Karthika Deepam 2 June 30th : కార్తీక్ బాబుకు జ్యోత్స్న వార్నింగ్.. మైండ్ బ్లాక్ చేసిన దీపా

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 28వ తేదీ 396వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాంచన కింద పడిపోతుంది. ఆ విషయాన్ని కార్తీక్ బాబుకు ఫోన్ ద్వారా తెలియజేస్తుంది కాంచన. కానీ ఫోన్ బాలు దగ్గర ఉండదు. దాంతో దీపా లిఫ్ట్ చేస్తుంది. విషయం తెలుసుకుని కంగారు పడుతుంది. త్వరగా వెళ్లి సాయం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ జ్యోత్స్న దీపా, కార్తీక్ బాబులను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఆ విషయం కార్తీక్ బాబు, దీపాలు శివనారాయణ కు తెలియజేస్తారు. దాంతో జ్యోత్స్న పట్ల శివనారాయణ అసహనం వ్యక్తం చేస్తాడు. యజమానిలా కాకపోయినా కనీసం మనిషిలాగైనా ఆలోచించాలని, మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలని శివ నారాయణ జ్యోత్స్నను హెచ్చరిస్తాడు.

అంతేకాదు దీపాకు జ్యోత్స్నతో క్షమాపణలు కూడా చెప్పిస్తాడు శివనారాయణ. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేస్తే ఏమాత్రం అస్సలు ఊరుకోనని చెబుతాడు. శివనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జ్యోత్స్న కూడా ఇంకోసారి ఇలాంటి పని చేయనని హామీనిస్తుంది. ఇక పారుజాతం కూడా తను చేసిన తప్పు బయట పడటం, దీపాను ఇంటికి వెళ్లకుండా అడ్డుకోవడంతో శివనారాయణ మండిపడుతాడు. దాంతో సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు సుమిత్ర కూడా తన వదినకు ఎలా ఉందో తెలసుకోవాలని అనుకుంటాడు. అంతే కాదు తన కూతురు ఎలా ఉందో తెలుసుకోవాలని శివ నారాయణ కూడా మనస్సులో అనుకుంటాడు. కింద పడిందని తెలిసి భావోద్వేగానికి గురవుతాడు. ఆ తర్వాత దశరథతో మాట్లాడి వీడియో కాల్ చేయిస్తాడు. కాంచనను వీడియో చూస్తాడు. బాగోగులు దశరథతో అడిగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 30వ తేదీ 397 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 397 June 30th 2025

తన కూతురు ఆరోగ్యం ఎలా ఉందనే విషయంలో శివ నారాయణ కంగారు పడుతారు. దాంతో కార్తీక్ బాబుకు దశరథతో వీడియో చేయించి మరీ బాగోగులు తెలుసుకుంటారు. దాంతో కార్తీక్ బాబు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత దశరథ కూడా నాన్న కాంచన ఇంటికి వెళ్లి ఒకసారి చూసి వస్తే బాగుండు అని అనుకుంటాడు. ఇక కార్తీక్ బాబు ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా ధీనంగా ఉండటంతో ఏమైందని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైందని మళ్లీ దీపా అడుగుతుంది. అసలు మనం రెండు కుటుంబాలు కలపాలని ప్రయత్నిస్తుంటే వాళ్లు మనల్ని అంతకంతకు దూరం చేస్తున్నారు. జ్యోత్స్న చేస్తున్న పనుల వల్ల మనం నష్టపోతున్నామని చెబుతాడు కార్తీక్ బాబు. అసలు ఆ కుటుంబం బాగుండాలని మనం ప్రయత్నిస్తుంటే వాళ్లేమో మనల్ని ఇంకా దూరం చేస్తున్నారు.

ఆ ఇంటికి ప్రమాదం రాకూడదని, ఆ కుటుంబంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకూడదని అనుకున్నాం. అందుకు మన ఇంటిని వదులుకొని ఆ ఇంటికి కాపాలాగా వెళ్లినా కూడా మనల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా శృతి మరింత దారుణంగా ఆలోచిస్తోంది. తన ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. అసలు ఏం చేస్తుందో తనకే తెలియకుండా పోతోంది. అమ్మ విషయంలో జ్యోత్స్న ప్రవర్తించిన తీరుకు ఒళ్లు మండిపోతుందని రగిలిపోతాడు. ఇప్పుడె వెళ్లి జ్యోత్స్న నీ అసలు కూతురు కాదు, దొంగ నాటకాలు ఆడుతుందని అందరికీ చెప్పాలని ఉంది. కానీ సమయం కాదని వేచి ఉన్నానని అంటాడు. ఏదేమైనా మనం ఎంత చేసినా ఫలితం లేకుండా పోతోంది. వాళ్లలో కొంచెం కూడా చలనం లేదని బాధపడుతాడు. ఆ ఇంటి వాళ్లకు ప్రమాదం రాకూడదని ప్రయత్నిస్తుంటే మన ఇంట్లోనే ప్రమాదం జరిగిందని అంటాడు. ఇక్కడ అమ్మను సరిగా చూసుకోలేకపోయామని బాధపడుతాడు.

సుమిత్ర అత్తకు అమ్మ కాంచన అంటే ఎంతో ఇష్టమని, ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఈ పాటికే వచ్చి చూసేంది. కానీ ఇంత వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదని బాధపడుతాడు. ఇంక వారికోసం మనం ఎందుకు తపన పడాలని, అస్సలు రెండు కుటుంబాలను కలుపుకోవాలని మనం మాత్రం ఎందుకు తాపత్రయ పడాలని కార్తీక్ బాబు అంటాడు. మనం ఇంత రిస్క్ చేయడంలో ఏమాత్రం ఫలితం లేదని అభిప్రాయడుతాడు. కానీ దీపా ఫలితం ఉందని చెబుతుంది. కాంచన అత్త కింద పడిపోవడం వల్లనే ఎవరు ఎలాంటి వారే విషయాలు మనకు సరిగ్గా తెలుస్తున్నాయని అంటుంది. కాంచన అత్త కింద పడిపోవడంతో నన్ను జ్యోత్స్న, పారులు అడ్డుకున్నారు. నేను వారితో పెద్దగా గొడవ పడటంతో ఆ విషయం తెలుసుకున్న నాన్న దశరథ కాంచనకు ఏదో ప్రమాదం ఉందని గ్రహించాడు. దాంతో వెంటనే కారు తీసుకొని అత్త కాంచనను కాపాడేందుకు వచ్చాడు. ఆస్పత్రిలో చేర్పించి వైద్యం కూడా చేయించాడు.

అంతే కాదు తాత శివనారాయణకు కూడా తన కూతురు కాంచనపై ఎంత ప్రేమ ఉందో తెలిసింది. జ్యోత్స్న మనల్ని వెళ్లనివ్వకుండా అడ్డకుందని, కాంచనకు దెబ్బ తగిలిందని తెలుసుకున్న వెంటనే జ్యోత్స్న పై మండిపడ్డాడని, గ్లాస్ విసిరేసి మరి ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేస్తుంది. అంతే కాకుండా తన కూతురు ఎలా ఉందోనని ప్రేమతో దశరథ నాన్నతో వీడియో కాల్ కూడా చేయించాడని అంటుంది. ఇక అమ్మ సుమిత్ర మనస్సు కూడా మారే రోజు వస్తుందని కార్తీక్ బాబుతో దీపా అంటుంది. త్వరలోనే అన్ని మారుతాయని, నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందని కార్తీక్ బాబుతో దీపా చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తల్లి విషయంలో ఏదైనా తప్పుగా జరిగితే మనస్సుకు బాధేస్తుందని అంటాడు.

ఇదిలా ఉంటే.. కార్తీక్ బాబు ఇంటికి శ్రీధర్ వస్తాడు. కాంచనకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకొని వచ్చి బాగోగులు తెలుసుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనను క్షమించమని అడుగుతాడు. నేను చేసిన తప్పు వల్ల నువ్వు, నా కొడుకు కార్తీక్ బాబు కష్టాలు పడుతున్నారని అంటాడు. నేను నీకు ఎంత ప్రేమించానో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని శ్రీధర్ కాంచనతో అంటాడు. ఏదేమైనా నేను చేసింది తప్పే. మరో పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టాను. ప్రస్తుతానికి కావేరి నీ సొంత చెల్లిలాగా, స్వప్నను నీ కూతురిలాగానే చూసుకుంటున్నావు కదా. అలాగే నన్ను కూడా మీతో కలిసి పోనివ్వండి. లేదంటే కావేరిని కూడా ఇక్కడికే రమ్మంటాను మనమందరం కలిసిపోదామని అంటాడు. కానీ కార్తీక్ బాబు ఒప్పుకోడు. ఇక నిర్ణయం తీసుకోవాల్సి కాంచన అని, శ్రీధర్ మామ కాంచన మధ్య జరుగుతున్న సంభాషణలో మనం తలదూర్చవద్దని చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X