Karthika Deepam 2 July 3rd: కార్తీక్ బాబుతో కలిసిపోయిన శివనారాయణ.. కన్నీళ్లు పెట్టుకున్న కాంచన

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 2వ తేదీ 399వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ నారాయణ ఇంటికి వచ్చి దాసు కొడుకు కాశీ రచ్చరచ్చ చేస్తాడు. కాంచన అత్తకు ప్రమాదం జరిగినా కూడా ఎందుకు దీపా అక్కను, కనీసం కార్తీక్ బావను పంపించలేదని అడుగుతాడు. రాను రాను ఈ ఇంట్లో మానవత్వం చచ్చిపోతోందని, మనుషులుగా బతకడం లేదని మండిపడుతాడు. కాశీ మాటలకు శివ నారాయణ ఒళ్లు మండిపోతుంది. మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనేంత ధైర్యం నీకు ఎవరు ఇచ్చారురా అని శివనారాయణ కోపం చేస్తాడు. ఈ ఇంటికి పెద్దాయనగా ఉన్న మీరు కూడా దయలేకుండా ప్రవర్తించడం నాకు ఏమాత్రం నచ్చలేదని, కన్న కూతురు ప్రమాదంలో ఉందని తెలిసినా అసలు చూడాలని అనిపించ లేదా అని ప్రశ్నిస్తాడు. ఇక కాశీ రచ్చ చేస్తుండగా.. జ్యోత్స్న దీపాను తెలివిగా ఇరికించే ప్రయత్నం చేస్తుంది. దీపానే కాశీకి ధైర్యం ఇచ్చి ఇలా మాట్లాడిస్తుందని నింద వేస్తుంది.

అప్పటికే సుమిత్రకు దీపా అంటే ఏమాత్రం నచ్చకపోవడంతో కాశీని రప్పించి తను మాట్లాడలేని మాటలన్నీ మాట్లాడిస్తోందని జ్యోత్స్న చెబుతుంది. దీపాను సుమిత్ర దృష్టిలో మరింత చెడ్డదాన్ని చేస్తుంది. జ్యోత్స్న దీపాప రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే.. కాశీకి ఇంకా కోపం వస్తుంది. దీపా అక్క మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం, ఇక్కడ మనుషులు కాదు, రాక్షసులు ఉన్నారని అంటాడు. ఆ మాటతో శివ నారాయణ భగ్గుమంటాడు. కాశీపై చేయి చేసుకోబోతాడు. అదే సమయంలో పక్కనే కార్తీక్ బాబు కాశీ చెంపలు వాయిస్తాడు. ఇంకేం మాట్లాడొద్దని చెప్పి బయటికి తీసుకెళ్లి పంపిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు సారీ చెబుతాడు. మరోవైపు జ్యోత్స్నపైకి ఎలాంటి తప్పు రాకూడదని, తనను మంచిదానిలా నమ్మాలని తాత శివ నారాయణను కాంచన ఇంటికి తీసుకెళ్తుంది. పలకరించే కార్యక్రమంతో మంచితనాన్ని సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తుంది. దీంతో శివనారాయణ, జ్యోత్స్నలు ఇద్దరు కాంచనను చూసేందుకని వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 3వ తేదీ 400 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 400 July 3rd 2025

శివనారాయణ కాంచనను చూసేందుకని కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. అప్పటికే శౌర్య పాపతో కాంచన మాట్లాడుతూ ఉంటుంది. అయితే శివ నారాయణ శౌర్య పాపకు చెప్పిన కుందేలు, తాబేలు కథను శౌర్య పాప కాంచనకు చెబుతుంది. కుందేలు ఓడిపోలేదు. తన స్నేహితుడు తాబేలును గెలిపించేందుకు ఓడిపోయాడని చెబుతుంది. స్నేహితులు అంటే అలా ఉండాలని చెబుతూ ఉంటుంది. అదే సమయంలో శివనారాయణ కూడా వచ్చి బాగా చెప్పావు అని శౌర్య పాపను మెచ్చుకుంటాడు. మనం చెప్పే కథల్లోనూ కోపతాపాలు, రాగద్వేషాలకు స్థానం ఉండకూడదని, భవిష్యత్ తరాలకు మంచిని నేర్పించాలని అంటాడు. ఇక అప్పటికే కార్తీక్ బాబు, దీపా కాశీని కలిసి తిరిగి ఇంటికి వస్తారు. శివనారాయణ చెప్పిన మాటలు విని చప్పట్లు కొడుతాడు. పిల్లలకు చెప్పే కథల్లోనే ఏమాత్రం చెడు ఉండకూడదని భావిస్తున్న మీరు నిజం జీవితంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నిస్తాడు. నిజం జీవితంలోనూ అంతే కచ్చితంగా ఉంటామని శివ నారాయణ బదులిస్తాడు.

ఇక నేను వచ్చింది నీతో పోట్లాడటానికి కాదు. ఈ మనిషి కోసమని కాంచనను చూపించి అంటాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని కాంచనను శివనారాయణ అడుగుతాడు. అప్పటికే తన కోసం చూడటానికి వచ్చిన తండ్రి శివనారాయణను చూసి కాంచన ఉప్పొంగిపోతుంది. ఇక బాగున్నాను నాన్న అని శివనారాయణకు బదులివ్వబోతుంటుంది. కానీ కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఆయన్ని నువ్వు నాన్న అని పిలవకూడదు అమ్మ. ఈయన మా యజమాని. పెద్దసారూ కూడానూ. నవ్వు అలా వరుసలు పెట్టి పిలిస్తే డ్రైవర్ వాళ్ల అమ్మతో నాన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడరేమో. ఇంతకీ ఆయన యజమానిగా ఈ ఇంటికి వచ్చారా? లేకా తండ్రి స్థానంలో వచ్చారా? అనేది ముందు తేల్చమనండి అని కార్తీక్ బాబు అంటాడు. కార్తీక్ బాబు మాటలకు చిర్రెత్తిపోయిన శివ నారాయణ యజమాని స్థానంలోనే వచ్చానని అంటాడు. నా దగ్గర పనిచేసే డ్రైవర్ తల్లి ఆరోగ్యం పట్ల కూడా తను బాధ్యతగా ఉంటానని చెబుతాడు. దాంతో కాంచనమ్మ బాగున్నాను నాన్నకు బదులు బాగున్నాను అండీ అంటూ సమాధానం ఇస్తుంది.

కాంచన మాటతో శివ నారాయణ మనస్సు కదులుతుంది. ఇక కాంచన కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడని, మా అన్నయ్య వల్లనే నేను క్షేమంగా ఉన్నానని చెబుతుంది. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందని, అప్పుడు మా అన్నయ్యకు, నాకు తండ్రే దైవ్యమని, ఎలాంటి లోటు లేకుండా పెంచాడని అంటుంది. ఏదేమైనా నన్ను చూడటానికి వచ్చారు అంతే చాలు అంటుంది. మీరు నిజంగా నా కోసం వస్తానంటే నా ప్రాణాలు కూడా తీసుకోవడానికైనా వెనుకాడను అని చెబుతుంది. దాంతో శివ నారాయణ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బంధాన్ని దూరం చేసుకుంది నువ్వేనని, సొంత మేన కోడలు జ్యోత్స్న ను కాదని, ఏవరో అనాథ కోడలిగా చేసుకున్నావని, తండ్రి మాటకు విలువ ఇవ్వని కూతురు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఏదేమైనా సంతోషంగా ఉండమని, నీకు ఏమైనా మీ తండ్రి తట్టుకోలేడని చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు శ్రీధర్ ఇంటికి పారుజాతం కోపంగా వెళ్తుంది. ఆవేశంతో శ్రీధర్ ను పిలుస్తుంది. దాంతో హాలులోకి వచ్చిన శ్రీధర్ అంత ఆవేశంగా ఉన్నారు ఏంటీ సంగతి అని అడుగుతాడు. నువ్వు మా ఇంటికి నిప్పు పెట్టాలని చూస్తున్నావా? అని అంటుంది. కాశీని పంపించి ఆ ఇంట్లో గొడవ చేయాలని ప్రయత్నించడం ఏం బాగా లేదని అంటుంది. మా ఇంట్లో మనిషి (దీపా) కోసం కాశీ ఎన్ని మాట్లాడుతున్నాడో తెలుసా? అందుకు కారణం నువ్వు అక్కడ విషయాలను ఇక్కడ చేరవేయడం వల్లనే అని అంటుంది. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని అంటుంది. ఇదే సమయంలో కాశీకి 10 లక్షల అప్పు కూడా ఉందని శ్రీధర్ చెబుతాడు. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. ఇప్పుడెలా ఆ సమస్య నుంచి బయటం పడతామని కాశీతో అంటుంది. కాశీ నేను చూసుకుంటానని అంటాడు. ఇక శ్రీధర్ మాత్రం పారుజాతంపై రగిలిపోతాడు. నా కుటుంబాన్ని, నా కొడుకు హింస పెడుతున్న మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను అని హెచ్చరిస్తాడు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X