Karthika Deepam 2 June 27th : జ్యోత్స్నపై శివనారాయణ ఆగ్రహం.. పారుజాతానికి చుక్కలు

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 26వ తేదీ 394వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాలను ఇబ్బంది పెట్టాలని జ్యోత్స్న పెద్ద కుట్ర పన్నుతుంది. తన ప్లాన్ ను అమలు చేసే ముందే కార్తీక్ బాబు, దీపాకు వచ్చిన ఆపదతో ఆడుకుంటుంది. కాంచన తన వీల్ చైర్ పై నుంచి కింద పడుతుంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. చక్రాల కూర్చి పై నుంచి పడిపోవడం, ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నిస్సహాస స్థితిలో ఉంటుంది. సాయం కోసం అరుస్తుంది. అదే సమయంలో తన ఫోన్ కూడా పక్కననే పడటంతో వెంటనే కార్తీక్ బాబుకు ఫోన్ చేస్తుంది. కార్తీక్ బాబు కారు ఇంట్లో పెట్టి కారు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక దీపా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కాంచన ప్రమాదంలో ఉందని, గాయంతో బాధపడుతోందని తెలుసుకుంటుంది. కంగారు పడుతూ ఇంటికి వెళ్లేందుకు బయల్దేరుతుంది. కానీ ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న దీపాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

పైగా పారుజాతంతో చెప్పి దీపాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లనివ్వొద్దని అంటుంది. మరోవైపు దీపా తన అత్తయ్య కాంచన కింద పడి ప్రమాదంలో ఉందని, వెంటనే వెళ్లాలని, అడ్డు తప్పుకోమని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోరు. దీపాను జ్యోత్స్న, పారుజాతం అడ్డుకోవడాన్ని దశరథ దూరం నుంచి గమనిస్తాడు. మొత్తానికి తన చెల్లి కాంచన ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఇక వెంటనే వెళ్లాలనని నిర్ణయించుకుంటాడు. మరోవైపు దీపా ఈ విషయాన్ని కనీసం కార్తీక్ బాబుకైనా చెబుతానని అంటుంది. కానీ జ్యోత్స్న కార్తీక్ బాబును కనీసం ఇంట్లోని కూడా రానివ్వదు. ఫోన్ కూడా తీసుకోనివ్వదు. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి బయటికి తీసుకెళ్తుంది. కార్తీక్ బాబు కూడా అనుమానంతోనే జ్యోత్స్న తో కారులో బయటికి వెళ్తాడు. దీపాను పారుజాతం అడ్డుకుంటుంది. ఇవన్నీ గమనించిన దశరథ కాంచన ప్రమాదంలో ఉందని తెలుసుకొని సాయం చేసేందుకు ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 27వ తేదీ 395 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 395 June 27th 2025

దీపాకు ధైర్యం చెప్పి దశరథ ఇంటి నుంచి కాంచన దగ్గరకు వెళ్తాడు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న కాంచనను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తాడు. దాంతో కాంచన ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది. ఇక మరోవైపు జ్యోత్స్న కార్తీక్ బాబును రోడ్లపై తిప్పుతూనే ఉంటుంది. ఇక దీపా కూడా కార్తీక్ బాబు ఫోన్ లో నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. పోతే కాంచన ప్రాణాలు పోనివ్వు అని మనస్సులో అనుకుంటుంది. తన శత్రువుల లిస్ట్ లో ఒకరు తగ్గిపోతారని భావిస్తుంది. ఇక కార్తీక్ బాబును కారులో తిప్పుతూనే ఉంటుంది. ఎప్పుడు లేనిది జ్యోత్స్న కార్తీక్ బాబును రోడ్లపై తిప్పుతుండటంతో కార్తీక్ బాబుకు చిరాకు వస్తుంది. 2 గంటల నుంచి రోడ్లపై ఎందుకిలా తిప్పుతున్నారు పెద్ద మేడం అని అంటాడు. ఆఫీస్, పార్లర్, ఇల్లు అంటూ హడావుడిగా ఎందుకు తిప్పుతున్నారని, మా డ్రైవర్ల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావని అంటాడు. అసలు విషయం తెలిస్తే నువ్వు నాతో ఆడుకుంటావు బావ అని జ్యోత్స్న మనస్సులో అనుకుంటుంది. ఇక చివరికి కార్తీక్ బాబు ఇంటికి తిరిగి వస్తాడు.

కార్తీక్ బాబు ఎప్పుడు తిరిగి వస్తాడా? అని దీపా బయటనే ఎదురు చూస్తూ ఉంటుంది. దీపాను ఎక్కడికి వెళ్లకుండా పారుజాతం కాపాలా కాస్తుంది. ఇక కార్తీక్ బాబు తిరిగి రాగానే అస్సలు నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్లావని కార్తీక్ బాబును నిలదీస్తుంది. చెప్పే వెళ్దాం అనుకున్న పెద్ద మేడమ్ ఏదో పని ఉందని చెప్పి బయటికి తీసుకెళ్లారని అంటాడు. ఇక దీపా కార్తీక్ బాబును వాళ్ల నుంచి దూరంగా తీసుకెళ్లి కాంచన అత్తయ్య కింద పడిపోయిందని, వీళ్లు తనని వెళ్లనివ్వలేదని, కనీసం నీకు కూడా చెప్పకుండా అడ్డుకున్నారని చెబుతుంది. వెంటనే అక్కడికి వెళ్దామని కార్తీక్ బాబు అనడంతో అవసరం లేదని, తన తండ్రి దశరథ వెళ్లాడని దీపా చెబుతుంది. ఇక వెంటనే కార్తీక్ బాబు దశరథకు వీడియో కాల్ చేస్తాడు. తన తల్లికి ఎలా ఉందని అడుగుతాడు. పర్లేదని, తలకు మాత్రం చిన్న గాయమైందని చెబుతాడు. కట్టు కట్టించానని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని దశరథ అంటాడు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నా కూతురు జ్యోత్స్ననే అని, ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలని, దీపాలాగా జ్యోత్స్నను మార్చితే సరిపోతుందని దశరథ కార్తీక్ బాబుతో అంటాడు.

జ్యోత్స్న నీ కూతురులా మారడం కుదరదు. దీపానే నీ అసలు కూతురు అని టెన్షన్ లో మాట జారుతాడు కార్తీక్ బాబు. ఇక వెంటనే దీపా కూడా నీ కూతురు లాంటిదని చెబుతున్నానని అంటాడు. ఏదేమైనా జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలని అంటాడు. అందుకు కార్తీక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అదుపు చేయలేని కోపంతో కార్తీక్ బాబు జ్యోత్స్న, పారుల దగ్గరికి వెళ్లి చేయి చేసుకోబోతాడు. రాను రాను మీకు మానవత్వం చనిపోతోందని ఆగ్రహిస్తాడు. ఇక ఇదే విషయాన్ని భోజనం సమయంలో కార్తీక్ బాబు శివ నారాయణకు వివరిస్తాడు. దశరథకు అందరి ముందు దీపా, కార్తీక్ బాబు ధన్యవాదాలు చెబుతారు. మీరు చేసిన సాయాన్ని మేం ఈ జన్మలో మర్చిపోలేమని అంటాడు. దాంతో వీళ్లకు అంత పెద్ద సాయం ఏం చేశావురా దశరథ అని శివనారాయణ అడుగుతాడు. సాయం చేసిన గొప్ప మనస్సు ఆయనది ఆయనేం చెబుతారు. నేనే చెబుతానని కార్తీక్ బాబు పూర్తిగా జరిగింది చెబుతాడు.

తన తల్లి కాంచన చక్రాల కూర్చి నుంచి కింద పడిపోయిందని, తలకు బలమైన గాయమైందని చెబుతాడు. అదే సమయంలో సాయం కోసం నాకు ఫోన్ చేస్తే నా భర్య దీపా మాట్లాడింది. వెంటనే ఆ విషయం నాకు చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ జ్యోత్స్న మేడమ్ ఎందుకో దీపాను అడ్డుకుంది. కనీసం నన్ను కలవనివ్వలేదు కూడానూ. అటు దీపాను కూడా ఇంటికి వెళ్లనివ్వలేదు. ఆ సమయంలో దశరథ సార్ మా అమ్మ ప్రాణాలు కాపాడాడని కార్తీక్ బాబు ఎమోషనల్ అవుతూ చెబుతాడు. దాంతో శివనారాయణ, సుమిత్ర కూడా కాంచనకు ఏమైందోనని కంగారు పడుతారు. జ్యోత్స్నపై శివనారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు మనిషివేనా, నీలో మానవత్వం ఉందా? ఆపదలో ఉన్నవారిని యజమానిగా కాకపోయినా మనిషిగానైనా సాయం చేయాలి కదా అని మండిపడుతాడు. నీకు కూడా బుద్దిలేదని పారుజాతాన్ని కూడా తిడుతాడు. వెంటనే దీపా, కార్తీక్ లకు క్షమాపణలు చెప్పిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X