబును కలవకుండా చేస్తుంది. కార్తీక్ బాబును తొందరపెట్టి ఫోన్ కూడా తీసుకోనివ్వకుండా బయటికి తీసుకెళ్తుంది. ఇక దీపాను బయటికి రానివ్వకుండా పారును కాపాలా పెడుతుంది. మరోవైపు ఇదంతా గమనిస్తున్న దశరథ నేను వెళ్లి చూస్తానని దీపాకు సైగ చేస్తాడు. దాంతో దీపా శాంతిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X