Karthika Deepam 2 July 2nd: దీపాను తెలివిగా ఇరికించిన జ్యోత్స్న.. కార్తీక్ బాబు కళ్ల ముందే ఘోరం
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూన్ 30వ తేదీ 397వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాంచనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తర్వాత శివ నారాయణ కూతురు కాంచన బాగోగులు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కార్తీక్ బాబు దీప డ్యూటీ కోసం అని శివ నారాయణ ఇంటికి వస్తారు. రాగానే శివ నారాయణ ఇద్దరు ఇవాళ ఎందుకు వచ్చారని అడుగుతాడు. రోజు ఇద్దరం పనికి వస్తున్నాం కదా పెద్ద సారు అలాగే ఇవాళ కూడా వచ్చామని అంటాడు. మీ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యం చూసుకోవడానికి మరెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ విషయం అర్థమైందా కార్తీక్ బాబు డ్రైవర్ తల్లి బాగోగులు కూడా మీరు అడుగుతారా పెద్దసారు అని అంటాడు. మా తల్లి క్షేమం కోరేవారు ఇంటికి వచ్చి చూస్తే బాగుంటుందని కార్తీక్ బాబు చెప్పి తన పనికి వెళ్ళిపోతాడు. దీంతో శివ నారాయణ ఆలోచనలో పడిపోతాడు.
మరో వైపు శ్రీధర్ కాంచన వీల్ చైర్ నుంచి కింద పడిపోయింది అని తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శిస్తాడు. అంతేకాదు కాంచన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్టు గా చెబు తాడు. ఇకపై అందరం కలిసే ఉందామని తన నిర్ణయాన్ని చెబుతాడు. కాంచన కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాడు. కానీ కాంచన ఒప్పుకోదు. కార్తీక్ బాబు కూడా తిట్టి పంపిస్తాడు. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని శ్రీధర్ అల్లుడు కాశి తో చెబు తాడు. కాంచనకు దెబ్బ తగిలింది అని తెలిసి, అందుకు కారణం జ్యోత్స్న శివ నారాయణ అని తెలుసుకొని రగిలిపోతాడు. వెంటనే ఆ ఇంటికి వెళ్లి నిలదీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో శివ నారాయణ పై, జ్యోత్స్న పై మండిపడతాడు. ప్రమాదంలో ఉన్నది తెలుసుకున్నాక కూడా జ్యోత్స్న ఎందుకు పంపించలేదని, జ్యోత్స్నకు అసలు మతి ఉందా అంటూ రెచ్చిపోతాడు. ఇక జ్యోత్స్న తెలివిగా సమస్యను దీపా పైకి నెట్టి వేసే ప్రయత్నం చేస్తుంది. కాశీని దీపానే రప్పించి ఇప్పుడు ఇంత పెద్ద గొడవ చేయిస్తుందని నింద వేస్తుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనే ది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక జూలై 2వ తేదీ 399 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

శివ నారాయణ ఇంటికి వెళ్లిన కాశి అందరిపై మండిపడతాడు. కాంచన అత్త కింద పడింది అని తెలిసినా కూడా దీప అక్కను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిస్తాడు. మీలో మానవత్వం చచ్చిపోయిందా అని శివ నారాయణను అంటాడు. కనీసం కనికరం లేకుండా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాలేదని అభిప్రాయపడతాడు. మాటలు తిన్నగా రానివ్వ అంటూ శివ నారాయణ కాశీ పై మండిపడతాడు. నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదని అంటాడు. ఒకవేళ నువ్వు దీప తరఫున వచ్చి ఉంటే పనివాడి గానే మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. ఇక వెంటనే పారిజాతాన్ని పిలిచి కాశీ ని మెడ పట్టి బయటికి పంపించమని అంటాడు. దాంతో పారిజాతం కాశీని శాంత పరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ కాశి అస్సలు తగ్గడు.
ఇక జ్యోత్స్న తెలివిగా సమస్యను మొత్తం దీపా పైకి నెట్టివేస్తుంది. అసలు కాశీ ఇక్కడికి వచ్చి మాట్లాడే అంత ధైర్యం ఇచ్చింది దీపా అని జ్యోత్స్న అంటుంది. కాంచన అత్తకు జరిగిన ప్రమాదం గురించి జ్యోత్స్న శ్రీధర్ కు చెప్పిందని అంటుంది. దీప కావాలనే కాశీ ని పిలిపించి తను మాట్లాడాల్సిన మాటలు అన్నింటిని కాశి తో మాట్లాడిస్తుందని అగ్గి రాజేస్తుంది. దీపాకు దురుద్దేశం ఉందని అందుకే ఇలా మరోసారి గొడవ చేయిస్తుందని సుమిత్ర అమ్మతో జోష్ణ అంటుంది. అటు శివ నారాయణ కు కూడా కాశీకి ఇక్కడి వరకు వచ్చి మాట్లాడేంత ధైర్యం ఇచ్చింది కేవలం దీపానే అని చెప్పి కోపం తెప్పిస్తుంది. దాంతో శివనారాయణ కూడా రగిలిపోతాడు.
మరోవైపు కాశీని కార్తీక్ బాబు, దీప అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కాశీ మాత్రం ఆవేశంలో శివ నారాయణ పై, జ్యోత్స్ నాపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. చివరికి దశరథకు కూడా ఓపిక నశిస్తుంది. కాశీ నీ నోరు అదుపులో పెట్టుకోమని చెబుతాడు. కానీ కాశీ మాత్రం ఆవేశంలో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ మనుషులు కాదని, రాక్షసులు అని కాశి అనడంతో అందరికీ చిర్రెత్తిపోతుంది. ఇక శివ నారాయణ కాశిని కొట్టబోయే సమయంలో కార్తీక బాబే కాశీ పై చేయి చేసుకుంటాడు. ఇంటి గురించి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలని అంటాడు. ఇంకొక మాట మాట్లాడితే రెండు చెంపలు వాయించేస్తానని హెచ్చరించి బయటికి పంపించేస్తాడు.
ఇక కాశి చేసిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నానని కార్తీక్ బాబు అంటాడు. నీకు క్షమాపణలు ఎవరికి అవసరం లేదు కానీ.. ఇకపై కాశి ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదని, వస్తే జైలుకు పంపిస్తానని హెచ్చరిస్తాడు. ముఖ్యంగా పారిజాతం కాశి నీ ఇంటికి రాకుండా చూసుకోవాలని ఆదేశిస్తాడు. ఇక తర్వాత కాశీని కొట్టినందుకు కార్తీక బాబు, దీపాలు బాధపడతారు. వెంటనే వెళ్లి కాశీకి జరిగిన విషయం చెప్పాలని అనుకుంటారు. ఇక కాశి దగ్గరికి వెళ్లి అక్కడి పరిస్థితిని కార్తీక్ బాబు వివరిస్తాడు. శివ నారాయణ కొట్టబోయే సరికి నేను కొట్టానని చెబుతాడు. దాంతో పర్లేదని కాశీ కూడా సర్దుకుపోతాడు. ఇక మరోవైపు కూతురు కాంచనను చూడడానికి శివ నారాయణ ఇంటికి వస్తాడు. అదే సమయంలో దీపా కార్తీక్ బాబు కూడా తిరిగి ఇంటికి వస్తారు. అప్పటికే శివ నారాయణ శౌర్య పాపతో ఎంతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తాడు. శివ నారాయణ చెప్పిన తాబేళు, కుందేలు కథను శౌర్య గుర్తుంచుకొని కాంచనకు చెబుతుండటం చూసి ఆనందిస్తాడు. ఇక మీ నానమ్మ తో మాట్లాడాలని చెప్పి శౌర్య పాపను గదిలోకి వెళ్ళమని చెబుతాడు. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











