Karthika Deepam 2 June 28th : జ్యోత్స్నకు శివ నారాయణ కండీషన్లు.. కార్తీక్ బాబు దీపాలకు మరో షాక్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 26వ తేదీ 394వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాంచన ఇంట్లో చక్రాల కుర్చీ పై నుంచి కింద పడిపోతుంది. నిస్సహాస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. దాంతో సాయం కోరుతూ కార్తీక్ బాబు ఫోన్ కు కాల్ చేస్తుంది. ఆ ఫోన్ ను దీపా లిఫ్ట్ చేస్తుంది. విషయం తెలుసుకున్న దీపా వెంటనే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ జ్యోత్స్న పారులు వెళ్లకుండా అడ్డుకుంటారు. కనీసం కార్తీక్ బాబును కూడా దీపా కలవకుండా చేస్తారు. ఇక విషయం తెలుసుకున్న దశరథ కాంచన ఇంటికి వెళ్లి సాయం చేస్తాడు. ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తాడు. ఇక జ్యోత్స్న, పారుల సంగతి తెలుసుకున్న కార్తీక్ బాబు చిర్రెత్తిపోతాడు. వాళ్ల దగ్గరకు వెళ్లి చిర్రెత్తిపోతాడు. నేరుగా అనకుండా పరోక్షంగా మండిపడుతాడు.

మరోవైపు జరిగిన విషయాన్ని అందరూ కలిసి భోజనం చేసే సమయంలో శివనారాయణకు చెబుతాడు. దాంతో శివనారాయణ జ్యోత్స్నపై మండిపడుతాడు. ఆపదలో ఉన్న మనిషికి సాయం చేయాలనే బుద్ధి లేకుండా పోయిందా నీకు అని మందలిస్తాడు. ఒక యజమానిగా కాకపోయినా మనిషిగానైనా మానవత్వాన్ని చూపించాలి కదా అని ఫైర్ అవుతాడు. నీ స్థానంలో నేను ఉంటే దీపాను పంపించడమే కాదు దగ్గరుండి ఇంటి వరకు తీసుకెళ్లి వదిలేవాడినని అవసరమైతే చికిత్స కూడా చేయించే వాడినని అంటాడు. మానవత్వం లేకుండా ఎలా ఉన్నావని చివాట్లు పెడుతాడు. ఇకపైనా ఇలాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరిస్తాడు. ఇక తమ వల్ల జరిగిన తప్పునకు కార్తీక్ బాబు, దీపాలకు క్షమాపణలు కూడా చెబుతాడు. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 27వ తేదీ 396 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 396 June 28th 2025

జ్యోత్స్న చేసిన పనికి శివ నారాయణ మండిపోతాడు. కాంచన కింద పడిపోయిందని తెలిసినా కూడా జ్యోత్స్న దీపా, కార్తీక్ బాబులను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తాడు. దీపాకు జ్యోత్స్నతో క్షమాపణలు చెప్పిస్తాడు శివనారాయణ. మరోసారి ఇలాంటి పొరపాటు కూడా రానివ్వనని చెప్పమని జ్యోత్స్నను అంటాడు. దాంతో జ్యోత్స్న కూడా ఇంకోసారి ఇలా జరగదని చెబుతుంది. ఇక సుమిత్ర వెంటనే వదినకు ఎలా ఉందని, చూసుకోవడానికి ఎవరు ఉన్నారని కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో అనసూయ పెద్దమ్మ ఉందని కార్తీక్ బాబు బదులిస్తాడు. మరోవైపు తన కూతురు కాంచనకు ఏమైందోనని శివనారాయణ కూడా కంగారు పడుతాడు. ఇక దీపా అప్పటికే శివనారాయణ నేలపై పడేసిన గాజు పెంకలను తీస్తుంటుంది. ఇప్పుడెందుకు తర్వాత భోజనం చేశాక తీసేదానివి కదా అని దశరథ దీపాను అంటాడు. దాంతో దీపా ఆసక్తికరంగా బదులిస్తుంది. వీటిని మనవనుకొని ఇంటికి తెచ్చుకుంటాం. మనతోనే ఉంచుకుంటాం. కానీ అవి కిందపడి పగిలితే కాలు తగలగానే ఏమాత్రం ఆలోచించకుండా గాయం చేస్తాయని అంటుంది.

దీపా మాటలు తమను ఉద్దేశించే అని పారు,జ్యోత్స్న అనుకుంటాడు. వెళ్లేప్పుడు మందులు కూడా తీసుకెళ్లమని దశరథ కార్తీక్ బాబుకు చెబుతాడు. డ్యూటీ టైమ్ ముగిసిందని, వెళ్లిపోతున్నామని కార్తీక్ బాబు, దీపా శివ నారాయణకు చెప్పి వెళ్తారు. తాత శివనారాయణకు జ్యోత్స్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ శివనారాయణ మాత్రం వినే స్థితిలో ఉండడు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. అయ్యిందేదో అయిపోయింది. ఇకపై బుద్ధిగా నడుచుకోమని చెబుతారు. సుమిత్ర కూడా జ్యోత్స్న చేసిన పనికి కోపంతోనే ఉంటుంది. ఇక మరోవైపు దాసు కొడుకు కాశీ తన స్నేహితుడి చేతిలో మోసపోతాడు. 10 లక్షలు అప్పు ఇప్పించి మధ్యవర్తిగా ఉంటాడు. రెండు నెలల్లో ఇస్తానని చెప్పి పారిపోతాడు. ఇక ఆ ఫైనాన్షియర్ వచ్చి కాశీని కాలర్ పట్టుకొని డబ్బులు అడుగుతాడు. ఈ సంగతి దిల్ కంట పడుతుంది. దిల్ కాశీని ఏం జరిగిందని అడుగుతుంది. జరిగింది కాశీ చెబుతాడు. దాంతో దిల్ కంగారు పడుతుంది. నాకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు దాచవని అంటుంది.

ఇక తన తల్లి కావేరి సాయం కోరుతుంది. కావేరి తన అకౌంట్ లో నుంచి 10 లక్షలు తీసి ఇస్తానని చెబుతుంది. కానీ లాకర్ తాళాలు శ్రీధర్ దగ్గర పెట్టుకొని ఉంటాడు. విషయం పూర్తిగా చెప్పే వరకు డబ్బులు ఇవ్వబోడు. తీరా డబ్బులు ఇద్దామని అనుకునే సరికి దిల్ కు, శ్రీధర్ కు ఎప్పటీ లాగే వాగ్వాదం జరుగుతుంది. దాంతో తండ్రి శ్రీధర్ పై దిల్ ఫైర్ అయ్యి వెళ్లిపోతుంది. ఇక శ్రీధర్ భార్య కావేరి మాత్రం ఇక అల్లుడు కాశీకి ఎలా సాయం చేయాలోనని కంగారు పడుతుంది. ఇదిలా ఉంటే.. తన కూతురు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని శివ నారాయణ ఆందోళన పడుతూ ఉంటాడు. ఇక అప్పటికే కాంచన దగ్గరకు వెళ్లి వచ్చిన దశరథను అడిగి విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. దశరథ, సుమిత్రల దగ్గరకు వెళ్లి దశరథను బయటికి రమ్మని పిలుస్తాడు. దాంతో రెస్టారెంట్ వివరాలు ఏమైనా అడగడం కోసమని పిలుస్తున్నాడేమోనని దశరథ వెంటనే బయటికి వెళ్తాడు.

దాంతో శివ నారాయణ మాట్లాడుతూ నాకు అసలు విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. రెస్టారెంట్ నిర్వహణ గురించి అనుకొని 20శాతం మరొకరికి ఇచ్చి నడిపించేందుకు ఏర్పాట్లు చేశానని చెబుతాడు. అది సరే నువ్వు పొద్దున వెళ్లిన విషయం గురించి అని దశరథను అడుగుతాడు. దాంతో దశరథ వెంటనే చెల్లి గురించి అడుగుతున్నావా? నాన్న అని అంటాడు. ఇక బయటికి కోపాన్ని ప్రదర్శిస్తున్నా కూతురు కాంచనపై శివనారాయణకు ఎంత ప్రేమ ఉందో ముఖంలో, ఆయన కళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఎలా ఉందని అడుగుతాడు. ఉదయమే చూశాను కదా నాన్న బాగానే ఉందని చెబుతాడు. మరీ ఇప్పుడెలా ఉందో తెలుసుకో అని అంటాడు శివనారాయణ. రేపు ఇంటికి వెళ్లి చూస్తాను అని చెబుతాడు. రేపు వెళ్లచ్చు కానీ, ఇప్పుడు వీడియో కాల్ చేయొచ్చు కదా అని చెబుతాడు. ఇక వెంటనే దశరథ వీడియో కాల్ చేసి కాంచనను చూపిస్తాడు. బాగోగులు అడుగుతాడు. బాగుందని తెలుసుకున్నాక శివ నారాయణ తన గదిలోకి వెళ్లిపోతాడు. ఇక వీడియో కాల్ చేయించింది తాతనే అని కార్తీక్ బాబుకు దశరథ చెబుతాడు. ఇదంతా చాటుగా పారుజాతం గమనిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X