Karthika Deepam 2 July 1st: శివ నారాయణ మనస్సును కదిలించిన కార్తీక్ బాబు.. జ్యోత్స్న ప్లాన్ కు బలైన దీపా
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 30వ తేదీ 397వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆ కుటుంబంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం రావొద్దని, తాము నిత్యం ఆ ఇంటికి కాపాలా ఉంటున్నాం. కానీ ప్రమాదం మన ఇంట్లోనే వచ్చిందని కార్తీక్ బాబు బాధపడుతాడు. తన తల్లి కాంచనకు ఏమైన అయితే అస్సలు తట్టుకోలేనని అంటాడు. తన తల్లిని చక్కగా చూసుకోవాల్సిన సమయంలో వెళ్లి ఆ ఇంట్లో కాపాలాగా ఉండటం నాకు ఏమాత్రం నచ్చడం లేదని, అసలు వాళ్లు మనల్ని మనుషులుగా కూడా చూడటం లేదని, అలాంటి వారి కోసం మనం మాత్రం ఎందుకు తాపత్రయ పడాలని కార్తీక్ బాబు అంటాడు. అలా తాపత్రాయ పడటంతో ఏమాత్రం ఫలితం లేదని దీపాతో అంటాడు.
అందుకు దీపా స్పందిస్తూ ఫలితం లేకుండా ఎందుకు ఉంటుందని, కాంచన అత్తకు అలా జరగడంతో ఎవ్వరు ఎంటనేది తెలిసిపోయింది. నా తండ్రి దశరథ తన చెల్లిని ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. తన తండ్రి శివనారాయణ కూతురు యోగ క్షేమాల గురించి వీడియో కాల్ ద్వారా అడిగి తెలుసుకున్నాడని అంటుంది. మున్ముందు కూడా అన్నీ మారుతాయని కార్తీక్ బాబుకు చెబుతుంది. మరోవైపు శ్రీధర్ కాంచన దగ్గరకు వచ్చి కాళ్లపై పడుతాడు. కాంచన కింద పడిందని తెలుసుకొని బాధపడుతాడు. ఇకపై అందరం కలిసే ఉందామని, తనను క్షమించమని కాంచనను కోరుతాడు. తన రెండో భార్య కావేరిని ఇక్కడికి రమ్మంటానని, లేదంటే మనమందరం అక్కడికి వెళ్దామని అంటాడు. అందుకు కార్తీక్ బాబు ఒప్పుకోడు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అంటాడు. ఆ తర్వాత కాంచన ఎలా స్పందించిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 1వ తేదీ 398 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

తను చేసింది తప్పేనని, నువ్వు ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పేనని శ్రీధర్ ఒప్పుకుంటాడు. కాంచన కాళ్ల దగ్గర కూర్చొని తనకు ఎలాంటి కోపం లేదని, మీ మీద ప్రేమ మాత్రమే ఉందని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతాడు. రెండో పెళ్లి చేసుకోవడం మినహాయిస్తే నేను ఎలాంటి తప్పు చేయలేదని, కాంచనపై, కార్తీక్ బాబుపై నాకు ఎంతో ప్రేమ ఉందని శ్రీధర్ బాబు వ్యక్తం చేస్తాడు. ఆ జ్యోత్స్న వల్ల ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నానని, మీరు ఒప్పుకుంటే కార్తీక్ బాబు అగ్రిమెంట్ కూడా డబ్బులు చెల్లించి క్యాన్సిల్ చేయిస్తానని అంటాడు. కానీ కార్తీక్ బాబు అందుకు ఏం అవసరం లేదని, తమ సమస్యలను తాము చూసుకుంటామని అంటాడు. ఇక కాంచనతో మనం అందరం ఇకపై కలిసి ఉందామని, లేదంటే కావేరీతో పాటు స్వప్నను కూడా ఇక్కడికే తీసుకొని వస్తానని అంటాడు. మునుపటిలాగే నాతో కలిసి ఉండమని శ్రీధర్ కావేరిని బతిమిలాడుతాడు.
ఇక కాంచన స్పందిస్తూ మీరు నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు, నాకు యాక్సిడెంట్ అయితే ఎంతో ప్రేమగా చూసుకున్నారు, నాకు తండ్రిలా ఎన్నో సేవలు చేశారు. కానీ నాలాగే మరో ఆడదాన్ని కూడా చూసుకున్నారని అని చెబుతూ బోరున విలపిస్తుంది. ఏ ఆడది కూడా తన భర్త మరో ఆడదానితో ఉండటాన్ని అస్సలు జీర్ణించుకోలేదని, సహించలేదని చెబుతుంది. ఇక మీరు దారిలో పోయే వారికి ఏదైనా వస్తువును దానం చేస్తే మళ్లీ తిరిగి అడుగుతారా? అని శ్రీధర్ ను ప్రశ్నిస్తుంది. దాంతో శ్రీధర్ అడగలేనని అంటాడు. నేను కూడా మిమ్మల్ని కావేరికి దానం ఇచ్చానని చెబుతూ రోదిస్తుంది. నాకు మంగళ సూత్రమే ఉంది కానీ, సౌభాగ్యం లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మనం కలిసి ఉండటం అంటూ జరగని పని చెబుతుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్ బాబు, దీపాలు కూడా కాంచన అభిప్రాయం చెప్పడంతో మౌనం బయటికి వస్తారు. తమకు డ్యూటీ టైమ్ అవుతుందని శివ నారాయణ ఇంటికి బయల్దేరుతారు.
కార్తీక్ బాబు, దీపా శివ నారాయణ ఇంటికి వెళ్తారు. ఎంట్రెన్స్ లోనే తాత శివ నారాయణ కార్తీక్ బాబుకు ఎదురవుతాడు. సైకిల్ ఉన్నప్పుడే కాకుండా స్కూటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు లేట్ అయ్యిందని అడుగుతాడు. అయినా ఇవ్వాళ పనికి ఇద్దరు ఎందుకు వచ్చారని అంటాడు. ఇద్దరం రావాలి కదా పెద్ద సారు అని కార్తీక్ బాబు అంటాడు. మీ ఇంట్లో మనుషులకు మంచిగా లేదు కదా ఒకరు ఉండి చూసుకోండి అని శివ నారాయణ చెబుతాడు. దాంతో కార్తీక్ బాబు, దీపా చాలా సంతోషిస్తాడు. ఇక కావాలని తాత శివ నారాయణతో ఆడుకుంటాడు. పని మనుషుల ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మీకేంటి పెద్ద సారూ అని అంటాడు. అయినా మేం మీకు బంధువులం కాదు, మీరు మాకూ ఏమీ కారు. అలాంటప్పుడు ఎవరు ఎలా ఉంటే ఏంటని ప్రశ్నిస్తాడు. కబుర్లు ఆపి ఒకరు ఇంటికి వెళ్లండని శివనారాయణ అంటాడు. అవసరం లేదు పెద్ద సారు ఇప్పుడు మా అమ్మకు బాగానే ఉంది. వాళ్ల అన్నయ్య దయ వల్ల త్వరగా కోలుకుంది.
వాళ్ల అన్నయ్య లాగానే వాళ్ల నాన్న కూడా ఉంటే మంచిదని అనుకుంటున్నాను. మా అనుకునే వాళ్లు అమ్మ ఎలాగుందనే విషయం ఇంటికి వచ్చి తెలుసుకుంటారులే అని అంటాడు. తన కూతురుపై శివ నారాయణ ప్రేమను కార్తీక్ బాబు గమనిస్తాడు. ఇంకెన్నీ రోజులు కాంచనతో మాట్లాడకుండ ఉంటారో చూద్దామని అనుకుంటాడు. ఇక తమ పనులకు వెళ్లిపోతారు. మరోవైపు శ్రీధర్ తిరిగి ఇంటికి వెళ్లి కాంచనకు యాక్సిడెంట్ అయ్యిందని కావేరి, స్వప్న, కాశీలకు చెబుతాడు. జ్యోత్స్న వల్లనే కాంచన ప్రాణాల మీదకు వచ్చిందని, దీపా జ్యోత్స్న మధ్య ఉన్న గొడవలతో నా భార్య కాంచనను చంపేయబోయరని అంటాడు. దాంతో కాశీ రగిలిపోతాడు. అసలు ఇంత కనికరం లేకుండా జ్యోత్స్న, శివ నారాయణ ఎందుకు ప్రవర్తిస్తున్నారని మండి పడుతాడు. వెంటనే అడుగుతానని శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అసలు మీరు మనుషులేనా, కాంచన అత్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా అస్సలు కనికరం చూపించరా.. జ్యోత్స్న అస్సలు ఎందుకు పంపించలేదని అడుగుతాడు. తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తాడు. ఇక శివనారాయణ, జ్యోత్స్న కాశీపై తిరగబడతారు. పారుకు చెప్పి ఇంట్లో నుంచి నెట్టేయిస్తారు. ఇక జ్యోత్స్న తెలివిగా కాశీని ఉసిగొల్పింది దీపానే అని పరిస్థితిని మరోవైపునకు తిప్పుతుంది. మళ్లీ నిందవేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో దీపా షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











