Karthika Deepam 2 July 4th: జ్యోత్స్నకు కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్.. వంటలక్కపై అసలు గురి
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 3వ తేదీ 400వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివనారాయణ తన కూతురు కాంచనను చూసేందుకు ఇంటికి వెళ్తాడు. ఇప్పుడెలా ఉందని అడుగుతాడు. అయితే కాంచన వరుసలు పెట్టి శివ నారాయణను నాన్న గారు అని పిలబోతుంది. దీంతో వెంటనే కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. మనం ఆయన ఇంట్లో పనివాళ్లం అలా వరుసలు పెట్టి పిలవకూడదని అంటాడు. అసలు ఇంతకీ శివనారాయణ గారు తండ్రి హోదాలో వచ్చారా? లేకా యజమాని హోదాలో వచ్చారా? ముందు తెలుసుకోవాలని కార్తీక్ బాబు అంటాడు. అసలే శివనారాయణ ఎంతో భావోద్వేగంతో తన కూతురును చూడటానికి వస్తే కార్తీక్ బాబు కావాలనే కోపం వచ్చేలా మాట్లాడతాడు. ఇక శివనారాయణ కోపంతో యజమానిగానే వచ్చానని చెబుతాడు. నా దగ్గర పనిచేసే డ్రైవర్ కుటుంబాన్ని కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతాడు.
ఇక మరోవైపు కాశీ శివనారాయణ ఇంటికి వచ్చి కాంచన అత్తకు ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా ఎందుకు దీపా అక్కను, కార్తీక్ బాబును పంపించ లేదని నానా రచ్చ చేస్తాడు. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతాడు. దీపాకు సపోర్ట్ చేస్తూ శివ నారాయణ, జ్యోత్స్నలపై అగ్గి దులుపుతాడు. తన మాటలతో శివనారాయణకు కోపం వచ్చేలా చేస్తాడు. అనకూడని మాటలు అని చేయి చేసుకునేలా చేస్తాడు. కానీ కార్తీక్ బాబే కాశీని కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపాలు ఇద్దరు వెళ్లి కాశీకి క్షమాపణలు చెబుతారు. మనస్సుల్లో ఏం పెట్టుకోవద్దని అంటారు. ఆ తర్వాత పారుజాతం శ్రీధర్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. కాశీకి లేనిపోనివి చెప్పి ఆ ఇంటిపైకి గొడవకు పంపిస్తున్నావని, ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకోనని అంటుంది. నా కొడుకును, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న మిమ్మల్ని అస్సలు వదలను అని శ్రీధర్ అంటాడు. ఇక నీ మనవడు కాశీ 10 లక్షలు అప్పు చేశాడని అది తీర్చామని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 4వ తేదీ 401 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు జ్యోత్స్నకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు. ఇప్పటికే జ్యోత్స్న కాంచన విషయంలో చేసిన రచ్చకు అందరికీ తనపై కాస్తా చిరాకు ఉంది. అది పోగొట్టుకోవడానికి కాశీ చేసిన గొడవకు కారణం దీపా అని, మరోవైపు శివనారాయణను బలవంతంగా కాంచన ఇంటికి తీసుకెళ్లి పలకరించి వస్తుంది. దీంతో తనపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకుంటుంది. అందరూ జ్యోత్స్నను నమ్మకపోయినా సుమిత్ర మాత్రం నమ్ముతుంది. జ్యోత్స్న ఎంత మంచిది కాకపోతే తనకు, తనకు కాంచనపై ప్రేమ లేకపోతే పట్టుబట్టి మరి శివనారాయణను తీసుకొని కాంచన ఇంటికి వెళ్తుందా? అని అంటుంది. ఇక జ్యోత్స్న కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది. నన్ను ఎవ్వరూ నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు అమ్మ అని అంటుంది. మరోవైపు నాన్న దశరథ ఎప్పటికీ నమ్మడని మనస్సులో అనుకుంటుంది. ఇక దశరథ కూడా నేను నిన్ను అస్సలు నమ్మబోనని చెబుతాడు. నేను నిన్ను నమ్మాలంటే ముందుగా నువ్వు దాసును ఎందుకు చంపాలనుకున్నావో తెలియాలని మనస్సులో అనుకుంటాడు.
మరోవైపు శివనారాయణ జ్యోత్స్నకు షాకింగ్ న్యూస్ చెబుతాడు. రేపు ఆఫీస్ లో మీటింగ్ ఉంది నాన్న అని దశరథ చెప్పడంతో శివ నారాయణ క్యాన్సిల్ చేయమని అడుగుతాడు. రేపటి మీటింగ్ ను ఎల్లుండికి వాయిదా వేయమని అంటాడు. ఎందుకంటే రేపు గౌతమ్ తల్లిదండ్రులతో ఇంటికి వస్తున్నారని, ముహూర్తాలు పెట్టుకోవడానికి రేపు మంచి రోజు ఉందని చెబుతాడు. రేపు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదని అంటాడు. దాంతో పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఇక మరుసటి రోజు గౌతమ్ తన తల్లిదండ్రులను తీసుకొని ముహూర్తాలు పెట్టించేందుకని వస్తారు. ఇక జ్యోత్స్నకు ముహూర్తాలను చెడగొట్టే సమయం కూడా ఇవ్వకుండా వాళ్లు వచ్చేస్తారు. అయితే వెంటనే జ్యోత్స్న తనకు జ్వరంగా ఉందని నాటకం ఆడుతుంది. పారుతో ఆ విషయాన్ని చెప్పమని కిందికి పంపిస్తుంది. అయితే అప్పటికే కార్తీక్ బాబు ఈ పెళ్లికి మళ్లీ ముహూర్తాలు పెట్టిస్తుంటాడు.
ఇక జ్యోత్స్నకు జ్వరం వచ్చందని తెలుసుకొని అది నార్మల్ ఫీవరే అని అంటాడు. జ్యోత్స్న నాటకం ఆడుతుందని తెలుసుకొని ఆమె గదిలోకి వెళ్తాడు. అంతే కాదు గౌతమ్ వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తాడు. పోయినసారే ఎంగేజ్ మెంట్ చెడిపోయింది. ఇక ఈసారైనా జరుగుతుందో జరగదోనని కంగారు పడుతుందని, దాని గురించే ఆలోచించి ఫీవర్ వచ్చిందని కార్తీక్ బాబు చెబుతాడు. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని గౌతమ్ వాళ్ల అమ్మ చెబితే జ్వరం తగ్గుతుందని అంటాడు. దాంతో ఆమె అలాగే చెబుతుంది. ఇక గౌతమ్ ను కూడా పైకి రమ్మంటే పూర్తిగా జ్వరం పోతుందని అంటాడు. గౌతమ్ తన గదిలోకి రావడం ఇష్టంలేని జ్యోత్స్న కిందికి వెళ్తుంది. ఇక ముహూర్తాలు పెడుతారు. వచ్చే బుధవారం ఎంగేజ్ మెంట్ జరిపించాలని నిర్ణయిస్తారు. ఆ తర్వాత గౌతమ్ వాళ్ల తల్లిదండ్రులు వెళ్లిపోతారు.
ఈ క్రమంలో దీపా ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో ఉండటానికి వీల్లేదని సుమిత్రకు కండీషన్ పెడుతారు. పోయినసారే తన కొడుకును దీపా అందరి ముందు చెంప వాచిపోయేలా కొట్టిందని, అలాంటి మనిషి మళ్లీ అదే ఫంక్షన్ లో ఉండటం మాకు అస్సలు ఇష్టం లేదని గౌతమ్ వాళ్ల అమ్మ అంటుంది. దీపా ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లోనే కాదు, వీలైతే ఏ ఫంక్షన్ లోనూ లేకుండా చూసుకోవాలని అంటుంది. ఆమె ఈ ఇంట్లో ఉండటం మాకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతుంది. దీంతో సుమిత్ర షాక్ అవుతుంది. మరోవైపు జ్యోత్స్న గౌతమ్ వాళ్ల అమ్మ పెట్టిన కండీషన్ ను వినియోగించుకోవాలని చూస్తుంది. అలాగే ఎలాగైనా పెళ్లిని చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











